మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము.


రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దినావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. “ఆచారహీనం నపునంతి వేదాః” అని శాస్త్రం. ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. “ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః” అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు – తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. “అభిషేకాత్ ఆత్మశుద్ధిః” అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు – ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి.వాటిలో క్షీరము ప్రధానమైనది. శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.

12703_267363923423076_710225004_n

Advertisements

మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట!


శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.

శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.

శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.

మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.

ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.

ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!!

శివానుగ్రహ సిద్ధికోసం


శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.

ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.

కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.

మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం – వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.

విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని – స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.

పైగా – ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.

ధ్యానమ్

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిసఫుర
జ్జ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దా కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తిభేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్
తతః ప్రణమ్య బహుధా కృతాంజలిపుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!

గణేశ ఉవాచ:
12703_267363923423076_710225004_n

౧. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్ర మన్యవే
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః
౨. నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే
నమస్తే భగవన్ శమ్భో బాహుభ్యాముత తే నమః
౩. ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్
శివం ధనుర్యద్బభూవ తేనాపి మ్ఋడయాధునా
౪. శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో
యా తే రుద్ర శివా నిత్యం సర్వజ్ఞ్గల సాధనమ్
౫. తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాప తే
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ
౬. యా తయా మృడయ స్వామిన్ సదా శన్తమా ప్రభో
గిరిశన్త మహారుద్ర హస్తే యా మిషు మస్ే
౭. బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామస
౮. త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్
౯. యథా తథావమా రుద్ర తదన్యధాపి మే ప్రభో
రుద్ర త్వం ప్రథమో దైవ్యోభిషక్ పాపవినాశకః
౧౦. అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా
అహీన్ సర్వాన్ యాతుధాన్యః సర్వా అప్యద్య జమ్భయమ్
౧౧. అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః
విలోహితో స్త్వయం శమ్భో త్వదధిష్ఠాన ఏవహి
౧౨. నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మీఢుషే
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందమూర్తయే
౧౩. ఉభయోరార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్
సంప్రాప్య ధను రన్యేషాం భయాయ ప్రభవిష్యతి
౧౪. అస్మద్భయవినాశార్థ మధునాభయద ప్రభో
యాశ్చతేహస్త ఇషవః పరాతా భగవో వప
౧౫. అవతత్య ధను శ్చ త్వం సహస్రాక్ష శతేషుఢే
ముఖా నిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ
౧౬. విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః
౧౭. కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యేతు భయం భవేత్
౧౮. యాతే హేతిర్ధను ర్హస్తే మీఢుష్టమ బభూవ యా
తయాస్మాన్ విశ్వత స్తేన పాలయ త్వ మయక్ష్మయా
౧౯. అనాతతాయాయుధాయ నమస్తే ధష్ణవే నమః
బాహుభ్యాం ధన్వనే శమ్భో నమో భూయో నమో నమః
౨౦. పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః
ఇషుధిస్తవ యా తవదస్మారే నిధేహి తమ్
౨౧. హిరణ్యబాహవే తుభ్యం సేనాన్యే తే నమో నమః
దిశాంత పతయే తుభ్యం పశూనాం పతయే నమః
౨౨. త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః
౨౩. నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః
నమస్తే హరికేశాయ రుద్రాయా స్తూపవీతినే
౨౪. పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః
సంసారహేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే
౨౫. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే
అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః
౨౬. రోహితాయ స్థపతయే మన్త్రిణే వాణిజాయ చ
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువన్తయే
౨౭. తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే
౨౮. ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రన్దయతే నమః
౨౯. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః
ధావతే ధవాలాయపి సత్త్వనాం పతయే నమః
౩౦. ఆవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే
స్తేనానాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. తస్కరాణాం చ పతయే వంచతే పరివంచే
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః
౩౩. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరచరాయతే
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ
౩౪. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతే నమః
నమ ఉగ్రాయ భీమాయ నమ శ్చాగ్రేవధాయచ
౩౫. నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః
౩౬. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే
౩౭. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే
౩౮. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః
నమశ్శివాయ శర్వాయ నమ శ్శివతరాయ చ
౩౯. నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయ తే నమః
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ
౪౦. నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ
౪౧. నమ శ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః
౪౨. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః
వర్షీయసే నమస్ేస్తు నమో వృద్ధాయతే నమః
౪౩. సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ
౪౪. శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయ తే నమః
౪౫. స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః
జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః
౪౬. పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ
మధ్యమాయ నమస్తుభ్య మపగల్భాయ తే నమః
౪౭. జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ చ నమోనమః
౪౮. క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయచ నమోనమః
౪౯. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః
నమో వన్యాయ కక్ష్యాయ మౌంజ్యాయ చ నమోనమః
౫౦.శ్రవాయ చ నమస్తభ్యం ప్రతిశ్రవ నమోనమః
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ
౫౧. వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః
౫౨. దుందుభ్యాయ నమస్తుభ్యమాహనన్యాయ తే నమః
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయచ
౫౩. పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః
౫౪. నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః
నమో నీప్యాయ సూద్యాయ సరస్యాయ చ తే నమః
౫౫. నమో నాద్యాయ భవ్యాయ వైశన్తాయ నమోనమః
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః
౫౬. అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః
విద్యుతాయ నమస్తుభ్య మీథ్రియాయ నమోనమః
౫౭. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః
౫౮. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః
నమోరుద్రాయ తామ్రాయా ప్యరుణాయ చ తే నమః
౫౯. నమ ఉగ్రాయ భీమాయ నమ శ్శంగాయ తే నమః
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః
౬౦. ప్రవాహ్యాయ నమస్తుభ్య మిరిణ్యాయ నమోనమః
నమస్తే చన్ద్ర చూడాయ ప్రపధ్యాయ నమోనమః
౬౧. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే
౬౨. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః
౬౩. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్ంసవ్యాయ తే నమః
౬౪. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః
౬౫. హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః
౬౬. నమోపగురమాణాయ పర్ణశద్యాయ తే నమః
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః
౬౭. విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః
త్ర్యమ్బకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః
౬౮. మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః
వేదవేదాన్త వేద్యాయ వృషారూఢాయ తే నమః
౬౯. అవిజ్ఞేయస్వరూపాయ సున్దరాయ నమోనమః
ఉమాకాన్త నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే
౭౦. హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ
నమో హిరణ్యరూపాయ రూపాతీతాయ తే నమః
౭౧. హిరణ్యపతయే తుభ్యమంబికా పతయే నమః
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక
౭౨. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణరూపిణే
౭౩. అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ
కాలాంతకాయాపి నమోనమస్తే దిక్కాలరూపాయ నమోనమస్తే
౭౪. వేదాంత బృందస్తుత సద్గుణాయ గుణప్రవీణాయ గుణాశ్రయాయ
శ్రీ విశ్వనాథాయ నమోనమస్తే కాశీనివాసాయ నమోనమస్తే
౭౫. అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధిరూపాయ నమోనమస్తే
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమోనమస్తే
౭౬. నీహారశైలాత్మజ హృద్విహార ప్రకాశహార ప్రవిభాసి వీర
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే

వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః
కృతాంజలిపుట స్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః
త మాలోక్య సుతం ప్రాప్తం వేదవేదాంగ పారగమ్
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః
ఇతి శ్రీ శివరహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్థే
గణేశకృత రుద్రాధ్యాయస్తుతిః నామ దశమోధ్యాయః
అనేన శ్రీ గణేశకృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భవతు!!

శాప – ప్రతిశాప శరాఘాతాలు-శ్రీ శివ మహాపురాణము


శివుని ప్రవర్తన, మహావమానకరంగా తోచింది – దక్షుడికి. ఇందరు తనని మన్నిస్తూంటే, రుద్రుడు అలా స్థాణువులా వుండిపోయాడూ అంటే ఏమిటి అర్థం?! అందుకే శివుణ్ణి శపించడానికి వెనుకాడలేదు.

“రుద్రా! నీ అవిధేయతకు ఇదే నాశాపం! ధర్మ బహిష్కృతుడివైన నీకు నేటి యజ్ఞమందు, హవిర్భాగములు అందుకొను అర్హత పోవుగాక!” అన్నాడు దక్షప్రజాపతి.

Namah sivaya

దీనికి వెంటనే స్పందించాడు రుద్రవాహక శ్రేష్ఠుడు నందీశ్వరుడు.

“ఏమేమీ? దక్షా! ఈ వాచాలత్వమేల?! ఎవరి స్మరణమాత్రాన ఈ యాగాదులన్నీ సఫలీకృత మవుతున్నాయో, అట్టి పరమేశ్వరుని శపించ సాహసించిన నీ దుర్మదాంధత నేమని నిందింతును?” అన్నాడు.

“ఓరీ! వాహనమాత్రుడా! నువ్వా నన్ను నిందచేయు ధీశాలివి? మహర్షి సంప్రదాయాలకు దూరులై, వేదమార్గ వర్జితులై,శిష్టాచార విమూఢులై, జటాభస్మలేపనమాత్రులై మీ రుద్రగణాలన్నీ నీతో సహా చరించెదరుగాక!” అని శాపం పెట్టాడు దక్షుడు.

నందికేశ్వరుడు రంకెవేస్తూ తన ధాటి ఎటువంటిదో చూపించాడు. “సాక్షాత్తు పరమశివధ్యాస తప్ప మరొకటి లేని నా వంటి భక్తి తత్పరుని, ఓ జంతువును చూసినట్టుగా చూస్తావా? నీ ఈ పశుబుద్ధికి నువ్వే పశుప్రాయుడివై అజముఖుడివై పోదువుగాక!

నేటినుండి శివుని సర్వేశ్వరునిగా గాక, త్రిమూర్తులలో ఒకడు మాత్రమే అని భావించేవారికి తత్త్వ జ్ఞానశూన్యత సంప్రాప్తించుగాక! అంతేకాదు ! ఇటుపై నీవు ఆత్మజ్ఞాన రహితుడవై, కేవల కర్మపరుడిగానే మిగిలెదవు గాక! అని త్రివిధ లక్షణ యుక్తంగా ప్రతిశాపం దయచేశాడు దక్షుడికి.

ఈ శాప – ప్రతిశాప శరాఘాతలకు, యాగదిదృక్షాయుతులై వచ్చిన దిగ్దంతులే దిగ్గురనే గుండెలతో దద్దరిల్లిపోయారు.

తన పుత్రుడి నిర్వాకమే తప్పు అని, దక్షుడ్ని మందలించాడు బ్రహ్మ. ‘పెద్దా చిన్నా తారతమ్యాలు చూడకుండా అంతలేసి పరుష పదజాలం వాడేస్తావాపశువా?’ అని నంది చెవి మెలిపెట్టాడు శివుడు.

ఏదో విధంగా యజ్ఞం అయిందనిపించి ఎవరి నిజస్థానాలకు వారు వెళ్లిపోయారు.

రుద్రుడనే పదంలోనే రౌద్రం ఉంది తప్ప, నిజానికి శాంత స్వభావుడూ – కరుణా సముద్రుడూ ఐన శివుడూ; అతని అనుచరులూ ఆ సంగతి అక్కడితో వదిలి పెట్టేశారు.

దక్షుడు మాత్రం తనకు కలిగిన అవమానం మర్చిపోలేకపోయాడు. పరమేశ్వరుడంతటి వాడిని పరాభవించ నిశ్చయించుకొని, ఎన్నెన్నో ఆలోచన్లు చేశాడు. కూతురును ఇచ్చినచోట, కొన్ని కృత్యాల విషయంలో పునరాలోచించి తమాయించుకుని, గట్టి ఊహ నొక్కటి మాత్రం అమలుచేయ పూనుకున్నాడు.

మనోబుద్దులు


శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. మనోబుద్దులు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి

1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

4. చిత్తం: చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

మడి అంటే ఏమిటి ?


ముందు రోజు సాయంత్రము, కట్టుకోవలసిన బట్టలను తడిపి, పిండి, తడి బట్ట కట్టుకొని దండేముల మీద గానీ, లేక బయట ఆరు బయలులో గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ప్రక్క రోజు మరలా తడి గుడ్డ తో, ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు, తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట చేయ వలను. మడితో నే భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి.

పట్టు బట్టతో గాని, ధావళి తో గాని భోజనము చేయకూడదు, ఒక వేళ చేస్తే మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే అమావాస్య అమావాస్య కు తడిపి ఆరవేయవలెను, లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి తో చేస్తే చాలా శ్రేష్టము. ధావలితో వున్నప్పుడు పొరబాటున మైల వస్తువులను తాకినా దోషము వుండదు. ధావళి కట్టుకొని సంధ్య వార్చడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు.

కావున శ్రేష్టము నూలు గుడ్డ లేక ధావళి. పంచను లుంగి లాగ కట్టుకొని మగ వాళ్ళు గానీ, చీరను లుంగి లాగ, లో పావడా తో ఆడ వాళ్ళు గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. ఇది శాస్త్రము. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసి పంచ, చీర కట్ట వలెను. మగ వాళ్ళు గోచీ పోసి ధోవతి కట్టి దైవ కార్యములలో పాల్గొన వలెను.

మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం ఇవన్నీ చాలా వరకు పోయినాయి. కొద్ది కొద్దిగా నైనా మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాము అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవుతాము. మనల్ని మనము కాపాడుకొంటాము. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవతం అనుభవము లోకి వస్తాయి. కొన్నిటిని మనము అంత ఖచ్చితముగా పాటించలేము. కనీసము మనము ఇంట్లో వున్నప్పుడు అయినా ఇలా అందరము పాటిస్తాము. మా గురువు గారి లాగ వుండా లంటే చాలా కష్టము, కొంత మంది వున్నారు ఇంకా అలాగే. వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, శుభం భూయాత్.

శివపూజలో


1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును

1606846_268074646685337_1548987370_n
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.