దారిద్ర్య దహన గణపతి స్తోత్రం


సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం

విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం

మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్

ఇతి శ్రీ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం

ఓం గం గణపతయే నమః

IMG_20140829_125335

దారిద్ర్య దహన శివస్తోత్రమ్


రచన: వసిష్ఠ మహర్షి

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 ||

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 ||

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 ||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 4 ||

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ |
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 ||

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 ||

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 ||

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ || 9 ||

|| ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్ ||

8

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేద్దామని మీకు ఉందా?


తిరుమలలో మీరు వాలంటీర్ గా చేద్దామని మీకు ఉందా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? వివరాలు తెలీక బాధబాధ పడుతున్నారా ? అయితే ఇక చదవడమే మీ వంతు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?
తెలుసుకోండి మరి…!

  • నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!
  • ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.
  • హిందువులు మాత్రమే అర్హులు.
  • హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.
  • శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.
  • వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.
  • ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.
  • కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
  • సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.
  • శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.
    సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.
  • గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.
  • శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.
  • కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.
  • ” సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు.”
    నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.
  • తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.
    సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.
    డ్రెస్ కోడ్..!
  • సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
    వివరాలు పంపాల్సిన చిరునామా..!
    పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము,
    కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
    వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.