కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట.

అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు యేమి కోరుకున్నామో అవి బాధించకుండా కాపాడతాయి. అమ్మవారిని లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం యేమిటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మవారిని అడగవచ్చు. కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట. కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఇది తప్పే. మిగిలిన వారిని అడిగి కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు మనల్ని బంధిస్తాయి, బాధిస్తాయి. అమ్మవారి వల్ల తీర్చుకుంటే అమ్మవారి దయవల్ల వచ్చింది అనే స్పృహ ఉంటుంది. కృతఘ్నత అన్నది లేకపోతే. భగవంతుడి దయవల్ల అని నానుడిగా మనలో వచ్చేసింది. రామకష్ణ పరమహంస ఒక మాట అనేవారట – “అమ్మ దయవల్లే అన్నీ ఉన్నాయి, అమ్మ దయ ఉంటే అన్నే ఉన్నట్లే”. ఈ మాట అర్థం ఏది ఉన్నా అమ్మ దయే. అనుభవించే ప్రతిదానిలోనూ అమ్మనే ధ్యానం చేస్తున్నాం. గ్లాసు నీళ్ళు చేతితో పట్టుకుంటే ఇందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంది. ఇలా ప్రతి పదార్థంలోను ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నదనే భావం ’కామ్యా’ నామ విచారణ వల్ల కావాలి. నామాలకి అర్థం చెప్పుకోవడం లేదు. విచారణ చేస్తున్నాం.

Make any Suggitions