మంగళ, శుక్రవారాలు ఎవ్వరికీ డబ్బు ఎందుకివ్వకూడదు? కారణం ఏమిటి?


మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.

ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.

జంట అరటిపళ్ళను తినకూడదా?


మనం అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు…. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు… కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు…. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితేచాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు పండితులు ఇలా సమాధానమిస్తున్నారు.. ‘‘అరటి చెట్టు అంటే మరెవరో కాదు.. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను ఆయన ఇచ్చారు. అంతపవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు.కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు.ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా.. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడం మంచింది’’.

శ్రీ రామూల వారి వంశ వృక్షం


బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు.
కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
సూర్యుడు కొడుకు మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు.
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.
పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.
ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
దిలీపుడు కొడుకు భగీరధుడు.
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు.
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.
నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకు లవ కుశలు ఇది రాముడి వంశ వృక్షo …

13450111_516430548547212_2107748648714309820_n

శ్రీ రామ జయం

జై శ్రీరామ్
జై హనుమాన్

శ్రీమదాంజనేయ కల్యాణము


జేష్ఠ మాసం శుద్ధ దశమి నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు సువర్చలా దేవిని వివాహమాడారు

శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.

 

 శ్రీ ఆంజనేయ స్వామి వారు సువర్చలా దేవి

           శ్రీ ఆంజనేయ స్వామి వారు సువర్చలా దేవి

ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది.

విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , ” ఆ కన్య ఎవరు ? ” అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.
బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , ” గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి ” అంటాడు.

” శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను… విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ ” అంటాడు సూర్యుడు.

హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , ” దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? ” అని అడుగుతాడు.
సూర్యుడు ఉత్తరమిస్తాడు , ” సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది. “

సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి..

ఆ దినము ఉత్తరా నక్షత్రము ఉండినది.
హనుమంతుని కల్యాణము ఆనాడు చేయుట ఆనవాయితీ అయినది. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.
భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక
|| శుభమస్తు ||

శ్రీ సువర్చలా సహితఆంజనేయ స్వామి వారికి జయము జయము

జై శ్రీరామ్
జై హనుమాన్

బాల త్రిపుర సుందరిదేవి


త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.

Bala_tripura_sundari_devi

షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.

అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి…..అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు…ఆది దంపతులు…వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే ” మనలోని ముడు అవస్తలు….జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!

ఈ ముడు అవస్థలు …లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!

ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ….”బాలగా..”….అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కెవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది….ఆవిడ ఆత్మ స్వరూపురాలు….ఆవిడను పూజిస్తే….ఙ్నానము కలిగి .. …తానె శివ స్వరూపము తో…చైతన్యము ప్రసాదించి…మోక్షమునకు…అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది…ఈ కరుణా మయి..