త్రిపురసుందరీ

“త్రిపురోపాసన” ఎప్పుడు? ఎక్కడ?

“త్రిపురసుందరీ” ఉపాసన, పూజావిధానం
ఎప్పుడు? ఎక్కడ? ఎలా ప్రారంభమైనదో కొంత పరిశీలిద్దాం.

“మహార్ధమంజరీ’ రచించిన
మహేశ్వరానందుని గురువు యొక్క గురువైన “శివానందుడు”. నిత్యాషోడశికార్ణవమనే కౌళాచార గ్రంథమునకు
“ఋజువిమర్శిని” అనే వ్యాఖ్య వ్రాయుచూ – అందు
“అస్య సంప్రదాయస్య కాశ్మీరోద్భూతత్వాత్” అని
ఉల్లేఖించుట వలన –
త్రిపురోపాసన – కాశ్మీరదేశమునందు ముందుగా
ఉద్భవించినదని తెలియుచున్నది.
‘తంత్రాలోక’ వ్యాఖ్యానకర్త అయిన కాశ్మీర దేశస్థుడు
“జయరధుడు” – వామకేశ్వరీ మత వ్యాఖ్యానమందు –
“వస్తుతోహ్యస్య దర్శనస్య ఏతదేవాచార్యద్వయం కాశ్మీరేషు
అవతారకం” అని 1 – ఈశ్వరశివ, 2 – విశ్వావర్తులను
కాశ్మీర దేశమందు త్రిపురోపాసన ముందుగా
ప్రవర్తింపచేసినట్లు తెలియ జేశాడు.
“కాశ్మీరేషుశ్రీమాన్ “విశ్వావర్త” ఏవ అస్య దర్శనస్య సాక్షాత్
ప్రవర్తయితా” అని ఉల్లేఖించాడు.
వామకేశ్వరీ మత వివరణమను గ్రంథమందు


ఈశ్వర శివుని పేరు – శంకరరాశిగా చెప్పబడినది.

ఈ “విశ్వావర్తుడు” 20 శ్లోకములతో ఒక స్తోత్రవ్యవస్థ చేసి
నట్లు “భటోత్పలాచార్యుడు” తన
“శివస్తోత్రావళి” యందు పేర్కొన్నాడు.
నవత్రికోణాత్మకమైన శ్రీచక్రమునందు కేంద్రస్థానము బిందువు.
ఇది ఓడ్యాణపీఠముగా ఇక్కడ ఉన్న త్రిపురసుందరికి,
చర్యానంద నాధునికి ప్రతీకగా
శివానందాదులచే అంగీకరించబడినది.

ఓడ్యాణపీఠం ఎక్కడ?
త్రిపురా సిద్ధాంతమును కాశ్మీరమునకంటే ముందు – చర్యా
నందనాధుడు ఉడ్డీయాన పీఠమునందు ప్రారంభించాడు.
ఉడ్డీయాన “పీఠం ప్రస్తుతం “స్వాత్” అను పేరుతో
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ దేశమునందున్నది.
ఈ స్థలమునే “ఔర్దాయిని” అని పిలుచుచున్నారు.
దీనికే ఉడ్డీయానమని, ఓఢ్యాణమని నామాంతరములు.
ఇక్కడే “త్రిపురారాధన” పుట్టినది.
ఇక్కడనుంచి కాశ్మీరమునకు వ్యాపించింది.
కాశ్మీరమునుంచి ఉత్తర – దక్షిణ భారతదేశమంతటా వ్యాపించినంది.
కాశ్మీరములో ఈశ్వరశివ – విశ్వావర్తాచార్యులు
“త్రిపురో పాసన” కు నాంది పలికారు.
ఈశ్వర శివుడు వామకేశ్వరీ మతమునకు
“రసమహోదధి” అను పేరుతో కారికావ్యాఖ్యానము రచించెను.
లలితా సహస్రనామములందు
“ఓఢ్యాణ పీఠనిలయా బిందుమండలవాసినీ” అని
ఓఢ్యాణ పీఠమే ప్రముఖస్థానముగా చెప్పబడినది.

Make any Suggitions