పర్యాటన్ పర్వ్ పధకం


హిందూ సనాతన ధర్మ విశిష్టత కోసం ప్రతి ఒక్కరికి తెలిసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఏడాది పొడవునా కనీసం 15 పుణ్యక్షేత్రాలకు దర్శించిన వారికి వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి వారికి తిరిగి ఇచ్చే విధంగా ఈ పధకం హిందువులకు ఉపయోగపడుతుంది

కలలో సర్పములు కనిపిస్తే ఏమి చెయ్యాలి


జంటనాగులు వున్నా విగ్రహం దగ్గేరకి ఆవ్వుపాలు తీసుకోని వెళ్లి ఆ విగ్రహం చుట్టూ 9 ప్రదక్షణలు చేసి సర్పమంత్రం పఠీoస్తు మానస దేవిని స్మరిస్తూ పూజించవలెను , ఇలా చేయ్యుట వలన ఎటువంటి సర్పదోషం లేదా సర్ప శాపం నుండి పరిహారం లబించును….

తెలిసి కానీ,తెలియక కానీ మీరు లేదా మీ పూర్వికులు సర్ప హత్య చేస్తే ,దాని ద్వారా ఈ సర్ప శాపం తగులుతుంది

ఒక వేళ తప్పనిసరి పరిస్థితిలో సర్పహత్య చేస్తే వెంటనే దానిని దహనం చేయాలి.ఇలా చేయడం వలన సర్పశాపం తగలదు సర్ప శాపం చాల ప్రమాదకరం…

అది తరతరాలు వెంటాడుతుంది అందుకే దీనిని తొందరగా నివారణ చేసుకోవాలి.ఇలా చేయించుకొనే స్తోమత లేని వారు సర్పశ్లోకాలు చదివితే ఆలాంటి దోషాలు ఉంటే పోతాయి…

కలలో సర్పాలు నాగదోషం ,నాగశాపం వలన కూడా ఎక్కువుగా వస్తుంటాయి..ఇవి సర్పాశాపం ఉందని మనకి తెలియజేయడం…కలలోవస్తే ముందు బయపడటం మానుకొని పరిహారం చేసుకోండి, ఖర్చు లేని పరిహరమార్గం కావున మానస దేవి ఆరాదించుట వలన నిద్రలో పాములు రావడం తగ్గి ప్రశాంతముగా నిద్రపోవచ్చును. ఇలా 9 మంగళవారములు చేయండి.. …

సేకరణ

ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు


భాగవతం, మహాభారతం

1.నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

  1. జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
  2. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
  3. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
  4. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
  5. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా
  6. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

8.వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

  1. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
  2. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
  3. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
  4. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
  5. హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
  6. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
  7. వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర.
  8. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్.
  9. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
  10. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
  11. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా.
  12. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
  13. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
  14. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం – గిర్నార్, గుజరాత్.
  15. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం – ద్వారక,గుజరాత్.
  16. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
  17. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) – విదర్భ, మహరాష్ట్ర
  18. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) – కుండినపుర, మహరాష్ట్ర
  19. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
  20. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
  21. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
  22. కుచేలుడు నివసించిన చోటు – పోర్ బందర్, గుజరాత్.
  23. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) – ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
  24. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) – కంపిల్, ఉత్తర్.
  25. జరాసంధుని భీముడు చంపిన చోటు – జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
  26. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) – పశ్చిమ హర్యానా.
  27. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
  28. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) – విరాట్ నగర్,రాజస్థాన్
  29. శోణపురం (బాణాసురుడి రాజధాని) – సోనిత్ పూర్, అస్సాం.
  30. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) – తేజ్ పూర్, అస్సాం.

39.నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

  1. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
  2. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
  3. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

43.గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు.
:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::

  1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్
  2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  3. కాంభోజ రాజ్యం – ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా5.పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – గోకర్ణ, కర్ణాటక
  5. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్
  6. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్
  7. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
  8. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
  9. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.
  10. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
  11. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్
  12. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి,బీహార్
  13. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  14. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
    16 దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
  15. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  16. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.
  17. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
  18. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.
  19. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
  20. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
  21. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – ధనుష్కొటి, తమిళనాడు.
  22. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
  23. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.
  24. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
  25. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక
  26. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.
  27. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
  28. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.
  29. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
  30. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
  31. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్.

సేకరణ : – మన వేదం

జగన్మోహిని పుట్టుమచ్చ రహస్యం


దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు.
అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు.
మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై…..

కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు.
జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ….,

అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.

ఈ విషయాన్ని కలహ భోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు.

అప్పుడు పరమశివుడు ‘మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు’ అన్నాడు.

అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి

‘నీ జగన్మోహన రూపాన్ని చూపించు’
అని అడిగాడు.
పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి..

విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై..
తనను తానే మరచి ఆ జగన్మోహినినీ ఆనుసరించాడు..

(ఇక్కడ తెలియనితనం తో చాలామంది శివుడు వెంట బడ్డాడు అని అంటారు.
కానీ కాదు ,మహిషి ఘోర తపస్సు చేసి తనను చంపగలిగేవాడు హరిహారాదులకు పుట్టినవాడు కావాలని కోరుకుంది,అందుకు అక్కడ అయ్యప్ప జననం జరగాలి,విష్ణువు ,అమ్మవారికి సోదరుడు కనుక పార్వతి అంశ తనలో ఉండబట్టే పార్వతి దేవిలా శివునికి భార్యలా ప్రవర్తించగలిగాడు విష్ణువు)

జగన్మోహిని శివుని చేతికి చిక్కక..చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి శిలారూపం దాల్చింది.

అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు పది మైళ్ల దూరంలో గల ‘ర్యాలి’ అనే గ్రామంలో ఉన్న ‘జగన్మోహినీ కేశవస్వామి’ దేవాలయం.

పూర్వం ‘ర్యాలి’ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది.
ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ‘ఘంటచోళుడు’ అనే చక్రవర్తి పరిపాలిస్తూండేవాడు.

ఒకసారి ‘ఘంటచోళుడు’ వేటకని ఆ అరణ్యాలకు వచ్చి, చాలాసేపు వేటాడి, అలిసిపోయి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. చక్రవర్తి కన్నులు తెరిచి చూసాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ‘ఘంటచోళుడు’ వేట చాలించి రాజథానికి వచ్చాడు.

ఆ రాత్రి ‘ఘంటచోళుని’ కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ‘రాజా..ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు.

ఆ రథం శీల ఎక్కడ ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమౌతుంది’ అని ఆదేశించాడు.

నిద్రనుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి, వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు.

ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా ‘జగన్మోహిని’ విగ్రహం బయటపడింది.

మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

ఆ విగ్రహానికి ఒకప్రక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే…

మరొకప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది.

స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ‘ఘంటచోళ చక్రవర్తి’. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది.

అదే ప్రస్తుతం ‘ర్యాలి’ గ్రామంలోనున్న ‘జగన్మోహిని కేశవస్వామి’ దేవాలయం.

ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. అదే.. నాడు జగన్మోహిని వెంట అనుసరిస్తూ వచ్చి ఇక్కడ ఉండిపోయాడు పరమశివుడు ఆ ఆలయమే ఇది. ఆ స్వామిని ‘ఉమాకమండలీశ్వరుడు’ అని అంటారు.

శిల్పకళాచార్యుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం ‘జగన్మోహినీ కేశవస్వామి’ దేవాలయం. సుమారు ఐదడుగుల ఎత్తు ఉన్న నల్లటిశిలలో నయన మనోహరంగా ఉండే ‘కేశవస్వామి’ ఒకప్రక్క..భక్తుల హృదయాలను దోచుకునే రూపంతో ‘జగన్మోహిని’గా మరొకప్రక్క.. అందరినీ ఆకర్షించే ఆ నల్లని ఏకశిలా మూలవిరాట్టులో.., భక్తుని ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. ఇదే ఆ సుందర,సుకుమార ‘జగన్మోహినీ కేశవస్వామి’ శిల్పకళా వైభవ ప్రత్యేకత.

అంతేకాదు.. పద్మినీజాతి స్త్రీకి వెనుకవైపున సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ ‘జగన్మోహిని’ శిల్పానికి వెనుక భాగంలో ఉండి, భక్తులకు చక్కగా కనబడడం ఈ శిల్పం ప్రత్యేకత.

విశ్వసృష్టికి మూలభూతమైన స్త్రీ, పుంసాత్మకమైన ఈ ‘జగన్మోహిని’కి ఆంధ్రదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడ దేవాలయం లేదు.

ఈ ‘జగన్మోహిని’ శిరో భూషణాలు, శరీర అలంకారాలు, ముఖ సౌందర్యం వర్ణనాతీతం.

ఇక ‘కేశవస్వామి’ అరచేతిలోని రేఖలు, కంఠసీమ మీది మడతలు.,నాలుగు చేతులలోని శంఖ,, చక్ర, గదా, పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు.

ఆ ‘కేశవస్వామి’ పాద పద్మాలనుంచి నిరంతరం ఉద్భవించు ‘జలం’ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆ స్వామి పాదోద్భవ జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు.

అదీ కాక విగ్రహం పైన తోరణంలా స్వామి దశావతారాలలో స్వామి అన్ని రూపాలు ఉంటాయి.

పండుగల్లోను, పర్వదినాల్లోను ఈ స్వామికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఈ మూర్తి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీరాలి. అలా చూడలేనివారు కళ్లుండి కూడా గ్రుడ్డివారే .. అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఓం నమో నారాయణాయ నమహః
ఓం నమః శివాయ నమహః!!

శుశృతుడు ( శుశృత సంహిత )




ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు.ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.


చరిత్ర :-
కీ.పూ.600 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర వికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ”


ఆయుర్వేద వైద్య సేవలు :-
వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్ లను కూడా ఆవిష్కరించాడు. మూత్ర పిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.

ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో అందెవేసిన చేయి శుశృతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సకోస్ం 120 రకాల వైద్య పరికరాలను శుశృతుడు ఉపయోగించేవాడట!

తెగిన శరీర భాగాలను అతికించటం, శరిరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు (ఫారిన్ ఆంటీబాడీస్) ను కనుగొని తొలగించటం, పుచ్చిన, దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం (బుడ్డ) రోగికి హాని కలుగకుండా శస్త్రచికిత్స చేసి వేరుచేయడం యివన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది శుశృతుడే!

ప్రొస్టేట్ గ్రంథిని ఏఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను శుశృతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నాదు. మూత్రనాళంలో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.

పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త శుశృతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు శుశృతుడు.

మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీరభాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రవికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ (మదిర) ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు.

తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి, వందలాదిమంది శిష్యులను తయారుచేశాడు శుశృతుడు. అంతే కాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంలో “శుశృత సంహిత” అనే గొప్ప గ్రంథం రాశాడు శుశృతుడు. ఈ శుశృత సంహిత క్రీ.శ.8 వ శతాభ్దంలో అరబ్ భాషలోకి “కితాబ్ షాషూన్ ఎ హింద్” “కితాబ్ ఐ శుశృత” గ్రంథాలుగా అనువదింపబడినవి.

శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలు సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.

శుశృత సంహిత :-

శుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ “శుశృత సంహిత” లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు – ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషదాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.

సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన “అష్టాంగ హృదయం ” వివరింపబడింది.

ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.

క్రీ.శ 8 వ శతాబ్దంలో “సుశ్రుత సంహిత”ను అరబిక్ భాషలోకి “కితాబ్ పాషూన్ ఎ హింద్”, కితాబ్ ఇ సుస్రుద్” పుస్తకాలుగా అనువదించారు. ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే “శల్యతంత్ర” అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరచివ్వడని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మధ్యం) స ద్వారా మత్తు కలిగించి, “అనస్తీషియా” ప్రక్రియకు తొలిరూపం అందించినవారయ్యారు.

ప్రకృతి ఆరాధకుడు :-
సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి అనేక అమూల్య అంశాలను వెలువరించారు. సంవత్సరంలోని భిన్న భిన్న ఋతువులలో ఆయా వాతావరనాలకు అనుగునంగా మెసిలి, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు. ఏఏ కాలాల్లో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినవలెనో వివరించారు. తృణధాన్యాలు, పప్పుదినుసులు వాడకం గూర్చి సోదాహరణంగా పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.

సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే ప్రకృతిలో అనుసంధానమై వివిధ ప్రయోగాలు చేశారు. ఏ ఏ మొక్క మానవునికి ఎన్నివిధాలుగా ఉపయోగపడిందో కూలంకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు, తమ గాఢ అధ్యయనం ద్వారా తన శిష్యులకు సరళంగా బోధించేవారు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవారు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే, వైద్య చికిత్సలో వాడే మూలికలను, క్షార పదార్థాలను, లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత, స్థాయిలను అనుసరిచ్మి తయారుచేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు. గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం గాని, పూర్తిగా తడి లేదా పూర్తిగా పొడిగా ఉండడం గాని ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు.

ఔషథాల తయారీకి ఉపయోగపడు మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు, ఔషధోపయోగ గుల్మాలు సీతాఫలం మొదలైన పండ్లు గురించి, వృక్షాలు నేరేడు, మారేడు మొదలైన వాటి గూర్చి తన గ్రంథంలో వివరించటానికి పూర్తి అధ్యాయం కేటాయించాడు. వందలాది మొక్కలు, వృక్షాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు గూర్చి, వాటిని ఉపయోగించుకొనే విధానాలను గూర్చి విశ్లేషన చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథరచనలో పొందుపరిచాడు. ఈ గ్రంథం అరబిక్ లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషలలోకి అనువాదమైంది. వ్యాధి గ్రస్తమైన శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం, వ్యాధి గ్రస్తుడు అయినపుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలని, ముఖ్యంగా ఆయా రోగులు శరీరతత్వాలను తెలుసుకొని, వారి శారీరక, మానసిక బలాలను, ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించారు. గర్భ నిరోధంతో పాటు గర్భ ధారణకు కూడా అనువైన ఔషధాలను, యవ్వనోత్సాహానికి తగిన మందులను తన ములికా వైద్య ప్రకరణంలో పేర్కొన్నారు. ఈయన సృష్టించిన “సందంశ యంత్రాలు” ఆధునిక శస్త్రవైద్యుల spring forceps, dissection and dressing forceps లకు తొలి రూపములుగా ఉన్నాయి.

ప్రసిద్ధ గాథ :-
అత్యవసర మైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అర్థరాత్రివేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రొదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు విరిగి వుండడం సుశ్రుతుడు గమనించాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకు వెళ్ళాడు.

ఆరోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు. మూలికా రసంతో అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర (మధ్యం) ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా, వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు, సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు. అతి చిన్నది, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు. ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు (గంధం) పట్తు వేసారు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టారు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో ఏయే మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు.

ప్లాస్టిక్ సర్జరీ :
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంతభాగం తీసి తెగిన చోట అమర్చి పుర్వ రూపానికి తీసుకువావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో, రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద ప్రఖ్యాతి చెందిన, సాధికార గ్రంథం “సుశ్రుత సంహిత” రాసాడు.

ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన “సుశ్రుత సంహిత” గ్రంథంలో!

పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి, ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.

క్షార సూత్రం :-
ఈ క్షార సూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని భగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొ. పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో “ఫిస్టులా ఇన్ ఆనో”గా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభజించారు. క్షార సూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికేకాక అర్స మొలలు (పైల్స్), నాడీ వ్రణం మొ. వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు. ముందుగా దారమును తీసుకొని దానికి 21 సార్లు క్షారయుక్తమైన ఔషధాలతొ సమ్మిళితం చేస్తారు. దీనిఏ క్షార సూత్రమని అంటారు. దినిని ఉపయోగించి అయిదారు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. మధుమేహ రోగులకు, రక్త పోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.

వైద్య విధానాలు :-
సుశ్రుతుడు రాసిన గ్రంథరచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్యచికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్ర చికిత్సను అతి నైపుణ్యంతొ నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడి వేష భాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి, పూర్తి చేతనతో, ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్త్రపరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు.

సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స (ఫిజియో థెరపీ) ను ఆ వ్యక్తికి అందించాలని, అప్పుడే శస్త్ర చికిత్సకు సంసిద్ధుడై, చికిత్స అనంతరం త్వరిత గతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే, వ్యాథులను ఏర్పరచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశరు. ఏ క్రిమి/కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏవిధమైన మూలికా వైద్యం అవసరమో వివరించారు.

మెదడు (పెద్దమెడడు) లోచిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకు రావటనికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రంఅ చేసి, మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించె రక్తంలో అతి సూక్ష్మ క్రిములు పుట్టి, ధమనులు సిరలలో జీవిస్తూ పలురకాల అస్వస్థతలకు గురిచేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధికారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథ రచనలో ఇమిడ్చి, మానవ జాతికి మహోపకారం చేశారు. ఈ నాతికీ వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న “సుశ్రుతసంహిత” లోని ముఖ్యాంశాలు దేశ దేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్యచికిత్సలు ఆయుర్వేద వైద్యవిధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున వుండి, ఈనాటికీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలలో మగ్గుతూ పూర్తి వివరాలకోసం వేచివున్నాయి. ఉదా: రక్త మోక్షణ.

యితర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు :-
సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం “అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర” ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్ లో “గుష్టి” (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.

సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుదు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూదా 8 వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి.

ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి “మనక్” అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత “మనక్” బాగ్దాద్ లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.