మనకు వేదాలు ప్రమాణం


మనకు వేదాలు ప్రమాణం.ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగుగా విభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వేదంలో భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి. ఈ ఉపనిషత్తులసారాన్ని 18 అధ్యాయాలలొ సుమారు 700 శ్లోకాలుగా మనకై ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు. అర్జునుని వ్యాజంతో మనందరికీ బోధించిన గురువయ్యాడు. అందుకే భగవద్గీతను గీతోపనిషత్ అంటారు. వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడే సామాన్యులకై చెప్పాడు. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం – ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు. రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు

శ్రీకృష్ణుడు మనకి బాగాతెలిసినదైవం. భగవంతుడే మానవునిగా వచ్చాడు. ఈ కలియుగం ఆరంభంలోనే 5000 సం. ముందు వచ్చాడు.మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాము. కాని ఆయన తత్త్వం మనకు తెలియదు. వ్రేపల్లెలో లీలలు, బృందావనంలో ఆటలు, రాసక్రీడలు, 16000 గోపికలు, రాధ – అంతే మనకు తెలిసినది. ఆయన 125సం.దీర్ఘ జీవితంలో ఇవి కేవలం మొదటి 12 సంవత్సరాల విశేషాలు. ఆయనను అపార్థం చేసుకోవడమే మనకు అర్థమైనది. జారుడు, వెన్నదొంగ, మానినీచిత్తచోరుడు — ఇవి మనం ఆయనకు ఇచ్చిన బిరుదులు. వీని పరమార్థమూ మనకు తెలియదు. సద్గురుబోధనుండి సేకరించినవి – తెలియవచ్చినంత తేట పరతు.

అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం – అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?

కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. పైగా అది యుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన.

Advertisements

ఏదో చేసుకోవడం కర్మ కాదు. విధింపబడ్డ విహిత కర్మనే ఆచరించాలి. నిషేధకర్మను ఆచరించరాదు.


న బుద్ధిం జనయే అజ్ఞానాం కర్మ సంగిణాం’ – అనే మాట చాలా లోతైనది. ఏదో చేసుకోవడం కర్మ కాదు. విధింపబడ్డ విహిత కర్మనే ఆచరించాలి. నిషేధకర్మను ఆచరించరాదు.

పై శ్లోకానికి వివరణ:

geeta
జ్ఞానియైన వానికి కావలసినదేదీ ఉండదు. అందుకతడు కర్మతో ’సంగం’ పెట్టుకోడు. ఫలాన్ని ఆశించడు. కానీ ఆ స్థితికి చేరనివాడు ఫలాసక్తితో కర్మను ఆచరించవచ్చు. అతడిని ’కర్మలు బంధనకరాలు. విడిచిపెట్టు వంటి మాటలు చెప్పి అయోమయపరచి, కర్మభ్రష్టుని చేయవద్దు” – అని దీని అర్థం
శాస్త్ర సిద్ధమైన కర్మనే ఫలాసక్తితో చేసేవారు కర్మ సంగులు. బ్రహ్మజ్ఞానం లేనివారు ’అజ్ఞులు’. లోకంలో వాడబడే “మూర్ఖులు” అనే అర్థంలో ఈ పదాన్ని భావించరాదు. వేదాంతులు ఆడే మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోక కర్మల్ని విడిచిపెట్టడం తగదు – అని దీని సారం.
అంతేకానీ నిషేధకర్మలనాచరించేవారు ’కర్మసంగులూ’, అజ్ఞులు’ కారు. భ్రష్ఠులౌతారు. శాస్త్రం తెలిసినవారు నిషేధకర్మలను చేసేవారిని నిరోధించాలి. లేకపోతే సమాజానికే ప్రమాదం.
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే”

ఏది చేయాలి, ఏది చేయకూడదు? – అనే సందర్భంలో శాస్త్రమే ప్రమాణం.

యత్ శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః!
న చ సిద్ధి మవాప్నోతి న సుఖం నపరాగతిమ్!!
శాస్త్రవిధిని అతిక్రమించి, ఇష్టానుసారం ప్రవర్తించేవానికి సిద్ధి కలుగదు. వానికి ఇహంలో సుఖం ఉండదు. పరంలో సద్గతి ఉండదు.
– ఇవీ శ్రీకృష్ణుని గీతా వచనాలే.

ఏదీ చేయకుండా ఉండేకన్నా ఏదో ఒకటి చేస్తున్నారు కదా – అని తృప్తిపడడం గొప్ప కాదు. ఏదీ తినకుండా ఉండేకన్నా ఏదో ఒకటి తినాలి అని ప్రమాదకరమైన ఆహారాన్ని తినకూడదు కదా! అలాగని ఏదీ తినకుండా ఉండరాదు కదా! ఏది యోగ్యమో దానిని తినాలి. దానిని ఆసక్తిగా తినేవారి వద్దకు వెళ్ళి – ’దానిపై ఆసక్తి వద్దనీ, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి అంతమోహం పనికిరాద’నీ బోధించి వారిని తిండి తిననివ్వకుండా చేయవద్దు అనేది గ్రహించాలి.

నిషేధాన్ని చేయకుండా నిషేధించాలి. లేకపోతే అది ఆచరించే వానికి క్షేమం కాదు. వేద, ధర్మశాస్త్రాలు చెప్పేవాటికి వ్యతిరేకంగా నడవరాదు.

యమునాష్టకమ్


కృపా పారావారాం తపనతనయాం తాపశమనీం
మురారి ప్రేయస్యాం భవ భయ దవాం భక్త వరదామ్
వియజ్జాలాన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్!!
మధువన చారిణి! భాస్కరవాహిని! జాహ్నవి సంగిని! సింధుసుతే!
మధురిపుభూషిణి! మాధవతోషిణి! గోకులభీతి వినాశకృతే!
జగదఘమోచని! మానసదాయిని! కేశవకేశి నిదానగతే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకట నాశని! పావయమామ్!!
అయి! మధురే! మధుమోద విలాసిని! శైలవిహారిణి! వేగభరే!
పరిజనపాలిని! దుష్టనిషూదిని! వాంఛిత కామ విలాసధరే!
వ్రజపురవాసి జనార్జితపాతక హారిణి! విశ్వజనోద్ధరికే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
అతి విపదంబుధి మగ్న జనం భవతాప శతాకుల మానసకం
గతిమతి హీన మశేష భయాకుల మాగత పాదసరోజయుగం
ఋణభయ భీతి మనిష్కృతి పాతక కోటిశతాయుత పుంజరతం
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
నవజలద ద్యుతి కోటి లసత్తమ హేమ మయాభర రంజిత కే!
తడిదవహేలి పదాంచల చంచల శోభిత పీత సుచేల ధరే!
మణిమయ భూషణ చిత్ర పటాసన రంజిత గంజిత భానుకరే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
శుభపులినే! మధుమత్త మదూద్భవ రాస మహోత్సవ కేళిభరే!
ఉచ్చకులాచల రాజిత మౌక్తిక హారమయాభవ రోదసికే!
నవమణి కోటిక భాస్కర కంచుక శోభిత తారక హారయుతే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
కరివర మౌక్తిక నాసిక భూషణ వాత చమత్కృత చంచల కే!
ముఖ కమలామల సౌరభ చంచల మత్త మధువ్రత లోచని కే!
మణిగణ కుండల లోల పరిస్ఫురదాకుల గండ యుగామల కే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
కలరవ నూపుర హేమమయాంచిత పాదసరోరుహ సారుణికే!
ధిమిధిమిధిమిధిమి తాల వినోదిత మానవ మంజుల పాదగతే!
తవపద పంకజ మాశ్రిత మానవ చిత్త సదాఖిల తాపహరే!
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పావయమామ్!!
ఇతి శ్రీమచ్ఛంకర భగవత్పాద కృతం యమునాష్టకమ్ సంపూర్ణమ్!!

విశ్వనాధాష్టకం


గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాదిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

1606846_268074646685337_1548987370_n

హనుమంతుని చరిత్ర


లో || అతులిత బలధామం స్వర్ణశైలాభా దేహం దనుజ వన క్రుశానుం జ్ఞానినా మగ్రగాణ్యం
సకలగుణ నిధానం వానరాణా మధిశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ||
1546147_582411085183774_260191875_n

శివ నిర్ణయం శంకర భగవానుడు సతీదేవితో మహొత్తుంగ కైలాస శిఖరముపై విరాజిల్లుచుండేను.వటవృక్షచ్చాయలో కర్పూర సదృశమగు అతని ధవళ గాత్రము పై జాటాజూటము శోభిల్లు చున్నది . పాణిపద్మమందు రుద్రాక్షమాలయు, సుందరగళసీమలో ఫణిరాజులును విరాజిల్లుచున్నవి.భక్తి శ్రద్దలతో మూర్తీభవించిన వినయ భావముతో సేవలకై అంజలిబద్దుడై ఆసీనుడై యుండెనా యనునట్లు ,అయన సమక్షమందు నందీశ్వరుడు కూర్చొని యుండెను .

ఆ మహాదేవుని సహచర ,యనుచర వర్గము కొలది దురములోనే వివిధ క్రీడలలో మునిగి తేలుచు ఆనందించుచున్నది .ఆ విశ్వనాధుని శిరస్సుపై శీతలకిరణుడు,ఆకాశగంగా సద నివసించుచుండుటచే ఫాలనేత్రమను తృతీయ నేత్రాంతర్గత భయంకర విష జ్వాల శాంతించినది.లలాటసీమ నల౦కరించి యున్న పవిత్ర భస్మ మత్యంత సుందరముగా కాన వచ్చుచున్నది . ”రామ రామ ”అనుచూ ధ్యానైకాగ్రతయందున్న ఆ పరమశివుడు అకస్మాతుగా తన సమాధ్యవస్థను భంగపరుచుకొని,పార్వతి వైపు చూచెను

.ప్రాణేశ్వరుడ ట్లపూర్వభావముతో తనను చూచుట సతీదేవియు చూచినది .వెనువెంటనే యామె పతిదేవుని కెదురుగా నిలిచి ,ముకుళితహస్తయై వినయముగా ”స్వామి !ఇప్పుడు నేను మీ కెట్టి సేవ చేయవలెను ? మీ వదనసీమ నవలోకించుచుండ మీరు నాతో నేదియో చెప్పదలచినట్లు గోచరించినది ” అనగా ,శంకరుడు ”ప్రియురాల !నేడు నా మనస్సులో మహోత్తమ శుభసంకల్పము జరిగినది .ఏ మహామహిమాన్వితుని నేను నిర౦తరము ధ్యానించుచూదునో ,ఎవని మంగళ నామమును సర్వదా స్మరించుచూ గద్గదత్వమును చెందు చుందునో,అట్టి ఆ దేవుడే అచిర కాలములో భూలోకమం దవతరించునున్నాడు

.దేవతలందరునూ యా ఆరాధ్యదేవతతో నవతరింప అత్యంత కుతూహల చిత్తులై ఆ ప్రభుసేవ భాగ్యమును పొందుగోరుచున్నారు .ఇట్టి స్థితిలో నేనెందులకు వంచింప బడవలెను?నేను కూడానచ్చటికి పోయి నా ప్రభువును సేవించుకుని ,యుగయుగముల నుండి కలిగిన లాలసను పూర్ణము చేసికొనెదను”అనెను. పతిదేవుని వచనముల నాలకించిన సతి ఆ సమయంలో ఉచితానుచితము లేమిటి యనెడి విషయము వెంటనే నిశ్చయించు కొనలేకపోయేను .ఆమె హృదయంలో ద్వంద భావములు ఏర్పడినవి .తన నాధుని అభిలాష నేరవేరవలెనన్నదొక భావముకాగా- తనకు భర్తకు మధ్య ఎడబాటు కలుగుచున్నదనునని రెండోవ భావము .ఇట్లామే కొన్ని క్షణము లాలోచించి ”నాధ!మీ సంకల్పము యోగ్యమైనది .

నా ఇష్టదైవమైన మిమ్ము నేను సేవింపగోరునట్లే ,మీరు కూడా మీ ఆరాధ్య దైవము సేవింపగోరుచున్నారు .కాని వియోగభితిచే నా హృదయస్టితి ఎట్లగునో తెలియటంలేదు .మీ సుఖమునందే నాసుఖము కలుగగలదని భావింపగలుగునట్లు నాకు శక్తిని ప్రసాదింపుడు .మూడవ విషయమేమనగా ఈ పర్యాయము భగవానుడు రావణ సంహరార్డమవతరింపనున్నాడు .

మీకు పరమభక్తుడైన రావణుడు మిమ్ములను ప్రసన్నులను చేసుకోనుటకై తన శిరస్సును సైతము ఖండించుకొని హోమమోనరించినాడు .అట్టి దశలో వాని సంహార కార్యమునకు మీరెట్ల సహకరింపగలరు ”? అని ప్రశ్నించేను . అంత మహాదేవుడు మందస్మితముచేయుచూ-”దేవీ !నీవు ఎంతటి అమాయకురాలవు ?ఇందులో మన వియోగ విషయమేమున్నది ?నేనొక రూపంలో అవతరించి నా ప్రభువును సేవించుకొనెదను. ఈ రూపంలో నీ వద్దనే ఉంటూ నీకు ఆ లిలామయుని విచిత్ర లీలను చుపించెదను .

సదవకాసము కల్గినప్పుడల్లా నా స్వామిని చేరి ప్రార్దించేదను .ఇక నీ మూడవ సందేహము ను కూడా నివారించుకొనుము .దశకంఠుడొక రీతిగా నన్నారాధి౦చిననూ ఒకానొక సమయంలో నా అంశనొక దానిని అవహేళన చేసినాడు .నేను ఏకాదశంశాలలో నన్ను విషయము నీకు తెలిసినదే .అతడు తన పది తలలనూ ఖండించి నన్ను అర్చించినవేళ నా పదకొండవ అంశనొకదానిని విడిచిపెట్టెను. నే నాదే అంశతో వానికి విరుద్దముగా యుద్దము చేసెదను .వాయుదేవుని ద్వారా అంజనా గర్భమున అవతరింప నిశ్చయించు కొనినాను .ఇక నీ కెట్టి సందేహము లేదు కదా!”అనిన పరమశివుని ప్రియమధుర వచనములకు సతిదేవీ పరమానంద భరితురాలైనది.

లంకానగర దహన సమయంలో హనుమ ఎలా ఉన్నారో


లంకానగర దహన సమయంలో హనుమ ఎలా ఉన్నారో చూసి పైనుంచి దేవతలు, క్రిందినుంచి రాక్షసులు కొన్ని మాటలనుకున్నారు అని వ్రాస్తారు వాల్మీకి. ఇక్కడ మంత్రరహస్యాలు చూపిస్తున్నారు మహర్షి.
panchamukha-hanuman-5-faced-photo

“వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!!”

ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే. కాలమే ఎవరు యేం పని చేస్తున్నదీ గమనించుకుంటూ ఉంటుంది. ఎంత పాపాత్ముడికైనా ప్రస్తుతం రోజులు బాగానే వుంటాయి. వాడి పాపం ఎప్పుడు పండుతుందనేది గమనించుకునేద కాలం. దానిని బట్టి ఫలితమిస్తుంది. అలాగ ఎవరికి ఎప్పుడు యే ఫలమివ్వాలో గమనించుకునే కాలమే ఈ రూపం ధరించి వచ్చింది. అంటే కాలాగ్ని రుద్రుడితడు అని ధ్వనినిస్తున్నాడిక్కడ.

నవానరోయం స్వయమేవ కాలః – వానరుడు కాడు స్వయంగా కాలరూపమే. వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా– ఈ మాటలు చెప్పడంలో వాల్మీకి హృదయం మనం తెలుసుకోవాలి. వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా అన్నారు. ఎంతమంది దేవతల పేర్లు చెప్పారు జాగ్రత్తగా ఆలోచిస్తే. పదిమంది దేవతలొచ్చారు చూడండి. అష్ట దిక్పాలకులని చెప్పాడు, సూర్యచంద్రులని చెప్పాడు. వీళ్ళేగా ప్రధానం. హనుమంతునిలో వీళ్ళకి స్ఫురించిన రూపం అష్టదిక్పాలకులైన ఇంద్రాది దేవతల రూపములు గోచరించాయి. ఐంద్రాస్త్ర వారుణాస్త్ర ఆగ్నేయాస్త్ర శక్తులన్నీ ఆంజనేయ స్వామివారిలో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి దర్శనమిచ్చాయి. ఒక దేవత తనయొక్క ప్రతాపాన్ని ప్రకటించినప్పుడు విజృంభించి ఉగ్రమూర్తి అయిపోతాడు. ఉగ్రమూర్తి అయినప్పుడు విశ్వరూపమే గోచరిస్తుంది. హనుమంతుడిలో ఉన్న సర్వదేవతాత్మక స్ఫురణ ఈ శ్లోకంలో వాల్మీకే మనకు స్వయంగా అందించారు. అందుకు సర్వదేవతాత్మకుడిగా కనపడ్డాడు.

సోమనాథ్


ద్వాదశజ్యోతిర్లింగములలో సోమనాథ్ ఒకటి. దక్ష ప్రజాపతి అశ్వనీ మొదలుగా గల తన 27గురు కన్యల వివాహమును చంద్రునితో జరిపించెను. పత్నులందరిలో కూడ రోహిణి చంద్రునకు మిగుల ప్రియమైనది. మిగిలిన వారందరును అంతటి ప్రేమను పొందలేకపోయిరి. దీనివలన ఇతర స్త్రీలకు మిగుల దుఃఖము కలిగెను. వారందరు తమ తండ్రి శరణుజొచ్చిరి. ఆయనకు తమ దుఃఖమును నివేదించిరి. అదంతయు విని దక్షుడు కూడ దుఃఖభాజనుడయ్యెను. చంద్రుని దగ్గరకు వెళ్ళి భార్యలందరినీ సమానంగా ఏలుకోమని హితవొసగుతాడు. అయినా చంద్రుడు దక్ష వాక్యాన్ని తృణీకరించి రోహణియందు ఆసక్తి కలవాడవటం వల్ల దక్షుడు చంద్రుని క్షయరోగ పీడితుడై క్షీణింపగలడని శపిస్తాడు. దానితో అన్ని దిశలయందు గొప్ప హాహాకారములు వ్యాపించెను.ఓషధులు ఫలించలేదు. యజ్ఞయాగాదులు నెరవేరనందున దేవతలకు ఆహుతులు లేకుండా పోయాయి. అమరులక్ అమృతం కొరవడింది. వర్షములు కురియక పంటలు నశించి దుర్భిక్షంతో ప్రజలు అకాల మరణం చెందారు. చంద్రకాంతి హీనత వల్ల నష్టపోయిన వశిష్ఠాది మహర్షులు, ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఒక ఉపాయము చెప్పాడు.

fdghf

dfghds

చంద్రుడు దేవతలతో కూడి ప్రభాసతీర్థమునకు వెళ్ళి అచట మృత్యుంజయ మంత్రము విధిపూర్వకముగ అనుష్ఠానము చేయుచు భగవంతుడగు శివుని ఆరాధించవలెను. తన ఎదుట శివలింగమును స్థాపించుకొని చంద్ర్రుడు నిత్యము తపమాచరించవలెను. అందులకు సంతసించి శివుడు అతనిని క్షయరహితుని చేయును. ఈ విషయమును దేవతలు చంద్రునకు తెలుపగా బ్రహ్మ ఆజ్ఞానుసారము చంద్రుడు అచటకు వెళ్ళి ఆరునెలలు నిరంతరము తపస్సు చేసెను. ఆయన తపస్సు చూసి శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై చంద్రునికి శాపవిమోచనం గావించి ఒక పక్షము కాలము ప్రతిదినము కళ క్షీణించుచుండునని, రెండవ పక్షమున అది మరల నిరంతరము వృద్ధియగునట్లుగా వరమునిచ్చెను. చంద్రుడు భక్తిభావముతో శంకరుని స్తుతించెను. శంకరుడు ప్రసన్నుడై ఆ క్షేత్రమహాత్మ్యమును పెంపొందించుటకు, చంద్రుని యశస్సును విస్తరింపచేయుటకును భగవంతుడగు శంకరుడు అతని పేరుతో సోమేశ్వరుడని పిలువబడెను.

సోమనాథుని పూజించుటవల్ల ఉపాసకులకు క్షయ, కుష్ఠు మొదలగు రోగములు నశించును. ఈ క్షేత్రమున సకల దేవతలు సోమకుండమును స్థాపించిరి. చంద్రకుండము పాపనాశన తీర్థముగ ప్రసిద్ధి చెందెను. ఈ తీర్థమున స్నానమొనరించిన మానవులు సకలపాపములనుండి విముక్తులగుదురు. క్షయ మొదలగు అసాధ్యమైన రోగములతో బాధపడువారు ఈ కుండమున ఆరునెలలు స్నానమాచరించిన రోగములు నశించును. ఈ ఉత్తమ తీర్థమ్ను సేవించువారి కోరికలు సఫలమగును. ఇందులో సంశయములేదు.

చంద్రుడు స్వస్థుడై తన మునుపటి కార్యములను నిర్వహించసాగెను. ఈ గాథను విన్నవాడు, ఇతరులకు వినిపించువాడు తన సంపూర్ణమైన కోరికలను సఫలము చేసుకొనును. సకల పాపములనుండి ముక్తుడగును. సోమనాథుని దర్శించుటకు కఠియవాడ ప్రదేశమున గల ప్రభాస క్షేత్రమునకు వెళ్ళవలెను. ఈ దేవాలయం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ మునిసిపల్ పరిధిలోని ప్రభాస పట్టణ ప్రాంతంలో వున్నది.