swami vivekananda

  • మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం. మానవ చరిత్ర అంతటినీ పరిశీలిస్తే, ఘనకార్యాలను సాధించిన స్త్రీ పురుషుల జీవితాలలో అన్నింటికంటే అధిక సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది. .”వివేకానంద సూక్తి”….
  • మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడవు , ఈ యుగంలో ఆవస్యకమైంది దానం, ఇతరులకు సహాయపడటం. దానం అంటే ఏమిటి ? పారమార్థిక జ్ఞానాన్ని అందించటం అత్యుత్తమ దానం, దాని తర్వాత వ్యావహారిక జ్ఞాన దానం. ఆ పిమ్మట ప్రాణరక్షణ, చివరిది అన్నపానీయాలను అందించటం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు జీవుణ్ణి జననమరణ చక్రపరంపర నుండి రక్షించగలరు
  • “కాదు, నాకు చేతకాదు” అని ఎన్నడు అనుకోవద్దు. మీరు అనంతులు. మీ స్వభావంతో(నిజస్వరూపం) పోల్చితే దేశకాలాలు అన్నీ అల్పమై తోస్తాయి. మీరు సర్వశక్తి సంపన్నులు, దేనిని చేపట్టితే దానిని సాధించగలరు.
  • ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. క్రమంగా అది మన హృదయంలో సింహ సదృశమైన బలాన్ని నింపుతుంది
  • ప్రతీ జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి, అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించటమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో ఒకటిగాని, కొన్నిటినిగాని, లేదా అన్నిటినిగానీ అవలంబించి ముక్తులవ్వండి. మతసారం ఇదే. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంధాలు, దేవాలయాలు, బాహ్యరూపాలు, మూర్తులు —-ఇవన్నీ అప్రధానాంసాలు.
  • Faith, faith, faith in ourselves, faith, faith in God—this is the secret of greatness. If you have faith in the three hundred and thirty millions of your mythological gods, and in all the Gods which foreigners have now and again introduced into your midst, and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves, and stand up on that faith and be strong; that is what we need.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s