బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా!?


శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె “ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?” అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ‘ఆకలి! ఆకలి!!’ అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, “తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో ‘విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః‘ అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి” అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.

శివుని అనుగ్రహం కోసం కార్తీక దీపం


కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. భక్తజనమంతా మహాశివుడి అనుగ్రహం కోసం పూజల్లో మునిగితేలుతుంటారు. తెల్లవారు జామునే తలారా స్నానం చేసి తదితర కార్యక్రమాలు ముగించి.. శివాలయాలకు తరలివెళ్లి…శివ కరుణకోసం నిష్టగా పూజలు చేస్తారు.

ప్రస్తుతం ఏ శివాలయం చూసినా భక్తజనంతో కళకళలాడుతోంది. దీపాల వెలుగుతో శోభిల్లుతోంది. పరమేశ్వరాన్రుగహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీకమాసం చాలా విశేషమైంది.

కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందునదీనికి కార్తీకమాసమని పేరొచ్చింది. కార్తీకంలోఎటు చూసినా దీపమే కనబడుతుంది. కార్తీకమాసంలో శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠప్రాంగణంలో ఇలా నాలుగు చోట్లా దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు ఉంది.
Karteeka_deepam
పూజలో ఒక ప్రారంభంగా దీపం వెలిగిస్తాం. దీనికి ఒక పరమార్థముంది. పరమేశ్వరుడు అయిదు జ్ఞానేంద్రియాలనిచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. సమస్త సుఖాలు ఈ అయిదింటిపైనే ఆధారపడ్డాయి. బ్రహ్మాండంలో ఉన్న ఏ భోగస్థానమూ సుఖస్థానం కాదు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు.

రాత్రులు బాగా ఎక్కువవుతాయి. పగళ్ళు తక్కువవుతాయి. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో..సాగుతాయి. దీపాలు వెలిగించి..పుణ్యఫలం కావాలని పరమేశ్వరుడిని వేడుకుంటారు. కార్తీక సోమవారం మరీ ప్రాశస్థమైనది. అందుకే ఆరోజుల్లో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. అంతా భక్తి కార్తీకం.

ఏలినాటి శని


జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు….

download

ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది.ప్రతిసారీ 7 1/2సంవత్సరాలు వుంటుంది. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-

  • 1) మయూరి నీలం ధరించుట.
  • 2) శని జపం ప్రతి రోజు జపించుట.
  • 3) శని కి తిలభిషేకం చేఇంచుట.
  • 4) శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రాహ్మణుడికికి దానం చేయుట.
  • 5 )శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట.
  • 6) ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన.
  • 7) శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన.
  • 8 హనుమంతుని పూజ వలన.
  • 9) సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట వలన.
  • 10) కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన.
  • 11) శని ఎకదాస నామాలు చదువుట వలన ( శనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన.
  • 12) బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన.
  • 13) ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన.
  • 14) ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదక్షణం. మరియు నల్ల నువులు మినుములు కలిపిన నీటిని రావి చెట్టుకు పోయటం వలన.
  • 15) ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన.
  • 16) చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన.
  • 17) బ్రాహ్మణునకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం చేయుట వలన..
  • 18) ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన .
  • 19) అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన.
  • 20) ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం శాంతించవచ్చును.ఇందులో అన్నీకాకపోయిన కొన్ని అయిన చేస్తే శని గ్రహాదోషం పోతుంది.983726_383261345113809_200384027_n

శ్రీ కాల భైరవ అష్టమి


భైరవ ఉపాసన చేస్తే …

images kalabhairava-yantra-be-ahead-of-time-250x250

కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు … కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

“శ్రీ కాల భైరవ అష్టమి”. ఎంతో మంచి రోజు. పిలిస్తే పలికేవాడు భైరవుడు. మహా రక్షకుడు.

కాలభైరవునికి ….. ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్హి (wik) గా చేసి , భైరవుని తలచుకుంటూ, దేవుని ముందు .. 2 దీపాలు నువ్వుల నూనె తో వెలిగించి పెట్టండి. ఎంతో మంచిది . భైరవుడు ఎంతో సంతోసిస్తాడు . దీవిస్తాడు .

మఖ నక్షత్రం లో అష్టమి రావడం మరీ శుభ ప్రదం. 12 సంవత్సరాలకు ఒక సారి ఇలా వస్తుంది. స్త్రీలకు మరీ శుభ ప్రదం.

గాయత్రి …..
ఓం కాల కాలాయ విద్మహే
కాలాతీతాయ ధీమహి
తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ॥

శ్రీ కాళభైరవాష్టకమ్

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం l
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం l
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే l
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ll
కాల భైరవం భజే l
కాల భైరవం భజే ll

~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~

 

 

శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ


నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.

అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు.

శుక్రవారాల నోము నోచుకోవడానికి కారణమైన కథ ?


నోములన్నింటిలోకి ‘శుక్రవారాల నోము’కి ఎంతో ప్రాధాన్యత … ప్రాముఖ్యత వున్నాయి. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి, తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గానీ, ఏ వూరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్ర వారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ, 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత ‘లక్ష్మీ తులసి’ దగ్గర 20 దీపాలు పెట్టి, 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు వాయన దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను … దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వాలి.

ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త, ఉన్న పళంగా బయల్దేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన, అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా, తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరాడు.

ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే వున్నారు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి, ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే వున్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా, ఆ పెద్దమనిషి బండి దగ్గరికి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమనీ, అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందనీ, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.

ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి … అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయనీ, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమనీ, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం … అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.

 

 

శ్రీహరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ?


శ్లో:- అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః 
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః 
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ 
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ . 

భావము:- 
*అహింస ఇంద్రియ నిగ్రహము సర్వ భూత దయ ఓర్పు శాంతి పరమాత్మకై తపించుట పరమాత్మ ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తారు.

వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది


భారతీయుల ఆచార వ్యవహారాల్లో వివాహానికి ఎంతో విశిష్టత వుంది. అలాగే పితృకార్యాలు నిర్వహించడంలోను ఈ ఆచార వ్యవహారాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ ఇంట్లో వివాహ వేడుకను జరిపించిన కొద్ది కాలానికే తమ పెద్దలకు తద్దినాలు పెడుతుంటారు. తెలిసి చేసినా … తెలియక చేసినా ఇందు వల్ల దోషం కలుగుతుందని చెప్పబడుతోంది.

వివాహ వేడుక జరిగిన ఇంట్లో ఆరునెలలు దాటకుండా తద్దినాలు పెట్టకూడదు. మనకి ఆరునెలల సమయం అంటే అది పితృదేవతలకు ఒక పూటతో సమానం. ఆరు నెలలు కాకముందే తద్దినాలు పెట్టవలసి వస్తే, రెండు కార్యక్రమాలకు వారిని ఒకే పూట ఆహ్వానించినట్టు అవుతుంది. వివాహ సమయంలో పితృ దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనం కోరుకునే సందర్భం వుంటుంది. అలా వివాహ వేడుకకి వచ్చిన పితృదేవతలను, అదే పూట తద్దినానికి ఆహ్వానించడం వారి మనసుకి కూడా కష్టం కలిగిస్తుంది.

అందువలన వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితే అయితే ఆ కార్యక్రమాన్ని నదీ తీరాల్లో జరిపించడం ఉత్తమమని అంటోంది. ఇక నూతనంగా గృహప్రవేశం చేసిన వారి విషయంలోనూ ఇదే పద్ధతి వర్తిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. అందువలన శాస్త్రం చేస్తోన్న సూచనలను దృష్టిలో పెట్టుకుని ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించాలి.

అష్టాదశ పురాణాలు


అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాసభగవానుడు మనకు అందించాడు. ఈ 18 గుర్తుపెట్టుకోవడం కష్టమైతే, ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం.

శ్లో! ! మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుషటయం !
అనాపలింగ కూస్కానీ, పురాణాని ప్రచక్షత !!

మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.

భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.

బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.

వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.

అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.

1. మత్స్య పురాణం: దీనొలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.

2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.

3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కౄష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.

4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్Yఓపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.

5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కౄష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.

6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకౄష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకౄష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.

7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకౄష్ణుల వైభవములు, సౄష్టికర్త బ్రహ్మ, సౄష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకౄతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.

8. వరాహ పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణూమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. ప్రమేశ్వరీ, ప్రమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.

9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ౠషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ౠతు వర్ణనలు వివరించబడినవి.

10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.

11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కౄష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.

12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యొతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.

14. స్కంద పురాణము: దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.

15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.

16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.

17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసిమ్హ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.

18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక పొగొట్టగలిగేది ఈ పద్మ పురాణము. 85,000 శ్లోకములలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసౄష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివౄక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.

ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.

స్వామి శరణమయ్యప్పా


హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.
అయ్య (=విష్ణువు),
అప్ప (= శివుడు)

అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు

మహిషి కధనం

మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.

అయ్యప్ప జననం

ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి – సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో

శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

మహిషి వధ

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

శబరిమలైలో నివాసం

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.