పితృదేవతలు – అమావాస్య– అనే పేరు ఎలా వచ్చింది ?


పితృదేవతలనేవారిని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో ఎదురవుతుంటాయి. ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథాసందర్భం.
ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలీ పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవతాగణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాలను గురించి తెలియచెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది. పితృదేవతలు ఏడుగణాలుగా ఉంటాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్ఠులయ్యారు. ఇలా భ్రష్ఠులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం విశేషం. ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.
అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.

Advertisements

శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ-.


ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .సర్వ సంపదలు ,మనశ్శాంతి ,సత్సంతానం ప్రాసాదించే వాడు త్రికూటేశ్వరుడు .త్రికూటేశ్వర నామ స్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభి వర్ణించాడు .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ‘’త్రికూటాచలం ‘’లేక ‘’కోటప్ప కొండ’’అంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం ,పన్నెండు కిలో మీటర్ల చుట్టుకొలత ఉండి కోటి ప్రభా భాసమానమైన దివ్య విరాజిత క్షేత్రం కోటప్ప కొండ . ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి .అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతి రూపాలు .త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమే త్రికూటేశ్వర పరమేశ్వరుడు .దేవ ,మానవ సేవితమై ముక్తి దాయుడైన ఈ స్వామిని ‘’ఎల్లమందేశ్వరుడు ‘’’కావూరి త్రికోటేశ్వరుడు ‘’,కోటప్ప ,కోటయ్య అని భక్తితో పిలుచుకొంటారు ఇక్కడ ధ్వజస్తంభం, అమ్మవారు లేకపోవటం ,కల్యాణం జరక్క పోవటం ప్రత్యేకతలు .ఈ కొండపై కాకులు వాలక పోవటంవింతలలో వింత .ఈ కొరతను తీర్చటానికా అన్నట్లు కోతులు మాత్రం అసంఖ్యాకం.జాగ్రత్తగా ఉండక పొతే చేతిలోని వన్నీ ‘’హనుమార్పణమే ‘’ .
త్రికూటేశ్వర ఆవిర్భావం
దక్షయజ్న విధ్వంసం చేసి లయ కార శివుడు శాంతి పొంది యోగ నిష్ట తో పన్నెండేళ్ళ వటువుగాదక్షిణా మూర్తి గా త్రికోటాద్రి పై ఉంటూ మధ్య శిఖరమైన రుద్ర శిఖరాన బిల్వ వనం లో వట వృక్షం కింద బ్రహ్మాసనస్తితుడై దేవ ,ముని యక్ష కిన్నరాదులచే సేవింప బడుతున్నాడు .రుద్ర శిఖరానికి ఈశాన్యం లో ఒక శిఖరం ఉంది .దాన్ని’’ గద్దల బోడు ‘’అంటారు బోడుఅంటే శిఖరం .శివుడిని ఆహ్వానించ కుండా దక్షుడు చేసిన యజ్ఞానికి తాము హాజరైన హవిర్భాగాన్ని తినటం వలన కలిగిన దోషాన్ని విష్ణువు మొదలైన దేవతలు నివా రించుకోవటానికి ఇక్కడ శివునికో సం తపస్సు చేశాడు .శివుడు మెచ్చి దర్శనమిచ్చి తన త్రిశూలం తో శిఖరాన్ని పొడిచి జలాన్ని ఉద్భవింప జేసి తాను వారి అభ్యర్ధన మేరకు అక్కడే ఉండిపోయి అనుగ్రహించాడు .ఆ శివజాలం లో సస్నానం చేసి విష్ణువు మున్నగు దేవతలు పాప విముక్తులయ్యారు .ఈ జలాన్ని పాప వినాశనతీర్ధమని ,ఈ శివుని’’ పాప వినాశక లింగ మూర్తి ‘’అని అంటారు .కార్తీక ,మాఘ మాసాలలో ఇక్కడి జలం లో స్నానించి ఈ శివుని దర్శిస్తే మోక్షమే .
సోపాన మార్గాలు
ఇంతటి దివ్య మహిమ కలిగిన త్రికూటాచలాన్ని ఎక్కటానికి మూడు దారులున్నాయి .పాప వినాశన స్వామి గుడీ పడమరగా ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కి చేరచ్చు .ఇదే ఏనుగుల బాట లేక ఎల్ల మంద సోపానం .దీనిని శ్రీ మల్రాజు నరసింహరాయణి నిర్మింప జేశారు 


ఆలయ పునర్నిర్మాణం
శ్రీ శృంగేరి పీఠాదిపతులు శ్రీశ్రీ భారతీ మహా తీర్ధ స్వామి వారు డెబ్భై లక్షల ఖర్చుతో ఆగమ విధానం లో కోటప్ప కొండఆలయ పునర్నిర్మాణం జరిగింది .

. స్థల పురాణ విశేషాలు

త్రికూట పర్వతాలలో మధ్యమ శిఖరం పై శ్రీ కోటేశ్వర లింగం ఉంది .కొత్త ఆలయం దక్షిణ భాగం లో గణనాధుని గుడి ,పడమర ‘’సాలంకేశ్వరాలయం ‘’ఉత్తరాన ‘’సంతాన కోటేశ్వర లింగం ‘’,ఎడమ బాగాన బిల్వ వృక్షం కింద ‘’మార్కండేయ లింగం ‘’,తూర్పు మండపం లో నందీశ్వరుడు ,దీనికి తూర్పున ‘’అడవి రామ లింగం ‘’,వెనక లింగ మూర్తి తూర్పున దుర్గా, భైరవులు ,గర్భాలయం లో ద్వార పాలురు ఉంటారు .సోపాన మార్గ ప్రారంభం లో కింద తలనీలాలను సమర్పించే ప్రదేశాన్ని ‘’బొచ్చు కోటయ్య ‘’గుడి అంటారు .కొండ కింద నీల కంఠేశ్వర స్వామి ,దీనికి నైరుతిన వాసు దేవానంద సరస్వతి స్వాముల వారు కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఉన్నాయి.ఈ క్షేత్రం లో దైవ నిర్మితమైన దోనెలు ఎన్నో ఉన్నాయి .దిగువ దోనేలలో ఎద్దడుగు దోన ,పుర్ర చేతి దోన ,ఉబ్బు లింగయ్య దోన ,పాలదోన ,లో భక్తులు స్నానాలు చేస్తారు .ఇక్కడే తపస్సు చేసుకోవటానికి ఎన్నో గుహలు అనుకూలం గా ఉన్నాయి .త్రికూటానికి దక్షిణాన ఒగేరు లేక ‘’ఓంకార నది’’ ప్రవహిస్తోంది .చేజెర్ల లో శిబి చక్ర వర్తి లింగైక్యం చెందిన కోటేశ్వర లింగానికి సమస్త దేవతలు ,సిద్ధ సాధ్యాదాదులు మహర్షులు ఓంకారం తో అభిషేకించిన జలం కపోతేశ్వర స్వామి గుడి వెనక నుండి బయల్దేరి కోటప్ప కొండ దగ్గర ప్రవహించి సముద్రం లో కలుస్తుంది .భక్తులు ముందుగా విష్ణు శిఖరం లోని పాప వినాశన తీర్ధం లో స్నానం చేసి లింగ మూర్తిని పూజించి ,గొల్ల భామను దర్శించి తర్వాత త్రికూటేశ్వర లింగ దర్శనం చేయటం విధానం .శ్రావణ మాసం లో రుద్ర శఖరాన్ని కార్తీక మాసం లో విష్ణు శిఖరాన్ని ,మాఘం లో బ్రహ్మ శిఖరాన్ని దర్శించి మహా లింగార్చన చేసి ప్రాచీన ,నూతన కోటేశ్వర స్వాముల దర్శనం చేసి తరించాలి .కోటప్ప కొండ అపర కైలాసం అని అచంచల విశ్వాసం ..
చరిత్ర ప్రసిద్ధి
కోటప్ప కొండ దేవుడికి వెయ్యేళ్ళ పై బడి చరిత్ర ఉంది .ఇక్కడి దాన శాసనాలలో వెలనాటి గొంక రాజు ,వెలనాడు చాళుక్య భీమ రాజు ,వెలనాటి కులోత్తుంగ చోళుడు ,వెలనాటి రాజేంద్రుడు పేర్లున్నాయి .కృష్ణ దేవరాయలు ,మల్రాజు వెంకట నారాయణి ,వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మొదలైన రాజులు జమీందార్లు స్వామికి విలువైన మాన్యాలు రాసి సమర్పించారు .
త్రికూటాచల మహాత్మ్యం
ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్ల ముని మంద లింగ బలిజ కులానికి చెందిన మహా భక్తుడు .అడివికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మి జీవించేవాడు .ఒక రోజు మధ్యమ లింగాన్ని పూజించి ,మర్నాడు తమ్ములతో విష్ణు శిఖరాన్ని చేర గా కుండపోతగా గాలీ వర్షం కురిసింది .దగ్గరలోని గుహలో తల దాచుకొన్నారు .అక్కడ ఒక ధనం ఉన్న బిందె అనిపించింది .దాన్ని తీసుకొని సాలంకయ్య రుద్ర శిఖరం లో ఒక జంగమయ్య ప్రత్యక్షం కాగా ఆయన్ను రోజూ పూజించే వాడు .కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనాడు .సాలంకయ్య వేదన చెంది వెదికి వేసారి నిరాహార దీక్ష చేసి బ్రహ్మ శిఖరం చేరి ఆక్కడున్న గొల్లభాము తన బాధ తెలిపుదామని వెతికితే ఆమెకూడా కనిపించలేదు . బ్రహ్మ శిఖరం లో ఒక గుహను చేరగానే ‘’నేను నీవిందు ఆరగించాను .నీ వాడిని .పరమేశ్వరుడిని .గొల్లభాము మోక్షమిచ్చాను .నేనిక్కడే ఉంటాను .ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు .త్రికూటేశ్వర లింగ రూపం లో అర్చించు .మహా శివ రాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి .జాగరణ చేసి ప్రభలను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానం చేయాలి .అప్పుడు నువ్వు శివైక్క్యం చెందుతావు’’అని చెప్పి జంగమ దేవర అదృశ్యమైనాడు .
సాలంకుడు యోగి ఆదేశం తో గుడికట్టించి ,త్రికూటేశ్వర లింగాన్ని ప్రతిష్టించి గొల్ల భామకు(ఆనంద వల్లి ) వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించాడు పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు అప్పుడు దివ్య వాణి ‘’ఇది బ్రహ్మ చారి దక్షిణామూర్తి క్షేత్రం. ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం ‘’అని విని పించింది .సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయ మైంది .విరక్తి చెందిన సాలముడు దేహ త్యాగం చేయ నిశ్చయించి యోగబలం తో లింగైక్యంచెందాడు .అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు . వీరు బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వర లింగాలుగా ,సాలంకయ్య ‘’సాలంకేశ్వరుడు ‘’గా ఆయన ప్రతిష్టించిన లింగం ‘’కోటేశ్వర లింగం ‘’గా బ్రహ్మ శిఖరాన వెలిసి ఈ క్షేత్రం ‘’పంచ బ్రహ్మ స్థాన క్షేత్రం ‘’గా పేరు పొందింది .
ఆనంద వల్లి (గొల్లభామ )
త్రికూటాచల దక్షిణాన ‘’కొండ కావూరు ‘’ గ్రామం లో యాదవ వంశం లో సుందరి సునందలకు గారాల బిడ్డగా ‘’ఆనంద వల్లి ‘’జన్మించింది .చిన్న నాటి నుంచే శివ భక్తిలో లీన మయ్యేది .రుద్రాక్షమాలలు ధరించేది .ఆధ్యత్మిక భావాలను బోధించేది .ఒక శివ రాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి ,బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా ,సాలంకయ్య కు దర్శన మిచ్చిన జంగమయ్య కు ఆవుపాలు ఇచ్చి మిగిలింది తను తాగుతూ శివ నామ స్మరణం తో గడిపేది .సాలంకయ్యకు జంగమ స్వామి కనపడక తిరుగుతూ గొల్లభామ దగ్గరకు వచ్చి తన మనవిని జంగమ స్వామికి తెలియ జేయమని వేడుకొన్నాడు .గొల్లభామ దీక్షతో శివార్చన చేసేది .ఒకరోజు నెత్తిన తీర్ధ జలాన్ని పెట్టుకొని శ్రమతో జంగమయ్య ను దర్శించినప్పుడు ఒక కాకి నెత్తిమీది కలశం పై వాలగా పాలు నేల పాలయ్యాయి .కోపించిన ఆనంద వల్లి ‘’ఈ రోజు నుండి ఈ కొండపై కాకులు వాల కుండా ఉండుగాక ‘’అని శపించింది .ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య ప్రత్యక్షమై శివైక్యాన్ని ప్రసాదించాడు
విశిష్ట సేవా విధానం
శ్రీ త్రికూటేశ్వరాలయం లో .ఎప్పుడూ అఖండ దీపారాధన ,అభిషేకాలు పూజలు జరుగుతాయి .శివ రాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల మత భాషా ప్రాంత భేదాలు లేఉండా అశేష జనం వస్తారు .మహా ఎత్తైన ప్రభలు కట్టుకొని రావటం ఇక్కడ ప్రత్యేకత . అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటె ‘’కోటప్ప కొండ ప్రభ ‘’అఅనటం అలవాటైంది .మాఘ మాసం లో పశువులతో ప్రదక్షిణ చేసి స్వామిని సేవిస్తారు .తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకొని గరి నెక్కిప్రదక్షిణ చేస్తారు .సంతాన హీనులు ,భూత ప్రేత పిశాచాదుల బారిన పడిన వారు నేత్ర ద్రుష్టి కోల్పోయిన వారు కోటేశ్వర స్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీస్టాన్ని నేర వేర్చుకొంటారు ..
కోటి ప్రభల కోటేశ్వరుడు
కొండ కింద ప్రసన్న కోటేశ్వరుడు నీల కంఠేశ్వరుడు మొదలైన ఆలయాలున్నాయి .అన్నదాన సత్రాలున్నాయి .శివరాత్రికి అన్నికులాల వారికి అన్నదానం జరుగుతుంది .శివ రాత్రి తిరునాళ్ళు పరమ వైభవం గా నిర్వహింప బడుతాయి .నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి .’’శివరాత్రి నాడు లింగోద్భవ సమయం లో కోటిన్నోక్క ప్రభలతో నా కొండకు వచ్చే భక్తుల కోసం నేను కొండ దిగి వచ్చి దర్శనం అనుగ్రహిస్తాను ‘’అని కోటేశ్వరుడు అభ్యమిచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు .శివుడికి ఇష్టమైన వెదురు గడలతో ప్రభలను నిర్మించి ,అనేక చిత్ర విచిత్ర పటాలను అలంకరించి విద్యుద్దీపాలతో వెలుగులు వెలయింప జేస్తూ కోటప్ప కొండకు తిరునాళ్ళకు వస్తారు .కాని ఇన్నేళ్ళుగా ప్రభలు కట్టినా కోటి న్నొక ప్రభ సంఖ్య కాలేదట ఎప్పటికప్పుడు ఒక ప్రభ తగ్గుతోందట .ఆ లేక పూర్తీ అయితే ప్రళయం వచ్చి స్వామి ఇందికి దిగివస్తాడని నమ్ముతున్నారు .‘’చేదుకో కోటేశ్వరా ,చేదుకొని మమ్మాదరించవయ్యా ‘’అని భక్తీ తో ఆర్తితో వేడుకొంటూ హరహర మహాదేవ స్మరణతో దిక్కులు పిక్కటిల్లిపోతాయి .ఎడ్ల పందాలు ,చిత్రమైన ఆటలు కోలాటాలు నృత్య గీతాలతో ,రంగుల రాట్నాలతో ప్రాంగణం అంతాశోభాయమానం గా కనిపిస్తుంది పశువులతో గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకొనే అశేష జన సమూహం ఉత్సాహాన్నిస్తుంది .శివరాత్రి వేడుకల తో బాటు కార్తీక ,మార్గ శిర మాఘ మాసాలలో భక్తులు సామూహిక బిల్వార్చన ,రుద్రాభిషేం ,రుద్రయాగం జరగటం ఇక్కడి విశేషం .
లింగ ప్రాధాన్యం
సంతానం అపేక్షించేవారు శుచిగా తడి బట్టలతో’’ సంతాన కోటేశ్వర లింగం ‘’కు ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు.లింగోద్భవ కాలం లో అర్ధ రాత్రి వరకు తడి బట్టలతోనే శివ పంచాక్షరి జపిస్తూ గడగడ లాడే చలిలో కూడా ఆలయం చుట్టూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేయటం వారి మహా భక్తికి విశ్వాసానికి నమ్మకానికి నిదర్శనం .కొత్త కోటేశ్వరాలయం పైన ఉన్న సెల యేరు దగ్గరున్న మార్కండేయ మహా ముని చేత ప్రతిష్టింపబడిన మార్కండేయ శివ లింగం ఉంది . కైలాసం నుండి సతీవియోగ వికల మనస్కుడై ఇక్కడికి వచ్చి దక్షిణా మూర్తి గా వెలసిన శివుని వెతుక్కొంటూ ఆయన వాహనమైన బసవన్న ఇకడికి వచ్చి ఘోర తపస్సు చేశాడు .ఆయన అమోఘ తపస్సుకు భంగం కాకుండా పరమేశ్వరుడు ఇక్కడ తాగు నీటికోసం ఒక వాగును ప్రవహింప జేశాడు .అదే ‘’ఎద్దడుగు వాగు ‘’అని పిలువ బడుతోంది .త్రికోటేశుని సన్నిధిలోని ‘’బసవ మందిరం ‘’భక్తులు శివరాత్రి మొదలైన పర్వ దినాలలో పూజలు ,వ్రతాలు ఆచరిస్తారు .ఇక్కడి అసలు దైవం బ్రహ్మ చారి అయిన దక్షిణా మూర్తి కనుక ధ్వజస్తంభ ప్రతిష్ట లేదు .కళ్యాణ వైభోగం లేదు అందుకే స్వామిని ‘’బాల కోటేశ్వరుడు ‘’అని ‘’సంతాన కోటేశ్వరుడు ‘’అని అంటారు .

కోటప్పకొండ
అడవి రామ లింగేశ్వరుడు ,కూకట్ల శంభుడు ,శంభు లింగమ్మ ,నాగమ్మ , వెంకటేశ్వరుడు అనే భక్తులు స్వామిని సేవించి పునీతులైనారు .200ఏళ్ళ నుండి ప్రభలతో మొక్కులు సమర్పించటం ఉన్నదని తెలుస్తోంది .పొట్లూరి గ్రామం నంది వాహనం పై శివుని అలమరించి శివరాత్రి జాగరణ నాడు ప్రభలతో ఆ గ్రామ ప్రజలు అన్ని మెట్లు యెక్కిస్వామిని దర్శించటం ఇప్పటికీ ఆన వాయితిగా వస్తోంది .ఇక్కడి ప్రభలు ‘’ఈశ్వరుని క్రాంతి ప్రభలకు ‘’నిదర్శనం .ఆహ్లాదానికి ,ఔన్నత్యానికి సమైక్యతకూ ప్రతీక .40అడుగుల నుండి 100అడుగుల ఎత్తు వరకు ప్రభలు వాటిపై విద్యుత్ కాంతులతో నిర్మించటం విశేషాలలో విశేషం ‘’.అమావాస్య నాడు పున్నమి’’ సందర్శనాన్ని తలపింప జేస్తుంది .
దక్షిణా మూర్తి దీక్ష
ధనుర్మాసం లో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణా మూర్తి దీక్షను స్వీకరిస్తారు .దీనికే ‘’కోటప్ప దీక్ష ‘’అని పేరు .నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామ స్మరణ శివ పంచాక్షరీ జపాల తో అభిషేకాలతో సంత్సంఘాలతో ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది ‘’దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం –త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం ‘’అని శివ స్మరణ చేస్తూ ఆలయం అపర కైలాసాన్ని స్పురణ కు తెస్తుంది .మేధా దక్షిణా మూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో ‘’మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన’’,నిరతాన్న దానాలు ,గోస్టులు , సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా .కోరిన కోర్కేలనుతీర్చేకోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ని దర్శించి తరిద్దాం .


.’’శివః కారయితాకర్తా-శివో భోజయితా భోక్తా శివః -ప్రీణాతు శంకరః ‘’

గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ ఒకటి. కోటప్పకొండలోని శివుణ్ణి త్రికూటేశ్వరస్వామి అని, దేవాలయాన్ని త్రికూటేశ్వరాలయం అని పిలుస్తారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో కోటప్పకొండను భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే వుంటారు. ఈ దేవాలయంలో 687 అడుగుల ఎత్తు వుండే శివుడి విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోటప్పకొండ ప్రాంతం మొత్తం శిఖరాల మయం. దేవాలయం దగ్గర నిలుచుంటే చుట్టూ రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు పెద్దపెద్ద శిఖరాలు కనిపిస్తాయి. కోటప్పకొండ కంటే ఎత్తున వుండే రుద్ర శిఖరం మీద ఒక చిన్న దేవాలయం కూడా వుంటుంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటయ్యే ఎత్తయిన ప్రభలు చాలా ప్రసిద్ధిని పొందాయి. కార్తీకమాసంలోనే ఈ దేవాలయంలో కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూ వుంటాయి. కొండమీద వున్న దేవాలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం వుంది. మెట్లు చాలా నిట్టనిలువుగా వుంటాయి. అందుకే కొండకు ఎక్కే భక్తులు ‘చేదుకో కోటయ్యా’ అని అంటూ ఎక్కుతూ వుంటారు. బస్సు మార్గం వున్నప్పటికీ చాలామంది భక్తులు నడిచే కొండమీదకి వెళ్తూ వుంటారు. ఈ కోటప్పకొండ క్షేత్రానికి వున్న మరో విశిష్టత ఏమిటంటే, ఈ క్షేత్రం వున్న కొండ మీద కాకులు అస్సలు కనిపించవు. మిగతా పక్షులన్నీ కనిపిస్తాయిగానీ, ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు. ఇదొక వింత. ఓ సందర్భంలో కాకి ఈ కొండమీదకి రాకుండా శాపం విధించారనే స్థల పురాణం ప్రచారంలో వుంది. 1761లో ఈ ప్రాంతాన్ని పాలించిన గుండారాయలు అనే రాజు కోటప్పకొండ మీదకి 703 మెట్లతో మెట్లమార్గాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మంత్రిగా వున్న సమయంలో కోటప్పకొండ మీదకు బస్సు మార్గాన్ని ఏర్పరచి అనేక సౌకర్యాలు కల్పించారు. భక్తులు ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ.

అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.


ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచమంతా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని వేదము మనకి చెపుతోంది. ఫలానాచోటనే బ్రహ్మము ఉంటాడని పరుగెత్తడం మొట్టమొదటి భక్తి స్థాయి. కాని అలా పరుగెత్తుతుంటే మీకు ఎప్పటికి బ్రహ్మదర్శనం అవుతుంది? నిజంగా బ్రహ్మదర్శనము చెయ్యాలని అనుకున్నవాడు, నీవు నిశ్శబ్దంగా కూర్చుండిపోయి ఏ అరమరిక లేకుండా ఎవరితో సంబంధం పెట్టుకోకుండా భగవత్ ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాలి. ” అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ” బయట వెతికితే దొరుకుతుందా? ఎవరు లోపలికి వెడుతున్నారో, అందరిలా బయట ప్రపంచముతో తాదాత్మ్యము చెందడంలేదో అటువంటి మహాపురుషుని స్థితిని హనుమ ఈ రోజు పొంది ఉన్నాడు. అటువంటి స్వామి దర్శనము చేసినంత మాత్రంచేత, అటువంటి సాధకుడిగురించిన మాట విన్నంత మాత్రం చేత మన పాపములుకూడా ఎగిరిపోతాయి. అందుకనే ” వ” బీజాక్షరమును అక్కడ ప్రయోగం చేశారు. అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.

1010229_728883020494432_6608997960394759296_n
ఈ వేళ హనుమ సీతామాత దర్శనం చెయ్యాలి అని సంకల్పించాడు. అందుకని తాను వెడతానన్నాడు. మిగిలినవాళ్ళు అనలేదు. కాబట్టి వాళ్ళు వెనుక ఉండిపోయారు. హనుమ ముందుకు కొనసాగగలిగాడు. తన సంకల్పంవలన ఆయన చరితార్ధుడయ్యాడు.

వీరభద్రాలయం, రాయచోటి.


రాయలేలిన రతనాల సీమే రాయచోటిగా నేడు వెలుగొందుతోంది. రాయల కాలంలో రాచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ది గాంచింది. పూర్వ కాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభ్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది. గతంలో రాచోటిగా పిలువబడే నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయమేనని పెద్దలు పేర్కొంటున్నారు. రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు. చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్దాలు చేసి ఆలసిపోయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశ ఘటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల, గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూల తోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని, దీంతో ఆయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది. వీరభద్రునికి రాచరాయుడు అనే పేరు కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చౌతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.

10154256_10152675479309340_6267527865614286810_n 10846455_10152675479549340_8437444526348368461_n

 

ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాదించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ పురాతన ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. వీరికి వీరభద్రుడు ఇలవేల్పు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తాదులు విచ్చేస్తుంటారు.

వీరభద్రుడిని హిందువులే కాక ముస్లింలు కూడా కులదైవంగా ఆరాధించే సాంప్రదాయం వుంది. స్వామివారి బ్రహోత్సవాలలో కులమతాలకు అతీతంగా సర్వమతస్తులు పాల్గొంటారు. ముస్లీంలలో దేశ్‌ముఖ్‌ తెగకు చెందిన వారు ఉత్సవాలకు స్వామివారికి సాంప్రదాయ బద్దంగా పూజాసామాగ్రిని పంపితే ఆలయకమిటీ వాటిని స్వీకరించి వారి పేరుతో పూజలు నిర్వహించిన తీర్థప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వుంది. ఈ సాంప్రదాయాలను పరమత సహసనానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. మాండవ్యనది పరీవాహక ప్రాంతంలో కొలువైన వీరభద్రాలయం భక్తుల కోర్కెలుతీర్చే వీరశైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. పది శతాబ్దాలపై బడిన చరిత్ర కలిగి ఈ వీరభద్రాలయ పేరు ప్రతిష్టలు దశదిశలు వ్యాపించాయి. ఆలయం మూడు గాలిగోపురాలతో అందమైన శిలాకళ సంపదతో విరాజిల్లుతూ చూపరులను ఆకట్టుకుంటోంది.

అర్చావిగ్రహమూర్తిగా ఆవిర్భవించిన వీరభద్రుడు

అలనాడు దక్షప్రజాపతి ఆత్మజ్ఞానహీనుడై శివద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు.యజ్ఞవిషయాన్ని తెలుసుకున్న శంకరుని భార్య అయిన సతీదేవి పుట్టింటిపై మమకారంతో , తన తండ్రి చేస్తున్న తప్పును తెలియజేయడానికి పతిదేవుడు పిలువని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పినా తన భర్త మాటమీరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. అది తెలిసిన మహోగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరిగి నేలకు విసిరితే అందుండి ప్రళయభీకరాకర వీరభద్రుడు ఉద్భవించి రుద్రగణ సహిత ుడైన యజ్ఞశాలపై విరుచుకు పడ్డాడు. ఆ నిరీశ్వర యాగానికి విచ్చేసిన దేవతలందరినీ దండించారు. దక్షుని పట్టుకొని తన ఖడ్గంతో శిరస్సు ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. అర్థాంతరంగా దక్షయజ్ఞం ఆగిపోయింది. వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించాడు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడవై వర్థిల్లుదువుగాక అని దీవించాడు. అప్పటి నుంచి వీరభద్రుడు వీరేశ్వరుడని పిలువబడ్డాడు. పూర్ణవిరాగి అయిన శివుడు ఒక వటవృక్షమూలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చుండి పోయాడు. ప్రజాపతులలో జ్యేష్టుడైన దక్షుడు ప్రాణాలు కోల్పోవడం , అర్థాంతరంగా యజ్ఞం ఆగిపోవడం లోకపద్రవాలకు దారి తీసింది. సృష్టి క్రమానికి ఆటంకం ఏర్పడింది. శివావరాధనికి గురైన దేవతలు దివ్వతేజోవిహునులై దేవలందరూ ఆలోచించి శివానుగ్రహం పొంది దక్షున్ని బ్రతికించి లోకకళ్యాణార్థం తిరిగి యాగం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. బ్రహ్మాదిదేవతలు విష్ణుమూర్తిని వెంట పెట్టుకొని కైలాసం వెళ్ళారు. అక్కడ దక్షణాభిముఖుడై వటవృక్ష మూలంలో చిన్ముద్ర ధరించి మౌనియై బ్రహ్మనిష్టలో ప్రకాశిస్తూ దక్షిణామూర్తియైన శివుడు దేవతలకు దర్శనమిచ్చాడు. ఏకాగ్రచిత్రులౖౖె దేవతలు భక్తితో దక్షిణామూర్తిని మనసారా ప్రార్థించారు. సర్వం గ్రహించిన గ ురుమూర్తి వారి తప్పును మున్నించాడు. దక్షుని అపరాధాన్ని బాలరాపరాధంగా భావించి క్షమించచాడు. ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అంశీభూతుడైన వీరభద్రున్ని పిలిచి ఇలా అన్ని పుత్రా వీరభద్రా కాలదోషం పట్టి ప్రజాపతులను దేవతలకు ఆత్మజ్ఞానంతో వారు చేసిన పని వ ల్ల సతీదేవి ప్రాణత్యాగం వారి పాలిట స్త్రీహత్యాపాతకమైన చుట్టుకుంది. కారణావతారుడవైన నువ్వే వీరందరికీ జ్ఞానబిక్ష పెట్టగల సమర్థుడవు మూర్ఖుడైన దక్షునికి ప్రాణబిక్షపెడుతున్నాను. ఆయన తిరుగు ప్రయాణంలో రామేశ్వరానికి, శ్రీశైలానికి నడుమనున్న ఈ మాండవ్యనదీ తీరమందు వీరేశలింగము నిలిచి ప్రకాశించింది. అప్పటికే ఇచ్చోట మండవీమాత(యల్లమ్మ) ఆలయం నెలకొని వుండేది. వీరేశలింగం వెలయడంతో ఈ క్షేత్రం శివశక్తి పీఠమై తేజరిల్లింది. సర్వదేవతలంకు ఇచ్చట మనస్సు శాంతించింది. అంతా శివసంకల్పం అని భావించి వీరేశ్వరుడు తదేక భక్తితో పరమశివున్ని ధ్యానించాడు. తక్షణం పొడవాటి మీసములు, వాడియైన కోరలు, సహస్రభుజ, సహస్రాయుధాలతో విరాజితుడైన వీరభద్రుని ఉగ్రరూపం మటుమాయమైంది. మౌని చిన్ముద్రధారి , సర్వలోక గురుస్వరూపియైన శ్రీదక్షిణామూర్తి వీరేశ్వరనలో మూర్తీభవించాడు. సతీజగన్మాత ఆత్మ శాంతించింది. దక్షాధి అమరులకు పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రోపదేశ మయ్యింది. దక్షాధి దేవతలందరికీ తిరిగి దివ్వతేజస్సు ప్రకాశించింది. తమ జ్ఞానబిక్ష పెట్టిన ఈ పుణ్యక్షేత్రములో అమరగురు వీరేశ్వరుడునే పేరిట వెలసి నిత్యం దేవతల సేవలు అందుకోవలసినదిగా దక్షాధిదేవతలు వీరభద్రుని ప్రార్థించారు. అలనాడు దక్షాధి దేవతల ప్రార్థన మన్నించి గురుపాదపూజ నిమిత్తం ప్రతియోటా ఉత్తరాయణం మీనమాసం సూర్యోదయం ఉదయం 6 గంటలకు మీన ల గ్నమందు 5 రోజులు కేవలం అరగడియ కాలం సాత్విక దేవతలకు , మరియు దక్షీణయానం కన్యామాస కన్యాలగ్నమందు 5 రోజులు కేవలం అరఘడియకాలం ఉగ్రదేవతలకు సూర్యమండలం నుండి సూర్యరశ్మి మార్గాన గర్భాలయంలోకి ప్రవేశించి పాదార్చన చేసుకొమ్మని వీరేశ్వరుడు వరమిచ్చాడట. ఇప్పటికీ మనము ఈ విచిత్రం ప్రత్యక్షంగా చూడవచ్చును. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర , తమిళనాడు రష్ట్రాల నుండి అశేష భక్త జనులు ఈ వీరేశ్వర క్షేత్రాన్ని నిత్యం దర్శిస్తూ వుంటారు.

ఆధ్యాత్మికం…ఆరోగ్యం-స్వామియే శరణం అయ్యప్ప


స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ… ఆంధ్రదేశం మారుమ్రోగుతోంది. ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ… కార్తీక మాసారంభంలో జోరందుకున్నాయి. ‘శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం’ అంటూ భక్తులు అచంచల భక్తితో… అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్ష నిదర్శనం…

Lord Ayyappa- 8-1024 x 768

-అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుం డా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే మన రాష్ర్టంలోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.

ఏటేటా అయ్యప్ప దీక్ష తీసు కునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రా రంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతాయి. అయ్యప్ప దీక్షా పరులు నలు పు/కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్విహస్తూ తరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వా ములు ప్రతి ఒక్కరిని దేవుడి ప్రతి రూపంగా భావిస్తూ ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని జపిస్తుంటారు. దీక్ష వల్ల మనఃశ్శాం తి, క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతా యంటారు గురుస్వాములు.

-Manikantha.
దీక్ష నియమాలు…
అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే స్వాములు ముందుగా 108 తులసి లేదా రుద్రాక్షలతో అయ్యప్ప స్వామి ప్రతిమను కలిగిన మాలను అల్లించుకోవాలి. నల్ల బట్టలు, మాల తీసుకుని సమీపంలోని అయ్యప్ప దేవాలయాల్లో గురు స్వామితో కానీ ఆలయ అర్చకులతో కానీ మాలధారణ చేయించుకోవాలి. మాల మెడలో పడిన క్షణం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. నల్ల బట్టలు, నుదుట గంధం బొట్టు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ప్రతివారి ని అయ్యప్ప స్వామి ప్రతి రూపంగా భావించి ‘స్వామి’ అని సంబోధించాలి.

ప్రతి రోజు సూ ర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉద యం, సాయంత్రం వేళల్లో స్వామి వారికి పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రి పూట అల్పాహారం లేదా పాలు, పళ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక నేల మీద నిద్రించాలి. దీక్షా కాలంలో క్షుర కర్మలు చేయడంగాని, వేలి గోర్లను తీయడంగాని చేయకూడదు. ఆడవారిని తోబుట్టువులుగా, తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ దైవరాధన చేస్తూ ప్రశాంత జీవనం గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. శబరియాత్ర పూర్తి చేసి ఇంటికి చేరిన తర్వాత తల్లితో కానీ, భార్యతో కానీ లేదా దేవాలయ అర్చకుల చేత మాల విరమణ చేయించుకోవాలి.

పడి పూజ…
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తమ దీక్షా కాలంలో మెట్ల పూజ (పడిపూజ) నిర్వ హించి కనీసం ఐదుగురు స్వాములకు భిక్ష (భోజనం) లేదా అల్పాహారం పెట్టడం ఆనవా యితీ. పడిపూజ నిర్వహించాలనుకున్న వారు అరటి బోదెలతో మండపం నిర్మిస్తారు. అందు లో అయ్యప్ప స్వామి చిత్ర పటాన్ని ఏర్పాటు చేస్తారు. శబరిమల దేవాలయం వద్ద ఉన్నట్లు గా 18 మెట్లను తయారు చేసి, ఒక్కో మెట్టు ను ఒక్కో దేవుడి ప్రతి రూపంగా భావించి మె ట్ల పూజ నిర్విహస్తారు. మెట్ల పూజలో భాగం గా అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకా లు నిర్వహిస్తారు. పడిపూజలో స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

దీక్షతో ఆరోగ్యం…
-అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.

-Ayyappa swami.
వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట ్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవ డం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మ ట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాల కు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒం టి పూట భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి.

అయ్యప్పకు కన్నెస్వామి అంటే ప్రీతి
అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసు లో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసు కోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూ డవ సారి గంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వా ములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్య క్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరి మలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.

యాత్ర అంత కష్టమా ?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్న కు చాలామందికి తెలిసిన జవాబు అది అ త్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరి గా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరి మల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది.

-నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవం పై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాం టి భయాలేవీ ఉండవు. పిల్లలు, వృద్ధ స్ర్తీలు, వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాల కు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడ కన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలై న కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆ ధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించు కుంటూ వెళుతుంది.

దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీ దే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలు దేరుతా రు. నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మే రకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్న ది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండా నే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయ పడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.

పదునెట్టాంబడి విశిష్టత…
-శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని పదునెట్టాం బడి (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తు లు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవ తలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. 18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.

Steps.
1వ మెట్టు అణిమ
2వ మెట్టు లఘిమ
3వ మెట్టు మహిమ
4వ మెట్టు ఈశత్వ
5వ మెట్టు వశత్వ
6వ మెట్టు ప్రాకామ్య
7వ మెట్టు బుద్ధి
8వ మెట్టు ఇచ్ఛ
9వ మెట్టు ప్రాప్తి
10వ మెట్టు సర్వకామ
11వ మెట్టు సర్వ సంవత్కర
12వ మెట్టు సర్వ ప్రియాకార
13వ మెట్టు సర్వ మంగళాకార
14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన
15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ
16వ మెట్టు సత్యవిఘ్న నివారణ
17వ మెట్టు సర్వాంగ సుందర
18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక

37 ఏళ్లుగా నిరాటకంగా మాలధారణ
-రామగుండం ఎన్టీపీసీలో కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు పని చేస్తుండేవారు. అయ్యప్ప దీక్ష తీసుకుని వారు చేసే పూజా కార్య క్రమాలు, భజనలను చూసి నేను ఆకర్షితుడనయ్యాను. మళయా ళీల ప్రోత్సాహంతో అయ్యప్ప దీక్షను మొట్టమొదటిసారిగా 1974 లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా 37 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి సేవలో తరిస్తున్నాను. అయ్యప్ప దీక్షలో ఉన్న మధురానుభూతి మరే దీక్షలో ఉండదనేది నా అభిప్రాయం. మన కోసం… మన కుటుంబం కోసం తీసుకునేదే అయ్యప్ప దీక్ష. దీక్షలో మనసా… వాచా… కర్మణా స్వామిని ధ్యానిస్తూ దీక్షను పరిపూర్ణం గావించాలి. దేహాన్ని కొబ్బరికాయగా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియ ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత.—- చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, గురుస్వామి

అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు
-అయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో కూడు కున్నది. ఎంత నియ మ నిష్ఠలతో ఉంటే అంత సులువుగా శబరియాత్ర చేయ వచ్చు. అయ్యప్ప దీక్షలో కుల మత భేదం, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ని భగ వంతుడి స్వరూపంగా భావించాలి. 20 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉండే అయ్యప్ప దీక్షాపరులు నేడు వేల సంఖ్యకు చేరుకున్నా రు. ప్రతి యేటా అయ్యప్ప దీక్ష లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉం ది. మిగతా ప్రాంతాల్లో కంటే మన రాష్ట్రం లోనే అయ్య ప్ప దీక్షను నియమ నిష్ఠలతో చేపడతారు.—- దీటి సతీష్‌, గురుస్వామ

దీక్ష ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది
-అయ్యప్ప దీక్ష ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది అయ్య ప్ప దీక్ష తీసుకుని వ్యసనాలకు దూరమయ్యారు. తమ జీవితంలో వచ్చిన మార్పుతో ప్రతి యేటా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షాపరులు దేవాలయంలో చేసిన పూజలు, భజనలకు ఆకర్షితుడనై స్వామి దీక్ష తీసుకున్న నేను నిరాటంకంగా 16 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. నా కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని స్వామి సన్నిధానానికి తీసుకెళ్లాను. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా స్వామి సన్నిధానాన్ని దర్శించుకుంటే అంతకు మించిన మహాభాగ్యం లేదు.—- అడువాల శ్రీనివాస్‌,గురుస్వామి

దీక్షతోనే నా జీవితం మలుపు తిరిగింది.
-sఅయ్యప్ప దీక్షతోనే నా జీవితం మలుపు తిరి గింది. 13 ఏళ్ల క్రితం నా కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉండేది. అయ్యప్ప దీక్ష తీసుకు న్న నేను ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరి గి చూడలేదు. స్వామి దయ వల్ల ఆర్థిక స మస్యలన్నీ తీరిపోయాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెళ్లిన నేను అక్కడ దీక్ష తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ దీక్షా సమయంలో ఎలా ఉండేవాడినో అక్క డ కూడా ప్రతి సంవత్సరం మాల, నల్లబట్ట లు ధరించకుండానే నియమనిష్ఠలతో అ య్యప్ప స్వామిని ధ్యానించేవాడిని. స్వామి దయ వల్ల ఆర్థికంగా ఎదిగిన నేను స్వామి వారి ఆలయ అభివృద్ధి ఇతోధికంగా సా యం చేస్తున్నాను. మున్ముందు కూడా సా యం చేస్తాను. దీక్ష తీసుకోవడం వల్ల నా జీ వితంలో వచ్చిన మార్పును ప్రతి ఒక్కరికి చెబుతూ దీక్ష తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నాను.—- రాపర్తి రమేశ్‌, గురుస్వామి

ఇరుముడి…
-అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి. ఇరుముడి రెండు భాగా లను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరిం చేందుకు వీలుగా ఉంటుంది. ఇరుముడిలో ఒ భాగంలో పూజా ద్రవ్యాలు, మరో భాగం లో ఆహార ధాన్యాలు, ఆవు నెయ్యితో నింపిన కొబ్బరి కాయను ఉంచుతారు. శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదు నెట్టాంబడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారినే అనుమతిస్తారు. దేవాలయానికి చేరు కున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరి కాయ లో నింపిన నెయ్యితో మూల విరాట్టుకు అభిషే కం జరిపిస్తారు. కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమ గుండంలో వేస్తారు. ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకుని తింటారు. దేహాన్ని కొబ్బరికాయ గా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది.

శబరిమలై యాత్రలో దర్శనీయ స్థలాలు…
-అయ్యప్ప భక్తులు వీలును బట్టి అచ్చన్‌ కోవిల్‌, అరయంగావు, కుళుత్తుపులలో ఉండే అయ్యప్ప దేవస్థానాన్ని దర్శించి పందళ రాజ నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుతారు.

ఎరుమేలి…
శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఇది. దీ నినే ‘కొట్టైప్పడి’ అని కూడా పిలుస్తారు. మణి కంఠునిచే సంహరింపబడ్డ మహిషి… తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసి రివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి ‘ఎరు మ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ‘ఎరుమేలి’గా మారింది.

ఎరుమేలి చేరిన భక్తులు వయోభేదాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా తమ శరీరాలను ఆకులు, కూరగాయలు, పళ్లు, రంగు రంగుల కుంకుమలు, బుడగలతో అలంకరించుకుంటారు. చెక్కతో చేయబడిన చాకు, బాకు, బాణం, గద మొదలైన ఆయుధాలను ధరించి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా ‘స్వామి దింతకతోమ్‌… అయ్య ప్ప దింతకతోమ్‌’ అంటూ నాట్యం చేస్తారు. ఈ నాట్యాన్ని ‘పేటైతులాలు’ నాట్యం అంటా రు. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకి ఎక్కి ఈ నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగా భక్తులు ఈ న్యాటాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. నాట్యం చేసుకుంటూ స్వామి వారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

వావరు స్వామి ముస్లిం భక్తుడైనా అయ్యప్ప స్వాములు తమ యాత్రలో కుల, మత భేదాన్ని పాటించరు. వావరు స్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప (పేటశాస్తా) ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నాన ఘట్టాల్లో స్నాన మాచరిస్తారు. పెరియా పాదం (పెద్ద పాదం) నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడి నుంచే తల పై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకు తూ పెరియా పాదయాత్రను ప్రారంభిస్తారు. చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు.

పెరూర్‌తోడు…
ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పెరూర్‌ తోడు’ చేరతారు. ఇక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీర మణికంఠుడు పులి పాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు భక్తులు నమ్ముతారు. పెరూర్‌ తోడు నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదే శాన్ని ‘పూంగా’ వనమని అంటారు. పూంగా వనమంటే పూలతోట అని అర్థం.

కాళైకట్టి…

Walk way .
భక్తులు పెరూర్‌తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి ‘కాళైకట్టి’ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు.

ఆళుదా నది…
కాళైకట్టి దాటి 5 కిలో మీటర్లు నడిచి ఆళుదా నది చేరుతారు. ఇది పంపానదికి సమానమైన పుణ్య నది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగిం చే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలి గించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు.

ఆళుదామేడు…
-ఆళుదానది నుంచి ప్రారంభమైన కొండను ఆళుదామేడు అంటారు. ఇది చాలా ఎతె్తైన ఏట
వాలు కొండ. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు ప లుకుతూ, ఆ స్వామి అండతో ఈ కొండను ఎ క్కుతారు. ఆళుదామేడు శిఖరం సముద్ర మ ట్టం నుంచి 4 వేల అడుగుల ఎత్తులో ఉండ టం చేత వాతావరణం చల్లగా ఉంటుంది.

కరిమలై…
కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొం డ ఎక్కడం ప్రారంభిస్తారు. కరిమల ఎక్కడం కష్టం.. కష్టం అని మనం అయ్యప్ప భక్తి గీతా లలో వింటూ వుంటాం. దానిని బట్టి కరిమల ఎక్కడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఊహిం చవచ్చు. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే కరి (ఏను గుల) కొండ అని అర్థం. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా సూర్య కిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం.

ఇక్కడ శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉం టాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొ దలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమ లై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్ని తీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకర టింకరలతో కూడిన కాలిబా టలో ఏడు భాగాలుగా పైకి ఎక్కాలి. కరిమలై లో కరిమల నాథస్వామి, కరిమలై అమ్మన్‌ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణా లు పలుకకున్నా ఈ అమ్మవారు భక్తులను దం డిస్తుందంటారు.

సిరియాన వట్టమ్‌.. పెరియాన వట్టమ్‌..
భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన వట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) పెరియాన వట్ట మ్‌ (పెద్ద ఏనుగుల పాదం) ద్వారా తమ యా త్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగు లు తిరుగుతూ వుంటాయి కనుక ఈ ప్రదేశాని కి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కి.మీ. పయనిస్తే పంబానదికి చేరుకుంటారు.

పంబానది…
పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నాన ఘట్టం. పంబానదికి ఎడమ పక్క వాలి చేత తరుమబడ్డ సుగ్రీవుడు తన అ నుచరులతో తల దాచుకున్న పురాణ ప్రసిద్ధ మైన ముకాచలం ఉంది. రామభక్తుడైన హను మంతుడు పుట్టినది, భక్త శబరి రామ దర్శనా నికి వేచి ఉన్నది ఇక్కడే. సీతాన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు మొదటి సారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎ త్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వర కు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే.

మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడ నే. అందుచేతనే గంగానదితో సమానంగా పం బా నదిని భావిస్తూ తమ పితృ దేవతలకు అక్క డ తర్పణాలు విడిచి పెడతారు. చాలామంది భక్తులు పంబానదిలో దీపాలను వెలిగించి దీపోత్సవం చేస్తారు. పంబానదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన అనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమ ను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరి కీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనుక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే ‘పంబాసద్దె’ అని అంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యిలలోని బూడిదను సేకరించి దానికి వస్తక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు.

గణపతి సన్నిధానం…

-పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపైనెత్తుకుని పంబానది తీ రం నుంచి మెట్ట మీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. అక్కడ మెట్లు ఎక్కే భక్తులను ఆ జ న ప్రవాహాన్ని చూస్తుంటే హృదయం పులకి స్తుంది. కడలి తరంగాల వలే కదిలేటి జనులు అనే అయ్యప్ప భక్తి గీతం జ్ఞప్తికి వస్తుంది. గణ పతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికా య కొట్టి గణపతిని, శ్రీరాముడు, హను మంతుడు, దేవీ ఆలయాలను దర్శిస్తారు.-Bath in river
శబరి పీఠం…
-అప్పాచ్చిమేడు దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనబడుతుంది. ఇది శ్రీరాముడు శబరిని కలి సిన చోటు. శ్రీ రాముడిని సమగుణుడుగా ప్రీ తించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు. ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన అమెకు శ్రీ ధర్మశాస్తా మోక్షాన్ని కలుగజేశాడు. శబరి జ్ఞాపకార్థం ఇప్పుడొక రాయి మాత్రమే ఇక్కడ ఉంది. శబరిని తలచుకుని భక్తులిక్కడ కొబ్బరికాయ కొడతారు. శరణాలు చెబుతారు.

శరంగుత్తి…
శబరిపీఠం నుండి కొంచెం ముందుకు వెళితే శరంగుత్తి చేరవచ్చు. శ్రీ అయ్యప్ప స్వామి, ఆ యన పరివారం ఇక్కడ గల శరంగ చెట్టు (మ ర్రిచెట్టు)కు తమ ధనుర్భాణాలను గుచ్చినట్లు పురాణగాథ. కన్నె స్వాములు తాము ఎరుమేలి లో కొన్న బాణాలను ఇక్కడ గుచ్చుతారు. అ ప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు.

పదునెట్టాంబడి…
పరిసరాలను చూస్తూ వరుసలో నిల్చున్న భ క్తులు మొదట దేవస్థానం వారు కట్టించిన విరి క్యూలైన్లలో నడిచిన తర్వాత పదునెట్టాంబడి చేరతారు. మెట్ట మార్గంలో కింద నున్న వెలి యకడుత్త స్వామి, కరూపమ్మ కరూత్త స్వాము లకు నమస్కరించి పక్కగానున్న గోడకు కొబ్బ రి కాయ కొట్టి శరణాలు పలుకుతూ మెట్టకు మొక్కుతూ ఆనందోత్సాహలతో పదునెట్టాంబ డి ఎక్కుతారు. భక్తులు ఈ పదునెట్టాంబడిని దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు.

ధ్వజ స్తంభం…
-పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తం భం కనబడుతుంది. ఇది పూర్తిగా బంగారు రే కులతో అతికించబడి ఉంది. ధ్వజ స్తంభం చి వరన బాణం గుర్తు ఉంటుంది. మణికంఠుడు పందళరాజుకు యోగ దృష్టితో ఆలయ నిర్మా ణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భ క్తులు నమ్ముతారు. సూర్య కిరణాలు ఈ ధ్వజ స్తంభంపై పడి స్వర్ణ కాంతులు విరజిమ్ముతాయి.

సన్నిధానం…(శబరిమలై)

ధ్వజ స్తంభం దాటిన తర్వాత స్వామి దర్శనా నికి కాంక్రీటు డాబాపై చుట్టూ క్యూ లో ఒక ప్రదక్షిణ చేయాలి. అప్పుడు స్వామి సన్నిధానంలో నిలిచే అదృ ష్టం కలుగుతుంది. పున్నమి నాటి చం ద్రుని ముఖారవిందంతో, యోగాసన ధారియై తపస్సు చేస్తున్న భంగి మలో ఉన్న శ్రీ ధర్మశాస్తా దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం వర్ణణాతీతం.

శబరిమలైలో ముఖ్య సేవలు…
స్వామి సన్నిధానంలో నవంబర్‌ 16 లేక 17 తేదీలలో ప్రారంభమై 41 రోజులు డి సెంబర్‌ 26 లేక 27 తేదీల వరకు మండల ఉత్సవం జరుగుతుంది. దీనికి మొదలు పదు నెట్టాంబడికి పూజలు చేస్తారు. పడి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మకర సంక్ర మణ ఉత్సవం జనవరి 1 నుంచి 20 వరకు జరు గుతుంది. ఆగస్టు – సెప్టెంబర్‌ మాసంలో వచ్చే ఓనమ్‌ ఉత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహి స్తారు. ఏప్రిల్‌లో విషు పూజ జరుపుతారు.

స్వామి వారి తిరువాభరణాలు…

మకర జ్యోతి కనిపించే ముందు స్వామి వారి కి తిరువాభరణాలు అలంకరించడం సంప్రదా యంగా వస్తోంది. మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం, బంగారు కడియాలు, స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైఢూర్యా లు ఉంటాయి. పందళ రాజవంశం వారి ఆధీ నంలోనే ఈ అమూల్యమైన అభరణాలు ఉం టాయి. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందుగా పందళ రాజ వంశీయులు దేవ స్థానం బోర్డు అధికారులకు తిరువాభరణాలు అప్పగిస్తారు. ఈ అభరణాలు మొదట శబరి మలైకి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంద ళలోని వెలియ కోయికెల్‌ ధర్మశాస్తా ఆలయం లో ఉంచి పూజలు చేస్తారు.

మకర విళక్కు ఉత్సవం…
-మకర జ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విళక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉ త్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు. మణి మండపంలో పులి స్వారీ చేస్తు న్న శ్రీ స్వామి అయ్యప్ప తైల వర్ణ చిత్రాన్ని ఉంచుతారు. ఇక్కడ నుంచి మాళిగ పురత్తమ్మ ను ఏనుగుపై కూర్చోబెట్టి పదునెట్టాంబడి వర కు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగిం పు పొడవునా దీపాల బారు, తాళ వాద్యాల హోరు చూసే వారికి చూడ ముచ్చటగా ఉం టుంది. పురాతన కాలం నుంచి సంప్రదాయ బద్దంగా వస్తున్న మకరవిళక్కు ఉత్సవాన్ని చూసిన తర్వాతే సన్నిధానాన్ని భక్తులు వదలాలనే నియమం ఉంది.

శబరి యాత్ర – ముఖ్యమైన రోజులు…
సాధారణంగా శబరి యాత్రికులు 3 ముఖ్య రోజులలో శ్రీ అయ్యప్ప స్వామిని దర్శింకునేం దుకు ఇష్టపడతారు.
విషుపూజ:ఇది శ్రీ స్వామి వారి పుట్టిన రోజు. ఇది మళయాళ సంవత్సరాది రోజున, సాధార ణంగా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. విషు పూజకు స్థానికులైన మళయాళీలే ఎక్కువగా వెళ్తారు.

మండల పూజ: ఇది శబరిమలై యాత్రలో ము ఖ్యమైనది. ఈ యాత్ర చేసేవారు కార్తీక మా సం, మొదటి రోజున మాలధారణ చేస్తారు. 41 రోజులు మండల దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించి మార్గశిర మాసం 15 రోజు నాటికి శబరిగిరిని చేరతారు. అప్పటికి శబరిమలైలో దేవస్థానం వారు పదునెట్టాంబడి పూజ చేసి భక్తులు 18 మెట్లను సిద్ధం చేసి ఉంచుతారు. మండల పూజకు సాధారణంగా నవంబర్‌ 16 లేక 17 తేదీల్లో దేవస్థానం తెరిచి 41 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుతారు.

మకర జ్యోతి…
మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది అయ్య ప్ప భక్తులు తమ ఇష్టదైవాన్ని, జ్యోతి స్వరూపు నిగా కనులారగాంచి, పులకించి, పరవశించే రోజు. ఆ రోజు సాయంకాలం పందళ రాజ వం శీయులు తెచ్చిన తిరువాభరణాలను స్వామి వారికి అలంకరించి దీపారాధన చేసిన వెంటనే భక్తులు సన్నిధానం ముందు ఉన్న కాంతి మలై (పొన్నంబల మేడు) వైపుకు చూస్తుంటారు. సాయంకాలం సుమారు 6.45 గంటలకు భక్తుల కు 3 సార్లు జ్యోతి దర్శనం కలుగుతుంది.

రాజసూయ యాగ మహాత్మ్యం


శ్రీకృష్ణుడి కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభ ముహూర్తాన పాండవులు అందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభలకంటే, బ్రహ్మ సభకంటే మయనిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో పాండురాజాదులు యమసభలో ఉన్నారనీ, హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉన్నాడనీ నారదుడు ప్రస్తావించాడు.

పరమ ధర్మాత్ముడైన పాండురాజు యమ సభలో ఉండడానికీ, హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉండడానికీ కారణమేమిటని ధర్మరాజు నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పసాగాడు.

1476023_797791460268522_3922918542297572230_n

త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు పేరుకెక్కిన సత్యసంధుడు. యజ్ఞంలో, ధైర్యంలో, శాస్త్రంలో, ధర్మంలో, ఎంతో ఆసక్తి కలవాడు. అయోధ్యా నగరానికి ప్రభువు. సూర్యవంశం మొత్తానికి అలంకారమైనవాడు.

విద్యా పరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అన్ని లోకాలకూ వ్యాపించిన కీర్తి కలవాడు. సూర్య వంశాన్ని ప్రకాశింపజేసే హరిశ్చంద్ర మహారాజు, జయించాలన్న స్వభావంతో, సప్త ద్వీపాలను తన బాహుబలంతో జయించాడు. శత్రువులెవరూ మిగలకుండా నేలమీది రాజులంతా తన ఆజ్ఞమీరకుండా చేశాడు. శాశ్వత వైభవంతో తన సామ్రాజ్యమంతా ప్రకాశించేటట్లు, రాజసూయ మహాయాగం చేశాడు. యాజ్ఞికులందరికీ ఇవ్వదగిన దక్షిణల కంటే ఐదింతలిచ్చి పూజించాడు. బ్రాహ్మణోత్తముల కోర్కెలన్నీ భక్తితో తీర్చాడు.

హరిశ్చంద్రుడు కావించిన గొప్ప ధన దానాలతో లెస్సగా తృప్తి పొందిన బ్రాహ్మణులు మిక్కిలి సంతోషంతో, “రాజులందరిలో నీవు లోకాతీత తేజస్సుతో, ధర్మంతో, ప్రకాశించు” అని ఆశీర్వదించారు. హరిశ్చంద్రుడు బ్రాహ్మణాశీర్వచనం వల్ల అందరు రాజులకంటే అధికుడై, రాజసూయ మహాయజ్ఞం చేయడం వల్ల దేవేంద్రలోకాన్ని పొందాడు. హరిశ్చంద్రునికి ఆ మహిమాతిశయం అంతా రాజసూయ మహాయాగ కారణంగానే వచ్చిందని గ్రహించి యమసభలో రాజులందరితో ఉన్న మీ తండ్రి యైన పాండురాజు ఇలా అన్నాడు.

రాజసూయ యాగం చేసిన రాజులంతా హరిశ్చంద్రునిలా తమ కోర్కెలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు. కాబట్టి మునీంద్రా! మీరు మానవ లోకానికి వెళ్ళి నేను యమసభలో ఉన్న విషయాన్ని, రాజసూయ మహాయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉన్న విషయాన్ని, కీర్తిసంపంనుడైన ణా కుమారుడు ధర్మరాజుకు చెప్పండి ఆ యాగం చేయడానికి ఉచితరీతిని అతణ్ణి ఆజ్ఞాపించండి. ఆవిధంగా ధర్మరాజు రాజసూయం చేస్తే నాకు పితృ పితామహ సమూహంతో ఇంద్రలోక సుఖప్రాప్తి కలుగుతుంది’ అని పాండురాజు చెప్పిన మాట విని నీకు తెలియజేయ్యాలన్న కుతూహలంతో ఇక్కడికి వచ్చాను. మహా సంపన్నుడవైన ధర్మరాజా! న్యాయమార్గంలో రాజసూయం చేసి నీ పితృదేవతా సమూహం దేవతాసమూహంచే శీఘ్రమే పూజలందుకొనేటట్లు చెయ్యి” అన్న నారదుని వచనములు విన్న ధర్మరాజు రాజసూయం చేయటానికి పూనుకున్నాడు.

విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది


ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.
ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.
శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ… ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.

రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.
దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.

అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు