పాణ్యం(శ్రీ పాణికేశ్వరము) నంద్యాల


శ్రీ వీర నారాయణ స్వామి దేవస్థానం.

నంద్యాల_జిల్లా

రాయలసీమ

శ్రీ మహా విష్ణువు అష్ట భుజ మూర్తిగా దర్శనమిచ్చే అరుదైన దేవాలయం ఇక్కడ స్వామి పూర్వం అగస్త్యుని ప్రార్ధన మేరకు ఇలా దర్శనమిచ్చారని అదే రూపంలో కొలువై ఉన్నారని స్థల మహత్యం జానపద కథ ప్రకారం “గదగ్; కర్నాటక”నుండి ఇక్కడకు స్వామి వన విహారం కు వచ్చి రాక్షస సంహారం చేసి ఇక్కడే నిలచిపోయారని చెప్తారు… ఈ దేవాలయం లో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, వారి శిష్యులు శ్రీ అన్నజయ్య,శ్రీ ఈశ్వరీ దేవి కొంత కాలం ఉన్నారు… ఉండి వీర నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసారని వారి చరిత్రల ద్వారా తెలుస్తోంది. ఈ పూర్వ ఆలయాన్ని గోపురాన్ని తూర్పు చాళుక్య రాజులు నిర్మాణం చేశారు..

కొన్ని సంవత్సరాల క్రిందట గుప్త నిధుల దొంగలు మూల మూర్తి చుబుకం(గడ్డం)అభయ హస్తం వద్ద చేసిన గాయం కారణంగా ఆ స్వామిని వెనుక ఉంచి ఆయన ముందు రాజస్థాన్ శైలి లో ఉండే పాల రాయి మూర్తిని పునః ప్రతిష్ట చేశారు… మూల మూర్తి విశేషం కారణంగా భిన్నమైన ఆయనకు ఏకాంతంలో పూజలు జరుగుతున్నాయి భక్తులందరికి ముందున్న స్వామి మాత్రమే దర్శనమిస్తారు. ఈ ఆలయ గోపురం పైన రామాయణం, భాగవతం, భారతం కథలు చూడచక్కని కళా నైపుణ్యం తో ఉన్నాయి… ఇదే ఆలయంలో ఒక శాసనం దాని మీద గరుడ ముద్ర ఉన్నాయి, రాజ గోపురం కింద మస్త్య అవతారం ఉంటుంది ప్రళయంలో ఈ స్వామి నీటిలోకి వెళ్తారని అప్పుడు సృష్టి మొత్తం జలం తప్ప ఏమీ ఉండదని చెప్తారు.

ఈ స్వామికి 8 దిక్కుల్లో శివుడు,భైరవుడు,ఆంజనేయ స్వామి,దుర్గా దేవి ,నృసింహ స్వామి కొలువై ఉన్నారు వివిధ ఆలయాల్లో ఆంధ్ర దేశంలో ఏకైక అష్ట భుజ మూర్తి ఆలయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి రోజు అనువంశీక అర్చకుల ద్వారా నిత్య పూజలు, కృష్ణాష్టమికి వార్షిక బ్రహ్మోత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి.

ఈ ఆలయ దర్శన వేళలు ఉదయం 5/6 నుండి 9 వరకు సాయంత్రం 6 నుండి 8 వరకు… ఈ ఆలయం పాత పాణ్యం గ్రామంలో లోపలికి ఉంది స్థానికులు “బొమ్మల దేవాలయం”గా పిలుస్తారు… ఎంతో ఆరుదైన ఈ ఆలయం సరైన ప్రచారం లేక జన బహుళ్యం లో తెలియ రాలేదు ఎప్పటి నుండో ఈ స్వామి ఆలయం గురించి రాయాలి అనుకున్న ఈ రోజు కుదిరింది అవకాశం ఉండే వారు ఆలయ వేళల్లో వెళ్లి తప్పకుండా దర్శించుకోండి.

శ్రీ వీర నారాయణ స్వామి దేవస్థానం.