నారాయణుని ఉపదేశం -శ్రీ దేవీ భాగవతం


శచికి బృహస్పతి హితవు
పాలకుడు పాతకుడైతే, పాలితులు తమకు ఎక్కడ హితవు లభిస్తుందో అది వెతుక్కుంటూ వెళ్లిపోవడం సహజంగా జరిగేదే! మన్మధావేశితుడై మూర్ఖుడైపోయిన నహుషునికి ఎంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేదని అర్థమైపోయింది వారందరికీ. అంగీరసుడు తప్పక ఈ దుర్మార్గాన్ని అంతమొందించే మార్గం చెప్పగలడని అందరూ కలిసి ఆయనను సంప్రదించారు.
దేవతలకు ఆచార్యుడు బుద్ధికి బృహస్పతి అయిన ఆ సురగురువు చాలా సేపు యోచించి, “నహుషుడి ఆతృతకు ప్రస్తుతానికి అడ్డుకట్ట వేయగల మార్గం అయితే చెప్పగలను. కాని అది వాయిదా వేయడానికీ తాత్కాలికంగా అతడ్ని నిలువరించడానికీ సాధ్య పడుతుంది తప్ప, అతని పీడ శచీదేవికి పరిపూర్ణంగా తప్పిస్తుందని చెప్పజాలను” అన్నాడు. ఏదోలా ముందీ గండం గడచి గట్టెక్కితే, నిదానించి ఇంకొక మంచి ఆలోచనతో నహుషుడి నాశనం గురించి యోచించవచ్చు! ఇక అట్టే కాలం ఇతడ్ని పదవిలో కొనసాగనివ్వడం శిష్టులకు క్షేమం కాదు” అని బృహస్పతి చెప్పిన చొప్పున చేయడానికి అందరూ సమాయత్తమయ్యారు.

బృహస్పతితో కూడి దేవతలూ – మునులూ తన వద్దకు రావడం వారితో శచీదేవి కూడా ఉండడం నహుషుడికి మహదానంద సంధాయకంగా తోచింది. ఇంద్రాణి మీదికి వలపు చూపుల తూపులు రువ్వుతూ “రా! శచీ! రా! ఇప్పుడు కదా నేను పరిపూర్ణ ఇంద్రుడినైనాను. ఇక నా హృదయ రాజ్యానికీ మన్మధసామ్రాజ్యానికీ దేవేరివి నీవే” అంటూ నవ్వులొలకబోశాడు.

లోలోపల చీదరించుకుంటూ, సిగ్గుతో చితికిపోతూ “అది అలా ఉంచు నరపతీ! నువ్వు ఒక విషయం విస్మరిస్తున్నావు. నా భర్త కనిపించకుండా పోయాడే తప్ప, కాలగతి చెందలేదు. ఏ స్త్రీ అయినా పతి బ్రతికి ఉండగా పరపురుషుని కన్నెత్తి అయినా చూడజాలదు. అది జారిణో స్వైరిణో అయితే తప్ప, అట్టి స్థితి నాకు కల్పించకు! అది నీకే అప్రతిష్ట. ముందీ శచీపతి గురించి పూర్తి సమాచారం సేకరించు! అతడికి కనపడే అవకాశం లేదని నిర్ధారించుకో! అది నీకూ నాకూ ఇద్దరికీ క్షేమదాయకం. ఎందుకంటే, కాలం కర్మం కూడివచ్చి భవిష్యత్తులో నా భర్త తిరిగి వచ్చాడనుకో, వచ్చేవాడెంత శక్తియుతుడై తిరిగి వస్తాడో! ఏ తపోదీక్ష బూని ఏ వరాలను గొనివస్తాడో ఎవరికి ఎరుక? అట్టి దేవేంద్రుడు బలోపేతుడై తిరిగొచ్చాడనుకుందాం! నీతో కులుకుతున్నానని శాపాలు నాకూ – తన భార్యని లోబర్చుకున్నందుకు ప్రతాపాలు నీకూ రుచి చూపిస్తే ఇద్దరికీ ఇక్కట్లే! నేను చెప్పినది కాదని ఎవరైనా ఖండిస్తారేమో ….ఇందరిలో ఒక్కర్ని చూపించు!” అని ప్రశ్నార్థకంగా చూసింది శచీదేవి.

నహుష చక్రవర్తి వికటంగా నవ్వేసి “అమరాధిపుడైన నాకు ఇంక ఎదురేమున్నదీ? నీ భర్త ఇంకా వుండడం కల్ల. అది నీవు నీ పతిపట్ల గల అనురాగం చేత గ్రహించలేకపోతూన్నావు. అతడిక బ్రతికిలేడు గాక లేడు! లేడు గనుకనే దేవతలు నాకు పట్టం గట్టారు. నీవింకా ఆ సంగతి జీర్ణించుకోలేక ఎదురు తెన్నులు చూస్తున్నావల్లే వుంది. అయినప్పటికీ నేను నిన్ను సంతోషపరిచే ప్రయత్నం తప్పకచేస్తాను . దేవేంద్రుని గురించి నేడే దశ దిశలకూ గూఢచారులను పంపుతాను. వారు ఏడేడు పధ్నాలుగు లోకాలూ గాలించి, అణువణువూ శోధించి అతడి అవశేషాలేం మిగిలి వున్నా నాకు నివేదిస్తారు. అది నువ్వు చూశాకనే నిన్ను చేపడతాను” అని కొంతకాలం ఆగడానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే భూలోకాన్నుంచి తనకు నమ్మకస్తులైన గూఢచారుల్ని పిలిపించి ఇంద్రుడినైనా – అతడి అవశేషాలనైనా జాడ కనుక్కోమని ఆజ్ఞ జారీచేశాడు. శచీదేవిని ఆమె మందిరానికి క్షేమంగా చేర్చమని అక్కడున్న ఋషుల్ని ఆదేశించాడు. అంతేకాదు – ఆమె సంక్షేమం చూసుకోవడమే వారికి వృత్తిగా చేసి, జపతపాలు కొన్నాళ్ళు కట్టి పెట్టవలసిందని కూడా ఆదేశించాడు. ‘ఔరా! అల్పుడా! ఆమె సదా కుశలమే! నీ కన్నుపడ్డాకనే, ఆమె కుశలానికి దూరమైంది. మేము ఎటూ ఆమె సంక్షేమం చూస్తూనే ఉన్నాం! నువ్వు ఏదో ఇప్పుడు కొత్తగా మాకేం ఆజ్ఞ లివ్వనక్కర్లేదు. అల్పునికి అధికారం అప్పగించాం చూడు! మేం చేసిన అపరాధం అదీ! దుర్మర్గుడా! దేవేంద్రుని జాడ కనుగొనడం ఇన్నాళ్ళుగా మా వశం కాలేదు. నీ మానవానుచరుల వల్ల అయ్యేదేనా? ఏదైతే అది అయిందిలే! నీకు రోజులు దగ్గర కొచ్చాయి. మా ప్రయత్నాలు మేమూ చేస్తున్నాం! అవి ఫలించి మేమే దేవేంద్రుని కనుక్కోగలిగితే, నీ పని హుళక్కే” అనుకుంటూ ఇంటిదారి పట్టారు అందరూ.

నారాయణుని ఉపదేశం

నహుష చక్రవర్తి సదనం నుంచి అలా బయటపడిన దేవతలంతా వైకుంఠానికి పోయి శ్రీమన్నారాయణుని సందర్శించి, విష్ణువును పలువిధాల స్తుతించారు. బ్రహ్మ హత్యాపాతకానికి వెరచి అతడెటకో కానరాని చోటకు నిష్క్రమించాడని వివరించారు. అసలానాడు ఇంద్రుడు నువ్విచ్చిన సలహా ప్రకారమే చేశాడు గాని, స్వతంత్రించి చేశాడా? ధర్మ సూక్ష్మాలు మాకు అర్థంకానివైపోయాయి. ఏది ఏమైనా మాకందరికీ దిక్కు నీవే వాసుదేవా! అంటూ మొరపెట్టుకున్నారు. చిద్విలాసంగా దేవతలందర్నీ చూశాడు శ్రీహరి.

“నిజమే! సూక్ష్మాతి సూక్ష్మ ధర్మ రహస్యాలు అందరికీ అర్థంకావు. అవి అలా ఉంచండి! ఏదోలా దేవేంద్రుని జాడ నేను కనుక్కుంటాను. మీరా పాకశాసనునిచేత అశ్వమేధ యాగం చేయించండి. ఆ హయమేధం వల్ల జగదాంబ ప్రీతిపాత్రురాలు కాగలదు” అని ఊరడించి, దేవేంద్రునికి బ్రహ్మహత్యాదోషం తొలగిపోగల మార్గం ఉపదేశించాడు.

దేవతలకు దేవేంద్రుడు కనిపించే మార్గం సుగమం చేశాడు. అవిశ్రాంతంగా వెతుకుతూన్న దేవతలకు, ఎట్టకేలకు దేవేంద్రుడొక తామరతూడులో దాగుకొని కనిపించాడు. అటుపైన క్షణమైనా ఆలసించక విష్ణుదేవుని పలుకులను అతనికి వినిపించి హయమేధం సాంగోపాంగంగా నిర్వహింపజేశారు. దీనితో అతడు తిరిగి పవిత్రుడైనాడు. ఎప్పటిలాగానే తన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశించసాగాడు. కాని స్వర్గంలో నహుషుడో ఇంద్రుడిలా వెలిగిపోతూండడంతో – ‘ఒక వొరలో రెండు కత్తులు ఇమడవన్న’ సామెత ప్రకారం స్వర్గానికి వెళ్ళలేక ఆ తామర తూడునే నివాసంగా మల్చుకొని అక్కడే ఉండసాగాడు. తాము నిర్వర్తించాల్సినట్టి కార్యం నెరవేరినందున దేవతలు ఆనందంతో, అమరపురిని చేరారు.

దేవీభాగవత కథలు – 5


పూర్వం త్వష్టృ ప్రజాపతి దేవతలందరిలోకీ గొప్పవాడూ, గొప్ప తపస్సుచేసినవాడూనూ. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ, మూడు తలలతోనూ మూడు వేరువేరు  పనులు చేస్తూంటే మును లందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేదపఠనం చేసేవాడు. మరొక నోటితో సోమ పానం చేసేవాడు. మూడో ముఖంతో ప్రపం చంలో జరుగుతున్నదంతా గమనించేవాడు.

అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటికాలి మీదా; చలికాలం నీటిలోనూ, వేసవిలో అగ్నులమధ్యా నిలబడి, నిరాహారుడై తపస్సు చెయ్యటం చూసి, అతను తన పదవి కాజెయ్యటానికి చూస్తున్నాడనుకుని, అతని తపస్సు భగ్నంచేయ నిశ్చయించి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. అయితే వాళ్ళ శృంగార చేష్టలు వృత్రుడిమీద ఏమాత్రం పనిచేయలేదు. వాళ్ళు ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి, వృత్రుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు.

ఇంద్రుడు మహాత్ముడైన ఆ విశ్వరూపుణ్ణి చంపటానికి నిశ్చయించాడు. అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు. అతను ఐరావతాన్నెక్కి, విశ్వరూపుడు తపస్స మాధిలో ఉన్న చోటికి వెళ్ళి, ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు. తన పుత్రుణ్ణి  ఇంద్రుడు హత్య చేశాడని విని త్వష్టృ ప్రజాపతి మండిపడి, అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వ్రేల్చేసరికి, అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు పుట్టుకొచ్చాడు. అతన్ని చూసి త్వష్ట, ‘‘నీ పేరు వృత్రుడు. వేదతత్వం తెలిసిన వాడూ, మూడుతలలు గలవాడూ అయిన మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి  హతమార్చటానికి నువ్వు పుట్టావు. ఆ పని చెయ్యి,’’ అని వృత్రుడితో అని, రకరకాల ఆ…యుధాలు త…యారుచేసి ఇచ్చి, రథం కూడా ఇచ్చి, మంచి ముహూర్తాన, బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపటానికి పంపాడు.

దేవేంద్రుణ్ణి హతమార్చటానికి వృత్రుడు వస్తున్నాడని విని, మునులూ,యక్షు…లూ, దేవతలూ కంగారుగా పారిపోయారు. అలా  ఇళ్లూ, వాకిళ్లూ విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి, ‘‘రుద్రులనూ, ఆదిత్యులనూ, వసువులనూ, దిక్పాలకులనూ విమానాలమీద …యుద్ధానికి రమ్మని పిలవండి,’’ అన్నాడు.

ఇలా అని, ఇంద్రుడు బృహస్పతిని కూడా తన ఏనుగుమీద ఎక్కించుకుని, …యుద్ధానికి తరలాడు. అతని వెనక ఆ…యుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు. వృత్రుడు కూడా దానవ సేనలను వెంటబెట్టుకుని వచ్చాడు. ఉభ…యపక్షాలూ మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి.

నూరు సంవత్సరాలపాటు …యుద్ధం సాగింది. దాని మూలంగా లోకాలన్నీ బాధపడ్డాయి. ముందు వరుణుడు పారిపోయాడు. తరవాత క్రమంగా వా…యుగణాలూ, యముడూ, కాంతి నశించిన అగ్నీ నిష్క్రమించారు. ఇంద్రుడు పలాయనం చె…య్యక తప్పలేదు; దేవతలనందరినీ జయించి, వృత్రుడు తండ్రి వద్దకు వెళ్ళి, నమస్కారం చేసి, ‘‘అందరూ ఓడి, భయపడి పారిపోయారు. భయపడ్డ వాళ్ళు అని ఎవరినీ చంపలేదు. ఇంద్రుడు  కాలి సత్తువ కొద్తీ పరిగెత్తిపోతే, అతని ఏనుగును తెచ్చాను. దీన్ని నువ్వు కానుకగా తీసుకో. ఇంకా ఏం చెయ్యాలో చెప్పు, ఎంత కష్టమైనా చేస్తాను,’’ అన్నాడు.

వృత్రుడు తండ్రివద్ద సెలవు పుచ్చుకుని, క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదికి వెళ్ళి, గంగలో స్నానాలు చేస్తూ, దర్భచాప మీద ఉండి, అన్నిరకాల ఆహారమూ త్యజించి, యోగం అవలంబించి, మునులకు అద్భుత మనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. వృత్రుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి, ప్రత్యక్షమై, ‘‘ఇంక నీ తపస్సు చాలించి, నీకు ఏం కావాలో అడుగు,’’అన్నాడు.

వృత్రుడు బ్రహ్మకు చేతులు జోడించి, ‘‘దేవా, ఇదివరకే ఇంద్రపదవి సంపాదించి ఎంతో సంతోషించాను. ఇవాళ నీ దర్శనభాగ్యం లభించటం అంతకంటె ఎంతో ఎక్కువకదా! ధన్యుణ్ణి! నేను కోరిన వరం ఇయ్యదలిస్తే, లోహాలవల్లగాని, కరల్రవల్ల గాని, ఎండిన, ఎండని వెదురు వస్తువులతోగాని, ఇతర ఆయుధాలచేతగాని నాకు చావులేకుండా వరం ఇయ్యి. యుద్ధం సాగినకొద్దీ నా శక్తి పెరిగేటట్టు వరం ఇయ్యి,’’ అన్నాడు.

బ్రహ్మ అతను కోరినవరం ఇచ్చి వెళ్ళి పోయాడు. వృత్రుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగివెళ్ళి, జరిగినదంతా  ఆయనకు చెప్పాడు. ‘‘నా…యనా, నీకు శుభం! నీ అన్న విశ్వరూపుణ్ణి, అకారణంగా చంపి, బ్రహ్మ హత్యా పాతకం మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి  ఇప్పుడు నిర్భయంగా చంపెయ్యి,’’ అన్నాడు త్వష్ట.  ఇంద్రుణ్ణి నిర్మూలించమని త్వష్ట చెప్పిన మీదట వృత్రుడు రథం ఎక్కి, గొప్ప సేనను వెంటబెట్టుకుని, …యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడు మరొకసారి వృత్రుడితో …యుద్ధం చె…య్యటానికి సిద్ధపడ్డాడు.

ఇంద్రుడికీ, వృత్రుడికీ గొప్ప …యుద్ధం జరిగింది. …యుద్ధం చాలా దీర్ఘకాలం సాగిన మీదట ఇంద్రుడు పూర్తిగా ఓడి, దిక్కులేని వాడయ్యాడు. వృత్రుడు అమరావతికి వచ్చి, అక్కడి సకల సంపదలనూ స్వాధీనం చేసుకున్నాడు.
తన కొడుకు స్వర్గానికి రాజు కావటం చూసి త్వష్ట ఎంతో సంతోషించాడు. దేవతలు యజ్ఞభాగాలు పోగొట్టుకుని, చెట్టులూ, పుట్టలూ పట్టి పోయారు. దేవనగరం రాక్షస నగరమయింది. దేవతలు శివుడికి తమ గోడు చెప్పుకున్నారు. ‘‘తమ శరణుజొచ్చాం, మమ్మల్ని కాపాడాలి,’’ అన్నారు వాళ్ళు.

శివుడు మామూలు ధోరణిలో దేవతలతో, ‘‘మనం బ్రహ్మను వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు పోదాం.

అతనే వృత్రుణ్ణి చంపుతాడు,’’ అన్నాడు.  అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువు వారికి దర్శనం ఇచ్చి, ‘‘మీరంతా ఇలా వచ్చారు, ఏమిటి విశేషం?’’ అని అడిగాడు.

దేవతలు తమ కష్టం చెప్పుకున్నారు. వారితో విష్ణ్ణువు ఇలా అన్నాడు:‘‘అవును, మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. వృత్రుడికీ, ఇంద్రుడికీ స్నేహం కలిగించండి. నేను వజ్రా…యుధంలో అదృశ్యంగా ఉండి మీకు సహా…యపడతాను. సమస్త కోరికలూ తీర్చగల జగజ్జననిని ప్రార్థించి నట్టయితే, ఆమె తన యోగమాయతో సహాయపడుతుంది. ఆమె మాయకు లోబడి  వృత్రుడు ఇంద్రుడి చేతిలో చస్తాడు. మీరు కూడా ఆమె సహా…యంతో వృత్రుణ్ణి చంపండి.’’

దేవతలు కల్పవృక్షాలతో కూడిన మేరు పర్వతం మీదికి వెళ్ళి, మహాదేవిని ధ్యానించారు. వాళ్ళు మహాదేవి తమకు లోగడ సహా…యపడి, మహిషాసురుణ్ణీ, శుంభ నిశుంభులనూ, ఇతర రాక్షసులనూ ఎలా చంపినదీ చెప్పి, ‘‘తల్లీ, ఈ వృత్రుడు నీకు కూడా శత్రువే అయి ఉండాలి. లేకపోతే, నీ భక్తులమైన మమ్మల్ని ఇలా ఎందుకు హింసలపాలు చేస్తాడు?’’ అన్నారు. వారి పొగడ్తలకు సంతోషించి దేవి వివిధ ఆభరణాలతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దివ్యమైన ఆ…యుధాలతో రక్తచందనం రంగుగల వస్ర్తాలు ధరించి, వారి ఎదట ప్రత్యక్షమయింది.

ఆమె వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చి  అంతర్థ్ధానమయింది. దేవతలు కూడా తృప్తిపడి తిరిగివచ్చి, ఇంద్రుడితో స్నేహానికి  ఒప్పించటానికి మునులను వృత్రుడివద్దకు పంపారు.

మునులు వృత్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ‘‘వృత్రా! నువ్వు మహాయోగ్యుడవే. ఇంద్రుడు కూడా గొప్పవాడు అనిపించుకున్న వాడే. అలాంటప్పుడు మీరిద్దరూ స్నేహంగా ఉంటే వేరే చెప్పాలా? ఇంద్రుడు నీతో స్నేహ ప్రమాణం చేస్తాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి. మునులు మీకు మధ్యవర్తులుగా ఉంటారు.’’

దానికి వృత్రుడు, ‘‘మీరంటే నాకు గౌరవమే. మీమాట తీసివేయలేను. అయితే, పాపాత్ముడూ,బ్రహ్మహంతకుడూ  అయిన ఇంద్రుణ్ణి ఎలా నమ్మగలను,’’ అన్నాడు.

దానికి మునులు, ‘‘ఎవడి ద్రోహం వాణ్ణే  కట్టికుడుపుతుంది. ఘోరమైన బ్రహ్మహత్యా పాతకానికీ, కల్లు తాగిన పాపానికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. కాని మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదే! అందుచేత నువ్వూ, ఇంద్రుడూ  ప్రమాణ పూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు,’’ అన్నారు.
‘‘తడిదానితోగాని,పొడిదానితోగాని, రాతితో గాని, కరత్రోగాని, కఠినమైన వజ్రంతోగాని, పగలుగాని, రాత్రిగాని దేవతలూ, వారి అధిపతి అయిన ఇంద్రుడూ నన్ను చంపకూడదు. ఇందుకు అభ్యంతరం లేకపోతే, మీరు కోరినట్టు  ఇంద్రుడితో స్నేహం చేయగలను,’’ అన్నాడు వృత్రుడు. మునులు ఈ మాట తీసుకుపోయి ఇంద్రుడితో చెబితే అతను సరేనన్నాడు. ఇంద్రుడు వృత్రుడి నియమానికి అగ్నిసాక్షిగా ఒప్పుకున్నానన్నమీదట, ఆ మాట నమ్మి వృత్రుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు.
.

ఇద్దరూ స్నేహంగా కలిసి తిరిగారు. సముద్రతీరానా, నందనవనంలోనూ సంచరించారు. వృత్రుడు తృప్తిపడ్డాడు. కాని ఇంద్రుడు మాత్రం వృత్రుణ్ణి చంపడానికి సరైన అవకాశం కోసం  ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఒకనాటి సంధ్యవేళ ఇంద్రుడూ, వృత్రుడూ సముద్రతీరాన తిరుగుతున్నారు. అది రాత్రీ కాదు, పగలూ కాదు; అంతేగాక వృత్రుడు  ఒంటరిగా ఉన్నాడు. అందుచేత   ఇంద్రుడు వృత్రుణ్ణి చంపటానికి  అదే అదను అనుకుని, విష్ణువును తలచుకున్నాడు. విష్ణువు వచ్చి, అదృశ్యంగా వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇంద్రుడికి

సముద్రపు నురుగు కనిపించింది; అది తడిదీకాదు, పొడిదీకాదు; ఏవిధమైన ఆ…యుధమూ కాదు. ఇంద్రుడు దేవిని కూడా తలచుకున్నాడు.ఆమె తన అంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయు ధాన్ని నురుగుతో కప్పి, వృత్రుడిమీద బలంగా విసిరాడు. ఆ దెబ్బతో వృత్రుడు కొండ విరిగిపడినట్టు పడి, అప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు.

శత్రుభయం తీరిపోయిన ఇంద్రుడు ఆనందంగా అమరావతికి  తిరిగివచ్చి, మునుల నుంచి స్తోత్రాలు పొందుతూ, మహాదేవికి ఉత్సవం చేయించి, నందనోద్యానంలో రత్న మయమైన  ఆలయాన్ని దేవికి కట్టించి, ప్రతిష్ఠించాడు.

దేవీభాగవత కథలు – 4


దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేశారు. కరం భుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు.
ఇంద్రుడు మొసలిరూపంలో పంచ నదంలో ప్రవేశించి, కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు. అప్పుడు అగ్ని ప్రత్యక్షమై, ‘‘ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా, పరమా? నీ తపస్సు చూసి నేను సంతోషించాను. కోరుకో, వరం ఇస్తాను,” అన్నాడు. ‘‘దేవా, నీకు నామీద అనుగ్రహం ఉంటే నాకు అజే…ుుడైన ఒక కొడుకును ఇయ్యి! వాడు కామరూపీ, దేవతలకుగానీ, దానవు లకుగానీ, జయించరానివాడుగా ఉండాలి,” అన్నాడు రంభుడు.
‘‘అలాగే అవుతుంది,” అని అగ్ని హోత్రుడు అదృశ్యమ…్యూడు. రంభుడు తిరిగి వస్తూ, …ుక్షుల అధీ నంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు. ఆ మహిషి అతని వెంట పాతాళానికి వచ్చేసింది. అక్కడ ఆ మహిషిని మరొక మహిషం వెంబడించింది. అదిచూసి రంభుడు ఆగ్రహా వేశంతో దాన్ని కొట్టాడు. ఆ మహిషం (దున్నపోతు) రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి, చంపేసింది.
అది చూసి మహిషి రంభుడితోపాటు చితిమంటలలో కాలి పోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు. ఒకడు మహిషుడు. ఇంకొకడు రక్తబీజుడు. రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు. మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సుచేసి, బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, ‘‘మహాత్మా, నాకు చావు లేకుండా చెయ్యి,” అని వరం కోరాడు. దానికి బ్రహ్మ, ‘‘పుట్టినవాళ్ళంతా చావక తప్పదు, చచ్చినవాళ్ళు పుట్టకా తప్పదు.
చావకుండానీకు వరం ఎలా ఇ…్యుగలను? భూమికీ, సముద్రానికీ, కొండలకూ సైతం నాశనం ఉన్నది గదా! చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరంకోరుకో, అలాగే ఇస్తాను,” అన్నాడు. అప్పుడు మహిషుడు, ‘‘ ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనక, దేవతలలోగాని, దానవులలోగాని, మానవులలోగాని ఏ పురుషుడి చేతా నాకు చావు లేకుండా అనుగ్రి హించు,” అని బ్రహ్మను కోరాడు. ‘‘అలాగే, కాని నీకు ఎప్పటికైనా స్ర్తీ మూలం గానే చావు వస్తుంది,” అని బ్రహ్మ వెళ్ళి పో…ూడు.
ఈ వరంపొంది ఉన్న మదంతో మహి షుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో …ుుద్ధా నికి సన్నద్ధుడ…్యూడు. ఒక సేవకుణ్ణి పిలిచి, ఇంద్రుణ్ణి హెచ్చరించి రమ్మని పంపాడు. వాడు వెళ్ళి ఆమాట ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఆవేశంతో దిక్పాలకులను సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు: ‘‘రంభుడికొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో …ుుద్ధానికి సేనలను సన్నద్ధంచేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నాడు.
వాడు స్వర్గాన్ని జయిస్తాడట. మహిషుడికి సేవకుడివిగా ఉంటావో, …ుుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడిదూత వచ్చి చెప్పి పో…ూడు. అందుచేత మనం ఏం చె…్యూలో తేల్చండి. శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు. జ…ూపజా…ూలు దైవాధీనమే అయినా ప్ర…ుత్నం మానరాదు. సంధి చే…ుటం మంచిదే. కానీ ఇలాటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది.
…ుుద్ధం చె…్యూలన్నా మన బలాలూ, శత్రుబలాలూ సరిగా అంచనా వె…్యువలసి ఉంటుంది. అందుకు ఒక మనిషిని పంపుదాం.” ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి, మహిషుడి బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మ…ుం చెంది, తన పురోహితుడైన బృహస్పతిని, ‘‘మహిషుడు అంతులేని సేనలతో మనమీదికి …ుుద్ధానికి వస్తున్నాడు.
ఏమిటి ఉపా…ుం?” అని అడిగాడు. ఇంద్రుడి కంగారుచూసి బృహస్పతి, ‘‘అపా…ుం ఎదురైనప్పుడు ధైర్యం విడిచి పెట్టరాదు. ధైర్యంగా ఉండు. అేు్యది కాకుండా ఉండదు. అయినా శా…ుశక్తులా ప్ర…ుత్నం చె…్యువలసిందే! అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు? అచ్చగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు. మనం ప్ర…ుత్నంచేసినా ఫలితం కలగకపోతే అది దైవికం,” అన్నాడు.
దానికి ఇంద్రుడు, ‘‘దేవా, ప్ర…ుత్నించక పని జరగదు. …ుతులకు విజ్ఞానమూ, బ్రాహ్మణులకు తృప్తీ ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగు. నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే, నేను …ుుద్ధ …ుత్నం చేస్తాను. నాకు నువ్వూ, వజ్రా…ుుధమూ, హరి హరులూ సహా…ుులు,” అన్నాడు. బృహస్పతి ఇంద్రుడితో, ‘‘నేను నిన్ను …ుుద్ధంచె…్యుమనిగానీ, వద్దనిగానీ సలహా చెప్పను. మీమీ బుద్ధికి తోచిన ఉపా…ూలు ఆలోచించండి,”అన్నాడు.
అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు జొచ్చి, ‘‘మహిషుడు అనేవాడు మదించి స్వర్గంమీదికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు. వాడినుంచి నాకు చాలా భ…ుం కలుగు తున్నది. నా దురవస్థ చూడు!” అన్నాడు. ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ, ‘‘మనం శివుణ్ణీ, విష్ణువునూ వెంటబెట్టుకుని …ుుద్ధం చె…్యుటం మంచిది. ముందు కైలాసానికి పోదాం,” అన్నాడు. ఇద్దరూ కలిసి శివుడివద్దకు వెళ్ళి సంగతి చెప్పారు.
తరవాత ముగ్గురూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. అందరూ కలిసి మహిషుడితో …ుుద్ధం చె…్యుటానికి నిర్ణ…ుం జరిగింది. హంసమీద బ్రహ్మా, గరుత్మంతుడి పైన విష్ణువూ, ఎద్దుమీద శివుడూ, నెమలిమీద కుమార స్వామీ, ఏనుగు మీద ఇంద్రుడూ ఎక్కి …ుుదా ్ధనికి బ…ులుదేరారు. దేవసేన లూ, రాక్షస సేనలూ ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి. …ుుద్ధం భ…ుంకరంగా సాగింది.
ఎంత శౌర్యపరాక్రమాలు ప్రదర్శించినా దిక్పా లకులూ, ఇంద్రుడూ, త్రిమూర్తులూ మహి షుడి ధాటికి తట్టుకోలేక చివరకు పారి పో…ూరు. స్వర్గం మహిషుడి వశమయింది. మహిషుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని, పదవులన్నిటా తన రాక్షసులను నిలిపి, దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకుని, స్వర్గసుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు.
దేవతలుకొండలూ, గుట్టలూ పట్టి పోయి, అష్టకష్టాలూ పడ్డారు. ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి,‘‘ఒక్క మహిషా సురుడు మమ్మల్నందరినీ జయించి, మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడుగదా, తండ్రివంటివాడివి, మా దుస్థితి ఎందుకు చూడవు? సర్వజ్ఞుడివి, మా గతి ఏమిటి?” అని వాపో…ూరు.
‘‘నన్నేం చె…్యుమంటారు? వాడు తనను ఏ పురుషుడూ చంపకుండా వరం పొందాడు. వాణ్ణి చంపితే ఆడ దే చంపాలి. మనం ముందు శివుడితోనూ, తరవాత విఫ్ణువుతోనూ ఆలో చిద్దాం,” అన్నాడు బ్రహ్మ. దేవతలందరూ బ్రహ్మవెంట శివుడి వద్దకు వెళ్ళారు. ‘‘ ఏం పనిమీద వచ్చారు?” అని శివుడు వారిని అడిగాడు. ‘‘నీకు తెలి…ునిదేమున్నది? మహిషా సురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణీ, దేవతలనూ అష్టకష్టాలపాలు చేశాడు.
వాళ్ళు తమ గతి ఏమిటని అడుగుతున్నారు,” అన్నాడు బ్రహ్మ. శివుడు చిరునవ్వు నవ్వి, ‘‘దేవతలకు ఈ అనర్థం కలిగించినది నువ్వేకదా! నీ వరంవల్ల వాణ్ణి ఏ మగవాడూ చంపలేడు. మరి వాణ్ణి చంపటానికి ఏ ఆడదాన్ని పంపుదాం? నీ భార్యను పంపుతావా? నా భార్యను పంపనా? లేక ఇంద్రుడి భార్య పోతుందా? మన భార్యలలో ఒకతె కూడా …ుుద్ధం చె…్యుగలది కాదే! అందుచేత ఏంచేస్తే బాగుంటుందో విష్ణువును అడుగుదాం. అతను నాకన్న తెలివిగలవాడు,” అన్నాడు.
అందరూ కలిసి విష్ణువువద్దకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు, ‘‘మనమంద రమూ మహిషుడితో …ుుద్ధంచేసి ఓడిన వాళ్ళమే గదా! వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్ర్తీని త…ూరు చేసి, ఆమెకు మన ఆ…ుుధాలిచ్చి, ఆమె చేత మహిషుడితో …ుుద్ధం చేయించాలి,”అన్నాడు.
విష్ణువు ఇలా అంటూండగానే దేవత లందరినుంచీ రకరకాల తేజస్సు వెలువడి, అది క్రమంగా ఏకమై, పద్ధెనిమిది చేతులు గల స్ర్తీ మూర్తిగా త…ూరయింది. దేవతలు ఆమె చేతులలో తమతమ ఆ…ుుధాలు ఉంచారు. ఆమె దేవతలతో, ‘‘భ…ుపడకండి. ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను!” అంటూ సింహనాదం చేసింది. దాన్ని విని మహిషుడు, ‘‘ ఎవడు ఈ ధ్వని చేసినది? వెళ్ళి, వాణ్ణి పట్టి తీసుకురండి!
నా చేత చావుదెబ్బతిన్న దేవతలకు ఇంత సాహసం ఉండదే!” అన్నాడు తన వాళ్ళతో. వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి,మహిషుడితో, ‘‘ఎవతో సింహం ఎక్కి వచ్చింది. ఒంటినిండా ఆభరణాలు, పద్ధెనిమిది చేతులలో ఆ…ుుధాలు!” అని చెప్పారు. మహిషుడు తన మంత్రితో, ‘‘ ఎలాగైనా ఆ స్ర్తీని తీసుకురా! నా పట్టమహిషిగా చేసుకుం టాను!” అన్నాడు.
మంత్రి వచ్చి, దూరంగా నిలబడి దేవితో, ‘‘అమ్మా, నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సర్వలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను పెళ్ళాడకోరుతున్నాడు,” అన్నాడు. దేవి చిన్నగా నవ్వి,‘‘వాణ్ణి చంపటానికే వచ్చాను. నువ్వు మంచివాడివిలాగున్నావు. నిన్ను చంపను. మీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు!” అన్నది. మహిషుడు తన మంత్రి మాటలు నమ్మ లేక, రా…ుబారానికి తన సేనాపతిని తామ్రుణ్ణి పంపాడు.
దేవి వాణ్ణి చంపింది. అంతటితో మహిషుడి ప్రేమఘట్టం అంతమయింది. అతను దేవితో …ుుద్ధానికి తన సేనాపతు లను పంపాడు. అందరూ దేవిచేత చచ్చారు. తరవాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు. ఇద్దరికీ …ుుద్ధం జరిగింది. మహిషుడు కామరూపి కావటంచేత, అనేక రూపాలు ధరించి దారుణ …ుుద్ధం చేశాడు. చివరకు దేవి వాణ్ణి చక్రా…ుుధంతో తల నరికి చంపేసింది. దేవతలు పరమ సంతోషం పొంది, దేవిని స్తోత్రం చేశారు.

దేవీభాగవత కథలు – 3


వైరాగ్య చిత్తంతో వివాహంచేసుకోనని పట్టు బట్టిన శుకుడికి, వ్యాసుడు తాను రచించిన దేవీభాగవతం చెప్పాడు: విష్ణువు మర్రి ఆకు మీద పిల్లవాడుగా ఉండి, ‘‘నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను? నన్ను ఎవరు సృష్టించారు? ఈ విష…ూలు నాకు ఎలా తెలుస్తాయి?” అని విచారిస్తూంటే, అతన్నిచూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకంచెప్పి, ‘‘ఇదే సమస్త మూనూ. దీన్ని తెలుసుకుంటే నన్నెరిగినటే్ట,” అన్నది.
విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడుగానీ, అర్థం చేసుకోలేకపో…ూడు. అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు. అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖ, చక్ర,గదాదులు ధరించి, మేలిమి బంగారు బట్టలు కట్టి, తనలాటివారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదట ప్రత్యక్ష మయింది.
విష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపో…ూడు. అప్పుడామె అతనితో, ‘‘మా…ు మూలంగా నన్ను మరిచావు. ఇప్పుడు నువ్వు సగుణుడివి. నేను సత్త్వ శక్తిని, నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి, రజోగుణంగలవాడై అన్ని లోకాలూ సృష్టి చేస్తాడు. అతను చేసిన సృష్టికి నువ్వు పాలకు డవుగా ఉంటావు. ఆ బ్రహ్మదేవుడి కను బొమలమధ్య నుంచి, క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు. ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి, దాని మూలంగా తామసగుణం కలిగిన వాడై, ప్రళ…ుకాలంలో, బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు.
నువ్వు నా సహా…ుంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనక సత్త్వశక్తినైన నన్ను గ్రహించు. నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను,” అన్నది. ఆమెతో విష్ణువు,‘‘నాకు ఒక అర శ్లోకం వినబడింది. దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు,” అన్నాడు.
‘‘నన్ను సగుణగా నువ్వు చూస్తున్నావు. నీకా అరశ్లోకం చెప్పినది నిర్గుణస్వరూపి అయిన పరదేవత. ఇది భాగవతమనే పేరుగల మంత్రం. దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి,” అన్నదామె. విష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైట భులను చంపి,వారికి భ…ుపడి తనకు శరణు జొచ్చిన బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికీ, నారదుడు వ్యాసుడికీ ఉపదేశించారు. వ్యాసుడు మహిమాన్వితమైన ఆ మంత్రాన్ని శుకుడికి ఉపదేశించి, ‘‘దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరించి రచిం చాను,” అన్నాడు.
శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించ మన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: కోసలదేశపు రాజధాని అెూధ్యానగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆ…ునకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు సుదర్శనుడనీ, లీలావతికి శత్రుజిత్తు అనీ కొడుకులు కలిగారు. ధ్రువసంధి ఒకనాడు వేటాడుతూండగా సింహం ఒకటి అతనిమీద పడింది. సింహమూ, ధ్రువసంధీ హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరూ చనిపో…ూరు.
మనోరమ తండ్రి కళింగదేశపు రాజు వీరసేనుడు, తన అల్లుడు చనిపోయిన వార్త విని మనమడైన సుదర్శనుడి క్షేమం చూడ డానికి వచ్చాడు. అలాగే ఉజ్జయిని నుంచి శత్రుజిత్తు మాతామహుడైన …ుుధాజిత్తు కూడా వచ్చాడు. సుదర్శనుడు, శత్రుజిత్తు ఇరువురిలో ఎవరిని రాజు చే…ుడమా అన్న విష…ుంలో ఇద్దరు మాతామహులమధ్య భేదాభిప్రా…ూలు తలెత్తాయి.
ఘర్షణపడ్డారు. ఆ పోరాటంలో …ుుధాజిత్తు వీరసేనుణ ్ణ చంపేశాడు. మనోరమ బిడ్డగావున్న సుదర్శనుణ్ణి వెంట బెట్టుకుని భరద్వాజాశ్రమం చేరింది. భరధ్వా జుడు ఆమెనూ, బిడ్డనూ ఆదరించి, శత్రువుల బారి నుంచి కాపాడి, సుదర్శనుడికి విద్యా బుద్ధులు నేర్పాడు. …ుుక్తవ…ుస్కుడైన సుదర్శనుడికి ఒకరోజు మహాదేవి కలలో కనిపించి అస్ర్తవిద్య ప్రసాదించింది.
కాశీరాజు సుబాహుడి కూతురు శశికళ, అద్భుత సౌందర్యవతి అని విని, సుదర్శనుడు ఆమెను పెళ్ళాడగోరాడు. అదేవిధంగా శశికళ కూడా సుదర్శనుణ్ణే పెళ్ళాడ నిశ్చయించింది. సుబాహుడు తన కుమార్తె శశికళ స్వ…ుం వరం ప్రకటించాడు. నానాదేశాల రాజులూ కాశీకి వచ్చారు. అయితే శశికళ సుదర్శనుణ్ణే పెళ్ళాడతానని పట్టుపట్టింది!
రాణి తన కుమార్తె వద్దకు వెళ్ళి, ‘‘అమ్మా, నిన్ను పెళ్ళాడాలని అంతమంది రాజులు వచ్చి ఉండగా, సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టు బట్టి, మన ప్రాణాలమీదికి ఎందుకు తెస్తావు? స్వ…ుంవర సభకు పద. నువ్వు సుదర్శనుణ్ణే వరిస్తానంటే, …ుుధాజిత్తు ఆ సుదర్శనుడితో పాటూ నిన్నూ, నన్నూ, నీ తండ్రినీకూడా చంపేస్తాడు!” అని హెచ్చరించింది.
ఎన్ని చెప్పినా, శశికళ మరొకరిని పెళ్ళాడ నన్నది. ఆమె తండ్రితో, ‘‘నీకు ఈ రాజులంటే భ…ుం అయితే నన్ను సుదర్శనుడికిచ్చి, రథంలో మమ్మల్ని పొలిమేర దాటించు. …ుుద్ధం జరిగితే అతను శత్రువులను తానే చంపేస్తాడు,”అన్నది.
‘‘చూడు, తల్లీ! అనేకమందితో విరోధం తెచ్చుకోవటం ఎవరితరమూ కాదు. మిమ్మల్ని పొలిమేర బ…ుట వదిలినంతమాత్రాన ఆ దుర్మార్గులు మిమ్మల్ని చుట్టుముట్టితే మీరు చె…్యుగలిగినదేమున్నది? నాకొక పద్ధతి తోస్తున్నది. సీత పెళ్ళికి పెట్టినట్టుగా నీ పెళ్ళికి ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గినవాణ్ణి పెళ్ళాడు,” అన్నాడు సుబాహుడు.
‘‘అందువల్ల సమస్య తీరుతుందా? పందెంలో ఎవడో గెలిచి నన్ను పెళ్ళాడతాడు. అప్పుడు మిగిలినవాళ్ళు ఊరుకుంటారా? ఎలాగూ …ుుద్ధం తప్పదు. మహాదేవిని నమ్ము కుని నన్ను సుదర్శనుడికిచ్చి పెళ్ళిచెయ్యి,” అన్నది శశికళ. ఆమె నిర్ణయించిన పథకాన్ని ఆమోదిం చాడు సుబాహుడు.
సుబాహుడు రహస్యంగా వివాహ ప్ర…ు త్నాలు జరిపించి, సుదర్శనుణ్ణి రప్పించి, తన కూతుర్ని అతనికి శాస్ర్తోక్తంగా కన్యాదానం చేశాడు. ఆ సందర్భంలో ఆ…ున తన అల్లుడికి రెండువందల రథాలూ, కొన్నివేల గుర్రాలూ, కొన్ని వందలమంది దాసీలూ, ఇతర కానుకలూ ఇచ్చాడు. అతను మనోరమతో, ‘‘అమ్మా, ఇక నా కూతురు నీ కొడుకు సొత్తు, నీసొత్తు. దాన్ని ప్రేమగా చూసుకో,” అని నమస్కారం చేశాడు. మనోరమ ఎంతో సంతోషంతో, ‘‘అ…్యూ, మహారాజువై ఉండి కూడా రాజ్యహీనుడైన నా కొడుక్కు నీ కూతుర్ని పెళ్ళిచేశావు! నీవంటి ఉత్తముడు ముల్లోకాలలో ఎక్కడా ఉండడు.
నీ కుమార్తె భారం మాది అయితే, మా భారం నీది!”అన్నది. దానికి సుబాహుడు, ‘‘అమ్మా, నీ కొడుకు రాజ్యవిహీనుడని ఎందుకు అనుకోవాలి? నా రాజ్యం అతనిది కాదా? నా సేన అంతా ఇస్తాను. మనం నీరక్షర న్యా…ుంగా ఉండేటప్పుడు ఒకడు రాజనీ, ఇంకొకడు సేవకుడనీ విచక్షణ దేనికి? జగదంబ అండ ఉండగా విచారం దేనికి?” అన్నాడు.
‘‘ఎంత చల్లనిమాట అన్నావు, బాబూ! నీకు శుభం కలుగుతుంది. నీ రాజ్యాన్ని నువ్వూ, నీ కొడుకులూ సుఖంగా ఏలుకోండి. జగ న్మాత అనుగ్రహంతో నా కొడుకు తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. గ్రహచారం సరిగా ఉన్నవాడు మట్టి పట్టు కుంటే, బంగారమవుతుంది. ఏది చేసినా కలిసివస్తుంది. అందరూ సహా…ుపడతారు. ఇప్పుడు నా కొడుకు రోజులు మంచివి. కీడు రాదు,” అన్నది మనోరమ. సుబాహుడు పెళ్ళితంతు పూర్తిచేసి, తన కూతురికి, అల్లుడికి అప్పగింతలూ, అంప కాలూ జరుపుతూండగా, కొందరు వచ్చి, ‘‘రాజా, వధూవరులను ఇప్పుడు పంపకండి. దారిలో శత్రువులు రాక్షసులలాగా కాపువేసి ఉన్నారు,” అని చెప్పారు.
రాజుల సంగతి ఎరిగినవాడు కావటంచేత సుబాహుడు ఆ మాట నమ్మి, అంపకాలు చె…్యుటానికి సంశయించాడు. అప్పుడు సుదర్శనుడు అతనితో, ‘‘రాజా, నువ్వేమీ సంకోచించవద్దు, దేవి నా పక్షాన ఉండగా ఈ రాజులు నన్నేం చె…్యుగలరు?” అన్నాడు. కాశీరాజు తన అల్లుడికి అంతులేని ధనం ఇచ్చి సాగనంపుతూ, సైన్యంతో సహా తానుకూడా తోడు బ…ులుదేరాడు. దారులు కాచివున్న రాజులు దూరంనుంచి చూసి, ‘‘అదుగో రథం! వాడే సుదర్శనుడు! పెళ్ళాంతోసహా పోతున్నాడు.
పట్టుకుని కొడదాం పట్టండి!”అంటూ విజృంభించారు. సుబాహుడు వారికి అడ్డుపడ్డాడు. సుదర్శ నుడు మంత్రం జపిస్తూ, అంబను ధ్యానిం చాడు. ఆ సమ…ుంలో శత్రుజిత్తూ, …ుుధా జిత్తూ అతనిపైకి వచ్చారు. సుబాహుడు వీరావేశంతో శంఖం పూరించి, …ుుధాజిత్తు మీద వరసగా బాణాలు వేశాడు. ఇద్దరికీ తీవ్రంగా …ుుద్ధం సాగింది.
అంతలో జగదంబ దివ్యమైన ఆకారంతో, అనేక మహా…ుుధాలతో, పూలమాలలతో, సింహంమీద ప్రత్యక్షమయింది. సుదర్శనుడు ఆనందంతో శరీరం పులకరిస్తూండగా దేవిని తన మామకు చూపి, ‘‘ఇంక మనకు భ…ుమే మిటి?” అని చెప్పి, రథం దిగి, తన భార్యనూ, మామనూ వెంటబెట్టుకుని, దేవి కాళ్ళకు ప్రణామం చేశాడు.
ఏనుగులు సింహాన్ని చూసి భ…ుపడి ఘీంకారాలు చేస్తే, సింహం వాటిని చూసి గర్జించింది. అదేసమ…ుంలో దారుణంగా గాలివీచి, బీభత్సం చెలరేగింది. రాజులందరికీ కంపరం పుట్టింది. వాళ్ళు దిక్కు తెలి…ునట్టుగా నిశ్చేష్టులై చూడసాగారు. అప్పుడు సుదర్శనుడు సేనాపతితో, ‘‘మహాదేవి మనకు అండగా వచ్చింది. నువ్వు సంశయించక, రాజులమీదికి సేనలు నడి పించు,” అన్నాడు. కాశీరాజు సేనలు రాజులపైకి విజృం భించాయి.
అప్పుడు, తెల్లబోయి చూస్తున్న రాజులతో …ుుధాజిత్తు, ‘‘ ఎవరో ఆడది సింహంమీద వచ్చేసరికి మీకు మతులుపో…ూేుమిటి? ఒక అర్భకుడు ఒక ఆడదాన్ని తోడు తెచ్చు కుంటే ఇందరు రాజులూ కొ…్యుబారిపోతారా? క్షణంలో వాణ్ణి చంపి, రాజు కూతుర్ని వశపరుచు కుందాం, పట్టండి!” అని, తన మనమడైన శత్రుజిత్తును వెంటబెట్టుకుని, సుదర్శనుడి మీద …ుుద్ధం సాగించాడు.
అప్పుడు అంబ అందరి రాజులకూ అన్ని రూపాలలో కనబడి, అందరితోనూ ఒక్కసారే …ుుద్ధంచేసింది. క్షణంలో …ుుధాజిత్తూ శత్రుజిత్తూ బాణాలు తగిలి చచ్చారు. సుబా హుడు ఆనందబాష్పాలు రాల్చుతూ, ఆ పరాశక్తిని స్తోత్రం చేశాడు. తరవాత అతను ఆమెతో, ‘‘తల్లీ, నీ దర్శనంతో ధన్యుణ్ణి అ…్యూను. శాశ్వతంగా నా హృద…ుంలో నిలిచిపో! ఈ కాశిలోనే ఉండిపో. నాకు మరెవరి అండా అవసరంలేదు. భూమి ఉన్నంత కాలమూ ఈ కాశీ ఉంటుందంటారు. కాశీ ఉన్నంతకాలమూ నువ్వు ఇక్కడే ఉండి, మాకు శత్రుభ…ుం లేకుండా చెయ్యి. ఇదే నేను నిన్ను కోరే వరం,” అన్నాడు.
మహాదేవి అందుకు ఒప్పుకున్నది. తరవాత సుదర్శనుడు మహాదేవిని స్తోత్రంచేశాడు. అతను ఆమెను, ‘‘తల్లీ, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేనెక్కడికి పోవాలి? నేను స్వ…ుంగా అసమర్థుడనై నప్పటికీ, నీ అండ ఉంటే ఏమైనా సాధించ గలను. అందుచేత నా కర్తవ్యం తెలిపి, నన్ను అనుగ్రహించు,” అని వేడుకున్నాడు. దానికి దేవి, ‘‘ఇంక చేసేదేమున్నది? నీ భార్యతోసహా అెూధ్యకు వెళ్ళి, సింహాసనం ఎక్కు; తగినవిధంగా రాజ్యం చేసుకో. నిన్ను నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను. ప్రతి అష్టమి, నవమి, చతుర్దశికీ నన్ను పూజ చెయ్యి.
నాకు శరత్కాలం ఇష్టం. నవరాత్రి పూజలు చెయ్యి. మాఘ, చైత్ర, ఆశ్వ…ుుజ, ఆషాఢ మాసాలు నాకు ఉత్సవాలు జరిపించు,” అని హెచ్చరించి అదృశ్యమయింది. తరవాత రాజులు ఒక్కరొక్కరే వచ్చి, ఇంద్రుడికి దేవతలు మొక్కిన విధంగా సుదర్శనుడికి మొక్కి, అంబను స్తుతించారు. వాళ్ళు అతన్ని తమ చక్రవర్తిగా ఆమోదించారు.
సుదర్శనుడు అెూధ్యకు చేరే లోపునే వార్తలు చేరాయి.అందుచేత మంత్రులు మంగళవాద్యాలతోసహా ఎదురువచ్చి, సుదర్శ నుణ్ణీ, అతని భార్యనూ నగరంలోకి తీసుకు పో…ూరు. సుదర్శనుడు తన సవతి తల్లి వద్దకు పోయి, కొడుకు చచ్చి ఏడుస్తున్న లీలావతికి నమస్కరించి ఓదార్చి, ‘‘అమ్మా, నీ తండ్రినీ, నీ కొడుకునూ చంపినది నేనుకాదు, మహాశక్తి! నీ పాదాల సాక్షగా చెబుతున్నాను. ఎవరో చేసిన కర్మకు నువ్వెందుకు బాధపడాలి? నన్ను నీ కొడుకులాగే చూసుకో. నీకు ఎల్లప్పుడూ మాతృసేవలు చేస్తాను.
నేను పసివాణ్ణి అయి ఉండగా నీ తండ్రి దురుద్దేశంతో నన్ను రాజ్య భ్రష్టుణ్ణిచేస్తే, అది నా ప్రారబ్ధం అనుకున్నాగాని, దుఃఖించ లేదు. నీ తండ్రి నా తాతను చంపేస్తే, నా తల్లి పుటె్టడు దుఃఖంతో నన్ను తీసుకుని అడవిదారిన పోతుంటే, మమ్మల్ని దొంగలు దోచారు. తర వాత గంగాతీరాన ఋష్యాశ్రమంలో తలదాచుకున్నాం. వాళ్ళ అనుగ్రహంవల్ల ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఇప్పటికీ కూడా నాకు ఎవరిమీదా ద్వేషం లేదు,” అన్నాడు.
అతని మాటలు విని లీలావతి సిగ్గు పడుతూ, ‘‘నేను వద్దంటున్నా వినకుండా నా తండ్రి నీకు ద్రోహంచేసి,తాను చావటమేగాక, నా కొడుకునుకూడా చంపాడు. నీ తల్లి నా అక్క, నువ్వు నా కొడుకువు! నేను విచారించవలసిన పనేమిటి? నా వాళ్ళు చావటానికి కారణం నువ్వు కాదని నాకు తెలి…ుదా?” అన్నది. తరవాత సుదర్శనుడు తన మంత్రులచేత ఒక బంగారు సింహాసనం త…ూరుచేయించి, దానిమీద జగదంబను …ుథావిధిగా స్థాపించి, రోజూ పూజిస్తూ, పట్టాభిషేకం చేసుకుని, సుఖంగా చాలాకాలం రాజ్యం చేశాడు.

దేవీభాగవత కథలు – 2


బ్రహ్మ ప్రార్థన ప్రకారం, ెూగనిద్ర విడిచి వెళ్ళగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డంవచ్చి, ‘‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి ల…ు కారకు లనీ, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడనీ విన్నాం. అలాటి విష్ణువును ెూగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తీ, తేజస్సూ ఏమ…్యూయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం. నువ్వు శక్తి మాత్రమేఅన్ని శక్తులకూ మూలకారణం అంటున్నావు. నిజం ఏదో మాకు తెలి…ుటం లేదు,”అన్నారు.
దానికి సూతుడిలా అన్నాడు:
‘‘మునులారా, మీరడిగినదానికి సమా ధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైన వారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక, విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవ మనీ, మరికొందరు సూర్యుడనీ, మరికొందరు అగ్ని అనీ,ఇంకా కొందరు చంద్రుడనీ, ఇంద్రు డనీ, కొందరు ఏదో అనీ, మా…ులోపడి, రకరకాలుగా అభిప్రా…ుపడతారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా, అన్ని ప్రమాణాలకూ అతీతమైన పరశక్తిమాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వా…ుు వులో, అగ్నిలో కనబడుతూంటుంది. ”
అలా శక్తిచేత మేల్కొల్పబడిన విష్ణువు బ్రహ్మనుచూసి, ‘‘అబ్బాయీ, నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి?” అని అడిగాడు. ‘‘ఇంక నేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవులనుంచి ఇద్దరు రాక్షసులు, మధుకైట భులనేవాళ్ళు పుట్టి, నన్ను చంపుతామంటూ …ుుద్ధానికి పిలిచారు,” అన్నాడు బ్రహ్మ.
‘‘దీనికే భ…ుపడతావా? నేను ఎంతలేసి రాక్షసులను చంపానుకాను?”అని విష్ణువు అంటున్నంతలోనే, ఆ రాక్షసులు వచ్చిపడి, బ్రహ్మతో, ‘‘పారిపోయివచ్చి,ఇక్కడ దాక్కు న్నావా? మేం కనుక్కోలేమనే? నిన్ను ఇతను రక్షస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక, ఇతన్ని తోడు చావమంటావా?” అని మీదికి వచ్చారు.
విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని, రాక్షసు లతో, ‘‘తెగ వదరుతున్నారు, మదమెక్కింది కాబోలు? తొందరపడకండి, ఇప్పుడే మీ మద మణుస్తాను,”అంటూ …ుుద్ధానికి సిద్ధ పడ్డాడు. దేవి ఆకాశంనుంచి చూస్తూండగా విష్ణువూ, మధుడూ …ుుద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలిసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల…ుుద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడు తూంటే విష్ణువుకుక్రమంగా నీరసం వచ్చేసింది. అతనికి ఏం చె…్యూలో తోచలేదు. రాక్షసు లను ఎలా జయించాలి? దానికి ఉపా…ుం ఏమిటి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అను కుంటుంటే రాక్షసులు అతనితో, ‘‘…ుుద్ధం చె…్యుటానికి శ…క్తి చాలకపోతే, మాకు దాసు ణ్ణని దణ్ణంపెట్టు, లేకపోతే నిన్ను చంపి, తరవాత బ్రహ్మను చంపేస్తాం,”అన్నారు.
విష్ణువు సౌమ్యంగా వారితో, ‘‘అలసిపోయిన వారినీ, వెనక్కుతిరిగినవారినీ, భ…ుపడిన వారినీ,…ుుద్ధంలో పడిపోయినవారినీ ఎదుర్కో వటం వీరధర్మంకాదు. అది అలా వుంచి, మీరు ఇద్దరున్నారు. నేనేమో ఒక్కణ్ణే! ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని …ుుద్ధంచేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకుమాత్రం …ుుద్ధ ధర్మం తెలి…ుదా?” అన్నాడు.
‘‘సరే, విశ్రమించు. ఈలోగా మేమూ విశ్రమిస్తాం,” అన్నారు రాక్షసులు. అప్పుడు విష్ణువు దివ్యదృష్టితో, ఆ రాక్షసులు వరం పొందినవారని గ్రహించి, ‘‘ఈ దుర్మా ర్గులతో అనవసరంగా …ుుద్ధం చేస్తినే! వీరు పరాశక్తినుంచి స్వేచ్ఛామరణం వరంగా సంపా దించారు. వీరిని ఎలా చంపటం?” అని ఆందోళన పడసాగాడు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు:
‘‘తల్లీ, నీ సహా…ుం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీదుమిక్కిలి వాళ్ళే నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్ళు చచ్చే ఉపా…ుం కూడా నువ్వే చెప్పు.” దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, ‘‘రాక్షసులమీద నా మా…ు కప్పుతాను.
వారిని జయించు,” అన్నది. రాక్షసులు విష్ణువుతో, ‘‘ ఓడిపోతానని ఎందుకు భ…ుపడతావు? శూరులకు జ…ూప జ…ూలు రెండూ సంప్రాప్తమవుతాయి. నీచేత ఎందరు రాక్షసులు ఓడారుకారు? అయినా ఎప్పుడూ జ…ుమే కలుగుతుందా?” అని ఎత్తి పొడిచారు. ఈ మాటకు విష్ణువు మండిపడి, రాక్షసు లతో తలపడి, వాళ్ళను పిడికిలితో పొడిచాడు. వాళ్ళు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టి…ుుద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి, రక్తం ఓడుతూ ఉన్న సమ…ుంలో ఆకాశంలో దేవిని చూశాడు.
అదే సమ…ుంలో దేవి రాక్షసులపైన మన్మ థుడి బాణాలలాటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు …ుుద్ధ్దంమాట మరచి మోహ పాశానికి చిక్కుపడ్డారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, ‘‘ఎంతమంది రాక్షసులనైనా చూశానుగానీ, …ుుద్ధవిద్యలో మీతో సమాను లను చూడలేదు. మీ …ుుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలాసంతోషమయింది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను,” అన్నాడు.
దేవీ ప్రభావంచేత మా…ూమోహితులై ఉన్న రాక్షసులు, విష్ణువు మాటకు అభిమానం తెచ్చు కుని, విష్ణువును తూస్కారంగా చూస్తూ, ‘‘మేం నిన్ను అడిగేవాళ్ళమూ, నువ్వు మాకు ఇచ్చేవాడివీనా? కావాలంటే నువ్వే కోరు, మేం ఇస్తాం!” అన్నారు. ‘‘నేను కోరినది ఇస్తారా?అదే నిజమైన వీరుల గుణం. చాలా సంతోషం! నా …ుుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నాచేత ఇప్పుడే చచ్చిపొండి,మరి ఇచ్చినమాట నిలు పుకోండి!”అన్నాడు విష్ణువు.
రాక్షసులు కళవళపడి, కొంచెం ఆలో చించి, ‘‘నువ్వు మాటమీద నిలబడే వాడివైతే, మాకు వరం ఇస్తానన్నమాట గుర్తుంచు కుని,నీరులేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చి పోతాం,” అన్నారు. విష్ణువు నవ్వి, తన తొడలు పెంచి,‘‘రాక్షసు లారా, రండి,” అన్నాడు. రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలనూ, రాక్షసులు తమ శరీరాలనూ ఇలా పెంచగా, చిట్టచవరకు రాక్షసుల శరీరాలకన్న విష్ణువు తొడలే పెద్దవి అ…్యూయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ళ మెదడు, నీటిలోపడి, పెద్దమిట్ట త…ూరయింది.
అది మొదలు భూమికి ‘మేదిని’ అనే పేరువచ్చింది. వ్యాసుడి తపస్సు ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు, ‘‘ప్రసంగవశాన ఇతర విష…ూలు చాలా విన్నాం. కాని కొడుకుకోసం తపస్సుచే…ు బోయిన వ్యాసుడి కథ అలాగే ఉండి పోయింది,” అన్నారు. మునులతో సూతుడు, వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు:
నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరిమీద, కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆ…ున శక్తిని మన స్సులో నిలిపి తపస్సు చేస్తూంటే, భూమ్యా కాశాలు కంపించాయి. ఇంద్రుడు భ…ుపడి, దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి, ‘‘వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. గొప్ప ప్రమాదం వచ్చిపడింది. మమ్మల్ని కాపాడు!” అని ప్రార్థించాడు.
‘‘తపస్సుచేసుకునేవారికి కీడు తలపెట్ట రాదు. వాళ్ళు ఇతరులకు చెరుపు చె…్యురు. వ్యాసుడు కొడుకును కోరి, శక్తితోకూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు,” అని శివుడు దేవతలతో చెప్పి, వ్యాసుడి ముందు ప్రత్యక్షమై, అతని కోరిక తీరేలాగు వరమిచ్చాడు. వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను అరణి మధించి అగ్నిచేసి, ‘‘ఇలాటి అగ్నివంటి కొడుకును నాకు ప్రసాదించగల స్ర్తీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతి బంధకం,” అని అనుకుంటుండగా, ఆకా శంలో ఘృతాచి కనబడింది. సమీపంలోనే మన్మథుడుకూడా కనిపించాడు.
వ్యాసుడు మన్మథుడి ప్రభావానికి గురి అయికూడా,‘‘ఇది నన్ను మోసగించ టానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో? లేక, పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా?”అనుకున్నాడు.
పురూరవుడి లాగే తానూ బాధపడవలసి వస్తుం దేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచికూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని, ఆడ చిలుకగామారి ఎగిరి పోయింది. అయితే వ్యాసుడు అగ్నికోసం మధిం చుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు.
వ్యాసుడు శుకుణ్ణి చూసి,‘‘ఏమిటీ అద్భుతం! ఇది శివుడి మహిమ కావాలి,” అనుకున్నాడు. ఆ…ున తన కొడుకును గంగకు తీసుకుపోయి, స్నానంచేయించి, జాతకర్మచేశాడు. ఆకాశంలో దేవదుందు భులు మోగాయి. భూమిమీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైనవారు పాడారు. రంభ మొదలైన అప్సరసలు ఆడారు.
చిలుకరూపం ధరించిన స్ర్తీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కు శుకుడు అనే పేరువచ్చింది. కురవ్రాడు క్రమంగా పెద్దవాడ …్యూడు. శుకుడికోసం ఆకాశం నుంచి జింక చర్మమూ, దండమూ, కమండలమూ పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపన…ునంచేసి, బృహస్పతివద్ద వేదాభ్యాసం చేయించాడు.
శుకుడు తన విద్యాభ్యాసం ముగి…ుగానే గురుదక్షణ ఇచ్చి, తండ్రివద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడుఎంతో సంతోషించి, అతనికివివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుకుడుఅందుకు అంగీకరించక, వైరాగ్యం పూని తత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు.
‘‘మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం. అంతేకాని మరేవీ ముక్తికి బంధాలుకావు. న్యా…ుంగా ధనం సంపాయిస్తూ, అబద్ధమాడక, శౌచం విడవక, అతిథులను ఆదరిస్తూ, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ, గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వసిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు; నువ్వుకూడా ఒక కన్యను పెళ్ళాడి, నాకు సంతోషం కలిగించి పితృదేవలకు తృప్తినివ్వు,” అన్నాడు వ్యాసుడు.
ఇంతచెప్పినా శుకుడి బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు మళ్ళీ,‘‘నా…ునా ఒకప్పుడు నేను ముక్తినివ్వగల దేవీభాగవతం రచించాను. దాన్ని చదివి జ్ఞానివికమ్ము,” అని దానిని గురించి చెప్పడం ప్రారంభించాడు.

దేవీభాగవత కథలు – 1


నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక  పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి  దేవీభాగవత పురాణం  చెప్పమని కోరాడు.  సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం  వినిపిస్తానని ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు:

‘‘ఆమె మహాశక్తి.  ఆమె వేదవిద్య. అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి.   సృష్టి స్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే.  ఆమె ప్రేరణద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు.  బ్రహ్మ విష్ణు నాభినుంచి పుట్టాడు; విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు; ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు; ఆ జలానికే ఆధారం మహాశక్తి; లోకమాత. అలాటి దేవికి సంబంధించినది దేవీభాగవతం.

’’ సూతుడివల్ల దేవీభాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల పక్షాన శౌనకుడు సూతుడితో, ‘‘ ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి, దాని నేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదనీ, అక్కడ కలి ప్రవేశించదనీ చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిశం అనే పేరు వచ్చింది.  మేం ఇక్కడే ఉండి పోయాం.  తిరిగి కృతయుగం వచ్చేదాకా  ఇక్కడే ఉండి, కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు.

అందుచేత నువ్వుమాకు పుణ్యప్రదమైన దేవీభాగవత పురాణం వినిపించు,’’ అన్నాడు. తిరిగి సూతుడు ఇలా చెప్పాడు:‘‘వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలా నేను మీకు దేవీభాగవతం చెబుతాను. ఇప్పటికి ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి, ఇరవై ఎనిమిదో ద్వాపరం జరుగుతున్నది.  ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి, పురాణాలు రచించిన సాత్యవతే…యుడు అనే వ్యాసుడు (సత్యవతి కొడుకు) మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీభాగవతం చెప్పుతూంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను.

‘అల్లుడి వెంట తిను; కొడుకు వెంట చదువు’ అంటారుగద పెద్దలు.  ఈ దేవీభాగవతం విని శుకుడు తరించాడు.  నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలుపడటం సాధ్యంకాదు.’’
ఇది విని మునులు  సూతుణ్ణి ,‘‘శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు?  అతను అరణిలో పుట్టాడని గదా చెబుతారు?’’ అని అడిగారు.

అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మవృత్తాంతం ఇలా చెప్పాడు:ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీతీరాన తపస్సు చేసుకుంటూ, పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటమూ, వాటి నోటికి ఆహారం అందించి, అవి తింటుంటే చూసి ఆనందించటమూ గమనించి, తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందోగదా అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్ళిచేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు. కొడుకులను కనవచ్చు. కొడుకులు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చెయ్యటానికి కాంచనాద్రికి వెళ్ళి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని  ఆలోచిస్తూండగా, ఆయన ఉన్నచోటికి నారదుడువచ్చాడు.

అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, ‘‘స్వామీ, సమయానికి వచ్చావు.  నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావు,’’ అన్నాడు.   ‘‘సర్వజ్ఞుడివి.  నీకు ఒకరి సహాయం అవసరమా?  ఏమయినా నీ కోరిక ఏమిటో చెప్పు,’’ అన్నాడు నారదుడు.   ‘‘కొడుకులేనివాడికి పరలోకం ఉండదుట.  ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు?  చెప్పు, నారదా?’’ అని వ్యాసుడు అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: ‘‘ఒకానొకప్పుడు, నా తండ్రి  అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది.

ఆయన విష్ణు లోకానికి వెళ్లి, విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడవనుకుంటున్నాను. నీకన్న గొప్పవాడుంటే చెప్పు,’’ అని అడిగాడు.  దానికి  విష్ణువు, ‘‘నువ్వు  సృష్టించేవాడివనీ, నేను పెంపొందించేవాడిననీ, శివుడు హరించే వాడనీ జనం అనుకుంటారు.  ఇది పొరపాటు.  తేజస్సుతోకూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు.  మనం సృష్టి స్థితిలయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సూ, నాకు సత్త్వమూ, శివుడికి తమస్సూ తోడ్పడుతున్నాయి.  లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా?

నేను ఈ శేషతల్పంమీద పడుకున్నా, లక్ష్మివెంట ఆరామాలలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దయవల్లనే గదా?  వెనక  నేను మదుకైటభులనే దానవులతో అయిదువేల ఏళ్లు పోరాడి, చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా?  నేను స్వతంత్రుడనని ఒక్కనాటికీ అనుకోకు. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే, నువ్వు దేవశిల్పిచేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు.  ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అ…య్యానుగదా. అందుచేత నేను శక్తికి అధీనుణ్ణే. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను,’’ అన్నాడు.

ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, ‘‘నువ్వు ఆదిశక్తిని వేడుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది,’’ అన్నాడు.‘‘వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు,’’అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు,‘‘విష్ణువు తల తెగటం ఎలా జరిగింది?  ఆ…యనకు గుర్రం తల ఎలా  అతికారు?  ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు,’’ అని సూతుణ్ణి అడిగారు. హయగ్రీవావతారం పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధంచేసి, అలసిపోయి, ఎక్కుపెట్టి ఉన్న వింటిమొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు.

ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి, విష్ణువుకోసం వెతుక్కుంటూ వచ్చి, అతను నిద్రలో ఉండటం చూసి, ఏం చెయ్యాలో తోచని స్థితిలోపడ్డారు.  అప్పుడు శివుడు బ్రహ్మతో, ‘‘నువ్వు ఒక పురుగును తయారుచేసి, దానిచేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి. నారితెగగానే వింటి మొన పైకి లేస్తుంది.  వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది,’’ అన్నాడు.బ్రహ్మ పురుగును సృష్టించి, విష్ణువు వింటి నారిని కొరకమన్నాడు.దానికా పురుగు, ‘‘మహాత్మా, ఎలా చేసేది ఈ పని?  మహాపాపం కాదా?

తల్లీ పిల్లలను విడదీయటమూ, భార్యాభర్తలకు ఎడబాటు చేయటమూ, నిద్రాభంగం కలిగించటమూ బ్రహ్మహత్యలాటి మహాపాపాలు.  ఈ పని నన్నుచేయమన్నారా?’’ అని అడిగింది.‘‘నువ్వేమీ విచారించకు. యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం,’’అని బ్రహ్మ  పురుగుతో అన్నాడు. పురుగు సంతోషించి వింటి నారిని కొరికింది.  అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది.  భూమి అదిరింది.  వింటి కొన చప్పున పైకి తన్నటంతో విష్ణువు తల కాస్తా ఎగిరిపోయింది.  అది చూసి దేవతలు దిమ్మరపోయి, ఏంచెయ్యాలో తెలీక, ‘‘నువ్వే సర్వేశ్వరుడివిగదా, అన్ని లోకాలనూ భరించేవాడివిగదా!

నీ గతి ఇలా అయిం దేమిటి?  ఏ రాక్షసులూ చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు?  నువ్వు మాయకు కూడా అతీతుడివే.  మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా?’’ అని విలపించారు.దేవగురువైన బృహస్పతి వారితో,   ‘‘ఇలా ఏడుస్తూ కూచుంటే ఏమవుతుంది?  జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి,’’ అన్నాడు.‘‘దేవతలంతా చూస్తూండగానే విష్ణువు తల తెగి, ఎగిరిపోయిందిగదా!  మన ప్రయత్నంవల్ల ఏమవుతుంది?  దైవబలంవల్లనే ఏమైనా జరగాలి,’’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ,‘‘దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి.

ఆవిడే సృష్టి స్థితి లయ కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి,’’ అన్నాడు.దేవతలు ఆదిశక్తిని ప్రార్థనచేశారు.  వారిని కరుణించి దేవి ప్రత్యక్షమయింది.‘‘తల్లీ, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది?  అతని తల ఏమయింది?’’ అని దేవతలు దేవిని అడిగారు. దేవి వారితో  ఇలా చెప్పింది:‘‘కారణం లేకుండా ఏదీ జరగదు.  ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు.  అది చూసి లక్ష్మి కంగారుపడింది.  విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు?  తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా?  తనకన్న అందగత్తెను ఎవతెనైనా చూశాడా?

ఇలా అనుకుని లక్ష్మి సవతిపోరును తలచుకుని క్షణకాలం విలవిలలాడింది. తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది.  ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది  ఇలాఉండగా, హయగ్రీవుడనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నాకోసం తపస్సుచేశాడు.  నేను ప్రత్యక్షమై, వరం కోరుకోమంటే, ఎవ్వరిచేతా తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదుగనక మరేదన్నా వరం కోరుకోమన్నాను.

అందుకు వాడు తాను హ…యగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగ వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. మూడు లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు.  కనక మీరు ఒక గుర్రం తల తెచ్చి, విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి.  అలాచేస్తే ఈ విష్ణు హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు.’’ఇలాచెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే, దేవతలు దేవశిల్పిని పిలిచి, గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతకమన్నారు.

దేవశిల్పి అలాగే చేశాడు.  విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుణ్ణి  చంపి, లోకాలకు ఆనందం చేకూర్చాడు. మధుకైటభులు తరవాత మునులు సూతుణ్ణి మధు కైటభుల కథ చెప్పమని కోరారు.  అప్పుడు సూతుడు వారికా వృత్తాంతం ఇలా చెప్పాడు: పాలసముద్రంలో  శేషతల్పంమీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి, నీటిలో ఈతలు కొట్టుతూ, తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు.  వారిలో కైటభుడు అనేవాడు మధువుతో, ‘‘మహాసముద్రానికీ, మనకూ ఏదో ఆధారం ఉండి ఉండాలి,’’ అన్నాడు.

వాడు అలా అనగానే ఆకాశంనుంచి ఒక మాట వినిపించింది.మధుకైటభులు ఆ మాట పట్టుకుని జపించసాగారు.  అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది.  రాక్షసులు దాన్ని చూసి, అది శక్తి తేజస్సే అని నిశ్చ యించి, తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి, వెేు్యళ్లు తపస్సు చేశారు.  ఆ తపస్సుకు మెచ్చుకుని దేవి వారిని వరం కోరుకోమన్నది.  వాళ్ళుస్వేచ్ఛా మరణం కోరారు.  ఆమె వారు కోరిన వరం ఇచ్చింది.
తరవాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ, ఒకచోట బ్రహ్మను చూసి, తమతో …యుద్ధానికి రమ్మని పిలిచారు.     ‘‘మాతో …యుద్ధంచెయ్యి, యుద్ధం చెయ్య లేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి, ఎక్కడికైనా వెళ్ళిపో,’’ అన్నారు వాళ్ళు బ్రహ్మతో.  బ్రహ్మ భయపడి, యోగసమాధిలో ఉన్న విష్ణువుతో, ‘‘మేలుకో, నాయనా!  ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు.  నన్ను కాపాడు,’’ అని వేడుకున్నాడు. ఈ మాటకు విష్ణువు యోగనిద్ర నుంచి లేవలేదు.

అప్పుడు బ్రహ్మ ఆదిశక్తిని తన యోగనిద్రనే ప్రార్థనచేశాడు :‘‘తల్లీ, ఈ రాక్షసులనుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా, నువ్వే నన్ను కాపాడు,’’ అన్నాడు బ్రహ్మ. వెంటనే యోగనిద్ర విష్ణువును విడిచి వెళ్శిపోయింది. విష్ణువు నిద్ర లేచేసరికి బ్రహ్మ పరమానందంచెందాడు.