అలహాబాద్ స్థంభం ( ఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలిఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలి)


అలహాబాద్ స్థంభం!!
ఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలి?

దీనిని అశోక స్థంభం అంటారు,అశోకుడు స్థాపించిన స్థంబాలలో ఇది ఒకటి.ఈయన మౌర్య వంశపు రాజు.ఈయన పాలన కాలం 3 BCE అంటే సామాన్యశకం కంటే ముందు 3 వ శతాబ్దం.

అప్పట్లో సజీవ కళ ఉట్టిపడేలా ఉండేలా చేసిన స్థంబాలలో ఇది ఒకటి.ఆ తరువాత దానిపైన గుప్తుల శాసనాలు కూడా చూడొచ్చు.అంటే సముద్రగుప్తుడి శాసనాలను మనం 4 వ శతాబ్దం నుండి చూడవచ్చు.అంటే మౌర్యుల కాలం తరువాత 700 ఏండ్లకు గుప్త శకం మొదలైనట్టు భావించాలి.

ఆ రాతి స్థంభం పైన కొన్ని శాసనాలు 17 వ శతాబ్దం లో మొఘల్ చక్రవర్తి రాయించాడు.

ఒక విషయం పరిగణలోకి తీసుకుంటే ఈ స్థంభం దాని ఒరిజినల్ స్థానం నుండి అలహాబాద్ అక్బర్ కోట కు తేవడం జరిగింది.తరువాత భారత ఆర్మీ అలహాబాద్ కోటను తమ స్వాధీనం.లోకి తెచ్చుకుంది.కేవలం కొంతమంది ప్రజలను మాత్రమే సందర్శనకు అనుమతిస్తున్నారు.ఇక ఆ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి అవసరం.

The Allahabad pillar

▪️The Allahabad pillar is an Ashoka Stambha, one of the Pillars of Ashoka, erected by Ashoka, Emperor of the Maurya dynasty, who reigned in the 3rd century BCE. While it is one of the few extant pillars that carry his edicts, it is particularly notable for containing later inscriptions attributed to the Gupta emperor Samudragupta (4th century CE)..

▪️Also engraved on the stone are inscriptions by the Mughal emperor Jahangir, from the 17th century.

▪️At some point of time, the pillar was moved from its original location and installed within Akbar’s Allahabad Fort in Allahabad, Uttar Pradesh. As the fort is now occupied by the Indian Army, the public are only allowed limited access to the premises and special permission is required to view the pillar.

అలహాబాద్ స్థంభం ( ఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలిఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలి)


అలహాబాద్ స్థంభం!!
ఈ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలి?

దీనిని అశోక స్థంభం అంటారు,అశోకుడు స్థాపించిన స్థంబాలలో ఇది ఒకటి.ఈయన మౌర్య వంశపు రాజు.ఈయన పాలన కాలం 3 BCE అంటే సామాన్యశకం కంటే ముందు 3 వ శతాబ్దం.

అప్పట్లో సజీవ కళ ఉట్టిపడేలా ఉండేలా చేసిన స్థంబాలలో ఇది ఒకటి.ఆ తరువాత దానిపైన గుప్తుల శాసనాలు కూడా చూడొచ్చు.అంటే సముద్రగుప్తుడి శాసనాలను మనం 4 వ శతాబ్దం నుండి చూడవచ్చు.అంటే మౌర్యుల కాలం తరువాత 700 ఏండ్లకు గుప్త శకం మొదలైనట్టు భావించాలి.

ఆ రాతి స్థంభం పైన కొన్ని శాసనాలు 17 వ శతాబ్దం లో మొఘల్ చక్రవర్తి రాయించాడు.

ఒక విషయం పరిగణలోకి తీసుకుంటే ఈ స్థంభం దాని ఒరిజినల్ స్థానం నుండి అలహాబాద్ అక్బర్ కోట కు తేవడం జరిగింది.తరువాత భారత ఆర్మీ అలహాబాద్ కోటను తమ స్వాధీనం.లోకి తెచ్చుకుంది.కేవలం కొంతమంది ప్రజలను మాత్రమే సందర్శనకు అనుమతిస్తున్నారు.ఇక ఆ స్థంభం చూడాలంటే ప్రత్యేక అనుమతి అవసరం.

The Allahabad pillar

▪️The Allahabad pillar is an Ashoka Stambha, one of the Pillars of Ashoka, erected by Ashoka, Emperor of the Maurya dynasty, who reigned in the 3rd century BCE. While it is one of the few extant pillars that carry his edicts, it is particularly notable for containing later inscriptions attributed to the Gupta emperor Samudragupta (4th century CE)..

▪️Also engraved on the stone are inscriptions by the Mughal emperor Jahangir, from the 17th century.

▪️At some point of time, the pillar was moved from its original location and installed within Akbar’s Allahabad Fort in Allahabad, Uttar Pradesh. As the fort is now occupied by the Indian Army, the public are only allowed limited access to the premises and special permission is required to view the pillar.

కొపేశ్వర దేవాలయం:ఖిద్రపూర్


కొపేశ్వర దేవాలయం:ఖిద్రపూర్,
కొల్హాపూర్ జిల్లా , మహారాష్ట్ర.

ప్రాచీన కోపేశ్వర్ ఆలయం ఇది ఖిద్రాపూర్ లో,కొల్హాపూర్ జిల్లాలో,మహారాష్ట్ర లో ఉంది.ఇది శివుడి ఆలయం.ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది.అక్కడ కొన్ని కారణాలు మనం నమ్మాల్సి ఉంటుంది అలాంటి వాటి వలన ఈ ఆలయం నిర్మాణం 7AD వ శతాబ్దం లో మొదలైంది.అక్కడ రాజుల యుద్ధాల వలన చాలా వరకు నిర్మాణం ఆగిపోయింది.పునర్నిర్మాణం మళ్లీ 12 వ్ శతాబ్దం.లో పూర్తి చేశారు. అది శైలహర మరియు యాదవరాజుల వలన జరిగింది.

ఆలయం నాలుగు భాగాలు ఉంటుంది,అన్ని భాగాలు కూడా వాటిని అవి ఒకే మండపం ద్వారా కలిసే ఉంటాయి.ఇందులోని స్వర్గ మండపం చుట్టూ 48 శిల్పాలతో స్తంభాల రూపం లో చెక్కబడి సర్కిల్లో పేర్చబడి ఉంటుంది.ఆ 48 స్తంభాల లో ఒక్కో స్థంభం ఒక్కో రకంగా ఉంటుంది.కొన్ని గుండ్రంగా,మరికొన్ని చతురస్త్రం గా,శడ్భుజి ఆకారం లో,మరికొన్ని అష్టభుజి లో ఉన్నాయి.

మరొక అద్భుతం ఏంటంటే,స్వర్గ మండపం పైభాగం వృత్తాకారం గా మధ్యలో ఉంటుంది(అది13 ఫీట్ ల వ్యాసార్ధం తో)ఆకాశానికి తెరిచి ఉంటుంది.గర్భగుడి శంఖు ఆకారం లో ఉంటుంది.బయట అద్భుత దేవతల శిల్పాల తో ఉంటుంది,ఏనుగుల విగ్రహాలు ఆలయ బరువు మోస్తున్నట్టుగా బేస్ లో ఉంటుంది.

ఇది ఒక అద్భుత ఆలయం,దర్శకులకు మొదటగా విష్ణుమూర్తి దోపేశ్వర్ లో లింగరూపంలో దర్శనం ఇస్తాడు,సాధారణంగా కనిపించే శివలింగం రూపానికి బదులుగా.శివలింగం ఉత్తరానికి మొహం చేసి ఉండగా ఈ రెండు లింగాలు కూడా అదే గర్భగుడిలో ఉంటాయి.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఆలయం మొదట్లో అంNఈ ఆలయాలలో ఉన్నట్టు నందీశ్వరుడు ఇక్కడ ఉండరు.

వైకోమ్ శివాలయము: వైక్కతప్పన్


వైకోమ్ శివాలయము: వైక్కతప్పన్
వైకోమ్ యొక్క మూలం

పురాతన సంస్కృత గ్రంథాలు, భార్గవ పురాణం & సనత్కుమార సంహిత ఈ స్థలాన్ని వైయఘ్ర గెహం మరియు వైయఘ్రాపురం అని పేర్కొన్నాయి.

ఇతిహాసాల ప్రకారం వ్యాఘ్రపాద మహర్షికి ఇక్కడ శివ దర్శనం జరిగినది, కాబట్టి దీనిని సముచితంగా వ్యాగ్రపాదపురం అని పిలిచేవారు. తరువాత, తమిళం వ్యాపించినప్పుడు, వ్యాఘ్ర అనే పదం వైకోమ్ గా రూపాంతరం చెందినది.
ఈ రోజు వైకోమ్ దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన శివ మందిరాలలో ఒకటి. ఎత్తూమనూర్ శివాలయం, కడుతురుతి తాలియిల్ మహాదేవ ఆలయంతో పాటు ఉన్న ఈ ఆలయం శక్తివంతమైన త్రిశూలంగా పరిగణించబడుతుంది. ‘ఉచ పూజ’కు ముందు ఈ మూడు దేవాలయాలలో భక్తుడు పూజలు చేస్తే, అతని కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకము.
వైక్కత్తాష్టమి ఆలయంలో అందరికి బాగా తెలిసిన పండుగ అయినప్పటికీ, ఈ ఆలయములో అనేక ఇతర పండుగలను జరుగును, వాటిలో కొన్ని ఈ ఆలయానికి ప్రత్యేకమైనవి.

మాల్యావన్ నుండి శైవ విద్య ఉపదేశము అందుకున్న ఖరసురుడు చిదంబరానికి వెళ్లి, మోక్షం సాధించడానికి తీవ్రమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు తాను అడిగిన అన్ని వరాలను మంజూరు చేశాడు మరియు తన నుండి తీసిన మూడు గొప్ప శివలింగాలను అతనికి సమర్పించాడు. అతను ఆ లింగములలో ఎప్పుడూ ఉంటాడని భరోసా ఇచ్చి, మోక్షాన్ని పొందటానికి లింగాన్ని పూజించమని ఖారాకు తెలిపి శివుడు అదృశ్యమయ్యాడు, . ఖారా మూడు లింగాలతో కుడి చేతిలో ఒకటి, ఎడమ చేతిలో ఒకటి మరియు మరొకటి మెడలో ఉంచుకొని హిమాలయాల నుండి దక్షిణమునకు తిరిగి వస్తున్నప్పుడు, అతను అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న తరువాత అతను లింగాలను తీయటానికి ప్రయత్నించినప్పుడు, ఆ లింగములు కదల లేదు. ఇది శివుడి మాయ అని అతను గ్రహించి శివుని పిలిచినప్పుడు, అశరీరవాణి, “నేను ఇక్కడే ఆశ్రయం పొందుతు నన్ను శరణు జొచ్చిన వారికి మోక్షాన్ని ఇస్తాను”అని తెలిపెను. వ్యాఘ్రపాద ఋషి ఖారాను అదృశ్యంగా అనుసరించి వస్తుండగ ఖారా మోక్షాన్ని పొంది ఆ పవిత్ర లింగమును మహర్షి వ్యాఘ్రపాదకు అప్పగించి వాటిని రక్షించి పూజించమని వ్యఘ్రపాద ఋషిని కోరెను.

ఖరా అసురుడు తన కుడి చేతిలో తెచ్చిన శివలింగాన్ని వైకోం వద్ద, ఎడమ చేతిలో ఉన్న లింగాన్ని ఎత్తూమన్నూర్ వద్ద, మెడ ద్వారా కడతురుతి వద్ద పూజిస్తున్నారు అని నమ్మకము.

ఖారా తన మెడతో తీసుకువెళ్ళిన లింగము కడతురుతి వద్ద ఉందని, ఎడమ చేతితో ఉన్నది ఎత్తూమనూర్ వద్ద ఉందని నమ్ముతారు. వైకోమ్ నుండి కడతురుతికి అక్కడి నుండి ఎత్తూమనూర్ వరకు ఉన్న దూరం దాదాపు ఒకటే అనే వాస్తవం ఈ పురాణానికి విశ్వసనీయతను ఇస్తున్నది. కాబట్టి ఒకే రోజున ఈ మూడు లింగాల దర్శనం కైలాసము వద్ద ఉన్న శివ దర్శనంగా పరిగణించబడుతున్నది అని భక్తుల విశ్వాసము.
వృశ్చిక – కృష్ణ పక్ష – అష్టమి నాడు (మలయాళ కాల ప్రకారం), ప్రభువుల ప్రభువు మరియు దేవతలకు దేవుడు అయిన – శివ పరమేశ్వరుడు తన భార్య పార్వతి – జగత్ జననితో వ్యాఘ్రపాద మహర్షికి ప్రత్యక్షమయి, “ఈ స్థలాన్ని వ్యాఘ్రపాదపురం అని పిలుస్తారు” అని ప్రకటించి అదృశ్యమైనాడు. ప్రపంచ ప్రఖ్యాతము గాంచిన వైక్కథాష్టమి మరియు దానికి అనుసంధానించబడిన అన్ని పవిత్ర ఉత్సవాలు ఈ రోజు వరకు ఈ ఆలయములో వృశ్చిక – కృష్ణాష్టమి దినమున జరుపుకుంటున్నారు.

వ్యాఘ్రపాద మహర్షి కొంతకాలం శివ లింగ పూజను భక్తితో కొనసాగించి తీర్థయాత్రలకు వెడెలెను. నెలలు మరియు సంవత్సరాలు గడిచాయి. శ్రీ పరశురాముడు – చిరంజీవి ఒకరోజు ఆకాశం గుండా వెళుతూ మంచి శకునాలు ఇచట చూసి, అకాశయానము నుండి దిగి దివ్యమైన కిరణాలను వెదజల్లుతున్ననీటిలో ఉద్భవించిన లింగాన్ని చూసినారు. ఇది ఖారా ఉంచిన శివలింగం అని అతను గ్రహించెను.
పవిత్రమైన గొప్ప శివ చైతన్య, మోక్షము కోరుకొనే భక్తులకు గొప్ప ఆశ్రయం అని శ్రీ పరశురాముడు అనుకున్నాడు. ఆయన పవిత్రమైన లింగాన్ని తన పవిత్రమైన ప్రార్థనలతో మరియు శివ మంత్రాల పారాయణంతో అచట ప్రతిష్ట చేశారు.

. అతని గొప్ప భక్తుడు – విష్ణువు అవతారం అయిన పరశురాముడు మంత్రాలతో లింగమును ప్రతిష్ట చేసినందున అత్యంత దయాళువైన శివుడు వెంటనే తన భార్య పార్వతి దేవితో పరశురాముడికి ప్రత్యక్షమయినాడు. దయగల శివుడు పరశురాముడితో ఇలా అన్నాడు, “ఇకనుండి నేను ఇచట శైవ-వైష్ణవ చైతన్యగా ఉండి పరమానందాన్ని మరియు మోక్షాన్ని భక్తులందరికీ ఇస్తాను”.
పరమానందముతో, కృతజ్ఞతతో పరశురాముడు కొన్ని రోజులు శివలింగమునకు పూజలు చేసి స్వయంగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి, తారుణ గ్రామానికి చెందిన ఒక గొప్ప బ్రాహ్మణుడుకు పూజా బాధ్యతలు అప్పగించారు. ఆ బ్రహ్మణునికి పూజ మంత్రాలు నేర్పించారు. బ్రాహ్మణుడు మొత్తం 28 శివగమాలను నేర్చుకున్నాడు మరియు రుద్రాక్ష మరియు భస్మము ధరించాడు. పరశురాముడు లింగముతో సహా ఆలయం మొత్తాన్ని బ్రాహ్మణులకు దానం చేసి అదృశ్యమయ్యాడు. ఆలయ విధులు మరియు పద్దతులను పరశురాముడే పధకముగా నిర్ణయించెనని భక్తుల నమ్మకము.

వ్యాఘ్రలయేష యొక్క మూడు భావాలు లేదా రూపాలు

ఈ పవిత్ర ఆలయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు భావాలలో లేదా రూపాల్లో ‘వ్యాఘ్రలయేష’ (మూర్తి) భక్తులను ఆశీర్వాదించుతారని నమ్ముతారు.

ఉదయం పంతీరడి పూజ వరకు అతను దక్షిణామూర్తిగా – దేవుళ్ళు, మహర్షులు, అసురులు, యక్షులు, కిన్నారాలు, మరియు అన్ని జీవులు మరియు అన్ని ప్రపంచాలచే గౌరవించబడిన గురువులకు గురువు. అతను వివేకము, జ్ఞానం మరియు అవగాహనను దానమిచ్చువాడు.
మధ్యహన్నపూజ వరకు కిరాత మూర్తి భావములో

మధ్యాహ్నం సమయంలో మధ్యహ్న పూజ వరకు తన గొప్ప భక్తుడయిన అర్జునుడికి పశుపతాస్త్రం ఇచ్చిన కిరత మూర్తి యొక్క భావమును వహిస్తాడు. అప్పుడు అతను భక్తులకు అన్ని ప్రయత్నాలలో విజయం మరియు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు – ‘సర్వకార్య జయం’ మరియు ‘సర్వ విజ్ఞోప శాంతి‘. సాయంత్రం శివుడు లేదా వైక్కతప్పన్ ‘శక్తి పంచాక్షరి’ యొక్క భావమును వహిస్తాడు- కైలాసము యొక్క నిరపాయమైన ప్రభువు – జగత్ పిత తన భార్య జగత్ మాత పార్వతి, కుమారులు గణపతి మరియు కార్తికేయలతో సంతోషంగా మరియు దయగల మానసిక స్థితిలో కూర్చొని దర్శనము. అప్పుడు అతను అన్ని ప్రాపంచిక ఆనందాలను మరియు భక్తుల కోరికలను తీరుస్తాడు. పై వాస్తవాలు భక్తుల నమ్మకం మాత్రమే కాదు, వారి ద్వారా నిరూపించబడినవి.

వైకోం యొక్క భస్మము లేదా బూడిద

వైక్కాతప్పన్ యొక్క అతి ముఖ్యమైన ప్రసాదం భస్మము-విభూతి. ఇది పెద్ద వంటశాల అగ్ని ప్రదేశం నుండి తీసుకోబడినది, ఇక్కడ శ్రీ వైక్కతప్పన్ బ్రాహ్మణుడిగా మారువేషంలో పని చేస్తాడని నమ్ముతారు.
ఇతిహాసాలు ఈ భస్మమును భయం, విషం, గాయాలు మరియు అపస్మారములకు పవిత్రమైన ఔషధంగా ప్రకటించబడినది. భస్మము యొక్క అద్భుత శక్తి యొక్కసాక్ష్యము భక్తుల నమ్మకం.

గంగా ప్రపత్త తీర్థము

ఒకసారి పరశురాముడు వ్యాఘ్రలయేషను ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రజలు మరియు జంతువులు నీరు లేక బాధపడుతున్నారని తెలుసుకొని ప్రభువును ప్రార్థించి దుఃఖాలను తెలిపెను. ఏ వరం కావాలి అని అడిగినప్పుడు, పరశురాముడు “కలియుగలో పాపాలతో వచ్చిన భక్తుల కోసం, తాగడానికి, స్నానం చేయడానికి మరియు తర్పాణము చేయడానికి (పాపాలను కడిగి, దేవుళ్ళను, పూర్వీకులను ప్రసన్నం చేసుకునే ప్రక్షాళన కార్యక్రమం) “తీర్ధమును ప్రసాదించమని కోరెను. భక్తుల నమ్మకం. ఈ తీర్థములో , దేవతలు, కిన్నేరలు మరియు గాంధర్వులు ఆశీర్వదించిన శివుడి జడలో గంగ ఉన్నదని. ఆలయ సమ్మేళనం యొక్క ఉత్తర భాగంలో మనం చూసే పుష్కరిణి ఇది. దీనిని ‘గంగా ప్రపత్త తీర్థము’ లేదా వలియచిర అంటారు.

శివానంద తీర్థము:

ఒకసారి నిదఘ మహర్షి పాంచాల దేశము నుండి, శివుడిని ధ్యానం చేస్తున్న వ్యాగ్రపాద మహర్షి వద్దకు వచ్చారు. తనను శిష్యుడిగా శ్వీకరించమని మహర్షిని వేడుకున్నాడు. వ్యాఘ్రపాద మహర్షి నిదఘకు శైవ మంత్ర విద్య మరియు ఉపసనా యోగం నేర్పించి, శివ భజన ద్వారా అన్ని విజయాలు మరియు ముక్తిని సాధించవచ్చని ఆయనను ఆశీర్వదించారు. నిదఘ చాలా భక్తితో శివోపాసన చేస్తున్నాడు. ఒక అష్టమి రోజున వ్యాఘ్రపాద మహర్షి మరియు నిదఘ మహర్షి స్థంభ గణేష్ మరియు శివులను ఆరాధిస్తున్నప్పుడు, కైలాస ప్రభువు ఈశాన్య మూలలో కనిపించి ఆనంద తాండవ నృత్యము ప్రదర్శించారు. ఆ సమయంలో అతని జడల నుండి కొన్ని నీటి చుక్కలు కింద పడినవి. ఆ నీటిని ‘శివానంద తీర్థ’ అని అశీర్వదించి అంతర్ధానమయ్యాడు. వ్యాగ్రపాద మహర్షి, నిదఘ మహర్షి దాని నుండి నీరు తీసుకొని వారి శరీరాలపై చల్లుకొని తీర్ధముగా స్వీకరించారు.

ఈశాన్య మూలలో ఉన్న ఈ తీర్థము ఇప్పుడు బావిగా రూపాంతరం చెందినది, ఆ బావి నీటిని ఆలయంలోని పూజలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ఆర్తిహర తీర్థము:

శంకర మరియు ముకుంద, శాస్త్రాలు బాగా నేర్చుకున్న యువ బ్రాహ్మణులు కన్యా కుమారి నుండి కాశీకి ప్రయాణిస్తు వైకోమ్ చేరుకున్నారు. వైక్కతప్పన్ యొక్క భజన మరియు ప్రసాదము ఆనందించేటప్పుడు శంకర లేకుండా ముకుంద కాశీకి బయలుదేరాడు. ఒంటరితనంతోను గంగలో స్నానం చేయలేకపోతున్నాననే ఆలోచన శంకర చాలా వ్యధపడి తీవ్రమైన జ్వరంతో భాధ చెందెను. ఒక రోజు శంకర వ్యాఘ్రాలయేశకు హృదయపూర్వక ప్రార్థనానంతరము గాఢ నిద్రలో ఉండగా కలలో ప్రభువు తూర్పు చెరువులో స్నానం చేయమని కోరాడు. అతని కోరికలునెరవేర్చుతానని నమ్మబలెకెను. మహేశ్వర ఆదేశానుసారం, శంకర ఉదయాన్నే లేచి, మంత్రాలను పఠించుతు చెరువులో స్నానం చేశాడు. చెరువు నీటి నుండి లేచినప్పుడు గంగా తీర్థంలో ఉన్నట్లు గమనించిన శంకర ఆనందానికి హద్దులు లేవు.

తనను తాను మరచిపోయి శంకర శివుడిని ప్రశంసించాడు. అదే సమయంలో వ్యాగ్రపాద మహర్షి అక్కడికి చేరుకుని ముకుంద పద్దెనిమిది నెలల తర్వాత తిరిగి వస్తాడని మరియు స్నేహితుడితో తిరిగి వచ్చి స్థనమాలయ ఆరాదించి శివ సయూజ్యం సాధిస్తారని తెలిపెను. తూర్పున ఉన్న అదే తీర్థాన్ని ఆర్తి హర తీర్థ లేదా ఆర్తి వినసన తీర్థము అని పిలుస్తారు. ఇక్కడ స్నానం మరియు తర్పణము పవిత్ర గంగలో చేసినంత మంచిదని నమ్ముతారు.

వాస్తు శిల్ప కళ

ముంగిలి మరియు గోపురములు:

కేరళలోని పెద్ద దేవాలయాలలో ఈ ఆలయము ఒకటి. వైకోమ్ మహాదేవ ఆలయం సుమారు ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో ఉన్నది. నది ఇసుకతో సమం చేయబడిన ప్రాంగణం నాలుగు వైపులా నాలుగు గోపురాల సమ్మేళనంతో ప్రహరీ గోడలతో ఉన్నది.

వ్యాఘ్రపాద స్థానము:

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉన్నది. తూర్పు గోపుర సమీపంలో ఒక రక్షిత వేదిక ఉన్నది, ఇక్కడ రావి చెట్టు, మామిడి చెట్టు మరియు పనస చెట్టు అన్నీ కలిసి పెరిగాయి. ప్రస్తుతం రావి చెట్టు మాత్రమే సజీవంగా ఉన్నది. గొప్ప శైవోపాసకుడు వ్యాఘ్రపాద మహర్షి ఇక్కడ తపస్సు మరియు పూజలు చేశాడని మరియు అదే స్థలంలో అతనికి శివ-శక్తి దర్శనం మరియు అత్మససత్కర్ లేదా నెరవేర్పు లభించిందని, ఈ స్థలాన్ని వ్యాఘ్రపాద స్థనా అని పిలుస్తారు.

లోపలి నిర్మాణాలు మరియు మండపం

బంగారు ద్వజ స్థంభము నిజంగా ఈ ఆలయానికి గర్వకారణం. ద్వజస్థంబము దాటిన తరువాత బలిపీఠము(బలికలుపుర) లోకి ప్రవేశిస్తాము. బలిపీఠము ఈశాన్య దిక్కున కూర్చున్న స్తంభ గణేష్ సన్నది ఉన్నది. తరువాత నమస్కార మండపంలోకి ప్రవేశము. రామాయణ కథ నమస్కార మండపము పైకప్పుపై లోన చెక్కబడినది. ద్రవ్య కలశ, మార్ఘాళి కలశ పూజలు వైక్కతప్పన్ యొక్క ప్రధాన సమర్పణలు వేద మంత్రముల పఠనము ఈ మండపము నుండి నిర్వహిస్తారు. ఒకే రాతితో చేసిన భారీ నంది, అర్చన కోసము చిన్న నంది ఈ మండపానికి తూర్పున ఉన్నవి. తన భక్తుల ప్రతి కోరికను నెరవేర్చే అన్నదాన ప్రభు – శ్రీ వైక్కతప్పన్ యొక్క శ్రీకోవిల్ (గర్భగుడి) కు పేర్చిన రాతి మార్గము గుండా చేరుకొన వచ్చును.

శ్రీకోవిల్ లేదా ప్రధాన లోపలి ప్రాకారము:

శ్రీకోవిల్ గుండ్రని ఆకారంలో రెండు గదులతో ఉన్నది. ముఖ మండపం. రెండవ గది గర్భ గుడి పూర్తిగా చదరపు ఆకారంలో పైకప్పుతో సహా రాతితో నిర్మించబడింది. దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తు పీఠమున్నది. ఈ పీఠముపై శ్రీ వైక్కాతప్పన్ యొక్క అత్యంత పవిత్రమైన, అత్యంత ప్రసిద్ధమైన మరియు అత్యంత గొప్ప శివలింగం ప్రతిష్టించబడినది. ఇది పవిత్రమైన నల్ల రాయితో చేసిన ఆరు అడుగుల ఎత్తులో ఉన్న లింగము. లింగమునకు నెలవంక, మూడు కళ్ళు, ముక్కు మరియు నాలుగు చేతులతో శైవ అభరణాలతో (ఆభరణాలు) స్వచ్ఛమైన బంగారంతో ‘అంకీ’ రూపంలో అలంకరించబడి ఉంటుంది. (శివ అభరణాలు పరసు, మృగ, వరద మరియు అభయ ముద్రలు). గర్భ గుడి లోపల నూని మరియు నెయ్యి దీపాలు కర్పూరం తో మాత్రమే వెలిగించి ఉన్నవి. ఈ ప్రదేశం యొక్క భావము లేదా రూపములను మరియు శాంతిని వర్ణించుట కంటే అనుభవించడానికి మాత్రమే. శ్రీకోవిల్ యొక్క బయటి గోడలు పురాణ కథల చిత్రాలు మరియు చెక్క శిల్పాలతో చక్కగా అలంకరించబడ్డాయి.

ఆరు మెట్లు మరియు వాటి అర్థం

గోపురము లేదా నడవ నుండి ఆరు మెట్లను దాటకుండా ఈ శ్రీకోవిల్‌లో ఉన్న శైవ చైతన్య దర్శనమును మనం పొందలేము అనేది చాలా ఆసక్తికరమైన మరియు విచిత్రమైన వాస్తవం. ఇది మనకు కామ, క్రోద, లోభా, మోహ, మధ మరియు మఠసార్య వంటి షట్ (ఆరు) వికారాలు (భావోద్వేగాలు) లేదా తాంత్రిక కల్పన ప్రకారం తాంత్రిక చక్రాలను గుర్తుచేస్తూ ఉండవచ్చు. అవి మూలాధర చక్రం, స్వాధిష్ఠాన చక్రం, మణిపురక చక్రం, అనాహత చక్రం, విసుధి చక్రం మరియు జ్ఞాన చక్రం.

విఘ్నేశ్వర ప్రతిష్ఠ

శ్రీకోవిల్ వెలుపల ఆగ్నేయ మూలలో రాతి పీఠంపై విఘ్నేశ్వర ప్రతిష్ఠ ఉన్నది, దక్షిణాన మహా గణపతి మరియు ఉత్తరాన శక్తి గణపతి గలవు. ఇవి పంచ లోహ విగ్రహములు.
మాత్రుశాల, విల్వ చెట్టు మరియు అష్టడదిక్పాలకులు
మాన్య స్థానా
ఉత్తరాన ఉన్న ఆలయ ప్రాంగణంలో, విల్వమంగళ స్వామికి గోడపై వైకత్తపన్ బ్రాహ్మణుడిలా ప్రతల్ ను తినడం కనిపించే ‘మన్య స్థాన’ అనే చాలా పవిత్ర స్థలము కలదు. వెలిగించిన భద్రదీపమును ఈ ప్రదేశంలో ఉంచి ప్రతల్ లేదా అన్నదాన ప్రారంభం ఇక్కడ నుండి జరుగుతుంది. పురాతన కాలం నుండి ఆలయ ప్రాంగణం యొక్క ఉత్తరం వైపున బ్రాహ్మణులకు ఇచట తదియారాధన జరుగుచున్నది.
పెద్ద వంటగది

మన్య స్థాన తూర్పు వైపు ప్రతల్ వండుటకు పెద్ద వంటగది కలదు. స్వామి వైక్కతప్పన్ ఈ వంటగదిలో పని చేస్తున్నట్లు కనిపించునని నమ్మకము. వంటగది పొయ్యి బూడిదను ఆలయ ప్రధాన ప్రసాదంగా వినియోగిస్తారు.

మూసిన తలుపు

వైకోం ఆలయం పాత రోజుల్లో నూట ఎనిమిది కుటుంబాల యాజమాన్యంలో ఉండేది. యజమానులను రెండు ముఠాలుగా ఏర్పడి ఒక సమూహం పాలకుడి పక్షంలో చేరినది. వారి వివాదాలు, తగాదాలు రోజురోజుకు పెరిగినవి. ఒక రోజు విభజించబడిన సమూహంలోని ఒక విభాగం అధ్యక్షుడు మధ్యాహ్నం ఆలయానికి వచ్చి మధ్యాహ్నం పూజను ఆపడానికి సిద్ధ పడిరి. ఆ సమయంలో నివేదాను నమస్కార మండపానికి పశ్చిమ భాగంలో ఉంచడానికి ఉపయోగించేవారు. పశ్చిమ ప్రాంగణంలో ప్రవేశ ద్వారం తలుపు పై తన ఉత్తరీయమును ఉంచి న్జల్లాల్ నంబూద్రి నివేదా వద్దకు వచ్చి నోటిలో యున్న కిల్లీ అవశేషాలను నివేదాపై ఉమ్మివేసి పూజకు అంతరాయం కలిగించిరి. అతను తలుపు పైనుండి తన ఉత్తరీయమును తీసుకుంటున్నప్పుడు, అత్యంత విషపూరితమైన పాము కాటుకు గురి అయినాడు. అతను పడమటి గోపురము వెలుపలకు ప్రాకి మరణించాడు. ఆలయ ప్రాంగణం యొక్క పశ్చిమ తలుపు అప్పుడు స్వయంచాలకంగా మూసివేయబడింది మరియు శ్రీకోవిల్ లోపల నుండి ఒక స్వరం “ఈ తలుపు ఇక తెరవకూడదు” వినిపించినది.

పనాచిక్కల్ భాగవతి

ఆలయ ప్రాంగణానికి దక్షిణం వైపున పనాచిక్కల్ భాగవతి అనే శక్తి సానిధ్యము కలదు. దాని మూలం ఇతిహాసాలలో ఈ క్రింది విధంగా వివరించబడింది:
అగస్త్య ముని అనేక మహర్షులతో ప్రదోష రోజు వైక్కతప్పన్‌ను పూజించిన తరువాత తిరిగి వచ్చుచుండెను. నీలకుండల అనే గాంధర్వ కన్య అప్పుడు తన పరివారముతో ప్రయాణిస్తున్నది. చాలా గర్వంగా ఉండటంతో ఆమె మహర్షులను, మహేశ్వరుడిని కూడా చూసి నవ్వినది. కోపంతో ఉన్న అగస్త్యుడు ఆమెను రాక్షసిగా శపించాడు. ఆమె పశ్చాత్తాపపడి షాప విమోచనము కోరినప్పుడు మహర్షి “86 సంవత్సరాల తరువాత మీరు ఇక్కడ పాప మోక్షాన్ని వ్యాఘ్రపాదపురంలో పొందుతారు” అని అన్నారు.

స్థంభ వినాయక

పరశురాము తీర్థయాత్రకు బయలుదేరిన రోజు నుండి ఆలయ రక్షణ బాధ్యతలను స్థంభ వినాయకుడు కలిగి ఉన్నారు. ఒక రోజు క్రూరమైన రాక్షసి అక్కడికి వచ్చి ప్రజలను, జంతువులను ఇబ్బంది పెట్టసాగాడు. ప్రజలు వ్యాఘ్రపాద మునిని ఆశ్రయించారు. అతను రాక్షసి యొక్క పాత కథను జ్ఞాపకం చేసుకొని స్థంభ వినాయకుడిని ప్రార్థించాడు. వినాయకుడు తన సేవకుడు భద్రాయుషును ఆమెతో వ్యవహరించమని ఆదేశించిన త్రిసూలముతో రాక్షసిని మూడు ముక్కలుగా నరికెను. మూడు ముక్కలు అప్పుడు మూడు దేవిలుగా రూపాంతరం చెంది వారికి మోక్షాన్ని ప్రసాదించినందుకు వైక్కతప్పన్ మరియు స్థంభ గణపతిని ప్రశంసించారు.
స్థంభ వినాయకుడి అభ్యర్థన మేరకు విక్కత్తప్పన్ వారికి ఒక్కొక్క చోటు కల్పించారు. మధ్య భాగం ఇక్కడ ఆలయ ప్రాంగణం యొక్క దక్షిణ భాగంలో ఉన్నది దీనిని పనాచిక్కల్ భాగవతి అని పిలుస్తారు. ఇతర దేవతలను దక్షిణాన్న చెరికుమెల్ మరియు ఉత్తరాన కూట్టుమెల్ పంపారు.

సర్ప సానిధ్య

ఆలయ ప్రాంగణానికి దక్షిణాన సర్పాలను (పాము దేవుళ్ళు) పూజిస్తారు. ఆచారాలు మరియు పూజలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ నిర్వహిస్తారు. అక్కడ ఒక రావి చెట్టు మరియు ఎత్తైన వేదిక ఉండెను, ఇది కొన్ని సంవత్సరాల క్రితం ధ్వంసమైంది. అచట కొత్త చెట్టును నాటి ఇటీవలి సంవత్సరాలలో వేదిక పునర్నిర్మించబడినది. మలయాళ మాసం కుంబ (ఫిబ్రవరి-మార్చి) లో సర్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూజలు:
సరస్వతి యమ తో ప్రారంబించి స్వామికి మేలుకొలుపు
నిర్మల్య దర్శనము
అభిషేకము
ఉదయము: ఊష పూజ, ఎథిర్థు పూజ లేద ఆహ్వాన పూజ, పంథిరడి పూజ.
ఉచ్చ పూజ (మధ్యాఃన్న పూజ)
రాత్రి: అథళ పూజ.
మూడు రకముల శ్రీ బెలి కలవు.
ఎథిర్థు శ్రీబెలి, ఉచ్చ శ్రీబెలి మరియు అథళ శ్రీబెలి.
పంచకావ్యము, నవకం మరియు ప్రత్యేక అభిషేకములు ఉచ్చ పూజ సమయములో చేయుదురు. ప్రత్యేక దినములలో సోమవారము, థిరువథిర, ప్రదోష, కృష్ణ పక్ష అష్టమి మరియు పౌర్ణమి రోజులలో సాయంత్రము కూడా అభిషేకము చెయుదురు. అలాటి ప్రత్యేక దినములలో లేద సంకరమ అప్పుడు వైక్కథప్పన్ రుషభ వాహనముపై అథళ శ్రీ బెలి కై ఊరేగింతురు. ఆలయము మరునాడు సాయంత్రము 04:00 గంటలవరకు మూసివేయబడును. ఘట్టియము పఠనము: ఘట్టియము పఠనము వైక్కథప్పన్ ఆలయములో మాత్రమే జరుగును, కేరళలో మరి యే ఆలయములలోను జరగదు. ఘట్టియము పఠనము దీపారాధన సమయములోను అథళ శ్రీబెలి మూడవ ప్రదక్షణ లోను జరుగును. శ్రీబెలిని శ్రివెలి అని వ్యవహరింతురు. ఒక 5 అడుగుల పొడవు గల ఇనుప కమ్మి వెండి రేకుతో కప్పబడి, చివర రిషభుడి విగ్రహముతో ఉన్న ఆ కమ్మిని ఒక ముదుసలి బ్రాహ్మణుడు వైథకప్పన్ వైపు చూస్తు స్లోకములను పఠించుతూ తిరుగును. ఇది ఘట్టియుము యొక్క ముఖ్య ఆంశము. ఆయిలము తిరునల్ ట్రావెంకోర్ మహరాజు 27వ తులం 1030 మళయలం కాలములో ప్రారంభించిరి.
ఒక అనాధ ముదుసలి బీద బ్రాహ్మణుడు శివ భక్తుడు ప్రథల్ కోసము కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చొనుటకు స్థలమునడిగెను. ఆ అనాధ బ్ర్రాహ్మణుడు తన కష్టములను ఆ బ్రాహ్మణునికి తెలుపుకొనగా నీవు ట్రివేన్డ్రము అయిల్యం మహ రాజు నాకు బాగా తెలియును నీవు ఆయన వద్దకు వెడలిన అతను అన్ని చూసుకొందురు అని వాగ్దానము చేసెను. ముదుసలి బ్రహ్మణుడు మరునాడు మహరాజు వద్దకు వెడలగా రాజు ఆయనని స్వాగతించి రాత్రి కలలో వైక్కథప్పన్, వైకోమ్ నుండి బ్రాహ్మణుడు వచ్చును నాకు అచట ఘట్టియము జరుగుటలేదు అతనికి రిషభ వాహనముము నుంచిన కమ్మిని ఇచ్చి ఘట్టియమును ప్రారంభించమని కోరినటుల తేలియజేసెను అని తెలిపెను. రిషభ వాహనము యున్న కమ్మిని రాజు వైకోమ్ ఆలయమునకు తీసుకొని వచ్చి వైక్కథప్పన్ ఆలయములో ఆ బ్రాహ్మణునికి ఇచ్చి ప్రతి దినము ఘట్టియము స్వామికి కైంకర్యము చేయవలెనని ఆ బ్రాహ్మణునికి ఆదేశించి తగిన పైకములు సమకూర్చి వెడలెను.
స్వామికి సమర్పణలు:
1. ప్రథల్
2. ఆనంద ప్రసాద
3. సహస్ర కలస
4. ద్రవ్య కలస
5. ఆయిర కలస
6. ఆయిరకుడం
7. విల్వపత్ర మాల
8. భస్మ మాల
9. విలక్కు (దీపం)
10. అప్పం నైవేద్యము
11. క్షీర ధార
12. అలువిలక్కు
13. జలధార
మంత్రములు భజనలు :

  1. లింగాష్టకము, 2. శివసూక్తము, 3. శివశక్తి, 4. అమ్మ స్తోత్రము, 5. నారాయజ్ఞనె, 6. ఓమ్ నమః శివాయ, 7. బిల్వాష్టకము, 8. చంద్రశేఖరాష్టకము, 9. వ్యాఘ్రాలయెశ వందన శ్లోకము, 10. శివస్థుతి. 11. శివమంత్ర. 12. తిరువైక్కొం వళుం శివ శంబొః, 13. శివ మంగళాష్టకము, 14. చంద్రశేఖారాష్టకము, 15. శివ శ్లోకములు.

ఆలయ సమయములు: 3.30 AM to 11.30 PM and from 5 PM to 8 PM
వైకొమ్ కొట్టయం నుండి 32 కి.మీ ద్రూరము. బస్ స్టాండ్ నుండి ఆలయము 900 మీ దూరములో యున్నది. అన్ని రకముల వాహనములు ఆలయమునకు చేరుకొనుటకు కలవు.
రైలు మార్గము: వైకోమ్ రైల్వె స్టెషను 12 కి. మీ దూరములో కలదు.
ఆకాశ మార్గము: కొచ్చిన్ విమానాశ్రయము 58కి,మీ దూరములో కలదు.

🌸🙏బీజాక్షర సంకేతములు🙏🌸


🌸🙏బీజాక్షర సంకేతములు🙏🌸

ఓం – ప్రణవము సృష్టికి మూలం
హ్రీం – శక్తి లేక మాయా బీజం
ఈం – మహామాయ
ఐం – వాగ్బీజం
క్లీం – మన్మధ బీజం
సౌః – సౌభాగ్య బీజం
ఆం – పాశబీజం
క్రోం – అంకుశము
హ్రాం – సూర్య బీజం
సోం, సః – చంద్ర బీజం
లం – ఇంద్ర బీజం, పృథివీ బీజం
వం – వరుణ బీజం,జల బీజం
రం – అగ్ని బీజం
హం – ఆకాశ బీజం, యమ బీజం
యం – వాయు బీజం
శం -ఈశాన్య బీజం, శాంతి బీజం
షం , క్షం – నిరృతి బీజము
సం – సోమ (కుబేర) బీజము
జూం – మృత్యుంజయ, కాలభైరవ బీజం
భం – భైరవబీజం
శ్రీం – లక్ష్మీబీజం
హ్సౌ – ప్రాసాద , హయగ్రీవబీజం
Kshourwm – నృసింహ బీజం
ఖేం – మారణబీజం
ఖట్ – సంహారబీజం
ఫట్ – అస్త్రబీజం
హుం – కవచబీజం
వషట్ వశీకరణముబీజం
వౌషట్ – ఆవేశబీజం
ష్ట్రీo – యమబీజం
ధూం – ధూమావతిబీజం
క్రీం – కాళీబీజం
గం – గణపతిబీజం
గ్లౌం – వారాహి,గణపతిబీజం
ఘే – గణపతిబీజం
త్రీం -తారా బీజం
స్త్రీo – తారాబీజం
హూం – కూర్చము,క్రోధము,ధేనువు
బ్లూం – సమ్మోహనము
ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం
ద్రీo – ఉద్దీపనం
దం – దత్తాత్రేయబీజం
అం – బ్రహ్మ బీజం
కం -బ్రహ్మబీజం
ఇం – నేత్రబీజం
ఉం – శ్రోత్రబీజం
హ్లీం – బగళాబీజం
గ్రీం – గణపతిబీజం
ఠ – స్థంభనము
హిలి – వశీకరణ,దేవతాభాషణం
కిలి కిలి – దేవతాభాషణం
చులు – బాధా నివారణ
హులు – బాధా నివారణ

మానవుడు ఈ లోకంలోని కర్మ వలన శరీరాన్ని పొందుతున్నాడు. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ మరల పాపపుణ్యాలు చేసి తిరిగి జన్మ పరంపరను పొందుతున్నాడు. ఇట్టి జన్మ పరంపరను విచ్చేదమొనర్చడానికి ఉపయోగపడు సాధనే ‘జపం’ అని శాస్తమ్రులు చెబుతున్నాయి.
‘జప’మనగా ‘జ’-జన్మ విచ్ఛేదనం చేయునది. ‘ప’ -పాపమును నశింపచేయునది అని అర్ధం. ఈ విధంగా జన్మను పాపమును రెండింటిని నశింపచేయడం చేతనే దీనికి జపమని పేరు వచ్చింది. జపంలో చందోబద్ధమైన ఒకే భగవన్నామం కానీ, ప్రత్యేకమైన కొన్ని మంత్రాలను కానీ ఉచ్చరించడం జరుగుతుంది. మనసు చంచలమై అల్లకల్లోలంగా వున్నప్పుడు ఆ మనసును ఏకాగ్రపరచడానికి జపం ఉపయోగపడుతుంది. నిశ్చల మనస్సుతో నిర్మలంగా దైవంపై మనసును కేంద్రీకరించి తత్ మంత్ర దేవతామూర్తి గుణరూపాలను మనసులో ముద్రించుకుని జపించాలి.
జపాన్ని మూడు విధాలుగా చేయవచ్చు. ఒకటి వాచకము: మంత్ర బీజ వర్ణములను తన దగ్గర ఉన్నవారికి వినబడునట్టు ఉచ్చరించుతూ జపించడం. రెండవది ఉపాంశువు: తన దగ్గరున్న వారికి మంత్రోచ్ఛారణ శబ్దాలు వినపడకుండా ఉచ్చరిస్తూ కేవలం పెదవులను మాత్రమే కదలిస్తూ జపం చేయడం. మూడు మానసికము: పెదవులను నాలుకను కదల్చకుండా మనస్సులోనే మంత్రం జపించుట.
వాచిక జపయజ్ఞముకన్నా ఉపాంశు జప యజ్ఞము వందరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ఉపాంశు జప యజ్ఞం కంటె మానసిక జపయజ్ఞం వెయ్యిరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మంత్ర మహిమార్ధములను క్షుణ్ణంగా తెలుసుకుని జపించడం, సగర్భ జపం అనీ, మిక్కిలి శ్రేష్ఠమైనదనీ చెబుతున్నారు.
జపాన్ని చేసి సిద్ధి పొంది ఉచ్ఛస్థితికి వచ్చిన మహాపురుషుల యొక్క ప్రతిరోమము మంత్రాన్ని ఉచ్చరించడాన్ని మనం గమనించవచ్చును. జపం వలన కలుగు స్పందనచే సాధకుని శరీరం అంతా ఒక విధమైన దివ్య తేజస్సుతో దీప్తి నొందుతుంది. ఇట్టి స్థితిలో సాధకుని శరీరం దైవభావంతో అంతర్లీనమై ఒకవిధమైన గగుర్పాటు కలిగి అనిర్వచనీయమైన అద్భుతానందాన్ని పొందును. అతనిలో దైవ ప్రేమ పూర్తిగా నిండి ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది. మరియు అనేక ఇతర సిద్ధులను కూడా పొందుతుంది.
అలాగే జపవిధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మరీ మెల్లగా అక్షరం విడిచి అక్షరంగా జపం చేయరాదు. అలాగని వర్ణోచ్ఛారణ మిక్కిలి వేగంగాను చేయరాదు. సమాన వేగంతో ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉచ్చరించాలి. జపం చేసేటప్పుడు మనసును ఇతర భావాలనుండి మరిల్చి దైవం మీద మంత్రార్ధం మీదే ధ్యాసవుంచి ప్రశాంతంగా, ఏకాంతంగా జపించాలి.
సాధ్యమైనంతవరకు వౌనంగా ఉండాలి. శాంత స్వభావంతో ఉంటు పెద్దలను, విజ్ఞులను గౌరవించాలి. పాప కర్మలను, పాప చింతనలను పూర్తిగా విడిచి ధర్మచింతనతో, ఆధ్యాత్మిక చింతనతో గడపవలెను. సాత్విక మితాహారాన్ని భుజించాలి. సదా ఇష్ట దేవతా స్తోత్రాల పఠనం, వినడం కీర్తనం చేయాలి. దైవంనందు జపం పట్ల పరిపూర్ణ విశ్వాసం వుండడం అత్యంత ఆవశ్యకం. మానసిక జపానికి కాలనియమం లేదు. సాధకుని యొక్క అనుకూలత బట్టి ఎపుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మంత్రార్ధాన్ని, మంత్ర చైతన్యమును, యోని ముద్రను తెలసుకోకుండా ఎన్నిసార్లు జపించినా నిష్ఫలం అవుతుంది. జపోచ్ఛారణలో మంత్రం బీజాక్షరాలు లోపించకూడదు. అలాలోపిస్తే జప ఫలం ఉండదు.

బీజ లోపం లేకుండా చైతన్యం కలిగి ఉండు మంత్రాలను జపించడం వల్లనే ఫలితం.

సంధ్యా సమయాల్లో అష్టోత్తరాలు, సహస్రనామాలు జపించడం ఉత్తమం. ఒక దైవనామాన్నికానీ ఒకే మంత్రాన్ని గానీ జపిచడం వల్ల ఏకాగ్రత కుదిరి జపసాధన నిర్విఘ్నంగా సాగుతుంది.

ఎత్తుమనూర్ మహదేవ ఆలయము



ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం భారతదేశం కేరళలోని కొట్టయం ఎత్తుమనూర్ గ్రామములో ఒక పురాతన శివాలయం. ఇది ఈ ప్రదేశానికి కీర్తిని ఖ్యాతిని తెచ్చిపెట్టినది. ఈ ఆలయంలో పాండవులు, వ్యాసముని పూజలు చేసినట్లు ఆలయ సంప్రదాయం తెలుపుచున్నది. ఈ ప్రదేశం యొక్క పేరు ‘మనూర్’ అనే పదం నుండి వచ్చినది, అంటే జింకల భూమి. కేరళలోని ప్రసిద్ద శివాలయాలు వైకోం ఆలయం, చెంగన్నూర్ మహాదేవ ఆలయం, కడుత్రుతి మహాదేవ ఆలయం, ఎర్నాకుళం శివాలయం, వజప్పల్లి మహా శివాలయం మరియు వడక్కునాథన్ ఆలయములలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడినది.
ఆలయం
ప్రస్తుత ఆలయ భవనం, దాని గోపురం మరియు దాని చుట్టూ ఉన్న కోటతో 717 ME (క్రీ.శ 1542) లో పునర్నిర్మించబడినది. ప్రధాన ద్వారం లోపల మరియు వెలుపల గోడలపై ద్రవిడ కుడ్య చిత్రాలు ఉన్నాయి. ప్రదోష నృతం (శివుడి నృత్యం) యొక్క గోడపై చిత్రము భారతదేశంలోని అత్యుత్తమ నటరాజ కుడ్య చిత్రము. ఈ కుడ్య చిత్రము గోపురము దక్షిణము వైపు లోపల గోడపై యున్నది. ఇది 3.6మీటర్ వెడల్పు*2.17మీటర్ల ఎత్తు ఉన్న చిత్రము. తాలసంస్ఫొతిత నాట్యమని భరత ముని నాట్య శాస్త్రములో వివరించినారు. ఈ కుడ్య చిత్రము పక్కన అఘోర మూర్తి కుడ్య చిత్రము కలదు. పశ్చిమ గోపురము ఉత్తర గోడపై భూదేవి, శ్రీ దేవి సమేత పద్మనాభస్వామి శయన చిత్రము కేరళలో అంత్యంత పెద్దది 5.8మీటరులు పొడవు, 2.47 మీటరులు ఎత్తు గల కుడ్య చిత్రము కలదు. చిన్న కుడ్య చిత్రములు ప్రధాన ద్వారము గోడలపై కలవు. ఆలయం లోపల బంగారు ధ్వజస్థంభము ఉన్నది. దాని పైభాగంలో చిన్న గంటలు మరియు మర్రి చెట్టు యొక్క లోహపు ఆకులతో చుట్టుముట్టిన నంది విగ్రహం ఉన్నది మరియు వాస్తుశిల్ప పరంగా ఈ దేవాలయాలు విశ్వకర్మ స్థపతీలకు, వారి శిల్పవిద్య నైపుణ్యాలకు అంతిమ సాక్ష్యంగా నిలుస్తాయి. ఆలయ పైకప్పులు రాగి పలకలతో కప్పబడి ఉన్నాయి మరియు దీనికి 14 అలంకార బల్లలు ఉన్నాయి. భగవతి, శాస్త, దక్షిణమూర్తి, గణపతి మరియు యక్షి ఇక్కడ అధీన దేవతలుగా స్థాపించబడ్డాయి. కృష్ణుడికి ప్రత్యేక ఆలయం ఉన్నది. గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్యులు ఆలయంలో ఉంటున్నప్పుడు ‘సౌందర్య లహరి’ రాశారని నమ్ముతారు.

ఈ ఆలయం వైకోమ్ సమీపంలోని ఎట్టుమనూర్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఖారా అనే అసురుడు హిమాలయ ప్రాంతములో మోక్షము కొరకు తపస్సు చేసెను. అతని తపస్సుకు శివుడు ప్రసన్నుడై మూడు శివలింగములిచ్చి వాటిని పూజించిన మోక్షము కలుగునని తెలిపి అంతర్ధాన మాయెను. హిమాలయ నుండి అతను ఆ లింగములను ఒకదానిని పళ్ళతో, ఎడమ మరియు కుడి చేతిలో ఒక్కొక్కటి పట్టుకొని కేరళకు వచ్చాడు. అతని దంతాలతో పట్టుకున్న లింగముని కడుతురుతిలో ప్రతిష్ట చేసి, కుడి చేతిలో పట్టుకున్నది వైకోంలో ప్రతిష్ట చేయబడినది. అతని ఎడమ చేతిలో పట్టుకున్నలింగమును ఎత్తూమనూర్లో ప్రతిష్ట చేయబడినది. ఈ మూడు దేవాలయాలన్నింటినీ ఒకే రోజున ప్రతిష్ట చేసిన తరువాత, ఖారా జింకగా మారి దేవుళ్ళకు సేవ చేస్తున్నట్లు నమ్ముతారు. ఎత్తూమనూర్ లోని శివుడు జింకను తన చేతిలో తీసుకొని అక్కడే ఉంచాడని నమ్ముతారు, ఆ కారణంగా, ఈ స్థలాన్ని ఉద్రుతైనా పురం అని పిలిచారు. దీనిని మలయాళ భాషలో ఎత్తూమనూర్ గా అనువదించిరి. భక్తులు ఈ మూడు ఆలయములలో ఉచ్చ పూజ ముందర స్వామిని పూజించిన వారి కోరికలు తీరునని నమ్మకము.

ఇచటి ప్రధాన ఆరాధన, ఆలయంలోని దీపాలను వెలిగించడం. మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎప్పుడూ మెరుస్తున్న, చాలా పెద్ద దీపం చూడవచ్చు. భక్తులు ఈ దీపానికి నూనె పోస్తారు. ఇటీవల, దీపానికి అవసరమైన దానికంటే ఎక్కువ నూనె అందుతున్నందున, దీపం నిండి ఉంటే, భక్తులు వారు తెచ్చిన నూనెను అచట ఉంచిన పాత్రలో పోయవచ్చు. దీని వెనుక ఒక ఉదంతమున్నది. ఒక ఇత్తడి లోహ కార్మికుడు ఒకసారి ఒక భారీ కాంస్య దీపం తయారు చేసి, దానిని ఈ ఆలయానికి తీసుకువచ్చి దానిని కొనమని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. వారు అతనిని చూసి నవ్వి ఆలయానికి ఇప్పటికే తగినన్ని దీపాలు ఉన్నందున దీపం కొనవలసిన అవసరం లేదని అతనికి తెలియజేశారు. దిగాలుపడిన ఆ లోహ కార్మికుడు స్వామిని వేడుకొని అక్కడ ఆ దీపమును ఉంచాడు! అకస్మాత్తుగా ఆలయం చుట్టూ ఒక పెద్ద తుఫాను ప్రారంభమైనది. ఆలయ యాజమాన్యం వారి ప్రవర్తనపై దేవుడు కోపంగా ఉన్నాడని గ్రహించి, దీపం కొని అక్కడే ఏర్పాటు చేసింది. అప్పటినుండి దీపం నిరంతరం స్వామి ముందు వెలుగుతోంది. అది అప్పటి నుండి వెలుగుతునే ఉన్నదని భక్తుల విశ్వాసము.

రౌద్ర భావములో ఉన్న అష్ట భుజముల శివుని శరభ మూర్తి ఉత్సవ విగ్రహము కలదు. (చాలా కోపంగా ఉన్న భంగిమలో కనిపిస్తుంది). స్వామి రౌద్ర బావ రూపములో యున్నను భక్తులు ఆయనను దయగల రూపంగా మాత్రమే చూస్తారు.
ఈ ఆలయం చాలా కళాత్మకంగా నిర్మించబడింది. ఆలయం చుట్టూ అనేక చెక్క శిల్పాలను చూడవచ్చు. ఈ ఆలయంలో రెండు నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో దక్షిణామూర్తి (కేరళలో చాలా అరుదు), గణపతి మరియు శాస్త దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక చెక్కడం ఉంది, ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని సూచిస్తుంది.
ఈ ఆలయంలో పండుగను కుంభం (ఫిబ్రవరి-మార్చి) నెలలో జరుపుకుంటారు మరియు పది రోజుల పాటు ఉంటుంది. ఈ ఆలయంలో తిరువదిర పండుగ, శివరాత్రి కూడా జరుపుకుంటారు. శివరాత్రికి పద్దెనిమిది భాగాల ఆరాధన ప్రసిద్ధి. ప్రజలు ఈ ఆలయంలోని దేవుణ్ణి “ఎత్తూమనూర్-అప్పన్” అని పిలుస్తారు
ఎట్టూమనూరప్పన్ యొక్క మూలం కొట్టాయం జిల్లాలోని కట్టంపక్ అనే చిన్న గ్రామం.
వైప్పు స్థలం

తమిళ శైవ నాయనార్ సుందరార్ పాడిన తేవర వైప్పు స్థలాల పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.

ఉత్సవములు

ప్రఖ్యాత ఎళర పొన్నాన పండుగ

ఎళర పొన్నాన ఏడున్నర బంగారు ఏనుగులను ఆలయ ఖజానాలో ఉంచి సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఎనిమిది విగ్రహాలు, ఏడు రెండు అడుగుల ఎత్తు విగ్రహాలు మరియు ఎనిమిదవ విగ్రహము సగం పరిమాణం, (అందుకే ఎజారా (ఏడున్నర) పేరు పొన్నాన (గోల్డెన్ ఏనుగు) దాని వెనుక గొప్ప కధ ఉన్నది.
ఆలయ పురాణ కధ: దీనిని ట్రావెన్కోర్ రాజ్య స్థాపకుడు అనిళమ్ తిరునాల్ మార్తాండ వర్మ ఆలయానికి సమర్పించారు. మరొక కథనము ప్రకారం, మార్తాండ వర్మ ‘పొన్నానా’ని స్వామికి సమర్పించడానికి వాగ్దానము చేసెను కాని ఆ వాగ్దానమును మార్తాండ వర్మ వారసుడైన మహారాజా కార్తిక తిరునాల్ “పొన్నాని” స్వామికి సమర్పించి మార్తండ వర్మ వాగ్దానమును నెరవేర్చెను. స్వామికి ఈ “పొన్నాన” సమర్పణ గురించి భిన్నమైన కథలు కూడా ఉన్నాయి: కొందరు దీనిని థెక్కూమ్‌కోర్‌ను ట్రావెన్‌కోర్‌తో విలీనము చేసిన సమయంలో ఆలయంకు సంభవించిన నష్టాలకు జరిమానాగా అందించారని కొందరు నమ్ముతారు. మరికొందరు దీనిని టిప్పు సుల్తాన్ సైన్యము ట్రావెంకోర్ పై దాడి చేసినప్పుడు చేసిన సమర్పణ అని నమ్ముతారు. విగ్రహాలు పనస చెట్టు కలపతో తయారు చేయబడి దాదాపు 13 కిలోల బంగారు రేకుతో కప్పబడి ఉన్నాయి.

పది రోజుల పండుగ ఎనిమిదో రోజు అర్ధరాత్రి జరిగే ఆలయ ఉత్సవంలో ఎజారా పొన్నన దర్శనం ఒకటి. ఎజారా పొన్నాన దర్శనం ఏనుగుల ఎనిమిది బంగారు విగ్రహాలను మోస్తున్న ఉత్సవ ఊరేగింపుతో ప్రారంభమవుతుంది మరియు తరువాత వాటిని భక్తుల వార్షిక దర్శనం కోసం ఆస్తాన మండపం వద్ద ఉంచుతారు.

ఈ ఆలయంలోని ముఖ్యమైన ఆచారాలలో తులాభారం ఒకటి. కోరుకున్న కోరికలు తీరిన అనంతరము భక్తులు దేవునికి తులా భారము అర్పణ చేస్తారు. స్వామికి నైవేద్యములు వాగ్దానము చేసిన సరుకులు గాని బంగారం నుండి పండ్ల వరకు నైవేద్యాలను తమకు సరి సమానమైన బరువును స్వామికి సమర్పించి కొనుదురు.

ఆరట్టు, (పవిత్ర స్నానము)

ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయంలోని భగవంతుడు శివుడి వార్షిక ఆరట్టు, (పవిత్ర స్నానము) మీనాచిల్ నదిలో పెరూరు, నీరికాడు మరియు త్రివంచూరు గ్రామాల వద్ద ఉన్న రేవుల వద్ద నిర్వహిస్తారు.

భౌగోళిక

ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయం ఎర్నాకుళం జిల్లా మరియు కొట్టాయం జిల్లా మధ్య ఉంది. ఇది ఎర్నాకుళం నుండి 54 కిలోమీటర్ల దూరంలో మరియు కొట్టాయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయం యొక్క ఇతర సమీప పట్టణాలు, కిడంగూర్, పాల, మరియు కడుతురుతి.

ఎలా చేరుకోవాలి

ఎర్నాకుళం సిటీ మరియు త్రివేండ్రం నగరం నుండి ఎత్తూమనూర్ పట్టణానికి రైలు మరియు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తరచుగా బస్సులు- ప్రైవేట్ మరియు పబ్లిక్ కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎటుమనూర్ పట్టణం నుండి కేరళలోని ఏ ప్రాంతానికైనా అందుబాటులో ఉన్నాయి. బెంగుళూరు, చెన్నై, సేలం, కోయంబత్తూర్, హోసూర్ వెళ్లే ఇంటర్‌సిటీ బస్సులు ఎట్టుమనూర్ నుండి సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయానికి సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం.

ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయం ఇతర రాష్ట్రాల భక్తులకు కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ప్రధాన కేంద్రంగా ఉన్నది.

పూజలు వాటి సమయములు:
Morning
Palliunarthal
3.00
Nadathurakkal
4.00
Nirmalyadarsanam
4.00 – 4.30
Abhishekam
4.30 – 5.00
Madhavipally pooja
5.30 – 6.00
Ethruthu Pooja
6.00 – 6.30
Ethruthu Sreebali
6.30 – 7.00
Pantheradi Pooja
8.00 – 8.30
Abhishekam
10.00 – 10.30
Ucha pooja
11.00 -11.30
Ucha Sreebali
11.30 – 12.00
Evening
Nada Thurakkal
5.00
Deeparadhana
6.15 – 6.45
Athazhapooja
7.30 – 8.00
Athazha Sreebali
8.00

హనుమాన్ జయంతి


హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి

👌 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?

ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”

👌 2. మైత్రి యొక్క విలువ!

వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”

👌 3. అహం బ్రహ్మాస్మి-నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…
కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో
తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం
లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…
అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…
రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”
-నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!

👌 4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”

👌 5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”

👌 6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”

👌 7. పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”

హనుమ కథ లో…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….

”ఏం భయం లేదు రా…నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే…

భగవత్ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!!

పితృ దోషం( స్మశాన నారాయణుడు)



మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో …
అలాగే…
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు –
మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.
అదే
” పితృ దోషం “
ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము…
చిన్న వారు అకాలమరణం పొందడం
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే …
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

  1. కాశీ
  2. పాపనాశి ( అలంపురం ‘జోగుళాంబ గద్వాల జిల్లా)
    అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
    విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
    అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం –
    స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే….
    పాలు అన్నముతో చేసిన పాయసం,
    అన్నము, ముద్దపప్పు, నేయి,
    వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .
    స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
    ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
    అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
  3. ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
  4. ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
    చేరుకొనే విధానం :
    అలంపూర్ “హరిత హోటల్ ” కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం “స్మశాన నారాయణుని ఆలయం “

  5. ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ‘ 7వ శతాబ్దం నాటి అతి పురాతన ‘ అతిపెద్ద మరకత లింగం ‘ దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !

  6. పదిమందికి ఉపయోగపడే విషయం . దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి
    సర్వేజనా సుఖినోభవంతు
    శ్రీ గురుభ్యోన్నమః

పరమ పద సోపానం( వైకుంఠ పాళీ)


పరమ పద సోపానం( వైకుంఠ పాళీ) వెనుక రహస్యం
పదమూడో శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని, కవి ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం.

మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి
ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వారు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసారు, వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం.

అలా మోక్ష పదం కాస్తా వైకుంటపాళిగా రూపాంతరం చెందింది.

పాత కొత్త ఆటలో వొంద చతురస్రములు ఉంటాయి, తేడా వొచ్చి మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో
12వ చతురస్రరం అంటే ‘నమ్మకం’ అని, 51వ చతురస్రరం అంటే ‘విశ్వసనీయత’ అని
, 57 వ చతురస్రరం వొచ్చి ‘దాతృత్వాన్ని’ సూచిస్తుంది, అలాగే 76వ చతురస్రరం ‘జ్ఞానాన్ని’ సూచిస్తుంది, 78వ
చతురస్రరం ‘మునివృత్తి’ని సూచిస్తుంది. ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చేనె ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.

అలాగే 41వ గడి ‘అవిధేయతకు’ ప్రతీకగా ,44వ చతురస్రరం లో పడితే ‘అహంకారం’ అని, 49వ గళ్లోకి పడితే ‘అశ్లీలత’ అని, 52వ గడిలోకి ప్రవేశిస్తే ‘దొంగతనం’ అని, 58వ గడిలో ‘అబద్దలాడుట’ అని , 62వ
చతురస్రరం లోకి ప్రవేశిస్తే ‘తాగుబోతు’ అని, 69వ గదిలోకి అడుగు పెడితే ‘అప్పులుపాలు’ అని,
73వ గడిలోకి ప్రవేశిస్తే ‘హంతకుడు/హత్యలు’ అని 84వ
చతురస్రరం లోకి వెళితే ‘కోపిష్టి’ అని, 92వ చతురస్రరం ‘దురాశను’ 95వ గడి ‘గర్వాన్ని’ సూచిస్తాయి. చివరగా 99వ గడి ‘కామాన్ని’
సూచిస్తాయి. ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు.

ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ముని చెప్పకనే తెలుస్తుంది పిల్లలకు. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారు.
మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం.

100వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే “మోక్షం”

ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో , కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి

ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు.

అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్రవేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశారు తెల్ల తోలు కప్పుకున్న నల్లటి మనసు ఉన్న బ్రిటీషేర్స్. మన దౌర్భాగ్యం ఆ అటని మనం ఇష్టంగా ఆడడం చిన్నప్పుడు.

వైకుంఠ పాళీ

జ్యోతి_సిద్ధవటం ( రాయలసీమ )


🍁 #జ్యోతి_సిద్ధవటం 🍁

రాయలసీమలో పెన్నా నది వడ్డున కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి..

రాజుల కాలం నాటి ఆలయాలు చాలావరకు కాలగర్భంలో కలిసిపోయాయి..

అలాంటి మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రమే జ్యోతి సిద్ధవటం.

కడప జిల్లాలోని సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుకలో కప్పబడి ఉన్న 108 శివాలయాల ఆలయాన్ని ఈమధ్యనే వెలికితీశారు,

ఈ ఆలయం 1213 వ సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు.

108 శివాలయాలు గల ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది.

ఈ 108 శివాలయాలు గల దేవాలయాన్ని రక్కసి గంగారయదేవ అనే రాజు మరియు అయన అంగరక్షకుడు అయిన జంటిమ నాయకుడు 12వ శతాబ్దంలో నిర్మించారని ఆ తరువాత ముస్లిముల పాలనలో ఇసుకతో పూడ్చి వేసారని చారిత్రక కథనం.

ఈ పవిత్రమైన యాత్రా స్థలం శ్రీశైలానికి ఉన్న నాలుగు ద్వారములలో జ్యోతి పశ్చిమ ద్వారము. ఆలంపురం , త్రిపురాంతకం మరియు ఉమామహేశ్వరం మిగతా మూడు ద్వారాలు.

పురావస్తుశాఖ ఆద్వర్యంలో జరిపిన తవ్వకాల్లో సుమారు 6 దేవాలయాలు ఇంకా చతుర్ముఖ శివలింగం, సూర్యుని విగ్రహం మరియు నాగ శిలలు బయటపడినాయి, వీటిని దశాబ్దాల క్రితమే చెన్నై మ్యూసియంకు తరలించారు.

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయములోని శిలా శాసనమును బట్టి కాకతీయ రుద్రమ్మ దేవి వెండి రథము, వజ్రపు కిరీటం ఈ ఆలయమునకు బహూకరించినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఆలయం లోపలి భాగం మాత్రం పటిష్టంగా ఉన్నా బయట నుండి మాత్రం ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా అత్యంత దయనీయ స్థితిలో ఉంది.

ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కానీ పురావస్తుశాఖ ఆనవాళ్ళు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం గమనార్హం… స్థానిక ప్రజలే ఈ ఆలయ ఆలన పాలన చూస్తున్నారు.

ఎంతో మహిమాన్వితమైన పవిత్ర పెన్నానది తీరాన ఉన్నది ఈ దివ్య క్షేత్రము.

ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది..

ఇక్కడికి చేరుకోవడానికి కడప నుండి సిద్దవటం చేరుకుంటే అక్కడి నుండి జ్యోతి గ్రామానికి ఆటోలు వెళుతుంటాయి.

మిత్రుల సహకారంతో..

జ్యోతి_సిద్ధవటం ( రాయలసీమ )