అప్సరసలు


ఏకత్రింశతి అప్సరసలు

 1.  రంభ,
 2. ఊర్వశి,
 3. తిలోత్తమ,
 4.  మేనక,
 5.  ఘృతాచి,
 6.  సహజన్య,
 7.  నిమ్లోచ,
 8.  వామన,
 9.  మండోదరి,
 10. సుభగ,
 11. విశ్వాచి,
 12. విపులానన,
 13. భద్రాంగి,
 14.  చిత్రసేన,
 15. ప్రమ్లోచ,
 16. మనోహర,
 17. మనోమోహిని,
 18.  రామ,
 19. చిత్రమధ్య,
 20.  శుభానన,
 21.  కేశి,
 22.  నీతకుంతల,
 23. మన్మధోద్దీపిని,
 24.  అలంబుష,
 25.  మిశ్రకేశ,
 26.  ముంజికస్థల,
 27.  క్రతుస్థల,
 28.  వలాంగి,
 29.  పరావతి,
 30.  మహారూప,
 31. శశిరేఖ : ~ (బ్రహ్మ పురాణం)
Advertisements

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం


శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

జై శ్రీరామ
శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

‘’ మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది .

దీపకుని గురుసేవ


పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీనదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేదవేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.

శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా!

నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.

గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానీకి పూజలుచేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది.

గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.

అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.

మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగవందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.

‘ఓం నమో భగవతే వాసుదేవాయ


1394433_546006428824240_1342022454_n

 

”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రంలో ”ఓం” తరువాత ప్రయుక్తమైన శబ్దం ”నమః”. దీనిలో ‘న’ ‘మః’ అనే రెండు పదాలున్నాయి. అవి నేనున్నది (ఆత్మ, జీవుడు) నాసేవ కొరకు కాని పరులసేవ కొరకూ గాని కాదు. భగవంతుడి సేవకోరకే. అనే అర్ధాన్ని వెల్లడిస్తాయి. నేను నాకు గాని, ఇతరులకు గాని సంభందపడినవాడిని కాను. ఆ పరమాత్మకే సంబందించినవాడిని అని భావిస్తూ తానూ చేసే కైంకర్యములు చేసే ఖర్మ యందు కర్తృత్వ భోక్తృత్వ బుద్ది మాని పరమాత్ముడే తన పరికరమైన నాచేత తన కైంకర్యములు తనే చేయించుకొంటున్నాడు. తానే దాని ఫలమనుభావిస్తున్నాడు. ఇందులో నా ప్రసక్తి ఏమిలేదు అని భావిస్తూ ద్యానం సల్పాలి అని నమః శబ్దం యొక్క తాత్పర్యం. భగవంతుడైన వాసుదేవుడికే తప్ప నాసేవకోరకు కాదు. అన్యుల సేవకోరకూ కాదు. అని ఈ మంత్రం భావం. భగవంతుడనగా జ్ఞాన బలైశ్వర్య వీర్యశక్తి తెజస్సులనే షడ్గుణ్య సంపత్తికలవాడు. వసుదేవ సుతుడైన శ్రీకృష్ణుడు గాని, తనయందు సమస్తం వసించగా అన్నిటియందు నివసించేవాడు అనిగాని వాసుదేవుడనే మాటకు అర్ధం. జీవుడు ఉన్నది మాధవ సేవకే గాని అన్యుల సేవకొరకు కాదు.

షిర్డీ సాయిబాబా


images (1)
జననం: తెలియదు
జన్మస్థలం: తెలియదు
అసలు పెట్టిన పేరు: తెలియదు
మరణం: అక్టోబరు 15, 1918
మరణ స్థలం: షిరిడీ, భారతదేశం
గురువు: వెంకూసా
వేదాంతం/తత్వం: అద్వైతం
ఉపదేశం: సబ్‌కా మాలిక్ ఏక్ హై
(అందరి ప్రభువు ఒక్కడే)

షిర్డీ సాయిబాబా (?? – అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి

సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా గారు అందుకే వారి పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కధనం ఉందిమరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారుఈ రెండు కధనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి

తన షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విడయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.

ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.

షిరిడీలో నివాసం

1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చాడు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “దయ చేయుము సాయీ” అని పిలిచాడు. తరువాత ‘సాయి’ పదం స్థిరపడి అతడు “సాయిబాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి ‘మొహిదీన్ తంబోలీ’ అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే ‘కఫనీ’, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.

1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.

1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశారు (మహా సమాధి చెందారు). ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే ‘సమాధి మందిరం’ నిర్మించబడింది.

ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు

సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవాడు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్, అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.

శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు – వారిలో ముఖ్యులు: మహాల్సాపతి, హేమాండ్ పంతు, శ్యామా ,తాత్యా..

బోధనలు

మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా

తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు. ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు. తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం – వీటిని ప్రోత్సహించాడు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడునీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు – అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.
రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని ఆయనతో ఉన్నవారు చెప్పారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నాడు
భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. అతని ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పాడు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పాడు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పాడు.
సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు. అతని బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవాడు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తాడని అతని అనుయాయులు అనేవారు.
దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవాడు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవాడు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?””అతనికి మొదలు లేదు… తుది లేదు “. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:

 1. షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
 2. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
 3. నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
 4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
 5. నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
 6. నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
 7. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
 8. మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
 9. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
 10. నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
 11. నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

మత సామరస్యం
“ హిందువుల దైవమైన శ్రీ రాముడు, ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే ! ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే – అందరి దైవం ఒక్కరే ! కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసి మెలిసి జీవించండి.”
సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునిని సేవించుటకు మత బేధం ఆటంకం కాకూడదు
ఒక ముస్లింకు సంతానం కలిగితే శిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంత కాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు.”వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయి పంచు” అన్నారు.మారుతీ ఆలయం లో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగలించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు.
“అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే”.
“ఖురానును చదవగానే సరి కాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి.”

భక్తులు, పూజా విధానాలు
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.

భారత దేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.

మహిమలు
సాయిబాబా భక్తులు అనుచరులు చెప్పే కధనాల ప్రకారం సాయిబాబా పెక్కు మహిమలు కనబరచాడు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.
తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచినట్లు పెక్కు భక్తులు చెబుతుంటారు. ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.

చారిత్రిక ఆధారాలు
1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టాడు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంధం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంధం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగుగులో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంధంగా పెక్కు భక్తులు పరిగణిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ, స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి. గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ కూడా ఒక ముఖ్యమైన ఆధారం. తొలి తెలుగు శిరిడీ సాయి చరిత్ర ను (1957) వేమురి వెంకటేశ్వరరావు గారు వ్రాసినారు.
ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’, ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రచించిన ‘సాయి చరిత్ర, సందేశం’ కొన్ని ముఖ్యమైన వనరులు.
వివిధ మతాలలో అభిప్రాయాలు

హిందూమతంలో
సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు.. గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు.. బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు. టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు. చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు. స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించాడు.సత్యసాయిబాబా తనను తాను షిరిడీ సాయిబాబా అవతారమని చెప్పుకొంటున్నాడు.

ఇతర మతాలు
అధికంగా సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిimagesబాబాను గురువుగా పరిగణించడం జరుగుతున్నది. మెహెర్ బాబా సాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్ (అత్యుత్తమమైన కుతుబ్) అని అభివర్ణించాడు.జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు.

సంస్కృతిలో
భారత దేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి. కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు వెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది. వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్ధనా సమావేశాలలోను బాబా భజన, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి

images (2)

అట్లతద్ది ఎలా జరుపుకోవాలి?


అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.

గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.

అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ

”అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…”

లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.

పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.

పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.

ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు.  దాన్ని కైలాసంగా భావిస్తారు. 

పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.

ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి,  పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.

అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు,  ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.

వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.

వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 

”ఇస్తినమ్మ వాయనం”

”పుచ్చుకుంటినమ్మ వాయనం” 

”అందించానమ్మా వాయనం”

”అందుకున్నానమ్మా వాయనం”

”ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం”

”ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం”  

ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ”అట్లతద్ది” జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ”కార్వా చౌత్” వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ”సెయింట్ ఆగ్నెస్ ఈవ్” మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.

ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ”అట్లతద్ది” లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ”అట్లతద్ది” జరుపుకుంటున్నారు.

“అట్లతద్దె” వ్రతమహిమ:

పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమెపేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రతమహిమను తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని.. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. 

దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహములు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కానీ కావేరిపై యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా తారసపడసాగిరి. 

మహారాజు ప్రయత్నములన్నీ విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది.. రాజ్యమును వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది.

అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.

దానితో నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిందేమీ లేదని, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరించు. నీ మనోభిష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు. 

అలా ఆ రాకుమార్తె తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహముతో అష్టైశ్వర్యాలను పొందుదుముగాక..!

 

పురాణం:

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా వుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని ‘అట్ల’కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో ‘కర్వా ఛౌత్’ అనే పేరుతో జరుపుకుంటారు.

వ్రతవిధానము

ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగా పెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్ది నోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. దీనినే ‘ఉయ్యాలపండగ’ అనీ, ‘గోరింటాకుపండగ’ అనీ అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము

అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం


విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.

స్థల పురాణం 
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.

ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.

దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.

క్షేత్ర విశేషాలు 
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.