ఆంజనేయుడి జన్మస్థలం అంజనేరి.


భారత దేశంలో అంజనేయ స్వామి జన్మించిన ప్రదేశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి.
వాటిల్లో ఒకటి అయిన నాసిక్ మహారాష్ట్రాలోని అంజనేరి.

జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్ వెడుతుంటే ఈ కొండ వస్తుంది.
అక్కడి ప్రాంత ప్రజలు అంజనేయ స్వామి ఇక్కడే జన్మించినట్లు ప్రగాడంగా విశ్వ సిస్తారు.
ఈ కొండ పైకి వెళ్ళాక ఆలయంలో అంజనా దేవి ఒడిలో పసిపాప లా అంజనేయ స్వామి వున్నట్లుగా విగ్రహం వుంటుంది.

మహారాష్ట్ర లోని నాసిక్ పట్టణం యాత్రస్థలాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది. పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం త్రయంబకేశ్వర్ నాసిక్ దగ్గరలోనే వుంది. ఇక్కడ ఎన్నో చూడ దగిన ప్రదేశాల్లో నాసిక్ త్రయంబకేశ్వర్ మధ్య అంజనేరి అనే స్థలం ఎంతో కూడా పవిత్రమైనది.

అంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం “అంజనేరి: అని మన పురాణాలు చెబుతున్నాయి. పవనుడు అంజనీ దేవిల పుత్రుడే మన హనుమంతుడు. తల్లి పేరుమీద అంజనేరి అనే పేరు వచ్చిందంటారు. ఆంజనేయుడు చిన్నతనమంతా ఇక్కడే గడిపాడట. చుట్టూ అందమైన ప్రదేశం, కొండలు గోదావరి పుట్టిన ప్రదేశం ఇవన్నీ ఈ ప్రాంతానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి.

ఇక్కడి పడమటి కనుమల్లో (western Ghats) సముద్ర మట్టానికి 4264 అడుగుల ఎత్తులో వున్న కొండమీద అంజనేరి ఫోర్ట్ కోట వుంది. మూడు కొండలు ఎక్కి దిగి వెళ్తే అంజనేయుడు జన్మించిన ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశంలో ఒక చిన్న ఆలయం, అందులో అంజనాదేవి ఒడిలో బాల అంజనేయ స్వామి ఉన్నట్లుగా ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఎక్కువగా అంజనేయ స్వామీ భక్తులు ఈ ప్రదేశం చేరుకునే వారు. హనుమాన్ చాలీసా చదువుతూ ఎక్కుతారు. కాని చాలా కొద్ది మంది మాత్రమే ఈ కొండపైకి చేరుకోగలరు.

పార్వతి దేవి సృష్టించిన అమృత తీర్ధం — మహా శైవక్షేత్రం చిక్కమగళూరు


పార్వతి దేవి సృష్టించిన అమృత తీర్ధం – అనేక అసాధ్య రోగాలకు సంజీవిని వంటిది

ఆకట్టుకునే మహా శైవక్షేత్రం చిక్కమగళూరు, ప్రకృతి అందాలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలోని ఆలయాలెన్నో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అక్కడి నీటిని సేవిస్తేచాలు.. అనేక రుగ్మతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగా ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకునేందుకు నిత్యం వందలాది మంది ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకూ అది ఏమిటో? ఎక్కడుందో తెలుసా? చిక్కమగళూరు జిల్లాలోని కొప్ప పట్టణానికి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అడవుల నడుమ కమండల గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయం వెయ్యేళ్లనాటిదని చెబుతారు. శని వక్రదృష్టి కారణంగా తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్న పార్వతీ దేవి ఇక్కడికి వచ్చి వినాయాకుడిని ప్రార్థిస్తుందట. ఆలయానికి సమీపంలో ఆమె తపస్సు చేసినట్లుగా చెప్పే ప్రదేశం ఉంది. భక్తులకు మేలుచేసేందుకు తీర్థాన్ని సృష్టించిందని స్థల పురాణం చెబుతుంది.

కొండల్లో నుంచి భూగర్భంలో చేరుకుని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయంటారు. ఇక్కడి నుంచే బ్రహ్మ నది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది. పుణ్యక్షేత్రాలైన కళస, హొరనాడు ప్రాంతాల్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు కమండల గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్తుంటారు.

ఓం శ్రీ మాత్రే నమః
ఓం గం గణపతయే నమః