అభిషేకఫలం


పరమశివునికి ఉన్న అనేక పేర్లలో ” ఆశుతోషుడు” ఒకటి !ఆస్తోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం.అందుకే శ్రీనాధ సార్వ భౌముడు స్వామి భక్తసులభుడు అని ఈ కృంద విధముగా వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లేచెట్టు

 

fdghf

dfghds


అంటే శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట కామధేనువు గాట కట్టిన పశువు అవుతుందట.
అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట మల్లే చెట్టు అవుతుందట!

ఆ స్వామి అభిషేకప్రియుడు.

ఆయ్నకి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగ చేస్తుంది అని శాస్త్ర వచనం

 1.  శివునికి నెయ్యతో భిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
  పెరుగు తో అభిషేకం చేస్తే కీర్తి, ఆరోగ్యం కలుగుతాయి. 
 2. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది.
 3. చెరకు రసంతో అభిషేకం ధనవృద్ధి!
 4. పంచధార తో చేస్తే దుఃఖ నాశనం!
 5. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదల వృద్ధి,
 6. విభుతి నీటి తో చేసే అభిషేకం మహా పాపాలను నశింపచేస్తుంది.
 7. నవరత్న జలాభిషేకం ధనధాన్య ,పశుపుత్ర లాభాన్ని,
 8. మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం,
 9. పసుపు నీరు తో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి.
 10. నువ్వుల నూనేతో అభిషేకిస్తే అపమృత్యువు భయం తొలగిపోతుంది.
 11. పుష్పోదకాభిషేకం భూలాభాన్ని , బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి.
 12. రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని,
 13. గరికి నీటి తో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు, మరియూ వాహనాలను ప్రసాదిస్తుంది.
 14. సువర్ణ ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతింది.
 15. కస్తురికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది
 16. హర హర మహా దేవ షంభో శంకర!

భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త


భార్య పొరపాటు చేసిందని ఆమెను విడిచిపెట్టిసినవాడు ఆర్షసంప్రదాయమందు భర్త కాదు. భార్యగా అహల్యచేసిన పొరపాటు కంటె పెద్ద పొరపాటు మరొకటి చరిత్రలో ఉండదు.

అహల్యకు దేవరాజుమీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? ఆహారాన్ని తినబట్టి. ఆహారంలో ఆరవవంత్ మనస్సు అయింది. మనస్సునుండి మోహము, మోహమునుండి లోభము వచ్చాయి. లోభానికి కామం కలిసింది. కామం కలిసి అహల్య మనస్సును దేవరాజు వైపు వెళ్ళేలా చేశాయి. అందుకని ముందుగా అహల్య మనసు శుద్ధికావాలి. అందుకని గౌతముడు అహల్యని –

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ!
అదృశ్యా సర్వభూతానా మాశ్రమేస్మినివత్స్యసి!!

“నువ్వు అన్నం తినకు. గాలిపీల్చు. నీపాపం పోవాలి. నువ్వు అగ్నిపునీతవు అవ్వాలి. అందుకని నువ్వు కొన్నివేల సంవత్సరాలు తపస్సు చెయ్యి. నీకు బాహ్యప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పబడి నువ్వలా భూమిమీద పడిపోయి ఉండిపోతావు.” రాబోయే అవతారాన్ని గౌతముడు ముందుగానే గుర్తించాడు. “పతితపావనుడయిన రామచంద్రమూర్తి ఇక్కడకు వస్తారు. అయన ఇక్కడకు ఆశ్రమంలోకి రాగానే ఆయన గాలి నీకు సోకుతుంది. నువ్వు శాపవిముక్తురాలివి అవుతావు” అన్నాడు.

అహల్యను ’రాయి అయిపోవలసినది’ అని గౌతముడు శపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. దేవాలయానికి వెళ్ళడం ఎందుకు? స్వామి పతితపావనుడు. ఆయనమీద నుండి వచ్చేగాలి మనకు సోకితే చాలు మన పాపాలు నశిస్తాయి. అందుకని దేవాలయాలలోకి వెళ్ళి మనం స్వామిముందు నిలబడతాం.

మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారంటారు వారి రామాయణ కల్పవృక్షంలో –

ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటిక స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగె
ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక
రించినంత హృదయనుపల వీధి
ఉపనిషద్వితానమొలికి శ్రీరామ భ
ద్రాభిరామమూర్తియగుచుతోచె!!

ఎప్పుడయినా సరే, మనం అహల్య వ్యభిచరించింది అనకూడదు. అలా అనడానికి మనకు హక్కులేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తాడు. రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పుచేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆదోషాన్ని చేసిందో గమనించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడు వస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకనే ఋషితుల్యుడు అయ్యాడు మహానుభావుడు. అప్పటివరకు బాహ్యస్పర్శలేకుండా పడిపోయిన అహల్యకు రామచంద్రమూర్తి నుండి గాలివచ్చి తగిలిందిట. అంతే. ఆమెకు ఇప్పుడు స్పర్శ కలిగింది. ఇప్పటివరకు ఆవిడకు స్పర్శలేదు. ఇప్పటివరకు అసలు ముక్కుకు వాసన తెలియకుండా పడిపోయిన అమ్మకి రామచంద్రమూర్తి మీది నుంచి వచ్చిన పరిమళమయిన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమయినదట. ఆయననుంచి గాలివచ్చి తగలగానే మరల స్పర్శేంద్రియము పనిచేయడం ప్రారంభించినదట. నీలమేఘసంకాశమయిన రామచంద్రమూర్తి సౌందర్యమును చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయట. ఆవిడిలోంచి శబ్దస్పర్శ రూప గంధములనే నాలుగు తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియమయిన నాలుక ఎప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసి లేచింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదట! ఆ రాముడికి పళ్ళు, ఫలములు, పాలు అన్నీ ఇచ్చినప్పుడట! ఆయన తింటే ఈవిడ రసేంద్రియము పనిచేయడం మొదలు పెట్టిందట! ఇపుడు ఏమయింది? ఆహారదోషం, శరీరదోషం అన్నీ నివృత్తి అయిపోయాయి. ఇప్పటివరకు రాముడు రాముడే. శ్రీరాముడు కాదు. సీతతో కలిసిన రాముడు కాదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలానగరంలో ఉంది. వారిద్దరూ తొందరలో కలియబోతున్నారు. సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు. అని దర్శనము చేసిన గొప్ప చారిత్రము కలిగి, తన పాపములనన్నిటిని ప్రక్షాళనము చేసుకున్న మహాపతివ్రత అహల్య. ఇటువంటి అహల్య కాళ్లమీద రాముడు పడ్డాడు.

భార్య తప్పు చేస్తే ఉద్ధరిమ్చుకున్నవాడు భర్త. అంతేకాని పాిగ్రహణం చేసి అస్తమానూ చిన్నదానికి చితకదానికి కూరలో ఉప్పు దగ్గరనుండి ప్రతిదానికీ భార్యను పట్టుకుని నిందించేవాడు భర్త కాడు. భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త.

మహర్షి అష్టావక్రుడు


శ్రీకృష్ణుని జీవితముతో సంబంధమున్న ఒక విఖ్యాత మహర్షి అష్టావక్రుడు. ద్వాపర యుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్న రోజులలో ఆయనను వెదుక్కుంటూ ఒకరోజు అష్టావక్ర మహర్షి వచ్చాడు. ఆయన శ్రీకృష్ణుని దర్శించి ధ్యానయోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి గౌరవించాడు. అర్ఘ్య పాద్యాలు ఈయబోతున్న సమయములో కృష్ణుని పాదాలపై శిరస్సు ఉంచి ఆయన శరీరాన్ని వదలిపెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయముగా ఆయనకు అంత్యక్రియలు జరిపించి, ఉదకములిచ్చి, ఆజీవునికి ఎంతోగౌరవమైన సద్గతిని ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుని పత్నులు, మంత్రులు అందరూ, ఆయన చరిత్రను చెప్పమని కృష్ణుని అడిగారు. అప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు.

“ఈ అష్టావక్రుడు నాకు పరమభక్తుడు. జితేంద్రియుడు. పూర్వము నేను నాభి కమలమునుండి బ్రహ్మను సృష్టించి విశ్వసృష్టిచేయమని అతనిని నియోగించాను. అతడు మొదట సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు వారు తపోన్ముఖులై సృష్టికార్యాన్ని తిరస్కరించారు. తరువాత బ్రహ్మదేవుడు వశిష్ఠ, మరీచి, ప్రచేతస, అంగీరసాదులైన మహర్షులనూ, ప్రజాపతులను సృష్టించాడు. వారుకూడా మొదట తపస్సులుచేసినా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి వివాహములు చేసుకొని సంతానమును కన్నారు. ప్రచేతసుని కుమారుడు అసితుడు. అతడు రుద్రుని గురించి తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమై రాధా మంత్రాన్ని ఉపదేశించాడు. రాధాదేవి అనుగ్రహముతో అతనికి కలిగిన కుమారుడు దేవల మహర్సి. ఆ దేవలమహర్షి తీక్షణమైన తపస్సు చేస్తే, ఇంద్రుడు తపోభంగము చేయమని రంభను పంపాడు. రంభను ఆయన తిరస్కరిస్తే, ఆమె అష్టావక్రునిగా జన్మించమని దేవలుని శపించింది. ఏకపాదుని కుమారుడుగా ఆయన జన్మించి మహాజ్ఞానిగా, దివ్య చరితుడైనాడు. కృష్ణుని సన్నిధిలో ప్రాణాలు వదలాలనే సంకల్పంతోనే ఆయన జన్మించాడు.”

జగతిని మ్రింగే కాలమే భోజనపాత్రగా కలిగినవాడు


శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజాదులకు ఉపదేశిస్తున్న శివ సహస్రనామాలలో 683వ నామం జగత్కాల స్థాలః. ఇది నమస్కారంలో జగత్కాల స్థాలాయ నమః అని చెప్పబడుతున్నది. స్థాలః అంటే పాత్ర అని అర్థం. భోజనపాత్రను స్థాల అని అంటాం. ఇప్పటికీ మనం స్థాళీపాకం అంటూంటాం. స్థాలః అంటే భోజనపాత్ర అని అర్థం.

Namah sivaya

పరమేశ్వరునికి ఒక భోజనపాత్ర ఉందిట. ఆ భోజనపాత్ర యేమిటంటే జగత్కాలమే ఆయనకు భోజనపాత్ర అన్నారు. చాలా గొప్ప విశేషం ఇది. జగత్-కాల-స్థాలః – ఈ కూర్పే చాలా చిత్రం. కాల స్థాలః అంటే అయిపోయేది కదా! కానీ జగత్కాల స్థాలః అని ఎందుకు అన్నారు అంటే జగతిని మింగేది యేదో అది కాలము. అలాంటి కాలము ఆయనకు భోజనపాత్రగా ఉందిట. కాలమే భోజనపాత్రగా ఉన్నది. ఈకాలంలో ఉన్న భోజనం జగత్తు. జగత్తు అనే భోజనం కాలంలో ఉంటే ఆ కాలాన్ని పాత్రగా పట్టుకున్నాడట. ఇది చెప్పేటప్పుడు మనకి ఒక అపురూపమైన భావన కనపడుతోంది. శాస్త్రప్రకారం సృష్టిస్థితిలయకారకుడు పరమాత్మ. ఈ లయం చేయడమే భోజనం చేయడం. అందుకే పరమేశ్వరుని ఆ భోజన లక్షణాన్ని శాస్త్రం అనేక రకాలుగా వర్ణించింది. మహాప్రపంచాన్నంతటినీ మ్రింగివేస్తాడట ప్రళయకాలంలో. ఎలాగైతే ఒక రైతు పండించి, పెంచి, తిరిగి మింగుతాడో అలా అది ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేస్తాడు. లయం చేసేటప్పుడు ప్రపంచం ఆయనకు భోజనం అయిపోయింది. ఆ సమయంలో ప్రపంచం ఉండే పాత్ర కాలము. చాలా చక్కటి మాట చెప్పారు. ప్రపంచం అందరికీ కనపడుతుంది. కానీ కాలం మాత్రం కనపడదు. కనపడదు కానీ లేదు అని మాత్రం ఎవరూ అనలేరు. కాలం స్థూలవస్తువా? కనపడుతోందా? లేదు అని అనగలమా? ఇక్కడ మనం పరిశీలిస్తే జగత్తంగా కాలమునందే ఉన్నది. కాలంలో లోకం ఉంటే కాలం ఆయన చేతిలో ఉన్నదిట. కాలాన్ని ఆయన శాసిస్తున్నాడు. కాలం ప్రకారం భోజనం చేస్తాడు. అంతేగానీ అడ్డదిడ్డంగా ఈ సృష్టిని ఎప్పుడుపడితే అప్పుడు నశింపచేయడం కాదు. దానికొక కాలం ఉంది. కనుక ఆ కాలాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని పట్టాడాయన. అది భోజనపాత్రగా కలిగినటువంటివాడు. జగతిని మ్రింగే కాలమే భోజనపాత్రగా కలిగినవాడు. ఇది జగత్కాల స్థాలాయనమః అనే విషయం చెప్తుంది.

కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట.


అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు యేమి కోరుకున్నామో అవి బాధించకుండా కాపాడతాయి. అమ్మవారిని లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం యేమిటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మవారిని అడగవచ్చు. కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట. కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఇది తప్పే. మిగిలిన వారిని అడిగి కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు మనల్ని బంధిస్తాయి, బాధిస్తాయి. అమ్మవారి వల్ల తీర్చుకుంటే అమ్మవారి దయవల్ల వచ్చింది అనే స్పృహ ఉంటుంది. కృతఘ్నత అన్నది లేకపోతే. భగవంతుడి దయవల్ల అని నానుడిగా మనలో వచ్చేసింది. రామకష్ణ పరమహంస ఒక మాట అనేవారట – “అమ్మ దయవల్లే అన్నీ ఉన్నాయి, అమ్మ దయ ఉంటే అన్నే ఉన్నట్లే”. ఈ మాట అర్థం ఏది ఉన్నా అమ్మ దయే. అనుభవించే ప్రతిదానిలోనూ అమ్మనే ధ్యానం చేస్తున్నాం. గ్లాసు నీళ్ళు చేతితో పట్టుకుంటే ఇందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంది. ఇలా ప్రతి పదార్థంలోను ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నదనే భావం ’కామ్యా’ నామ విచారణ వల్ల కావాలి. నామాలకి అర్థం చెప్పుకోవడం లేదు. విచారణ చేస్తున్నాం.

కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి.?


వదాన్యుడనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు ఆమెను వివాహమాడగోరి వదాన్యుడిని అడిగాడు. ఆయన రూపగుణవర్తనాలలో యోగ్యుడైన అష్టావక్రుడికి కూతురుని ఇస్తానని మాట ఇచ్చి, అతడిని ఉత్తరదిశగా పయనించి పార్వతి శివుడి కొరకు తపస్సు చేసిన ప్రాంతం దాటి కదంబ వనంలో ప్రవేశించి, అక్కడ నివసించే ఒక పవిత్ర ప్రౌఢ వనితను దర్శించి తిరిగి రమ్మని కోరాడు. ఆ వెంటనే వివాహం చేస్తానన్నాడు. అష్టావక్రుడు దానికి అంగీకరించి ఆ రాత్రి బాహుదా నదీ తీరంలో ఆగి మరునాడు కుబేరనగరానికి పోయి ఆయన కల్పించిన వినోదాలను వీక్షిస్తూ నిశ్చలమనస్సుతో ఒక యేడాది గడిపి ఈశ్వరుడి క్రీడా క్షేత్రాలను దర్శించి కడిమిచెట్ల వనం చేరి బంగారు మేడలో నివసించే ఒక పవిత్ర వనితను దర్శించాడు. ఆమె అతడికి ఎన్నో అతిథి సత్కారాలను చేసింది. రాత్రి శయ్యపై అతడితో శయనించి భోగించుమని కోరింది. అష్టావక్రుడు తనను తాకకుండా ఉంటే ఉంటానని, లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని అంటాడు. ఆరోజు మిన్నకుండి మరునాడు రాత్రి మరల అతడిని కోరింది. అష్టావక్రుడు ఇలా అన్నాడు. “స్త్రీని పసితనంలో తండ్రి, వివాహమైన తర్వాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమె స్వతంత్రంగా ఏమీ చేయ తగదు. కాబట్టి నేను నిన్ను స్వీకరించను” అన్నాడు. ఆమె ఎన్ని విలాసాలు ప్రదర్శించినా చలించలేదు. అప్పుడామె సంతోషించి తాను ఉత్తరదిశా కన్యనని వదాన్యుడి ఆనతితో అతనిని పరీక్షించానని చెప్పి అతడిని అభినందించి పంపింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి వదాన్యుడి అభినందనలతో పాటు సుప్రభను భార్యగా పొంది సుఖించాడు. కాబట్టి కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారి.