షష్ఠీ దేవి.. (శ్రీ మాత్రే నమః)


షష్ఠీ దేవి.. 🙏
శ్రీ మాత్రే నమః

సంతానం లేనివారు షష్ఠీదేవిని వ్రత విధానమున పూజించిన వారికి సంతానం కలుగుతుంది.

షష్ఠీ దేవి ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చినది. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. పిల్లలకి తరుచుగా అనారోగ్యాలు కలుగుతున్నా, ఆపదలు వస్తున్నా, బాలారిష్టాలు ఉన్నా షష్ఠిదేవి కధ విన్నా, చదివినా, వ్రాసినా షష్ఠిదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువుని అభివృద్ధి చేస్తుంది. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. సంతానం లేనివారు షష్ఠిదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘాయుష్మంతులు అయిన సంతానం పొందుతారు.

సృష్టిలోని చిన్నపిల్లందరికీ జన్మనిచ్చిన తల్లిగాక, కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే మరో తల్లి ఉంది. ఆమే షష్ఠీదేవి. ఈ దేవతకు సంబంధించిన కథ దేవీభాగవతం తొమ్మిదో స్కంధంలో వివరంగా కనిపిస్తుంది.

ప్రతి భాద్రపద శుక్లచవితిని వినాయక చవితి పండుగగా ఎలా చేసుకుంటారో అలాగే ప్రతి భాద్రపద శుక్లషష్ఠిని షష్ఠీదేవి పండుగగా కూడా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా, గొప్పగా కనిపిస్తుంది. ప్రకృతి మాతలో ఆరో అంశగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అని పేరు వచ్చింది. బ్రహ్మ మానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధసమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చిపెడుతున్న కారణంగా దేవసేన అని పేరు వచ్చింది. ఈ దేవసేన కుమారస్వామిని వివాహమాడింది. బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయా రూపంలో పురిటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది. పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను ఆర్తితో స్తుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చిపెడుతుంది. దీనికి సంబంధించిన పూర్వకథ నొకదానిని కూడా దేవీభాగవతం పేర్కొంటోంది.

పూర్వం స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే ఓ కుమారుడు జన్మించాడు. ప్రియవ్రతుడు పెరిగి పెద్దయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనస్సు పోలేదు. నిరంతరం తపస్సుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకొని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవ్రతుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు. అయితే ఆ దంపతులకు ఎంత కాలానికీ సంతానం కలగలేదు. ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రియవ్రతుడి చేత చేయించాడు. ఆ తర్వాత మాలినీదేవి గర్భవతి అయింది. ఓ శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది. కానీ ఆ శిశువు మృతశిశువు. దాంతో ఆ దంపతులు ఎంతో శోకించారు. ప్రియవ్రతుడు మృతశిశువును తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు. దారుణంగా విలపించాడు. అలా విలపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖననం చేయటానికి పూనుకోలేదు. ఇంతలో ఓ దివ్యవిమానం అక్కడకు వచ్చి ఆగింది. ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో, పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది.

ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిలుచొని నమ్కరించాడు. ఆమె ఎవరో? తన దగ్గరకు ఎందుకు రావల్సి వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు ఆ దేవి తన విషయాలన్నింటినీ చెప్పింది. తాను ఆదిపరాశక్తిలోని ఆరో అంశనని, తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోకి తీసుకొని ఒళ్ళు నిమిరింది. ఆ బాలుడు కిలకిలా నవ్వుతూ జీవం పోసుకొని కళకళలాడాడు. పునరుజ్జీవితుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని, ఎంతో యోగ్యుడుగా ఉంటాడని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడని షష్ఠీదేవి ప్రియవ్రతుడికి చెప్పింది. తాను పసిపిల్లలను నిరంతరం రక్షిస్తూ ఉంటానని, అయితే కర్మవిపాకం బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మం ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించటం అంత సులభసాధ్యం కాదంది. అలాకాక మరి ఏ ఇతర కారణాంతరాల వల్లైనా శిశువులకు కష్టాలు కలిగితే వాటిని తాను తొలగిస్తానని చెప్పింది.

ప్రియవ్రతుడు రోదిస్తూ ఉండటాన్ని పక్కనే మృతశిశువు ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్థానమైంది. అప్పటినుంచి ప్రతినెల శుక్లషష్ఠినాడు అందులోను భాద్రపద శుక్లషష్ఠినాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించటం ప్రారంభించాడు. పురిటిళ్ళల్లో ఆరో రోజున, పదకొండో రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం సందర్భంలోను షష్ఠీదేవి పూజలుచేయటం ఆనాటినుంచే మొదలైంది. సాలగ్రామంలోనో, మంగళకలశంలోనో, వటవృక్షం మూలనో షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజలు జరిపిస్తారు. పుష్పాలతోను, షోడశ ఉపచారాలతోను పూజచేసి నైవేద్యం పెడతారు. ఇలా పూజలు చేసినవారి ఇంట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్దవారికి కూడా సుఖభోగాలు ప్రాప్తిస్తుంటాయన్నది నమ్మకం. పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత షష్ఠీదేవి గురించి దేవీభాగవతం వివరిస్తోంది.

శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః

ధ్యానం :

శ్రీమన్మాతరమంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం .
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షష్ఠాంశాం ప్రకృతేః పరాం భగవతీం శ్రీదేవసేనాం భజే ..

షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం .
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం ..
శ్వేతచంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం .
పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాంభజే ..

అథ శ్రీషష్ఠీదేవి స్తోత్రం

స్తోత్రం శృణు మునిశ్రేష్ఠ సర్వకామశుభావహం .
వాంఛాప్రదం చ సర్వేషాం గూఢం వేదే చ నారద ..

ప్రియవ్రత ఉవాచ:

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః .
శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః .. 1..

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః .
సుఖదాయై మోక్షదాయై చ షష్ఠీదేవ్యై నమో నమః .. 2..

సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః . (var శక్తిషష్ఠీస్వరూపాయై)
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః .. 3..

పరాయై పారదాయై చ షష్ఠీదేవ్యై నమో నమః .
సారాయై సారదాయై చ పరాయై సర్వకర్మణాం .. 4..

బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః .
కల్యాణదాయై కల్యాణ్యై ఫలదాయై చ కర్మణాం .. 5..

ప్రత్యక్షాయై చ భక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః .
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు .. 6..

దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః .
శుద్ధసత్త్వస్వరూపాయై వందితాయై నృణాం సదా .. 7..

హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః .
ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి .. 8..

ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః .
భూమిం దేహి ప్రజాం దేహి దేహి విద్యాం సుపూజితే .. 9..

కల్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః .

.. ఫలశృతి ..

ఇతి దేవీం చ సంస్తూయ లేభే పుత్రం ప్రియవ్రతః .. 10..

యశస్వినం చ రాజేంద్రం షష్ఠీదేవీప్రసాదతః .
షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్యః శృణోతి చ వత్సరం.. 11.

అపుత్రో లభతే పుత్రం వరం సుచిరజీవినం .
వర్షమేకం చ యా భక్త్యా సంయత్తేదం శృణోతి చ .. 12..

సర్వపాపాద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే .
వీరపుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం .. 13..

సుచిరాయుష్మంతమేవ షష్ఠీమాతృప్రసాదతః .
కాకవంధ్యా చ యా నారీ మృతాపత్యా చ యా భవేత్ .. 14..

వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీదేవీప్రసాదతః .
రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ .. 15..

మాసం చ ముచ్యతే బాలః షష్ఠీదేవీ ప్రసాదతః .

.. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ఇతిఖండే నారదనారాయణసంవాదే
షష్ఠ్యుపాఖ్యానే శ్రీషష్ఠీదేవిస్తోత్రం సంపూర్ణం ..

Courtesy: ఫొటో & కథా వివరణ : Dendukuri Satyasomayaji గారు

సమాధి – వివిధ రకాల సమాధి స్థితులు – విశ్లేషణ:


యోగ శాస్త్రంలో 8 రకములైన సమాధి స్థితుల వర్ణన కలదు. ఇవి 8 రకాలైన జ్ఞానోదయ పద్ధతులు కూడా. అయితే ఈ “సమాధి” స్థితిని వర్ణించడం దుర్లభం కూడా. అయితే, ఈ సమాధి అనుభవం కూడా అంతే దుర్లభం.

సమాధి స్థితిలో, ఏ లక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే
స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన “సమాధిస్థితి”
సమాధులు 1. సంప్రజ్ఞాత సమాధి, 2.అసంప్రజ్ఞాత సమాధి
3.సవితర్క సమాధి
4.నిర్వితర్క సమాధి
5.సబీజ సమాధి
6.నిర్బీజ సమాధి
7.ధర్మ మేఘ సమాధి

8. ప్రకృతి లయ సమాధి…అని రకములు.

ఇంకనూ అనేక సమాధి స్థితులు ఉన్ననూ, ప్రస్తుతానికి ఇవి చాలును.

సంప్రజ్ఞాత సమాధి:

దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి. కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని “సబీజ సమాధి” అనికూడా అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.

అసంప్రజ్ఞాత సమాధి :

దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల “నిర్బీజ సమాధి”అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనో నాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసుకొని ముక్తిని పొందుతాడు.వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.

మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.

రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.

మూడవది… నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.

నాల్గవది ….. ఆనంద సమాధి. స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు. చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది. కానీ ప్రకృతి తత్వాలను దాటాలి కదా! ఇదే కదా, సాంఖ్యం చెబుతుంది.

అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.
క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.
స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే “నిర్వికల్పసమాధి” అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు
నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే “ఋతంభర ప్రజ్ఞ”.
ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.

ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల “అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి” పొందగలం అని ఈ సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి… ఋషి కాబట్టి…ఆ మహితాత్ముడు చెప్పినది “ఆప్తవాక్యమే”… హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే…సమాధి వల్ల కలిగే సంస్కారం, ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.

చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.

పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే “నిర్భీజసమాధి” అంటారు.

ఇలా వృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.——-మహర్షి పతంజలి

అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.
క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.
స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే “నిర్వికల్ప సమాధి’ అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.
నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే “ఋతంభర ప్రజ్ఞ”
ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.

ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి… ఋషి కాబట్టి…ఆ మహితాత్ముడు చెప్పినది “ఆప్తవాక్యమే”… హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియ గోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే…సమాధి వల్ల కలిగే సంస్కారం, ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.

చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.

సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు. ప్రకృతి లయుల యొక్క అత్యున్నత ధ్యాన దశను “ప్రకృతి లయ సమాధి” అంటారు.పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంతకాలం పురుషుడిని దర్శించలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. : ఇక్కడ ధర్మ మేఘ సమాధి గూర్చి, సూత్రకారుడేం చెబుతున్నాడో చూద్దాం! సర్వ తత్వాలను, చక్కగా వివేచించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక ఉండేవానికి, అలాంటి పరిపూర్ణ వివేకికి "ధర్మ మేఘం" అనే సమాధి సిద్ధిస్తుంది. ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, అణిమాది అష్ట సిద్ధులన్నీ కలుగుతాయి. కానీ నిజమైన యోగి వాటిని పరిత్యాగం చేస్తాడు. అలాంటి యోగికి, "ధర్మ మేఘం" అనే విచిత్ర, వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అటువంటి యోగి సమస్త జ్ఞానం తననుండే కలుగుతుందని గ్రహిస్తాడు.

ఇక్కడ, యోగికి వివేక ఖ్యాతి లభించినచో, దాని సహాయముతో, సర్వ భావాధిష్ఠాతృత్వాది సిద్ధులను, ఆశించినచో , ఆ యోగి “కుసీదుడు” అనబడును. (కుసీదుడు – సద్గురు మళయాళ స్వామి వచనం)

భట్టాచార్య

గుడిలోకి వెల్లే ముందు భక్తులు గడపకు ఎందుకు నమస్కరిస్తారు ?


సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.

రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు.

అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?


వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ… ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని

(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే… ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ… తిరిగి మొదటి నుండి లెక్కించాలి.శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే…
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు అంటారు. దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.

పైన రాసిన స్టోరీ… భగవద్గీత ఆధారంగా రాయబడింది.