(అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ) శివగంగ- కర్ణాటక


శ్రీ గంగాధరేశ్వర స్వామీ ఆలయం, కర్ణాటక రాష్ట్రం, తుముకూరు

అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకంశివాలయంలో '1600' సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం...

“నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారుతుంది…శివానుగ్రహం… తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం…

కర్ణాటక రాష్ట్రం తుముకూరు
గంగాధరేశ్వర స్వామి ఆలయం లో జరిగే మర్మమైన ఈ విషయం అంతుపట్టని శివవైభవం.

శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.

వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.

ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే.

ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు,
శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది.

పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా “గంగా” అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.

శివయ్య కొలువైఉన్న పర్వతం
శివలింగాకృతిని పోలి ఉంటుంది.

పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలిపిస్తుంది

పర్వతం పై కొలువైఉన్న దేవాలయాలు, ప్రమధగణాలు సాక్షాత్ కైలాస శిఖరం పై ఉన్న భావనకు వేదికలవుతాయి.

పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని,సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.

అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం

ఇలా అనేక విశిష్ఠతల సమాహారం శివగంగ దివ్య క్షేత్రం

ఈ క్షేత్రాన్ని ‘దక్షిణ కాశీ’ గా పిలుస్తారు.

పర్వతశిఖరం పైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమదేవి ఆలయం,పాతాళగంగా ఆలయం,నందీశ్వరుడు కొలువై ఉన్నారు

ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం చూస్తూ అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ గంగ సరస్సులు ఉన్నాయి.

మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది మరియు గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక నైపుణ్యం యొక్క రుజువు

ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.

ప్రజలు ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని చూస్తారు. చెక్కిన అనేక మంటపాలు కూడా ఉన్నాయి.

ఓం నమశ్శివాయ🙏

ఆహారంలో #5దోషాలు


మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.

  1. అర్ధ దోషం
  2. నిమిత్త దోషం
  3. స్ధాన దోషం
  4. గుణ దోషం
  5. సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🔸 అర్ధ దోషం

ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.” అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

🔸 నిమిత్త దోషం

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
‘అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం – బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి ‘నిమిత్త దోషం ‘ ఏర్పడుతోంది.

🔸 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

🔸 గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🔸సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతోంది. (సేకరణ) 🍃🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🍃

కర్పక వినాయక ఆలయం, తమిళనాడు


వినాయకుని అరుదైన ఆలయాల్లో తమిళనాడులోని కర్పక వినాయక ఆలయం ఒకటి. శివగంగై జిల్లాలోని పిళ్లయ్యార్‌పట్టి గ్రామంలో ఉంది ఈ పురాతన ఆలయం. దీనిని స్థానికులు పిళ్లయ్యార్‌ ఆలయం అని కూడా అంటారు. ఇది గుహాలయం. గుహలో దేవతామూర్తుల పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తాయి.

ఆలయ చరిత్ర;-
ఈ ఆలయం గర్భగుడిలోని గుహలో కనిపించే పద్నాలుగు శిల్పాలు పదో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్య కాలానికి చెందినవని అంటారు. పిళ్లయ్యార్‌పట్టి కొండల నడుమ గుహలో వెలసిన కందర్ప వినాయకునికి పాండ్య రాజులు ఆలయాన్ని నిర్మించారు. ఇందులోని మూలవిరాట్టుగా ఉన్న పిళ్లయ్యార్‌– కందర్ప వినాయకుడి విగ్రహం నాలుగో శతాబ్దికి చెందనదిగా చరిత్రకారుల అంచనా. మిగిలిన చోట్ల వినాయకుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే, ఇక్కడ మాత్రం కుడి వైపు తిరిగి ఉండటం విశేషం. ఈ ఆలయంలోని కాత్యాయనిని, పశుపతీశ్వరుడిని, నాగలింగాన్ని కూడా భక్తులు పూజిస్తారు. ప్రస్తుతం చెట్టియార్లలోని నాగరదర్‌ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఏటా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఇది కరైకుడి మరియు పుదుకొట్టై మధ్య పిళ్ళయ్యార్పట్టిలో ఉంది. మదురై నుండి 71 కిలోమీటర్లు మరియు కారైకుడి నుండి 12 కిలోమీటర్లు. ఈ స్థలం (పిళ్ళయ్యపట్టి) పేరు ఇక్కడ ఉన్న కర్భాగవినాయకరే (పిళ్ళయ్యార్). ఇక్కడ వినాయకపెరుమాన్ ఇతర చోట్ల చూసినట్లుగా నాలుగు చేతులతో కాకుండా రెండు చేతులతో కనిపిస్తుంది. ఇక్కడ మూలావ కర్భాగవినాయక 6 అడుగుల ఎత్తులో వలంపూరి స్థానంలో కనిపిస్తుంది. ఆలయంలోని 15 కి పైగా శాసనాలు ఆలయ ప్రాచీనతకు నిదర్శనం. ఇక్కడ జరిగే ప్రధాన పండుగ ఆగస్టు-సెప్టెంబర్ నెలలో జరిగే వినాయగ చతుతి పండుగ. వినాయగ సత్తుతి పండుగ 10 రోజుల పాటు చాలా కోలాతో జరుగుతుంది. నెలవారీ సంగదా సతుద్ధి కూడా ఇక్కడ జరుపుకుంటారు. ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి – తిరువీసా, మారుదీసా మరియు సేంచదీశ్వర, 3 దేవతలు – శివగామి అమ్మన్, వడమల మంగయమ్మన్, సౌంద్రనాయకి అమ్మన్ చేరా అమండు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరే దేవాలయానికి లేని ప్రత్యేక లక్షణం ఇది.

కర్పక వినాయక ఆలయం, తమిళనాడు

ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8.30 వరకు

మడి – ఆచారాలు


బ్రాహ్మణకులం లో ఆచరించే మడి, ఆచారాలు రాను రాను బయటవారిలోనే కాదు, ఆ కులం లోని యువతలోనూ, హాస్యాస్పదంగా, అర్థరహితంగా కనబడుతున్నవి. అందుకు కారణం ఏమిటంటే, అందులో వున్న అంతరార్ధం విడమరచి చెప్పలేక పోవడం.

ఇప్పటికే, గుడీ, దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో, దైవ కార్యాలు చేసే/చేయించే బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించడం లేదు, చాలాచోట్ల. మనముందే వాళ్ళు వేసుకున్న షర్టు విప్పేసి, మెడలో ఉత్తరీయం వేసుకుని ‘ ఓం ! ‘ అని పనులు మొదలు పెట్టిస్తున్నారు.

అసలు, దీని కథా , కమామీషు యేమిటో చూద్దాం.

ఏదైనా దైవ కార్యం నిర్వర్తించేటప్పుడు, ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్దతి మనకు వున్నది. ప్రాణాయామం చెయ్య
మనడానికి బదులు పురోహితుడు ‘ మీ ముక్కులు పట్టుకోండి. ‘ అంటాడు. మనం పట్టుకుంటాం. ఆచమనం, ప్రాణాయామం అంత: శుద్ధికని ఆయన చెప్పడు, మనకూ తెలీదు. ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే వున్నారు, అందులో మార్పు ఏమీలేదు. అర్ధమైన వారికి అర్ధం అవుతుంది. అర్ధం కాని వాళ్ళు పురోహితుడు ‘ చేతులను మీ వైపు తిప్పుకోండి ‘ అని చెప్పి ఆ దేవతని ‘ ఆవాహయామి ‘ అని మన చేత చెప్పిస్తారు. అలాగే కార్యక్రమం అయిన తరువాత, ‘ మంత్రహీనం, క్రియాహీనము.. ‘ చెప్పించి, ఆ దేవతకు ఉద్యాపన చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు. ఇదంతా ‘ కార్యక్రమం మొదలు,తుది ‘ అని తెలుసు కానీ, ఆ దేవతలు మనతో అప్పటిదాకా వున్నారన్న భావం మనకు రాదు.

ఇవన్నీకూడా మనచేత చేయిస్తారు. అయినా మనకు అవేమీ పట్టవు. వచ్చిన బంధువులను చూస్తూ,’ కాఫీలు తాగారా, టిపినీలు తిన్నారా ‘ అని వాళ్ళను నవ్వుతూ పలుకరిస్తూ, వచ్చిన వాళ్ళచేతనే, ‘ మీరు కార్యక్రమం చేసుకోండి. మేము మాకు కావలసినవి చూసుకుంటాము, ‘ అని చెప్పించు కుంటాము. మీ తమ్ముళ్లతోనే, కుటుంబసభ్యులతోనో వారు గడుపుతారు.

ఈలోపు ఇంకొక చుట్టమో, స్నేహితుడో, మన ఆఫీసరో వస్తాడు. మళ్ళీ ఇదే తతంగం. ఇంతకుముందు రోజుల్లో, పురోహితులు మధ్యలో కర్తను ఎవరైనా మాట్లాడిస్తే, అభ్యంతరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలా చేస్తే, ‘ మళ్ళీ పిలవరేమో ‘ అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ వుంటారు.

అదే విధంగా సంధ్యావందనం సమయంలో ‘ ఆయాతు వరదా దేవీ… ‘ అని చెప్పినప్పటినుంచి, గాయత్రీ, సావిత్రి, సరస్వతి మొదలైన దేవతలను మనమీదకు ఆహ్వానించుకుంటాము. తిరిగి ‘ ఉత్తమే శిఖరే జాతే ‘ అనిచెబుతూ ‘ గచ్ఛదేవి యధా సుఖం ‘ అని చెప్పేదాకా అమ్మలంతా మనతోనే వున్నారన్న మాట. ఇంత విశద౦గా ఏ బ్రాహ్మలూ చెప్పరు. మనమూ తెలుసుకోవాలని అనుకోము.

అలాగే, పూర్వం రోజుల్లో, ఇళ్లల్లో ఆడవారు కూడా, ఏటికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు, జలదేవతను ఆరాధించి నీళ్లు బిందెలతో నింపుకునేవారు. ఆ దేవత వారితో వున్నదనే భావనతో ఇంటికి వచ్చి, దానితో వంట కార్యక్రమాలు చేసేవారు. అలాగే అగ్ని. అగ్నిని ఆవాహన చేసి, జలం తో వంటచేస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో, బియ్యాన్ని వండుతూ, శాక0బరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ వుండేవారు.

ఇప్పుడు చెప్పండి. అలాంటి వారికి, వారిని ఎవరైనా ముట్టుకున్నా, అపరిశుభ్రమైనవి ఏమైనా కనబడినా, తగిలినా, ఏదో అపరాధనా భావము కలిగి, వాటిపై శుద్ధి నిమిత్తం నీరు చల్లడము, విష్ణు,విష్ణు అనీ శివ శివా అనీ అనడమూ తిరిగి పనిలో మునిగిపోవడం ఆనవాయితీ.

జలం మానవుడికీ, దేవతలకూ అనుసంధానమైన పంచ భూతములలో ఒకటి. అందువలన నీటితో ఆ గిన్నెపైనో, బట్టపైనో సింబాలిక్ గా శుద్ధి కార్యక్రమం చేసేవారు, వీలయితే తిరిగి స్నానం చేసేవారు. ఇక్కడ ‘ నీళ్లు చల్లితే మైల, మడి అయిపోతుందా? ‘ అని ప్రశ్నలు యువతరం వేస్తారు.’ నీళ్లు గుమ్మరించుకుంటే, శుద్ధి అయిపోతారా ? ‘ అని వితండవాదం చేస్తారు. ఆజలం ద్వారా, అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని వుండడం వలన, ఆ దేవతను సంతృప్తి పరచే కార్యం శుద్ధి చేసుకోవడం.

ఇదంతా ఎవరూ చెప్పరు. ఎంత సేపటికీ ‘ పసుపు వాడితే బ్యాక్తీరియా పోతుంది. ఇంకేదో చేస్తే క్రిమి కీటకాలు పోతాయి ‘ అని చెబుతారు కానీ.’ మనది కర్మభూమి. దైవభూమి. మనము దేవతలను నమ్ముతాము. దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాము.’ అని ఢంకా బజాయించి యెవరూ చెప్పరు. ఇంకా హేళన చేస్తారేమో అని భయం. ఉన్న విషయం చెప్పడానికి మనకూ తెలియాలి కదా !

పెద్దలు, పండితశ్రేష్ఠులు, అనేకమంది మిత్ర సమూహం లో వున్నారు. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వ్రాసాను. దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాలమీద చులకన భావన పోయేటట్లు చేయగలరని మనవి. ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్ధమైతే, మిగిలిన వారికీ చెప్పగల పరిస్థితిలో మనం వుంటాము.

మనకే అర్ధంగాక, దైవకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా, మడి కట్టుకున్నవాళ్లకు దూరంగా వుండమని చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం. ‘ ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా, అరవైలు దాటినాయి కదా ! చాదస్తం. ‘ అనే స్థితి మనకు రాకుండా మనలను మనం, కాపాడుకుందాం.
సేకరణ: నాగ వంశి పిసుపాటి ద్వారా

🙏🏻🙏🏻జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.🙏🏻🙏🏻



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఏకాదశ స్కంధము : కృష్ణుడు – ఉద్ధవుడు మధ్య Confidential & *last సంభాషణ of Lord Sri Krishna*🙏🏻🙏🏻🙏🏻 before Starting Kaliyug
*దీని తర్వాత యింక కృష్ణుడు మాట్లాడలేదు*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Uddhavudu క్రిష్ణ భగవానుడి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక, విశేష భక్తుడు.

ఈలోగా “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.

ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతోకలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను.
కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.

అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.

దీని తర్వాత యింక కృష్ణుడు మాట్లాడలేదు.

ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.

“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.

కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు.
రెండు విపరీతమైన కోపం.

ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే.

కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు.

కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను
“వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి” అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.

అల్పాయుర్దాయంతో జీవిస్తారు.
పూజలు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.

ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే
ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.

ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.

ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.

కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు.
ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు.

భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు.

అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.

కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.

కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు.

ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.

కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. “యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు ?వెళ్ళిపో.”

కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.

ఈశ్వర నామమును విడిచిపెట్టకు.

ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు.

మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.

అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను.

ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను.

గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది.

వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.

కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో.

సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు.

నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు.

అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది.

క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు.

మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన.

కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.

అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు.

పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు.

జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది.

వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కాబట్టి ఉద్ధవా,
నీవు ఈ పని ప్రారంభించు.

కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో” అన్నాడు.

ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.

ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు.

బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు.

బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది. తదనంతరం కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు.

దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తె తలలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు.

ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో; లోకమునంతటినీ పవిత్రం చేశాయో;
ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో;
ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో;
ఎ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో;
ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో;
ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనం యిచ్చాయో; అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ “హా” అని అరిచారు.

బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు.
కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది.
అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు.

అపుడు కృష్ణ పరమాత్మ “నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే.
నేను కూడా పెద్దల వాక్కునుపాటించాను అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను” అన్నారు.

దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవదమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు. అపుడు కృష్ణుడు
“నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు” అని చెప్పారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸