సూత్రాలు అని శాస్త్రంలో అంటుంటారు


ప్ర: సూత్రాలు అని శాస్త్రంలో అంటుంటారు. ఉదాహరణకు – యోగ సూత్రాలు, భక్తి సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు… ఇలా. అసలు ‘సూత్రం’ అంటే ఏమిటి? మంగళ సూత్రం అంటే ‘మంగళకరమైన దారం’ అని అర్ధం కదా. శాస్త్రంలో ‘సూత్రాలు’ ఏమిటి?

జ: ‘సూత్రం’ అంటే లౌకికంగా ‘దారం’ అని అర్థం. ఒక కొనసాగింపును కలిగినది కనుక దారాన్ని సూత్రం అన్నారు. శాస్త్రంలో ‘సూత్రం’ చాలా బలీయమైనది. ఒక్క వాక్యంలో ఎంతో జ్ఞానాన్ని నింపి అత్యంత క్లుప్తంగా చెబితే ‘సూత్రం’ అంటారు. ఇది జ్ఞాపకం ఉంచుకొనడం తేలిక. సూత్రంలోని అంతరార్థాన్ని వివరిస్తే ‘భాష్యం’ అంటారు. ఇంగ్లీష్ భాష ప్రకారం సూత్రాన్ని ‘ఫార్ములా’ అనవచ్చు. తొలుత సూత్రం వ్యాకరణ శాస్త్రంలో ఉద్భవించింది. తదనంతరం ప్రతి శాస్త్రం సూత్ర పద్ధతిని అవలబించింది. వేదాంతాన్ని ‘బ్రహ్మసూత్రాలు’ గా వ్యాసదేవులు అందించారు.

భక్తి సూత్రాలను నారదుడు, యోగసూత్రాలను పతంజలి రచించారు. ఇలా దర్శన శాస్త్రాలన్నీ సూత్ర
సాహిత్యాలను అభివృద్ధి చేశాయి. బౌద్ధ జైనాలు, శైవ శాక్తేయాది సంప్రదాయాలు కూడా సూత్ర రచనలను ఏర్పరచుకున్నాయి.

చిన్మస్తిక దేవి. (శిరస్సు లేని దేవత)


నేనుచెప్పే ఆలయం .5.”మా” చిన్తపూర్ణి
ప్రముఖమైన శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం.

మా” చిన్తపూర్ణి

ప్రముఖమైన శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం.
చిన్తపూర్ని హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది. డిల్లి నుంచి పఠాన్ కోట్ చేరుకొని అక్కడినుంచి టాక్సీ లో స్వామి చిన్మయానంద వారి తపోవన్ ఆశ్రమం చేరుకున్నాము. అక్కడి నుంచి మేము హిమాచల్ ప్రదేశ్ లోని చుట్టుపక్కల ప్రదేశాలు చూసాము. వాటిలో శక్తి పీఠం గా విరాజిల్లే మా చింత పూర్ణి మందిరం ఒకటి.భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన టూరిష్టులు కూడా వస్తుంటారు.

ఈ శక్తిపీఠాలలలో పరాశక్తి భైరవునితో (తన భర్త అయిన శివుడు) వెంట కాలభైరవుని (శునకం) తోడుగా కొలువై వుంటుంది చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో వుండదు. పిండి రూపం లో వుంటుంది. ఇక్కడకి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది.

చిన్మస్తిక దేవి. (శిరస్సు లేని దేవత)

స్థల పురాణాన్ని బట్టి ఈ కధ కూడా ప్రచారంలో వుంది. ‘మస్తిక’ అంటే శిరస్సు అని, ‘చిన్’ అంటే లేదు అని, అర్థం… శిరస్సు లేని దేవత గా ఇక్కడి మాత ని కొలుస్తారు. ఇతిహాసాలలోని పురాణాల ప్రకారం మార్కండే పురాణం లో ఒక గాధ ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండి దేవి అసురుల్ని ఓడిస్తుంది. అందులో సాయపడిన ఢాకిని, యోగిని గా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని, యుద్దానంతరం కూడా వారు విపరీతమైన రక్త దాహంతో వున్నపుడు చండి దేవి తన తలని తానె ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త దారాలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి దేవికి చిన్ మస్తికాదేవిగా శిరస్సు లేని దేవిగా పిలువ బడుతోంది.

పురాణాలు, ఇతిహాసాలలో ఈ స్థలాని రుద్ర దేవుడు ఈ ప్రదేశాన్ని నలు దిక్కులా కాపాడుతుంటాడని కూడా వుంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్ ఆలయం దక్షిణాన శివ్ బారి ఆలయం వున్నాయి. అందుకే ఆ ఆలయాన్ని చిన్ మస్తిక దేవి ధామ్ అని అంటారు
పండుగలు

ప్రతి సంవత్సరంలో పది రోజులు జూలై ఆగష్టు మధ్య ఉత్సవాలు జరుగుతాయి సావన్ (శ్రవణ్ ) అష్టమి ఉత్సవాలుగా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రవణ మాసం లోను, దసరా నవరత్రులలోను కార్తిక మాసంలోను, చైత్ర మాసం లోను, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు

ఎంతెంత దూరం

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నుంచి 47 కి.మీ. దూరం లో వుంది. సొలా సింఘి పర్వత శ్రేణులలో పర్వత శిఖరం పైన 940 మీటర్ల (3,117 అడుగుల) ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం వుంది.
65 కి. మీ. ధర్మశాల నుంచి.అతి దగ్గరి విమానాశ్రయం గగ్గల్. కాంగ్రా జిల్లాలో వుంది. రైలు మార్గం ఉనా జిల్లాలోని అంబ నుంచి 20 కి.మీ. దూరం లో వుంది. ఢిల్లీ నుంచి 430 కి మీ దూరంలో వుంది. పంజాబ్ రాష్ట్రం లోని హోషియార్ పూర్ 43 కి.మీ. దూరం లో వుంది. చుట్టూ సుందరమైన ప్రక్రుతి దృశ్యాలతో అలరారుతూ వుంటుంది. ఢిల్లీ నుండి చందిగడ్, నంగల్, ఉన, ముబరిక్పూర్, తానికపుర , భార్వైన్ చిన్తపూర్ని ఒక మార్గం ఢిల్లీ నుండి జలంధర్, హోషియార్పూర్ ముబారిక్పూర్ భార్వైన్, తానికపుర ద్వారా చిన్తపూర్నికి ఇంకొక మార్గం