ఎంగిలి దోషం


ఓం శ్రీమాత్రే నమః

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు

ఎంగిలి చాలా ప్రమాదకరం

ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే

ఇంతెందుకు! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు.అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు .

ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి.నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేర పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి

వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది.ఇంకొన్ని ఇళ్ళలో అయితేవెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు

ఇప్పుడు కూడా వెండి క్రిమి సంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం,వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు.ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు.అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు.ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నోటి ద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.అవి

1.చిలక కొరికిన పండు

2.తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె

3.దూడ తాగిన తర్వాత పిండినటు వంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం

🚩సర్వేజనా సుఖినోభవంతు🚩

కాలభైరవ మంత్రం ఒక రక్ష కవచం సాధకుడికి


కాలభైరవమంత్రంఒకరక్షకవచంసాధకుడికి .

భైరవ అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు, ఇబ్బందులు, సమస్యలను అడ్డుకోవడం అని అర్థం. కాల భైరవుడు తన భక్తులను భయంకరమైన శత్రువులు, దురాశ, కామం మరియు కోపం నుండి రక్షిస్తాడు.

భైరవుడు తన భక్తులను ఈ శత్రువుల నుండి రక్షిస్తాడు. ఈ శత్రువులు ప్రమాదకరమైనవి, ఎందుకంటే వారు మానవులను లోపల దేవుణ్ణి వెతకడానికి అనుమతించరు.

కాలభైరవుడిని ఆరాధించే వారు జ్ఞానం మరియు విముక్తి యొక్క మూలాన్ని కలిగి ఉంటారు, ఇది ఒక వ్యక్తి యొక్క న్యాయతను పెంచుతుంది మరియు దుఃఖం, అనుబంధం, నిరాశ, దురాశ, కోపం మరియు వేడిని నాశనం చేస్తుంది – శివుని (కాలభైరవుడు) పాదాల సామీప్యానికి వెళతారు. , తప్పనిసరిగా.భైరవ లేదా కాల భైరవ అనేది శివుని యొక్క ఉగ్రమైన అభివ్యక్తి. 52 శక్తి పీఠాలలో ఒక్కొక్క భైరవుడికి కాపలా చేసే పనిని శివుడు నియమించాడు .భైరవుడు యొక్క రూపాలు 52, వాస్తవానికి అవి శివుడి యొక్క వ్యక్తీకరణలుగా పరిగణించబడతాయి. చెడులు మరియు శత్రువుల నుండి రక్షణ కోసం భైరవ దీక్ష స్వీకరింవచ్చు ,
భైరవ మంత్రాలు :

కష్టములు తొలగుటకు : ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః
శత్రువినాశమునకు : ఓం హూం జూం భం కాలభైరవాయ శత్రువినాశాయ భీషణాయ నమః
యుద్దంలో గెలవడానికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సంగ్రామ జయదాయినే నమః
దుఃఖ నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః
వ్యాధి నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః
గ్రహదోష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః
వివాహ సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః
విఘ్న నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ విఘ్న నివారణాయ నమః
దివ్య దృష్టికి : ఓం హూం జూం భం కాలభైరవాయ యోగినేెత్రాయ నమః
విష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గరుడరూపాయ నమః
అపవాదులు, అపకీర్తి పోవుటకు: ఓం హూం జూం భం కాలభైరవాయ కళంకనాశాయ నమః
సిద్ధానుగ్రహప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సిద్ధస్వరూపాయ నమః
అధికార ప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ పాలకరూపాయ నమః
భయ నివారణకు: ఓం హూం జూం భం కాలభైరవాయ భయహంత్రే నమః
ధ్యాన సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ ధ్యానాదిపతయే నమః
మంత్ర సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మంత్రప్రకాశాయ మంత్రరూపాయ నమః

ముఖ్యమైన భైరవ మంత్రాలు

ఉగ్రభైరవ మంత్రము : ఓం నమో భగవతే ఉగ్రభైరవాయ షర్వ విఘ్ననాశాయ ఠ ఠ స్వాహా
మహాభీమ భైరవ మంత్రం : హ్రీం నమో మహభీమ భైరవాయ సర్వలోక భయంకరాయ సర్వశత్రు సంహారకారణాయ హ్రుం హ్రుం దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా
క్రోధ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఋం క్రోధ భైరవాయ నమః
కపాల భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః
అఘోర భైరవ మంత్రం : హ్రీం రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహా
ఉన్మత్త భైరవ మంత్రం :
ఓం ఐం ల్పుం ఉన్మత్త భైరవాయ నమః
చండ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ నమః
రురు భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఇం రురు భైరవాయ నమః
అసితాంగ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం అసితాంగ భైరవాయ నమః
క్షేత్రపాల భైరవ మంత్రం : క్షాం క్షేత్ర పాలాయ నమః
బడబానల భైరవ మంత్రం : పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల వైరిలోకం దహదహ స్వాహా
మహాభైరవ మంత్రం : ఓం శ్రీం మం మహాభైరవాయ నమః
సంహార భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః
భీషణ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఊం భీషణ భైరవాయ నమః
మోహన భైరవ మంత్రం : ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః
వశీకరణ భైరవ మంత్రం : ఓం శ్రీం వం వశీకరణ భైరవాయ నమః
ధూమ్ర భైరవాయ నమః : ఓం శ్రీం ధూం ధూమ్ర భైరవాయ నమః
సింహ భైరవ మంత్రం : ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః
రక్త భైరవ మంత్రం : ఓం హ్రీం స్ర్ఫం రక్త భైరవాయ నవ శవ కపాల మాలాలంకృతాయ నవాంబుధ శ్యామలాయ ఏహి ఏహి శీఘ్రమేహి ఏం ఐం ఆగామి కార్యం వదవద అఖిలోపాధిం హరహర సౌభాగ్యం దేహి మే స్వా

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

సర్వకార్యసిద్ధికి మాతా బగలాముఖి మంత్రం


🌷#సర్వకార్యసిద్ధికిమాతాబగలాముఖి మంత్రం🌷

ఓం హ్రీం ఐం క్లీం శ్రీ బగలాననే మామ్ రిపూన్ నాశయ్ నాశయ్ మమైశ్వర్యాణి దేహి దేహి శీఘ్రమ్ మనోవాంఛితమ్ సాధయ సాధయ హ్రీం స్వాహా

పూజ విధానం,

ఆచమనం,ప్రాణాయామం, సంకల్పం చెప్పుకుని పసుపుకొమ్ములతో అష్టమి రోజు ఈ పూజ మొదలు పెట్టి ఈ మంత్రాన్ని 41 రోజులు నిష్ఠగా నియమంగా చేయాలి..రాబోయే ప్రమాదాలు గండాలు స్తంబించిపోతాయి, మీ పైన చెడు ప్రచారం చేసే నోర్లు మితబడతాయి…ఇది సర్వకార్య సిద్ధి భగలా మంత్రం, పని పూర్తి కాకుండా అడ్డు పడుతున్న సమస్యలను స్తంభించిపోయే లా చేసి పనులన్నీ పూర్తి అవుతాయి.. మీ అభివృద్ధి కి ఉన్న అడ్డంకులు తొలగిస్తుంది…. పులిహోర, లాంటి నివేదనలు పసుపు రంగు లో ఉన్న అన్నం పండ్లు, పసుపు చామంతులు.. దీక్ష చేసే సమయంలో పసుపు రంగు బట్టలు వేసుకుని చేస్తే ఫలితం అద్భుత గా ఉంటుంది.. ఆహార నియమాలు పాటించాలి.. సాయంత్రం సమయంలో చేయాలి, రోజూ తల స్నానం అవసరం లేదు..

శ్రీరామ రఘు రామా


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.

శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!

💐దశావతార జయంతులు:💐

  1. మత్స్య – చైత్రబహుళ పంచమి, 2. కూర్మ – వైశాఖ శుద్ధ పూర్ణిమ, 3. వరాహ – చైత్ర బహుళ త్రయోదశి, 4. నారసింహ – వైశాఖ శుద్ధ ద్వాదశి, 5. వామన – భాద్రపద శుద్ధ చతుర్దశి, 6. పరశురామ – వైశాఖ శుద్ధ ద్వాదశి, 7. శ్రీరామ – చైత్రశుద్ధ నవమి, 8. శ్రీకృష్ణ – శ్రావణ బహుళ అష్టమి, 9. బుద్ధ – వైశాఖ శుద్ధ పౌర్ణమి, 10. కల్కి – భాద్రపద శుద్ధ విదియ

శ్రీరాముడు పుట్టిన రోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.

అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

‘రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి’ అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. ‘రామ’ నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:

రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, “సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి” అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, “హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప” అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, “మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? ” అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, “రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి” అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి “దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాఅలి?” అనగా దేవర్షి, “ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, “ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ” అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు” అన్నాడు.

మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి – “ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!” ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. “రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు” అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.

‘శ్రీరామ’ – ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. “జయరామ” ఇది అతని స్తుతి. ‘జయజయరామ’- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.

సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయI 🚩 సర్వే జనా సుఖినోభవంతు 🚩

ఏ రాశి వారికి ఏ జ్యోతిర్లింగం మంచి ఫలితములు వచ్చును


  1. మేషరాశి: “రామేశ్వరం” :

శ్లోకం:- “సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.”
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.

  1. వృషభ రాశి: “సోమనాధ జ్యోతిర్లింగము”💐

శ్లోకం:- “సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.”
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.

  1. మిధున రాశి: “నాగేశ్వర జ్యోతిర్లింగం”💐

శ్లోకం:-“యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.”
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.

  1. కర్కాటకం: “ఓం కార జ్యోతిర్లింగం”:💐

శ్లోకం:-“కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే”
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.

  1. సింహరాశి : “శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం”💐

శ్లోకం:-“ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే.”
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.

  1. కన్యా రాశి: “శ్రీ శైల జ్యోతిర్లింగం”.💐

శ్లోకం:-“శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం.”
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.

  1. తులారాశి: “మహాకాళే శ్వరం”:💐

శ్లోకం:- “అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం “
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.

  1. వృశ్చిక రాశి: “వైద్యనాదేశ్వరుడు:💐

శ్లోకం:-“పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.”
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.

  1. ధనురాశి : “విశ్వేశ్వర లింగం”:💐

శ్లోకం:- “సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.”
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున “నారాయణ మంత్రం”తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.

  1. మకరము: “భీమ శంకరం” :💐

శ్లోకం:- “యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి.”
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది.

  1. కుంభం:”కేదారేశ్వరుడు”:💐

శ్లోకం:-“మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే “.
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.

  1. మీనా రాశి: “త్రయంబకేశ్వరుడు” :💐

శ్లోకం:-“సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే “.
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్య నామస్మరణ చేస్తూ ఉండండి

సుబ్రహ్మణ్య రోజుఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదలనుంచి రక్షింపబడతారు..


రామాయణాంతర్గత స్కందోత్పత్తి

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి.

ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు.

కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.

“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొ

షణ్ముఖుడు



అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని అన్న. దేవతల సేనాధిపతి. ఈయనకే ‘స్కందుడు’ అని, ‘కార్తికేయుడు’ అని, ‘శరవణుడు’ అని, ‘సుబ్రహ్మణ్యుడు’ కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.


ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, “నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడట.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి ‘స్కందా’ అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి

  • షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు
  • స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి
  • కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
  • వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు
  • శరవణభవుడు – శరవణము అంటే ఱెల్లుగడ్డిలో అవతరించినవాడు
  • గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు
  • సేనాపతి – దేవతల సేనానాయకుడు
  • స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
  • సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
  • మురుగన్ – అందమైన వాడు (తమిళం)
    దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
    షణ్ముఖుడి ఆరు ముఖాలుపంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు. తెలుగునాట సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ. తమిళనాట మురుగన్ దేవాలయాలు, పేర్లు, ఉత్సవాలు సర్వ సాధారణం.
    ఉపాసన.

  • షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన)ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అనిపేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము.అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు.అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేననిపెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.
    వైదిక వాగ్మయంలో కుమార అనే నామం వినగానేగుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యగణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక,
    “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు, ఎలా పిలిచినాఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం.ఇందులో అవ్యక్తానికి ప్రతీకగా అమ్మవారిని పేర్రొంటే, వ్యక్త స్వరూపాలకు సంకేతంగా అయ్యవారిని స్మరించుకోవటం ఆనవాయితి అయితే, మహత్తత్వానికి ప్రతీకగా గణపతిని,అహంకారానికి ప్రతీకగా కుమారస్వామిని చెప్పడం జరిగింది. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినదిఅని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
    ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనేభావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ బావం ఉంటుంది.ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈసృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటిజ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైనసృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.

  • ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు.రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించినవాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది.
    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః
    అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా
    తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః
    పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్తశక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామిఅని స్కాంద పురాణం చెబుతోంది.
    అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామితత్త్వం.
    కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలుఉన్నాయి. పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలోకనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచిఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.
    కాలస్వరూపం.
    వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.
    జ్ఞానస్వరూపుడు.
    సుబ్రహ్మణ్యస్వామి వారురాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తిఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదేఅజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేదిస్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తినిధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడాకుమారస్వామి ఉపాసన చెప్పబడింది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
    “పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలోపోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట),శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్థించారు. ఈ మాటలో కూడా కవితా శక్తినిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయనస్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా,మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.
    కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులైపుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు.
    మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్యస్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి.ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడమనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడాసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువులనుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణంలో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలోఉద్దేశం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణసంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God ofWar” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి రావణుడికి,పాందవులకి, కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో మంచి/దేవతా సైన్యం విజయం సాధించాలంటే,దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలోరాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. అందులోనేశ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి,అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అనిఅర్ధం. మరి విష్ణువే రాముడు కదా, ఆయనకివిశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతారప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికిఅవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తినికూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలోధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.
    అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ,శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలావిశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమునుఅనేక కోణాలలో మహర్షులు దర్శించారు.
    కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీగుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం,”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈకుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివపార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమేకుమారుని సంభవం.
    అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణంస్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణంఅయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.
    ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగాసుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలుఅంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక.ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.
    ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులేదేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీ దేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.
    ప్రసిద్ధ భక్తుల ప్రస్తావన.
    “నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా!మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని స్కందునికీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారుసాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందినమహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన ‘తిరుత్తణి’లో కుమారస్వామి ఒకవృధ్ధ గురురూపంలో కనిపించి “ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూ…అని చెప్పిఆయన నోటిలో పటికి బెల్లం వేసి” వెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికిఅక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య,మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో‘గురుగుహ’ అనే నామముతో ముద్రాంకితం చేశారు. “శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీ దేవిశ!గురుగుహ! దేవసేనేశ!” ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.
    అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధనచేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.
    కంచికామకోటి పీఠాధిపతిపరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలోపరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకిఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట.ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించిమరో చక్కని మాట కూడా చెప్పారు. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకిఅవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు,మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే అన్న ఆలోచనకు ఈ బుజ్జిసుబ్రహ్మణ్య స్వామిని ఉదహరించవచ్చన్నారు..
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️🪷🪷🪷🚩 సర్వేజనా సుఖినోభవంతు🚩🪷🪷🪷

మార్గశిర సుబ్రహ్మణ్యషష్టి


ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని… ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. “శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం…
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం…
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.

💐💐💐సుబ్రహ్మణ్య వ్రతకల్పన.. సంతాన ప్రదాతకం💐💐💐

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు. తారకాసుర సంహారంకోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరివల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు.

తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. శివుడు వారి కోరికమేరకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారంకోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు.

సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి.

అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు.

దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

  • కాలసర్పదోషం ఉన్నవారికి మేలైనవి:

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.

అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తిలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్ర్తిలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు…..

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి🙏🌼🌿 #శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి🙏🌼🌿

🌿🌼🙏దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!🙏🌼🌿

🌿🌼🙏శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం🙏🌼🌿

🌿🌼🙏పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న “తారకా సురుడు” అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. 🙏🌼🌿

🌿🌼🙏అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి “సర్పరూపం” దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.🙏🌼🌿

🌿🌼🙏సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.🙏🌼🌿

🌿🌼🙏ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున “శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.🙏🌼🌿

🌿🌼🙏ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.🙏🌼🌿

🌿🌼🙏ఇటువంటి పుణ్యప్రదమైన “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి” నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.🙏🌼🌿

🌿🌼🙏వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి, సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.🙏🌼🌿

స్కందోత్పత్తి

  1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
    సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!
  2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
    ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!
  3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
    తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!
  4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
    సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!
  5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
    సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!
  6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
    తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!
  7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
    జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!
  8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
    ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!
  9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
    ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!
    ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
    అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!
    ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
    శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!
  10. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
    గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!
    ౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
    దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!
    ౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
    సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!
    ౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
    అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
    దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!
    ౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
    ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!
    ౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
    ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!
    ౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!
    ౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
    తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!
    ౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
    తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!
    ౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
    సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!
    ౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!
    సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
    తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!
    ౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
    క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!
    ౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
    దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!
    ౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
    పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!
    ౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
    స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!
    ౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
    కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!
    ౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!
    షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!
    ౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!
    అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!
    ౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
    అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!
  11. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
    కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!
    ౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
    ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
    ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!
  • గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం


(మార్గశిర లక్ష్మీవార వ్రతం)

రేపటి నుండి మార్గశిర మాసం 🙏🙏

అన్ని మాసాలలో మార్గశిర మాసం ఉత్తమమైన మాసం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పేడు🙏

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం…’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే…’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే!

ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం…

లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.

  • ఐదువారాల అద్భుత వ్రతం… మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.
  • వ్రతవిధానం

ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి.

” ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ “

అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి.

అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు.

  • తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి.
  • రెండవవారం అట్లు ,తిమ్మనం
  • మూడోవారం అప్పాలు ,పరమాన్నము
  • నాలుగోవారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి.
  • ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి.

ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.

  • నియమనిష్ఠలు కీలకం

గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.

ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.

మార్గశిర లక్ష్మీవార వ్రత కధ:

పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.సరే అని తీసుకెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటని పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు .జరిగిన విషయం తల్లికి చెప్పేడు .తల్లి జరిగినదనికి దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందిందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ ఈసారి అయిన జాగ్రత్త గా తీసుకురమ్మని చెప్పెను. అక్కకి పరిస్థితి ఇదివరకు లానే ఉంది అని చెప్పెను.అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాల నింపి ఆ పండు అమ్మ కి ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తు సాయం సమయం లో ఒక చెరువు వద్ద కి వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు.
ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు.ఆ కుర్రాడు గట్టు మీద కొచ్చి పండు వెతగగా పండు లేదు.ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళేడు.
తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను.
తల్లి విచారించింది.కొన్నాళ్ళకి తల్లి పిల్లలని ఇంటిదగ్గర ఉంచి , కూతురు దగ్గరకి వెళ్లెను.తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం నోము నోచిన ఐశ్వరం వచ్చునని తలచెను.

అమ్మ ఈ రోజు మార్గశిర లక్ష్మీ వారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను.ఆమె కూడా అలానే నేను ఏమైనా చిన్న పిల్లనా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చల్ది అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది.కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్ వ్రతం చేసుకుందాం అన్నది.అప్పుడు జరిగింది తల్లి చెప్పింది.ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది .
రెండవ వారం అమ్మ వ్రతం చేసుకుందాం అన్నది
అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది .
ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు.మరుసటి వారం అమ్మ ఈ వారం అయిన జాగ్రత్త గా ఉండమని చెప్పింది.పిల్లలకి తలదువ్వుతూ తాను దువ్వుకుంది.ఆ వారం కూడా వ్రతం కుదరలేదు.కూతురు మాత్రమే చేసుకుంది.నలుగోవారం ఈసారైనా జాగ్రత్త గా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతి లో కూర్చోపెట్టింది.పని అయిన తరువాత అమ్మ ని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్న అని చెప్పింది.అయ్యో అని తలచి కుతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవరం ఆఖరి వారం .అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కి కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయంచి వ్రతం చేయంచింది.
పూర్ణాలు, కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది.కానీ మహాలక్ష్మీ దూరం గా వెళ్లి పోయింది.ఏమి అమ్మ ..అలా వెళ్లిపోతున్నావు అని అడుగగా…నీ చిన్నతనం లో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురు తో కొట్టింది అందుకే వెళ్లిపోతున్నా అని చెప్పింది.అప్పుడు తన తల్లి చేసిందనికి క్షమించమని ప్రార్ధిం చినది .మళ్ళీ ని తల్లి తొ వ్రతం చేయంచమని అదృశం అయింది మహాలక్ష్మి.
సరే అని మొదటివారం పులగం,రెండవ వారం అట్లు,తిమ్మానం,మూడవ వారం అప్పాలు,పరవణ్ణం,నాలుగోవారం చిత్రన్నాం,గారెలు,
పుష్య మాసం లో మొదటివారం లో పూర్ణ కుడుములు వడ్డించి తల్లితో నోము చేయంచింది.
కథా అక్షింతలు తలమీద వేసుకున్నారు.
అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకము కి వెళ్లెను.కథలో లోపమైనను వ్రాతలోపం కారాదు.భక్తి తప్పినను ఫలం తప్పదు.

🚩సర్వేజనా సుఖినోభవంత్🚩