ఓం నమోవినాయకాయ:

1044587_377497522349820_1361156765_n

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ||

ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

(ఈ గణేశ ద్వాదశనామాలు నిత్యం పారాయణ చేసే విద్యార్థులకు, విద్యాబుద్ధులు బాగా అలవడుతాయి)

గణం అంటే సమూహం, గుంపు, వర్గం అని అర్ధాలున్నాయి. ఈ సృష్టి అంతా గణమయం అంటుంది శాస్త్రం. మనలో అనేక నిత్యం అనేకానేక ఆలోచనలు కలుగుతుంటాయి. అది ఆలోచనల గణం(సమూహం). అలాగే మనుష్య గణం అంటే మానవ సమూహం, దేవ గణం, నక్షత్ర గణం, వృక్ష గణం, జంతు గణం……..ఇలా చెప్పుకుంటూ పోతే జగత్తే పెద్ద గణం. ఇక మన కంటికి కనిపించని అణువులు చేత నిర్మితమైంది ఈ విశ్వం. విశ్వమంటేనే అనేక కోట్ల అణువులు, శక్తులు కలియక. ఇవన్నీ గణాలే. గణం గణం కలిస్తే మహాగణం. ఈ గణాలన్నీ వాటంతట అవి నడిస్తే గందరగోళం ఏర్పడుతుంది. అందువల్ల ఈ గణాలన్నీటిని నడిపే శక్తి ఒకటి ఉంది, నాయకుడు ఒకడు ఉన్నాడు. ఈ గణాలకు అధిపతే గణపతి. మహాగణాలకు అధిపతి కనుక ఆయనే మహాగణపతి. అతడే పరబ్రహ్మం. ఈ గణాలన్నీ ఆయన్నే చేరుతాయి కనుక ఆయన గణనాధుడయ్యాడు. ఈ గణాలాన్నిటికి అధ్యక్షత వహిస్తాడు కనుక గణాధ్యాక్షుడయ్యాడు. అందుకే వేదంలో మనం ఆ పరబ్రహ్మాన్ని ‘ గణానాం త్వా గణపతిగుం హవామహే్‘ స్తితించాం.

 • పురాతన శాస్త్రవేత్తలు వినాయకుడిని విశ్వవ్యాపి అని నిర్ధారించారు. ఇండియా, బర్మా, థాయ్‌లాండ్‌, కాంబోడియా, పర్షియా, నేపాల్‌, టిబెట్‌, చైనా, టర్కిస్తాన్‌, మంగొలియా, జపాన్‌, బల్గేరియా, మెక్సికో, పెరూలలో గణేషుడు ఆరాధనలను అందుకుంటున్నాడు. బౌద్ధులు కూడా ఆరాధిస్తారనేది, ‘గణపతి హృదయమ్‌’ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఈ మంత్రాన్ని స్వయంగా బుద్ధుడే ఆనందుడనే భక్తునికి ఉపదేశించాడట. జైనులు తమ వృత్తి ఆరంభంలో వినాయకుడి పూజలు చేస్తారు. స్పినోజా అనే పాశ్చాత్య వేదాంతుడు వినాయకునికి ప్రకృతిని అన్వయించడానికి మూల ప్రకృతే ప్రాణం. ప్రాణంలో జీవశక్తి ఉంటుంది. మాక్స్‌ ప్లాంక్‌ భౌతిక శాస్త్రంలోని క్వాంటమ్‌ సిద్ధాంతానికి ప్రాణశక్తికి ముడిపెట్టాడు.
 • థాయ్‌లాండ్‌లో వినాయకుడిని ‘‘ప్రపికనేత్‌’’గా పూజిస్తారు. అదృష్టదేవతగా, విఘ్నాలను తొలగించేవాడిగా అర్చిస్తారు. థాయ్‌లాండ్‌ వినాయకుడికి కళలు, చదువు, వాణిజ్యంతో సన్నిహిత బాంధవ్యం వుంది. 6-8వ శతాబ్దాల కాలంనుంచి థాయ్‌లాండ్‌లో గణపతి అక్కడి ప్రజల పూజలందుకుంటున్నాడు. థాయలాండ్‌ లలితకళల మంత్రిత్వ శాఖ గుర్తు పై వినాయకుడు దర్శనమిస్తాడు. థాయ్‌లాండ్‌ అంతటా ఫ్రా పికనెత్‌ దేవస్థానాలు వెలిశాయి. రాజధాని బాంకాక్‌లో రాజకుటుంబీకులైన బ్రాహ్మణ మందిరం వీటిల్లోకల్లా శ్రేష్టమైందిగా పరిగణిస్తారు.
DSCI1090 DSCI1086 DSCI1082
DSCI1081 DSCI1085 DSCI1123

కాణిపాకం వరసిద్ధి వినాయకుని చరిత్ర:–

విఘ్నేశ్వరుడు అందరి దేవతలకి ప్రధమ గణాధిపతుడు. అతని పుట్టుక గురించి వివిధ పురాణాలు, వివిధ రకాలుగా చెబుతున్నాయి.

పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఒకరోజు వనవిహారము చేస్తూ ఉండగా, గజరాజు యొక్క శృంగారక్రీడలని,ఆసక్తిగా గమనించి, వారు కూడా గజరూపాలని ధరించి, శృంగారక్రీడ సలిపినప్పుడు, వారికి గజముఖ వినాయకుడు ఉద్భవించుట జరిగింది. అతడే సర్వ దేవతలకి నాయకునిగా నియమింపబడ్డాడు.(ఇది ఒక పురాణగాథ)

పూర్వము చిత్తూరు మండలానికి సమీపంలో, విహారిపురి అనే ప్రాంతం ఉండేది. సమస్త దేవతలు ఇక్కడ విహరించటం వల్ల, ఈ ప్రాంతానికి విహారిపురి అనే పేరు వచ్చినట్లు చెప్పబడుతున్నది. ఈ స్థలంలోనే వినాయకుడు “స్వయంభూగా” వెలసినాడంట.

ఈ ప్రాంతంలో పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి ఐన ముగ్గురు నివసిస్తూఉండేవారు. వారు ముగ్గురు కాణీ పెట్టి, ఒక మాగాణి పొలాన్ని కొని, యాతాం బావి నీటితో ఆ పొలాన్ని సాగు చేస్తూ, పంటలు పండిస్తూ జీవించేవారు. ఒకసారి వానలు లేక ఆ ప్రాంతం ప్రజలు, త్రాగునీటికి కూడా ఇబ్బందుల పాలైనారు. ఒకనాడు ఈ ముగ్గురు వికలాంగులు ఆలోచించి, తమ పోలములోని బావిని, మరికొంత లోతుగా త్రవ్వగా, కొంత తడి తగిలింది. నీరు కొద్దికొద్దిగా ఊరుతున్నట్లు అనిపించి, నీరు తీయటానికి అని ఒక చేద(బాన)ని, బావిలోకి దించారు, అది భళ్ళున పగిలింది. అలా ఎన్నిసార్లు చేదలు దించినా పగిలిపోవుట వల్ల ఏదో ఒక బండరాయి అడ్డుగా ఉన్నదని భావించి, గునపాలతో పొడవటం మొదలుపెట్టారు. తవ్వుతున్న ప్రాంతంలో, ఖంగుమనే శబ్దం వినిపించింది. అలా 3 సార్లు వారు పొడవగా, చిన్నరాతిముక్క ఎగిరి బయటకు వచ్చింది, ఆ ముక్కతోపాటు, రక్తం బయటకు ఎగచిమ్మింది. ఆ రక్తంలో తడవటం వల్ల, ఆ ముగ్గురి అవిటితనం పోయింది. వెంటనే చూపు వచ్చినవాడు , విహారిపురి రాజువద్దకు వెళ్ళి, జరిగిన విషయం చెప్పగా, రాజుకి ముందు రోజు రాత్రి కలలో కనిపించిన వరసిద్ధి వినాయకుడు ఇక్కడే వెలసి ఉంటాడు అనుకుని, పరివారంతో బయలుదేరి, స్వామి ఆవిర్భవించిన ప్రాంతానికి చేరుకున్నాడు. అందరు స్వామిని శాంతింపచెయ్యటానికి, కొబ్బరినీటితో అభిషేకం చేసారు, ఆ విధంగా కొబ్బరినీటితో ఆ కాణీ మాగాణి అంతా, పావనమయ్యిందని, పవిత్రమయ్యిందని, ఈ ప్రాంతానికి “కాణిపాకం” అనే పేరు సార్థకమయ్యింది.

ఈ స్వామి విగ్రహం రోజురోజుకూ, కంటికికనిపించకుండా పెరుగుతున్నాదని , పరమసత్యం. స్వామివారి తల వెనుక తగిలిన, గునపపు దెబ్బ, నేటికి కూడా మనకు కనిపిస్తుంది. ఆ బావిలో ఉన్న నీటినే , భక్తులకు తీర్థంగా ఇస్తున్నారు. ఇటువంటి దైవం ఉన్న ప్రాంతం నిజంగా, కలియుగ కైలాసమే.

Advertisements

3 thoughts on “ఓం నమోవినాయకాయ:

 1. I’m not tɦat much of a internet reader to be honest ƅսt your blogs really nice, keеp it up!

  ӏ’ll goο aheаd and Ƅoօkmark youսr webѕite to come baсk later.
  Cheers

 2. Thanks for your Interest on my blog. If you find any mistakes please let me inform those. we will correct them as soon as possible.

  And i am suggested that if you are having interest on our traditional things you may follow Sri chaganti(http://www.srichaganti.net/) Pravachanas. He explained pravachans with more interesting manner.

  And If possible you may include MahaBharatm Serial.It gives more solutions. That is published in maaTv

 3. Thanks a lot. May i know your name.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s