నహుషుడు



స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించటం వలన ఆయనకు బ్రహ్మహత్యా దోషము పట్టుకుంది అందువల్ల తాను స్వర్గాది పత్యానికి అనర్హుడిని అని భావించి ఆచూకీ తెలియని సరస్సులో నారాయణ మంత్రం జపిస్తూ ఒక తామర తూడు లో దాక్కున్నాడు ఆ సమయంలో అష్టదిక్పాలకులు దేవతలు మునులతో సంప్రదించగా వారు చంద్ర వంశములో ప్రభ – ఆయువు లకు జన్మించిన నహుషుడు అర్హుడని నిర్ణయించారు.
ఋగ్వేదంలో నహుషుని గురించి తరచుగా ప్రస్తావించబడింది . నహుషుడు ప్రతిష్ఠానం నుండి పాలించాడు. రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు అతను పురూరవుని పౌత్రుడు ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి (ముని అయ్యారు) యయాతి(రాజు అయ్యాడు) సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నాడు. శ్రీమద్భాగవతము నందును, విష్ణు పురాణము నందు నహుషుని కొడుకులు యతి, యయాతి , సంయాతి, ఆయాతి, నియతి, కృతి అని ఆరుగురు చెప్పబడి ఉన్నారు దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో నహుషుడు ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలు వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అందువల్ల నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిగా చేశారు ఆ విధంగా ఒక సాధారణ రాజైన నహుషునికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు.
ఇంద్రపదవి చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనికి అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే ‘ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.శచీదేవి విష్ణుమూర్తిని ఈ ఆపద నుంచి తప్పించమని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు నహుషుని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా రమ్మని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు శచీదేవి నహుషుడిని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా అందులో రమ్మని చెపుతుంది. తప్పని సరి పరిస్తుతులలో సప్తర్షులు నహుషుని పల్లకి మోయటానికి అంగీకరిస్తారు నహుషుడు ఆ పల్లకిలో బయలుదేరుతాడు.
శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. ‘సర్ప! సర్ప!’ (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందర పెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేక పోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుని శపించాడు.చేసిన తప్పును తెలుసుకొని నహుషుడు క్షమించమని వేడుకొని శాపవిమోచన అడుగుతాడు అప్పుడు అగస్త్యుడు ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆ నాడే నీకు శాప విమోచన కలుగుతుంది అని చెపుతాడు. ఆనాటి నుండి నహుషుడు పెద్ద సర్పము రూపంలో దైత్య వనములో తిరుగుతున్నాడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతము దాటి దైత్యవనములో ప్రవేశిస్తారు.భీముడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సమయములో సర్పరూపంలో నున్న నహుషుడు భీముడిని తన తోకతో బంధిస్తాడు వాయు దేవుడి అంశంతో జన్మించిన భీముుడు అమిత బలశాలి భుజ బలం లో, గదా యుద్ధం లో భీముడికి ఎవరూ సాటిలేరంటే అతిశయోక్తి కాదు. జరాసంధుడిని మల్ల యుద్ధం లో ఓడించిన యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించిన వాడు. దానంలో కర్ణుడికి, బలము భీముడికి ఎవరూ సాటిలేరని చెబుతారు. అటువంటి భీముడు విచిత్రముగా ఓ కొండ చిలువ కు బందీ కావాల్సి వచ్చింది భీమునికి ఆ సాధారణ బలం ఉన్నప్పటికీ, నహుషుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు, అతను పడిపోయినప్పుడు అగస్త్యుడి నుండి ఒక వరం పొందాడు, అతనిని తీసుకున్న, అతనికంటే గొప్ప బలవంతులు వెంటనే తమ బలాన్ని కోల్పోతారు.
భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు బందీ అయిన భీముని చూసి ఆశ్చర్యపోతారు. నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజు కి ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు.
తన ప్రశ్నలకు సరి అయిన జవాబు లిస్తే భీముడిని వదిలిపెడతామని సర్ప రూపంలో ఉన్న నహుషుడు చెపుతాడు నహుషుడు, ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశారు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము వంటి లక్షణాలు ఉన్న వాడే బ్రాహ్మణుడు, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. భారతములో యక్ష ప్రశ్నల గురించి మనము విన్నాము ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబులిచ్చి తన సోదరులను విడిపించుకున్న విషయం మనకు తెలుసు కానీ భారతములో యక్షుడిని మించిన చిత్రమైన పాత్ర సర్పరూప ములోని నహుషుడు ఆ విధంగా నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపించుకొని నహుషునికి ధర్మరాజు శాప విమోచనం కలుగజేస్తాడు నహుషుడు ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసే శాప విముక్తుడవుతాడు నహుషుని వృత్తాంతం అరణ్యపర్వం లో ఉంది.పౌరులను పాటించాల్సిన రాజుకి ఆ పాలనాధికారం తలకెక్కి కోరరాని కోరిక కోరిన,నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతుంది.

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు


7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన “దత్తాత్రేయ స్వామి”
*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.

4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది “మాట ఇవ్వడం”
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.

7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

హర హర మహ దేవ శంభో శంకర
ఓం నమో భగవతే నారాయణాయ

పిప్పలాదుడు


పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!
జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు
మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-
నారదుడు- నువ్వు ఎవరు?
అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.
నారదుడు- నీ తండ్రి ఎవరు?
అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి! నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్తిక తో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?
నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.
పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?
నారదుడు- శనిదేవుని మహాదశ.

ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.
నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.

సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-

1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.

2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

దానికి బ్రహ్మాదేవుడు ‘తథాస్తు’ అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని
“శనిః చరతి య: శనైశ్చరః” అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.
శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.

🚩సర్వే జనా సుఖినోభవంతు.🚩

మందపల్లి శ్రీ మందేశ్వర దేవస్థానము మహత్మ్యము

పూర్వకాలము నందు మేరు పర్వతముతో స్పర్ధ వచ్చి.. అంతకంటే ఉన్నతముగా ఉండాలని భావించి.. వింధ్యాపర్వతము విపరీతముగా పెరగసాగెను. ఇలా వింధ్య పర్వతము మిక్కుటముగా పెరుగుతుండడంతో.. భారతవర్షమున ఉత్తర దక్షిణ భాగములయందు సూర్యకిరణ ప్రసారము చక్కగా ప్రసరించదని భయమేర్పిడింది. అప్పుడు దేవతలు, ఋషి పుంగవులు అగస్త్య భగవానుని వద్దకు వచ్చి.. వింధ్యపర్వతము పెరుగుదలను నిలపాలని ప్రార్థించారు. అప్పుడు ఆ లోపాముద్రాపతియగు అగస్త్య మహర్షి.. వేయి మంది మహర్షులతో, వివిధ పశు జాతులతో, బహు మృగ గణములతో వింధ్య పర్వతమునుచేరాడు.

అంతట ఆ పర్వతరాజు బహు ఋషిగణ సమేతుడగు అగస్త్య భగవానునికి సాష్టాంగ నమస్కారం చేసి.. ఆర్ఘ్యపాద్యాదులు నర్పించి అతిథి సత్కారాలతో సంతుష్టుని చేసెంది. అగస్త్యముని పుంగవుడు సంతుష్టాంతరంగుడై.. పర్వత శ్రేష్టుడా అంటూ వింధ్యుని ప్రశంసించి దేవ కార్యమును మనసు నందుంచుకొని ఇలా చెప్పాడు. హే! పర్వత శ్రేష్టుడా.. నేను మహా జ్ఞానులగు మహర్షులతో కలిసి దక్షిణ దిక్కునకు తీర్థయాత్రకై బయలుదేరాను. కాబట్టి నాకు మార్గమునిమ్ము. నేను తిరిగి ఉత్తర దిక్కునకు వచ్చే పర్యంతము నీవు పెరగకుండగా ఇలానే ఉండాలి. దీనికి భిన్నముగా చేయరాదని చెప్పగా ఆ పర్వత శ్రేష్టుడు సరేనని అలాగే ఉండిపోయాడు.

అగస్త్యమహర్షి.. ఋషులతో దక్షిణ దిక్కుకు వెళ్లిపోయాడు. అనంతరం క్రమముగా సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి.. సంవత్సరము సత్రయాగము చేయుటకు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులు మహా పాపులునగు అశ్వత్థుడు, పిప్పలుడు అను రాక్షసులు దేవలోకములో కూడా ప్రసిద్ధి చెందారు. వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపములోనూ.. పిప్పలుడు బ్రాహ్మణరూపములో.. సమయం చూసుకుని.. యజ్ఞమును నాశన చేయాలని తలచారు. రావిచెట్టు రూపములోనున్న అశ్వత్థుడు.. ఆ వృక్షఛాయనాశ్రయించుటకు వచ్చిన బ్రాహ్మణులను తినేవాడు. పిప్పలుడు.. సామ వేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యగణంబులను భక్షించెవాడు.

రోజురోజుకి బ్రాహ్మణులు క్షీణిస్తున్నారని గమనించిన మహర్షులు.. గౌతమీ దక్షిణ తటమున నియత వ్రతుడై తపమును నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూసి ఈ ఘోరమగు రాక్షస కృత్యముల గురించి ఆయనకు నివేదించారు. ఈ రాక్షసులను వధించమని కోరారు. అప్పుడు శని ఋషులతో ఇలా చెప్పాడు. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తికాగానే రాక్షసుల నిరువురిని వధిస్తాను అని తెలిపాడు. అప్పుడు మహర్షులు మేము మా తపః ఫలితమును నీకిచ్చెదము. నీవు వెంటనే ఆ రాక్షసులను సంహరింపుమనిరి. అయితే రాక్షస సంహారము పూర్తి అయినట్లేనని శని.. ఋషులతో పలికి బ్రాహ్మణ వేషమును దాల్చి వృక్షరూపంలోనున్న అశ్వత్థుడు వద్దకు వెళ్లి ప్రదక్షిణములు చేశాడు. అశ్వత్థుడు.. ఈ శనిని మామూలు బ్రాహ్మణుడేనని తలచి అలవాటు చొప్పున మింగేశాడు.

అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి.. అతని పేగులను తెంచేశాడు. ఆ పాపాత్ముడగు రాక్షసుడు సూర్యపుత్రుడగు శనిచే క్షణమాత్రములో మహా వజ్రాహతు వలె భస్మీభూతుడాయెను. బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము నభ్యసించుటకు వచ్చిన బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా శని వెళ్లి.. అతనిని సంహరించాడు. ఆ ఇరువురు రాక్షసులను సంహరించిన శని ఇంకేమి చేయాలని ఋషులను అడగగా.. వారంతా శని ముందు సంతుష్టాంతరంగులై.. శనికి ఇవ్వవలసిన వరములిచ్చారు..

సంతుష్టుడై శని.. నా వారము రోజున (శనివారం) ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్థవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీడేరును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థము ఈ శనైశ్చర తీర్థములలో ఎవరైతే స్నానము చేయుదురో.. వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా కొనసాగును.. శనివారము రోజున అశ్వత్థ ప్రదక్షిణములు చేసిన వారికి గ్రహపీడ కలుగదని హామీ ఇచ్చాడు. ఈ తీర్థము నందు అశ్వత్థతీర్థము, పిప్పలతీర్థము, సానుగ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్రిక తీర్థము, యగ్నిక తీర్థము, సాముగ తీర్థము వంటి మొదలైన పదునాలుగువేల నూట ఎనిమిది తీర్థములు ఉన్నాయని.. అక్కడ స్నానం చేయాలని సూచించారు.

శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వారికి.. సమస్త కోరికలు నెరవేరుతాయని.. తమ బాధ, ఇతర గ్రహపీడ కూడా ఉండదని మునులకు శని వరమిచ్చాడు. అంతట శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి.. శనేశ్వరుడని పేరు కూడా ఉంది. పిమ్మట ఈ మందేశ్వరునికి పక్కనే సప్తమాత్రుకలు వచ్చి.. శ్రీ పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకటగు కర్కోటకుడను నాగు ఉంటాడు. అందుకే ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు వచ్చింది. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాలస్వామి మూర్తి ఉంటారు.

సమస్యలకుపరిష్కారమార్గం


మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతున్నా సరే ఒక పరిహారాన్ని కనుక మనం పాటిస్తే సమస్యలన్నీటినుండి మనం బయటపడేటటువంటి పరిహారం ఒకటి ఉంది.ఆ పరిహారం ఏమిటంటే కులదేవత ఆరాధన.ప్రతీ కులానికి ఒక అధిష్టాన దేవత ఒక కులదేవత ఉంటుంది.అటువంటి కులదేవత యొక్క ఆరాధన కనుక మీరు శ్రద్దగా ఒక పద్దతిగా చేశారంటే కులదేవత యొక్క అనుగ్రహం మీకు కలిగింది అంటే ఎటువంటి చికాకులు అయిన తొలగిపోతాయి.అదేవిధంగా ఈ కులదేవతల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి యొక్క గృహమునందు కులదేవత స్థిరంగా కొలువై ఉంది వారి యొక్క జీవితాన్ని నిర్దేశించి మంచి మార్గములో వెళ్ళే విధంగా ఆశీర్వచనం చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.అందుకని కులదేవత ఆరాధన అమావాస్య రోజున మొదలుపెట్టి చేసుకోవాలి.అమావాస్య రోజున కులదేవతా యంత్రం మీద మీ కులదేవత ఎవరో ఆవిడ పేరు యంత్రం మీద ఎక్కడ ఉందో చూసుకుని కొద్దిగా పచ్చకర్పూరాన్ని,కొద్దిగా పన్నీరు చుక్క వేసి అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో ఆ గంధాన్ని మీ కులదేవత యొక్క పేరు మీద రాయండి.అమావాస్య రోజున ప్రొద్దున్నే అంటే తెల్లవారుజామునే రాసిన తరువాత ఆ అమావాస్య రోజు వేపచిగుళ్ళు తీసుకువచ్చి మీ యొక్క కులదేవతకు అలంకరించండి.కొద్దిగా పసుపు కుంకుమ తీసుకుని మీ కులదేవత యొక్క పేరుతో పసుపు కుంకుమలతో పూజ చేయండి.తరువాత విధియ రోజున అల్లం ముక్కను తీసుకుని నైవేద్యం పెట్టండి.చవితి రోజున కొద్దిగా ఇంగువ తీసుకొని నైవేద్యంగా పెట్టండి.షష్టి రోజున కొంచం జీలకర్ర,అష్టమి నాడు కొంచం ఆవాలు,దశమి రోజున ఎండుమిరపకాయలు నైవేద్యంగా పెట్టండి.ఆ విధంగా మొదలుపెట్టి మీరు పౌర్ణమి వరకు కూడా ఒక రోజు విడిచిపెట్టి ఒక రోజు ఇంట్లోని పోపులపెట్టెలో ఉండేటటువంటి ఏదైతే సామగ్రి ఉందో వాటిని నివేదన చేసి మళ్ళీ అమావాస్య రోజు వచ్చేంతవరకు కూడా రోజు విడిచి రోజు ఏదో ఒక సామగ్రి నైవేద్యంగా పెట్టండి.ఆ తరువాత వీటన్నింటినీ తీసి ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అమావాస్య పూర్తైన తరువాత ప్రక్కకు పెట్టుకున్నటువంటి నైవేద్యాలన్నిటినీ కూడా ఆ నెల మొత్తం వంటకు ఉపయోగించండి.అదేవిధంగా మీరు కనుక 11 అమావాస్యల పాటు కులదేవతాయంత్రానికి కనుక ఆరాధన చేసి నివేదనలు చేసి ఆ నివేదనలను మీరు ప్రసాదంగా వంటలకు వినియోగించారంటే కులదేవత యొక్క అనుగ్రహం చేత మీ కులదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుస్తుంది.కులదేవతను మర్చిపోవడం వలన ఆవిడను పూజించాకపోవడం వలన మనం ఎన్నో సమస్యలను ఎదురుకుంటూ ఉన్నాము.అటువంటి సమస్యలన్నీ కూడా ఈ కులదేవత యొక్క ఆరాధన వలన తొలగిపోతాయి.సంతోషం అనేదటువంటిది కలుగుతుంది.కాబట్టి కులదేవత యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయండి.సంతోషంగా జీవించండి….

🚩సర్వేజనా సుఖినోభవంతు🚩

త్రిపురసుందరీ


“త్రిపురోపాసన” ఎప్పుడు? ఎక్కడ?

“త్రిపురసుందరీ” ఉపాసన, పూజావిధానం
ఎప్పుడు? ఎక్కడ? ఎలా ప్రారంభమైనదో కొంత పరిశీలిద్దాం.

“మహార్ధమంజరీ’ రచించిన
మహేశ్వరానందుని గురువు యొక్క గురువైన “శివానందుడు”. నిత్యాషోడశికార్ణవమనే కౌళాచార గ్రంథమునకు
“ఋజువిమర్శిని” అనే వ్యాఖ్య వ్రాయుచూ – అందు
“అస్య సంప్రదాయస్య కాశ్మీరోద్భూతత్వాత్” అని
ఉల్లేఖించుట వలన –
త్రిపురోపాసన – కాశ్మీరదేశమునందు ముందుగా
ఉద్భవించినదని తెలియుచున్నది.
‘తంత్రాలోక’ వ్యాఖ్యానకర్త అయిన కాశ్మీర దేశస్థుడు
“జయరధుడు” – వామకేశ్వరీ మత వ్యాఖ్యానమందు –
“వస్తుతోహ్యస్య దర్శనస్య ఏతదేవాచార్యద్వయం కాశ్మీరేషు
అవతారకం” అని 1 – ఈశ్వరశివ, 2 – విశ్వావర్తులను
కాశ్మీర దేశమందు త్రిపురోపాసన ముందుగా
ప్రవర్తింపచేసినట్లు తెలియ జేశాడు.
“కాశ్మీరేషుశ్రీమాన్ “విశ్వావర్త” ఏవ అస్య దర్శనస్య సాక్షాత్
ప్రవర్తయితా” అని ఉల్లేఖించాడు.
వామకేశ్వరీ మత వివరణమను గ్రంథమందు


ఈశ్వర శివుని పేరు – శంకరరాశిగా చెప్పబడినది.

ఈ “విశ్వావర్తుడు” 20 శ్లోకములతో ఒక స్తోత్రవ్యవస్థ చేసి
నట్లు “భటోత్పలాచార్యుడు” తన
“శివస్తోత్రావళి” యందు పేర్కొన్నాడు.
నవత్రికోణాత్మకమైన శ్రీచక్రమునందు కేంద్రస్థానము బిందువు.
ఇది ఓడ్యాణపీఠముగా ఇక్కడ ఉన్న త్రిపురసుందరికి,
చర్యానంద నాధునికి ప్రతీకగా
శివానందాదులచే అంగీకరించబడినది.

ఓడ్యాణపీఠం ఎక్కడ?
త్రిపురా సిద్ధాంతమును కాశ్మీరమునకంటే ముందు – చర్యా
నందనాధుడు ఉడ్డీయాన పీఠమునందు ప్రారంభించాడు.
ఉడ్డీయాన “పీఠం ప్రస్తుతం “స్వాత్” అను పేరుతో
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ దేశమునందున్నది.
ఈ స్థలమునే “ఔర్దాయిని” అని పిలుచుచున్నారు.
దీనికే ఉడ్డీయానమని, ఓఢ్యాణమని నామాంతరములు.
ఇక్కడే “త్రిపురారాధన” పుట్టినది.
ఇక్కడనుంచి కాశ్మీరమునకు వ్యాపించింది.
కాశ్మీరమునుంచి ఉత్తర – దక్షిణ భారతదేశమంతటా వ్యాపించినంది.
కాశ్మీరములో ఈశ్వరశివ – విశ్వావర్తాచార్యులు
“త్రిపురో పాసన” కు నాంది పలికారు.
ఈశ్వర శివుడు వామకేశ్వరీ మతమునకు
“రసమహోదధి” అను పేరుతో కారికావ్యాఖ్యానము రచించెను.
లలితా సహస్రనామములందు
“ఓఢ్యాణ పీఠనిలయా బిందుమండలవాసినీ” అని
ఓఢ్యాణ పీఠమే ప్రముఖస్థానముగా చెప్పబడినది.


పంచలింగాలు

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

  1. పృథ్విలింగం:
    ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
  2. ఆకాశలింగం:
    ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
  3. జలలింగం:-
    ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
  4. తేజోలింగం:
    తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
  5. వాయులింగం:
    ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.