శివాలయ దర్శన విధానం


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.


శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.


శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.


శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. …
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.
ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, “వామదేవ” ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని “ఈశాన ముఖం” అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.

ఉత్తరం వైపు చూసే “వామదేవ ముఖం” నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.
వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు…
శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు…
అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి,
1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు.
2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.
3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.

శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.
మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది “శివమహిమ్నా స్తోత్రం”
హర హర మహా దేవ శంభో శంకర …!

Advertisements

ఆషాడమాసం


శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా … ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం “ఆషాడమాసం” చాంద్రమానం ప్రకారం “ఆషాడమాసం” నాలుగవ నెల. ఈ మసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగానీ,ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలోగానీ సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి “ఆషాఢ మాసం” అనే పేరు ఏర్పడింది.

రోజూ కాకపోయినా ఆషాఢ మాసంలో శుక్లపక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యసామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.

ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి.ఆషాఢంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలువుతుంది.

కాగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అతాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం. కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేవరకు చైత్ర,వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు ఉన్నాయి.

శుక్లపక్ష ఏకాదశి : తొలి ఏకాదశి

దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూ పేరు. శ్రీ మహావిష్ణువు ఇ దినం ఒదలుకుని నాలుగునెలలపాటు పాల కడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణూవు పూజించాలి.మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.

శుక్లపక్ష పూర్ణిమ : వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ

శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెపబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని ,గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం.

కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ

ఆషాఢమాసం చివరి రోజు అయిన అమావాస్యనాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వుంచి వెలిగించి పూలు, లడ్డులు సమర్పించవలెను. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి.

అధికమాసం…..


భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ మాస వివరాలున్నాయి.

హిందూ కేలండర్‌ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా మల మాసమని,లేదా పురుషోత్తమ మాసం వస్తుంది.

కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా అందరూ వాడే మాటలు ”అసలే కరువు, అందులో అధిక మాసం’ అని సాధారణంగా సంవత్సరానికి 12 మాసాలే కానీ ఈ అధిక మాసం ఏమిటని అంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

ఓసారి భగవాన్‌ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారయణుడు అధిక మాసాన్ని సృష్టిం చాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటంలేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట.

  • 1. సౌరమానం
  • 2. చంద్రమానం.

తెలుగువారు చాంద్రమానం ప్రకారం పండుగలను జరుపు కుంటారు. చాంద్రమానం అంటే శుక్లపక్ష పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ఒక చాంద్ర మాసం అవుతుంది.

సౌరమాన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు, ప్రతిమాసం ఒక్కొక్క రాశియందు సంచరిస్తూ పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో సంచరించడం వలన ఒక సంవత్సర కాలం పూర్తి అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 365.2622 రోజులు సౌరమానం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తుంటాయి. అంటే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది ఆయన సంక్రాంతి అవుతుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అవుతుంది.

ఒక అమావాస్య నుండి తిరిగి అమావాస్య ఏర్పడుటకు 29.53 రోజులు పట్టును. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు. సౌరమానానికి సంవత్సరానికి 365.24రోజులు. ఈ రెండు మాసాల మధ్య గల వ్యత్యాసాన్ని భర్తీ చేయుటకు భారతీయ కాల గణనలో ప్రతిరెండున్నర సంవత్స రాల తర్వాత ఒక అధిక మాసముగా ఏర్పాటు చేశారు. అంటే రెండు అమావాస్యల మధ్య ఎప్పుడయితే సంక్రమణం ఉండదో అదే అధిక మాసం ఇది సుమారు 32 మాసాల పదహారు రోజులకు ఒకసారి వస్తుంది.

పంచమే పంచమే వర్షే ద్వౌమాసే ఉదజాయత: అని శాస్త్రవచనం, అనగా ప్రతి ఐదు సంవత్సర ములలో రెండు అధిక మాసములు వచ్చునని అర్థం.

సూర్య సంక్రమణం లేని చాంద్రమాసమునే అధిక మాసంగా పరిగణిస్తున్నాం.
ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది.

సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయవ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుప్ఫలితాలుండవు.

అధిక మాసంలో చేసిన జప, దానాదులకు అధిక ఫలం వస్తుందని శాస్త్రవచనం పురుషోత్తమ మాసంలో చేసే పురాణ పారాయణ మునకు, శ్రవణమునకు, విష్ణుపూజకు అధిక ఫలం లభిస్తుంది.

ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు. ముహూర్తాలతో ప్రమేయం లేని నిత్యం చేసే పూజ పునస్కారాలు, యధావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. శాస్త్ర ప్రకారం మరణించిన పితరులను తలచుకొని కనీసం అన్నదానం చేయాలి.