కల్యాణవృష్టిస్తవః


కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః|
సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్||౧||

కళ్యాణములను వర్షించునవీ, అమృతముతొ నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించు నట్టి మంగళములను చూపించునవీ, అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింప బడలేదు?

ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే|
సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య||౨||

ఒ తల్లీ| నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనంద బాష్పములతొ నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతొ నిండినదీ, అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక. ఇది మాత్రమే నా కొరిక.

ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః|
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి||౩||

ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునొ ఒ జననీ| వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.

లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం
కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్|
కన్దర్పకొటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమొహయన్తి తరుణీర్భువనత్రయేపి||౪||

ఒ త్రిపురసుందరీ| కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కొటి మన్మథసమానులై ముల్లొకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.

హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా
మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే|
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః||౫||

త్రికొణము నందు నివసించు ఒ తల్లీ| త్రిపుర సుందరీ| మూడు కన్నులు ఉన్న దానా| నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లొకపాలులతొ క్రీడించుచున్నారు.

హన్తుః పురామధిగళం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః|
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య||౬||

ఒ తల్లీ| అమృతముతొ తడిసి చల్లనై న నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచొ త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఏంత క్రూరముగా ఉండేదొ కదా|

సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః|
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి||౭||

ఒ దేవి| నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమును, సభలొ వాక్పాటవమును కలిగించును. అంతేకాక మేరుస్తున్న కిరీటమును, ఉజ్జ్వలమైన తేల్లని గొడుగును, రేండు పక్కల వింజామరలను, విశాలమైన భూమిని(రాజ్యాధికారమును) ఇచ్చును.

కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః|
ఆలొకయ త్రిపురసున్దరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్||౮||

ఒ తల్లీ| త్రిపురాసుందరీ| కొరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణా సముద్రములు అగు నీ కటాక్షముతొ అనాథయైన, నీ పై ఆశలు పేట్టుకున్న నన్ను చూడుము.

హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహన్తి కిల పామరదైవతేషు|
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌ మి శరణం జనని త్వమేవ||౯||

అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనస్సులనుంచి భక్తి పేంపొందించుకొనుచున్నారు. ఒ దేవి| నేను మనస్సుతొ నిన్నే స్మరించుచున్నాను. నిన్నే నమస్కరించుచున్నాను. ఒ తల్లీ| నీ వే శరణము.

లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలొకయ త్రిపురసున్దరి మాం కదాచిత్|
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతొ జనిష్యతి జనొ న చ జాయతే చ||౧౦||

ఒ త్రిపుర సుందరీ| నీ కటాక్షవీక్షనములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము.నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబొడు, పుట్టుట లేదు.

హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే|
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః||౧౧||

ఒ త్రిపుర సుందరీ| ’హ్రీం’ హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించినది ఈ లొకములొ ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతొ విరాజిల్లు భూదేవి శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.

సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
సామ్రాజ్యదాననిరతాని సరొరుహాక్షి|
త్వద్వన్దనాని దురితాహరణొద్యతాని
మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్||౧౨||

పద్మముల వంటి కన్నులు కల ఒ త్రిపుర సుందరీ| నేకు చేయు వందనములు సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతొషము నిచ్చును. సామ్రాజ్యములనిచ్చును. పాపములను తొలగించును. ఒ తలీ నీ నమస్కార ఫలితము ఏల్లప్పుడు నన్ను పొందుగాక.

కల్పొపసంహృతిషు కల్పితతాణ్డవస్య
దేవస్య ఖణ్డపరశొః పరభైరవస్య|
పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా||౧౩||

ఒ త్రిపురసుందరీ| ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము-అంకుశము-చేరకువిల్లు-పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడుచున్నది.

లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశొణమ్|
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికొణనిలయం పరమామృతార్ద్రమ్||౧౪||

అమ్మా| తేజొవంతమైనదీ, కుంకుమతొ ఏర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికొణము యొక్క మధ్యలొనున్నదీ, అమృతముతొ తడిసినదీ, అగు నీ అర్ధశరీరము ఏల్లప్పుడు నా మనస్సునందు లగ్నమగు గాక.

హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి|
త్వత్తేజసా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనొతి సరసీరుహసమ్భవాదేః||౧౫||

ఒ త్రిపుర సుందరీ| ’హ్రీం’ కారమే నీ పేరు. నీ రూపము. అది దుర్లభమైనదని చేప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచ భూతసముదాయము బ్రహ్మ ముదలగు సమస్త జీవరాశికి సుఖమును కల్గించుచున్నది.

హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం
స్తొత్రం యః ప్రతివాసరం తవ పురొ మాతర్జపేన్మన్త్రవిత్|
తస్య క్షొణిభుజొ భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః||౧౬||

ఒ తల్లీ| మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వేలుగొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు.లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును.చిరాయువు కలుగును.
హర హర శంకర జయ జయ శంకర

హర హర శంకర జయ జయ శంకర

కార్తీక మాసము – 13 వ అధ్యాయము(కన్యా దాన ఫలము)


ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసములో యింకనువిధిగా చేయవలసిన ధర్మములు చాల యున్నవి. వాటిని వివరించెదను. సావధాను డై అలకి౦పుము. కార్తీక మాసములో నదీస్నాం ముఖ్యము. దాని కంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్ష తలు , దక్షణ తా౦బూలాది. సంభావనలతో తృప్తి పరచినాను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహా పాపములు చేసియున్నాను, అ పాపములన్నియు పోవును.ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిన నూ పై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనము చేసిన౦దు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తి శ్రద్దలతో కన్య దానము చేసిన యెడల తను తరించుటయే గాక తన పితృ దేవతలను కూడా తరింప జేసినా వాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ” సువిరు”డను ఒక రాజుండెను. అతనికి రుప వతియను భార్య కలదు. ఒక సారి సువిరుడు శత్రు రాజులచే ఓడింప బడిన వాడయి. భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హినుడయి నర్మదా నదీ తీరమందు పర్ణ శాలను నిర్మించుకొని కంద మూలా ఫలాదులను భక్షించుచు కాలము గడుపు చుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచు చుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయిన ప్పటికి శుక్ల పక్ష చంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు, అతి గారబముతో పెరుగు చుండెను, ఆమె చూచు వార లకు కనుల పండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒక దినము వాన ప్రస్థుని కుమారుడా బాలికను గాంచి అనే అంద ఛందములకు పరవశుడై అ బాలికను తన కిచ్చి పెండ్లి చేయమని అ రాజునూ కోరెను. అందులకా రాజు’ ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బిద స్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తోలుగుటకు గాను నాకు కొంత దానమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు’నని చెప్పగా తన చేతోలో రాగి పైసా యైన నూ లేకపోవుటచే బాలిక పై నున్న మక్కువతో అ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి దన పాత్రా సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్త వారింటికి పంపెను.
అటులా ముని కుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లి దండ్రులకు నమస్కరించి అంత వరకు జరిగిన వృత్తంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభావించు చుండెను. సువిరుడు ముని కుమారుడి చ్చిన దన పాత్రను తీసుకోని స్వేచగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా వుండెను. యతుల కొంత కలం జరిగిన తర్వాత అ రోజు భార్య మణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల యెవరి కైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచు చుండెను.
ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానర్ధమై వచ్చుచు దారిలో నున్న సువిరుని కలుసుకొని’ ఓయీ! ని వెవ్వడవు? నీ ముఖ వర్చసు చూడ రాజ వంశము నందు జన్మించిన వాణి వలె నున్నావు. నివి యరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి?” అని ప్రశించగా, సువిరుడు” మహానుభావా! నేను వంగ దేశమును నేలుచుండేది సువిరుడను రాజునూ. నా రాజ్యము శత్రువులాక్రమించుటచె భార్య సమేతముగా నీ యడవిలో నివసించు చున్నాను. దరిద్రము కంటె కష్ట మేదియూనూ లేదు. పుత్రా శోకము కంటె గొప్ప దుఖము లేదు. అటులనే భార్య వియోగము కంటె గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్య భ్రష్టుడని యి నందున యీ కారడవిలో నె సకుటుంబముగా బ్రతుకు చున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాణి వద్ద కొంత దానము పుచ్చు కొంటిని. దానితోనే ఇంత వరకు కాలక్షేపము చేయుచున్నాను” అని చెప్పగా, ‘ ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము లలోచి౦పక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహా పాతకములలో నొకటి, కన్యను విక్రయిన్చున వారు’ అసి పత్ర వాన’ మను నరక మనుభావి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృ దేవత ప్రిత్యర్ధము యే వ్రతము చేసినాను వారు నశి౦తురు. అది యూను గాక కన్య విక్రయము చేసిన వారికీ పితృ దేవతలు పుత్ర సంతతి కలుగ కుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్ధ మగుటయే గాక అతడు మహా నరక మనుభావి౦ చును. కన్య విక్రయము జేసినా వారికీ ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా ణి౦చి యే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున ణి రెండవ కుమార్తెను ణి శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మభుద్ది గల వణికి కన్య దానము చేయుము. యతుల చేసిన యెడల గంగ స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందు టయే గాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలిగి పోవును” అని రాజునకు హితోప దేశము చేయగా అందుక రాజు చిరు నవ్వు నవ్వి ” ఓ ముని వర్యా! దేహ సుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జరా విడువమా౦టారా? ధమను, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦ప గలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్య మైయున్న వారిని లోకము గుర్తిస్తుందా?
గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధన మేవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కానీ, కన్య దానము మాత్రము చేయను’ అని నిక్కచిగా నిదివేను. ఆ మాటలకూ సన్యాసి ఆశ్చర్య పడి తన దారిన వెడలిపోయెను. మరి కొన్ని దినములకు సువిరుడు మరణించెను. వెంటనే యమ భటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమ లోకములో అసి పత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా భాదించిరి. సువిరుని పుర్వికుడై నా శ్రుత కీర్తి యను రాజు ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గ మందు సర్వ సౌఖ్యములు అనుభవించు చుండెను. సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ శ్రుత కీర్తిని కూడా యమ కింకరులు పాశాములతో బంధించి స్వర్గము నుండి తీసుకోని వచ్చిరి. అంతటా శ్రుత కీర్తి ” నేనెరిగున్నత వరకును ఇతరులకు ఉపకారము చేసి ధన ధర్మదులు, యజ్ఞ యాగాదు లోనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె? ” నని మనమునందు కొని నిండు కొలువు దీరి యున్న యమ ధర్మ రాజు కదా కేగి , నమస్కరించి ” ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధరముర్తివి, భుద్ది శాలివి. ప్రాణ కోటి నంటాను సమ౦గా జూచు చుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణ మేమి? సెలవిండు’ అని ప్రాధేయ పడెను. అంత యమ ధర్మ రాజు శ్రుత కీర్తిని గాంచి’ శ్రుత కీర్తి! నీవు న్యాయ మూర్తివి, ధర్మజ్ఞుడవు, ని వెతువంటి దురాచారములూ చేసి యుండలేదు. అయిన నేమి? నీ వంశియుడగు సువిరుడు తన జ్యేష్ట పుత్రికను దానమున కాశించి అమ్ముకోనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వికులు యిటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్ను వరెంతటి పుణ్య పురుషులైనను నరకమనుభావించుట యే గాక, నిచ జన్మ లెత్త వలసి యుండును. నీవు పుణ్య త్ముడ వాణియు ధర్మతుడా వాణియు నేనేగుడును గణ, నీ కోక ఉపాయము చెప్పెదను. నీ వంశీ యుడగు సువిరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచూన్నది. నా యశిర్వా దాము వలన నీవు మనవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శిలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాల౦కృత కన్య దానము చేయుచు, యతుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువిరుడు, మీ పితృ గణములు కూడా స్వర్గ లోకమున కెగుదురు. కార్తీక మాసములో సాల కృత కన్య దమను చేసిన వాడు మహా పుణ్యాత్ముడుగాను. పుత్రిక సంతానము లేనువారు తమ ద్రవ్యముతో కన్య దానము చేసినను, లేక విది విధానముగా అబోతునకు వివాహ మొనర్చిను కన్య దన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపి నటుల చేసితి వేణి ఆ ధర్మ కార్యము వలన న పితృ గణము తరిం తుర పోయి రమ్ము ‘ అని పలికెను.
శుర్తి కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకోని నర్మదా తీరమున ఒక పర్ణ కుటిరములో నివసించు చున్న సువిరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోష పడి, ఆమెతో యవ్వతి విషయములు వివరించి కార్తీక మాసమున సువిరుని రెండవ కుమార్తెను సాలం కృత కన్య దన వివాహము చేసెను. యతుల కన్య దానము చేయుట వలన సువిరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలసి కొనెను.
కన్య దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయములో వారకి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యా దానము చెయవలయునని దీక్ష భుని ఆచరించిన వాడు. విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి యుండి వుదసినత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
త్రయోద శాద్యయము – పదమూడో రోజు పారాయణము సమాప్తము.

కార్తీక మాసం విశిస్టత


శివ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం… కార్తీక మాసం

మన భారతీయ సంసృ్కతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అను బిరుదు కలిగింది.
‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ! ప్రతి ఈశ్వ రాలయంలో ఆ రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందు వుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశ ేషంగా ఆరాధిస్తారు.
ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.
ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.

ఈ మాసమందు వచ్చు సోమవారములు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాస ముప్పది దినములు ఆచరించిన వార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడినది.

ఇందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.

కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారా ధనలు, పూజలు కావించి, నివేదించిన అన్నాన్ని రా త్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక నక్తవ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా ‘‘అర్థనారీశ్వ రుడుగా’’ దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ‘‘అధ్యక్షురాలు’’గా అధిరోహించియుండగా! పరమే శ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయి స్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తా డుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.

కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహ స్తుంది అని చెప్పబడినది.
ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనమందు ఉంటాడని చెప్తారు.

ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చినది. పాల సముద్రమును చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధ నలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశము నలుమూలలా గల ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమి ట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వ హిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభము లకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమే శ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహి స్తారు. అలా హరి హరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పుటకు సహస్రముఖములు కలిగిన ఆదిశేషుడు, చతు ర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత? అని సూతమహాముని చెప్పియున్నారు.

మన సంసృ్కతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవునేయి కలిపి వెలిగించిన దోషములేదని, అలా! ఒకటి మొదలు వేయి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభ ప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాం గణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.
ఈ మాసమందు సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వార్కి కాను కలు సమర్పించుటతోపాటు, సమీప వన మందు బంధువులు, స్నేహితులతోకూడి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారముతో వన భోజనములు చేస్తూ ఉండుట మంచిది. అం దువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదము తోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుంది.

అట్టి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసమందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ ‘‘కార్తీకపురాణ’’ పఠనము గావించిన ఎడల అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాకుండా, జన్మాంతరమందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్య్యమును గూర్చి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.

విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం:కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక దీపాలు:ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక సోమవారాలు:ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.

ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.

కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.

సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన – సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.

ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.

పంచారామాలు


ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

పంచారామాల పుట్టుక

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు – కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
‍ ‍ ‍ ‍ ‍ ‍ – స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) – భీమేశ్వరుడు
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) – భీమేశ్వరుడు
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) – రామలింగేశ్వరుడు
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) – సోమేశ్వరుడు
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) – అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.

అమరారామము
గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.

దక్షారామము

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది.
ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు
శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.

సోమారామము
పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

కుమారభీమారామము
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.

కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02′ ఉ, రేఖాంశము 82 12′ తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.

క్షీరారామము
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.

కార్తిక పురాణము – 4వ అధ్యాయము( (దీపారాధనా మహిమ)


అథ చతుర్థధ్యాయ ప్రారంభః
జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక రాజుగలడు. సంతానము లేక గోదావరీతీరమందు తపస్సు చేసెను. గోదావరీ స్నానార్థమై పైప్పమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆమాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పల్కెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్రసంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగ ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను జేసెను. పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రునిగనెను. ఆరాజు విని అధికానందమును బొంది కార్తీకమహాత్మ్యము సత్యమైనది ఈకార్తీకవ్రతము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీకమాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు “శత్రుజిత్” అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చినవారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడైయుండెను.
ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయొక్క నడుమువంటి నడుుగది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిరుదులును, కుచములును గలదియు, అరటి స్థంభములవంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై యుండెను. ఆరాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ భ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారునియొద్దకుబోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈప్రకారముగా అనేకదినములు జరిగినవి. ఆసంగతి బ్రాహ్మణుడు తెలుసుొి నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తీకపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి క్తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దదు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణినరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆజీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆదినము కార్తీకపూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందుముగ్గురికి శివుని సన్నిధియందు మరణము గల్గినది. అంతలో పాశ హస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానముమీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈనాభార్య జారిణి. ఈరాజకుమారుడును జారుడుగదా. నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి అని యడిగెను. శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పదము వినుము. ఈనీభార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి కామమోహముచేత కార్తీకపూర్ణిమా సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను చించి వత్తిని చేసి ఇచ్చినది.గాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈరాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనయినా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీభార్యకు రాజకుమారునకు ైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగా లేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి.
శివదూతలు ఈప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈబ్రాహ్మణుని భార్యతో రమించి ఈబ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈబ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతినొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి. కాబట్టి కార్తీకమాసమున ధర్మమును జేయవలెను. అట్లు చేయనివాడు రౌరవనరకమును బొందును. కార్తీకమాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమునందుగాని దీపమాలను సమర్పించిన యెడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్ద్వారా పునరావృత్తిరితమగు మోక్షమునొందును. సందేహములేదు. కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుుగాని తన శక్తికొలది దీపార్పణము చేసినయెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీకమాసమున దీపముల పంక్తి సమర్పించుము.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ స్సమాప్తః

సక్కియ నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు


సక్కియనాయనారు తిరుచంగమంగయిలోని వెల్లాల కులజుడూ. ఆయనకు ఇహలోక వ్యాపకాలన్న అయిష్టత ఏర్పడింది. మోక్షమును పొందదలచాడు. మోక్షమునకు ఉత్తమమైన మంచి మార్గ మభిలషించాడు. బౌద్ధుల ప్రచారము వలలోపడి బౌద్ధ మతావలంబి అయ్యాడు. బౌద్ధమును స్వీకరించినా అది ఈయనకు ఎక్కువ కాలము సంతృప్తి నీయలేదు.

శైవమతమునకు ఆకర్షితుడయ్యాడు. బాహ్య చిహ్నములేవైనా, బాహ్య ప్రవర్తనమేదైనా దేవునియందు అచంచల భక్తి ప్రపత్తులున్నచో మోక్షమునందగలడు అని నాయనారు మనస్సుకు గాఢంగా తట్టింది. బాహ్యంగా బౌద్ధమత చిహ్నాలు వీడకపోయినా ఆయన మనస్సులో శివునియందు అచంచలమైన భక్తి ప్రపత్తులు నెలకొన్నవి. శివుని గాఢంగా ప్రేమించాడు.

ఒకరోజున శివాలయములో బయట కూర్చుని శివలింగము గూర్చిన తలంపుతో మైమరిచిపోయాడు. ఆ స్థితిలో శివలింగముపై తాను రాయిని వుంచుట తటస్థించింది. మరునాడు దేవాలయమునకు వెళ్ళి వెనుకటి దినమున తానేమి చేసాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు కూడా శివునిపై రాయిని వేశాడు. రోజూ ఈ విధమైన పూజ జరిగింది. ఈ పని చేయనిదే ఆహారము గూడ తీసుకునే బుద్ధయ్యేదికాదు. ఒకరోజున భోజనానికి కూర్చోగానే తాను రోజూ చేసే పూజ చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది. ఆకలిని గూడ మరచి దేవాలయమును దర్శించి భక్తితో శివునిపై రాయి నుంచాడు. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆసీర్వదించి కైలాసానికి తీసుకుని వెళ్ళాడు.

కార్తీక పంచమి – జ్ఞాన పంచమి – లక్ష్మీ పంచమి


అలిమేలు మంగతాయారు పుట్టిన రోజు::
స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణుభగవానుడి హృదయం మీద తంతాడు… తన నివాస స్థలమైన ప్రదేశంలో తన్ని తనను తన భర్తను అవమానించినా… శ్రీహరి భృగు మహర్షిని ఏమీ అనకుండా మిన్నకుండడం.. శ్రీలక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది.. అందుకే
(పతికి/ గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) బాధపడి పాతాళానికెళ్ళిపోయిందనీ, శ్రీ లక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీమహావిష్ణువు చేసిన తపస్సుకుఫలితంగా సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించి, కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు.
పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు. అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు .. ఈరోజు అమ్మవారు, అయ్యవారలు పరమ కరుణాదృష్టితో ఉంటారు.. ఈ రోజు తిరుమల/తిరుచానూరు స్వామి వార్లను దర్శించడం చాలా ఉత్తమం….ఈరోజు తిరుమలనుంచి వచ్చే ప్రత్యేక సారెను ఏనుగులపై ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి(తిరుచానూరు)కి సమర్పిస్తారు .
ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆదీక్ష తీసుకునేవారు కూడా ఈ నాడు తీసుకుంటూంటారు.
తన పతి ఏ చోట అవమానింపబడ్డాడో ఆ చోటు విడిచింది అమ్మవారు, అంటే ఆది లక్ష్మియైనా సరే పతినింద, గురునింద తట్టుకోలేదన్నమాట. విష్ణుమూర్తే భృగుమహర్షితో అనునయంగా మాట్లాడినా తన భర్తకు జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది (మనకీ గురునింద వినరాదు, గురునింద జరిగేచోటునుండి వెంటనే వెళ్ళిపోవాలి అని శాస్త్రాలు/పెద్దలు చెప్తారు)కాబట్టి అయ్యవారిని విడిచి కాకుండా అమ్మవార్ని సంతుష్టురాల్ని చేయటానికి ’అయ్యవార్ని అమ్మవార్ని’ కలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం/ గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుష సూక్త, శ్రీ సూక్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా హయిగా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం. , ఇతర లక్ష్మీ దేవి స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇక ఈ పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు, ఈ రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని నమ్మకం

కార్తీక పురాణము — అధ్యాయం — 5


అథ పంచమాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసమువలెపాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును. భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసినయెడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును. కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి విముక్తుడాయెను. ఆకథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా చెప్పెను.
కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆదేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీకమాసమందు ప్రాతస్స్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆమాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప పడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆతండ్రి ఇట్లనెను. కుమారకా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈపనివల్ల ఏమిఫలము అనియడిగెను. కిరాతా! వినుము చెప్పెదను. నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము ఈధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీకమాసమందు మోహముచేతనైనను స్నానదానాదికమును జేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను. కిరాతుడును మూషకదేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు బుద్ధినుంచుము. అట్లయిన యెడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః

శిరప్పులి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు


చోళదేశంలో తిరువాకూరులో నివసించే బ్రాహ్మణ కులజుడు శిరప్పులి నాయనారు. శివునియందు శివభక్తులయందు గాఢమైన భక్తి ప్రపత్తులు కలవాడు. వారిని పూజించి, చిత్తశుద్ధితో వారల సేవలు చేసేవాడు. పంచాక్షరీమంత్రముతో భావయుక్తంగా పగలు రాత్రి నిరంతరము జపించేవాడు. పరమశివునకు యజ్ఞయాగాదులు గూడా చేశాడు. ఈ పనులు శివుని మురిపించినవి. శిరప్పులినాయనారుకు శివానుగ్రహము పూర్తిగా లభించింది.

ఈ నాయనారు భక్తి నిరంతర ఓం నమఃశివాయ పంచాక్షరి జపంలో కనిపిస్తుంది. అత్యంత సులభమైన ఈ నిత్యపంచాక్షరీ జపము అనంతమైన ఫలితానిస్తుంది. అయినా అజ్ఞానంతో, మాయలో కప్పబడి మానవులు ఈ ప్రక్రియనవలంభించరు. మనసు అలా చేయనీయదు.

ఈ మంత్రానుష్టానము నిరంతర ప్రక్రియగా కొనసాగినచో అది మానసిక ప్రవృత్తనే తత్త్వాన్నే మార్చి వేయగలదు. ఆ జపము దివ్యచలన తరంగాలకు కారణమవుతాయి. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానము సమూహానికి సంఖ్యామాణానికి విలువ నియటంలేదు. శాస్త్రజ్ఞాణము ఏమీలేని పామరుడు గూడా అణువులోని, కణములోని మహత్యము గుర్తెరుగుతున్నాడు. శబ్దతరంగాల విశిష్టత, మానసిక ఆలోచనా తరంగాలు తెలిసికొనలేకపోయినచో అది బుద్ధిహీనతే అవుతుంది. అవి మనుజులలో భౌతికంగా, మానసికంగా ఆధ్యాత్మికంగాను విశిష్టమైన మార్పులు తెస్తాయి.

ప్రతిక్షణము దేవుని జ్ఞాపకముంచుకొని – నిరంతరం ఆయన నామము జపించుట ఉత్తమమైన యోగ ప్రక్రియ.

చేరమాన్‌ పెరుమాళ్‌ నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు


ఇప్పటి కేరళ రాష్ట్రమయిన మలైనాడులో చేరమాన్‌ పెరుమాళ్‌నాయనారు కోడున్‌కోలూరులో (మలైనాడు రాజధాని. మహోదయం అనిపేరు గూడా వుంది) – ఉత్తియన్‌ కుటుంబము కొత్తయార్ల రాజ వంశములో జన్మించాడు. చేర వంశస్తులందరికి చేరమాను అనునది సాధారణ నామము. పట్టాభిషిక్తుడైన తర్వాత పెరుమాళ్‌ అని పిలిచేవారు. అసలు పేరు – పెరుమ్‌ -మ-కొత్తయారు. మంచి సంస్కారవంతుడు. బాల్యము నుంచి దైవభక్తి తత్పరతతో నుండెడివాడు. వయస్సు పెరిగిన కొలది దైవభక్తి గూడ పెరుగుతూ వచ్చింది. విచక్షన, నిష్పక్షపాతము ఆయనలో మూర్తీభవించాయి. పరిపాలకుడుగా నుండాలన్న ఇచ్చ ఆయనకు లేనేలేదు. అందుకని వయస్సురాగానే సన్యసించి తిరువంజక్కళముకు చేరి అచ్చట శివపూజాదురంధరుడై యుండెను. దేశాన్ని సెన్‌గోల్‌ పోరయాను (చెంగప్పరుడు) పరిపాలించేవాడు. ఆయన గూడ నిత్యానిత్య వివేకము నెరిగి మోక్షమునకై ప్రపంచ సంబంధాల నుండి వైదొలగి వెళ్ళిపోయాడు. ఆయనకు సంతతి లేదు. సింహాసనం ఖాళీగా వుంది. అందుకని ప్రజలు తిరువంజక్కళమునకు వెళ్ళి పెరుమ్‌-మ-కొత్తయారును సింహాసనమధిష్టించి రాజ్యాన్ని కాపాడమని అర్థించాడు. తన దైవ ఉపాసనకు అడ్డంకియని ముందర రాజ్యమధిష్టించుటకు అంగీకరించలేదు. కాని దైవాజ్ఞ – అతను పరిపాలకడుకావాలని. దేవాలయమునకు వెళ్ళి దేవుని ప్రార్థించాడు. పరమాత్మ అతనిని రాజువుకమ్మని ఆదేశించాడు. నీవు రాజువయితే ప్రజలు నిన్ను అనుసరిస్తారు. రాజువై నీవు శైవాగమమును వ్యాపింపజేయవచ్చును. అందుకని రాజువుకా అని పరమాత్మ ఆదేశించాడు. దైవాజ్ఞ మూలాన సింహాసన మధిష్ఠించి న్యాయవంతముగా పరిపాలన చేశాడు. ఆయనకు అన్ని భాషలు, చివరకు పక్షుల భాష గూడ తెలుసును. దేవుడు అష్టైశ్వర్యాలు, బలం, రాజవాహనాలు అన్ని ఆయనకు ప్రసాదించాడు.

పట్టాభిషిక్తుడై పిదప దేవాలయమునకు వెళ్ళి అర్చించి తిరిగి వస్తుంటే ఒక చాకలివాడు దేహమంతా విభూతితో కనిపించాడు. ఆ దృశ్యము చేరమానుకు సాక్షాత్తు పరమశివుని చూస్తున్నట్లు అనిపించింది. అందుకని ఏనుగుదిగి చాకలిని అతను వారిస్తున్నా వినకుండా మ్రొక్కాడు. చేరమాను యొక్క అనితర భక్తి అందరకు గోచరమైంది.

చేరమాను పవిత్ర జీవనము, భక్తి ప్రపత్తులు పరమశివుని ముగ్ధుణ్ణి చేశాయి. పెరుమాళ్ళు అనేక శివాలయములను దర్శించి పరమశివుని సేవించి స్వస్థలమునకు చేరుకున్నాడు. మధుర సోమసుందరేశ్వరుడు తన భక్తుడైన బాణాపతిరారు (బారాభద్రుడు) నకు సకలైశ్వర్యములు ఒసగదలచి చేరమాను పెరుమాళ్‌ పేరున ఒక చీటీనిచ్చెదను. దానిని తీసుకొనిపోయి అతనికిమ్ము, అతను సకలము నెరవేర్చును అని చెప్పి చీటీ (తాళపత్రము) ఇచ్చెను. ఆ చీటిలో దైవము సోమసుందరారు రచించిన గీతమున్నది. దాని అర్థము ఇలా వుంది. ‘కవులను పండితులను సమాదరించే, ప్రజలను న్యాయవంతముగా పరిపాలించే ఓ మహారాజా! నీకు జయము, జయము నీ భక్తి తత్ప్రత, దయార్ద హృదయత, దాతృత్వము నన్ను ఆకట్టుకున్నాయి. ఈ తాళపత్రము గొని తెచ్చునా తని పేరు బాణపతిరారు. గొప్ప సంగీత విద్వాంసుడు. పరమ దైవభక్తి తత్పరుడు. నన్ను గూర్చి అతనికి ఇష్టమైన ‘యాజు’ (వీణ) మీద నన్ను కీర్తిస్తూ పాడుతూ వుంటాడు. నిన్ను చూడాలని అభిలషిస్తున్నాడు. అతనిని సాదరంగా గౌరవపురస్సరంగా ఆహ్వానించి అనంత పురస్కారములనిచ్చి గౌరవించవలసినది” అని వుంది.

చేరమాను ఆ విద్వాంసుని ప్రేమతో, గౌరవంతో ఆహ్వానించాడు. ” సోమసుందరేశ్వరస్వామికి నేటికి నా మీద అనుగ్రహము కలిగినదా” యనుకొని చీటి (తాళపత్రము) సంగతి మంత్రులకు తెలియజేసి “కోశమున సకలమును బాణాపతిరారు ఇంటికి తరలించుడు” అని ఆజ్ఞాపించి బాణాపతిరారు వైపుతిరిగీ “స్వామీ ఈ రాజ్యమును గూడ స్వీకరించి మీసేవ చేయ నంగీకరింపవలయును” అని ప్రార్థించాడు. అందులకు బాణాపతిరారు నిర్ఘాంతపోయాడు.

రాజుగారి పరమ భక్తితత్పరత అర్థమైంది. “ఓరాజా! మీ దర్శనంతో నా జీవితము ధన్యమైంది. నాకు కావలసినంత మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకొనగలను. ఆదిదేవుని ఆజ్ఞ కూడా” అని చెప్పి తనకు కావలసినది తీసుకుని రాజుకు వందన మాచరించి తిరిగి వెళ్ళాడు. చేరమాను ఆయనను ఏనుగు మీద ఎక్కించి పంపాడు. తన రాజ్యము పొలిమేరదాక ఆయనతో వెళ్ళి ఆయనను సాగనంపాడు.

చేరమానుకు నటరాజస్వామి యెడ బహు ప్రీతివుంది. తన శరీరము, మనస్సు, ఆత్మను గూడా ఆయనకే అర్పణ మొసగాడు. ప్రతిరోజు ఆయనను అర్చించేవాడు. ఆయన అర్చించే సమయములో నటరాజస్వామి(కనకసభలో) మూవురు ధ్వనులు (కాలందెల) స్వామి నృత్యము చేస్తునట్లు వినిపించేది. ఒక రోజున అర్చన సమయంలో కాలందెల ధ్వని వినబడలేదు. చేరమాను తాను మహాపరాధము చేసితినని భావించి తన ఖడ్గముతో మరణమునకు ఉధ్యుక్తుడయ్యాడు. వెంటనే మూపురధ్వని వినబడింది. ఆకాశము నుండి ఒక వాణి వినిపించింది. ‘నా మిత్రుడు సుందరారు తిల్లై వచ్చాడు. ఆయన మధురమైన పాటలను వింటూ తన్మయుడనైనాను. అందుకని నా మూపురుధ్వనులతో నిన్ను ఆశీర్వదించుటకు ఆలస్యమైంది’. పరమశివుడు – సుందరారు, చేరమాను ఇరువురు మిత్రులవ్వాలని వాంఛించాడు. అందుకని సుందరార్‌ గూర్చి గొప్పగా చెప్పాడు. చేరమాను నటరాజును అర్చించుటకును సుందరారును దర్శించుటకును తిల్లైకు వెంటనే బయలుదేరాడు. చేరమాను తిల్లైచేరే సరికే సుందరారు ఆ స్థలము వదిలి వెళ్ళిపోయాడు. అందుకని చేరమాను తిరువారూరు వెళ్ళి అచ్చట సుందరారును కలిసికొన్నాడు. ఒకరికొకరు సాష్టాంగ ప్రణామములు చేసికొన్నారు. తిరువావూరులో చేరమాను విఖ్యాతినందిన “తిరుమమ్మనికోవై” కృతిని దేవదేవుడైన త్యాగరాజు మీద రచించి పాడాడు.

ఇద్దరూ కలిసి వేదారణ్యం వెళ్ళారు. అక్కడ చేరమాను ‘తిరూఅంతాది’ కృతిని దేవుని మీద పాడాడు. చాల దేవాలయములను సందర్శిస్తూ ఇద్దరూ మధుర చేరుకున్నారు. పాంఢ్యరాజు సాదరముగా వాళ్ళని ఆహ్వానించాడు.

ఆ సమయములో అక్కడ యున్న చోళయువరాజు గూడా వారిని గౌరవించాడు. వాల్లతో కలిసి చాలా దేవాలయములను ఇద్దరూ సందర్శించారు. వారి దగ్గర నుండి సెలవు తీసుకుని చేరమాను, సుందరారు తిరువారూరునకు చేరారు. చేరమాను కోరికపై సుందరారు కొడున్‌కోలూరు చేరమాను వెంట వెళ్ళాడు. అచ్చట చేరమాను సుందరారును ఏనుగుపై వూరేగించి సత్కరించాడు. సుందరారు తిరిగి వస్తూ చేరమానును – రాజ్యమును న్యాయవంతముగ నేర్పుతో పరిపాలించ వలసినదిగా చెప్పాడు. భక్తుని కోరికను చేరమాను తూచాతప్పక పాటించసాగాడు.

మరి ఒకసారి చేరమానుతో సుందరారు కొడున్‌కోలూరులో వున్నప్పుడు – సుందరారు వంటరిగా తిరు అంచైకాలము కోవెలను సందర్శించాడు. అచట తనను సంసార ఇహలోక బాధ్యతలనుండి తప్పించి కైలాసమునకు తీసుకునుపొమ్మని శివుని అర్థించాడు. మహాదేవుడు అతని అభ్యర్థనను మన్నించి తెల్ల ఏనుగుపై కైలాసానికి తెచ్చుటకు ప్రమధగణాన్ని పంపాడు. చేరమానుకు సుందరారు కైలాసానికి చేరుతున్నట్లు తట్టింది. తాను కూడా తన భద్రాశ్వమును అధిరోహించి దాని చెవిలో పంచాక్షరీ మంత్రమునుచ్చరించగా అది చేరమానును సుందరారు వద్దకు తృటిలో చేర్చింది. సుందరారును కలిసికొన్నాడు. ఇద్దరూ కలిసి కైలాసంకు చేరుకున్నారు.

కైలాసంలో ద్వారపాలకులు ఒక్క సుందరారునే లోనికి ఆహ్వానించారు. సుందరారు దేవుని దగ్గరకు వెళ్ళి నుతించాడు. చేరమాను ద్వారం బయటయున్నాడని చెప్పాడు. తన స్నేహితుని మురిపించుటకు పరమశివుడు తన వాహనమైన నందికేశ్వరుని పిలిచి చేరమానును తీసుకొనిరమ్మని పంపాడు. శివుడు చేరమానును తన అనుమతిలేనిదే కైలాసానికి ఎలా రాగలిగావు అని ప్రశ్నించాడు. “సుందరారు కైలాసమునకు బయలుదేరుట చూచాను. అతని వియోగము భరించలేక అతనితో వచ్చాను” అని చేరమాను బదులు చెప్పాడు. శివుడు చేరమానును వాత్సల్యంతో కైలాసానికి ఆహ్వానించాడు.

ఈ సంఘటనలో చేరమాను ఒక మహాసత్యాన్ని వెల్లడించాడు. ఒకడు అనర్హుడైనను గురువు (ఋషికి)కు ఆత్మీయుడవగలిగినచో గురువు తనతోబాటు తన శిష్యునికి గూడా భగవత్‌ సాన్నిధ్యము ఇప్పించ గలడన్న సత్యము ప్రస్ఫుటమైంది.

పరమశివుడు చేరమానును తన ప్రమధ గణాధిపతిగా చేసికొన్నాడు.