నవ నారసింహ క్షేత్రాలు.

1. సింహాచలం వరాహ నరసింహుడు ( విశాఖపట్నం దగ్గర )
2. కోరుకొండ ( రాజమండ్రికి 20 కి.మి )
3. వేదగిరి యోగానంద నారసింహుడు ( విజయవాడకు 50 కి.మి )
4. మంగళగిరి శాంత నృసింహుడు ( విజయవాడకు 30 కి.మి )
5. పెంచలకోన ఛత్రవటి నరసింహ స్వామి ( నెల్లూరుకి 80 కి.మి )
6. అహోబలం నవనారసింహులు ( ఆళ్ళగడ్డకు 25 కి.మి. )
7. కదిరి లక్ష్మి నరసింహుడు ( అనంతపురానికి 90 కి.మి )
8. యాదగిరి గుట్ట లక్ష్మీ నారసింహడు ( హైదరాబాద్ దగ్గర )
9. మట్టపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ( నల్గొండ జిల్లా )

  1. సిమ్హాచలంలో ఉన్నమూర్తిని వరాహ నరసిమ్హమూర్తిగా కొలుస్తాము. సిమ్హాచల స్వామిది ఉగ్రరూపమని,ఆయన్ని శాంతింపచేసేందుకు చందనం పూసి,చందనం పూతతో శివలింగాకారంగా శ్రీ వరాహనరసిమ్హస్వామివారి రూపాన్ని పూజిస్తారు.
  2. విశాఖపట్నం జిల్లాలో సిమ్హాచలం ప్రముఖ క్షేత్రం, వేదవేద్యుడు గనుకనే వేదాద్రి,వేదగిరి,వేదాచలం,అంతర్వేది వంటి వేద సంబంధమైన పేర్లున్న ప్రాంతాలలో స్వామి నెలకొన్నాడు.
  3. యాదగిరి గుట్ట (వేదగిరి) రంగారెడ్డిజిల్లాలో ఉంది. కరీమ్నగర్ జిల్లాలోకూడా ఆ స్వామి కొలువై ఉన్నారు.
  4. పంచక్రోశక్షేత్రమైన అహోబిలం,కర్నూలు జిల్లా వద్ద ఉంది. ఇక్కడ నవ నరసిమ్హ రూపాలు ఉన్నాయి.
  • కరంద నృసింహ
  • యోగానంద నృసింహ
  • ఉగ్ర నృసింహ
  •  వరాహ నృసింహ
  • ప్రహ్లాదవరద నృసింహ
  • చత్రపఠ నృసింహ
  • మాలోల నృసింహ
  • జ్వాలా నృసింహ
  • పవన నృసింహ
  1. కదరి నరసీమ్హ క్షేత్రం అనంతపురం లో ఉన్నది. స్వామి ఉగ్ర రూపంలో అవతరించినప్పటికీ, భక్త వరదునిగా,భక్తుల పాలిట కల్ప తరువుగా ఎందరినో కరుణించిన కరుణామూర్తి.  అందుకే మన మహర్షులు నరసీంహ తత్త్వాన్ని ఇలా చెప్పారు.
    ఆ నాభేర్బ్రహ్మణోరూపం, ఆ గళాద్వైష్ణవం వపుః
    ఆ శీర్షా ద్రుద్రమీశానాం, తదగ్రే సర్వతశ్శివం

    ఆయన దివ్యదేహంలో నాభివరకు బ్రహ్మతత్త్వం,అక్కడి నుండి గళం వరకు విష్ణుతత్త్వం,అక్కడి నుండి శీర్షం వరకు రుద్ర ఈశాన శివతత్వం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అదే నరసిమ్హావతారం. ఆ స్వామి అభయస్వరూపుడు. దుష్టశిక్షణకొరకై అవతరించిన కరుణమూర్తి !

One thought on “నవ నారసింహ క్షేత్రాలు.

  1. Please send the following storam::

    దయ చేసి ఈ క్రింది స్తోత్రం పంపగలరు

Make any Suggitions