భాద్రపద శుద్ధ పంచమి

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు ఋణములలో ఋషి ఋణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ మనకు నేర్పింది వీళ్ళే మరి. దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనే చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు. అదీ కుదరకపోతే అందులో సగం చెయ్యమంటాడు. అలాగే ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమి నాడు స్మరించుకొని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు. ఆ ఐదుగురు ఎవరంటే అత్రి, ఈయన భార్య అనసూయ – వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ఇక రెండవ వారు భరద్వాజుడు, ఆపై గాయత్రీ మంత్ర స్రష్ఠ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని.

నిజానికి ఈ పండుగ స్త్రీలకూ సంబంధి౦చినది. దీనిని భాద్రపద శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. ఈవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసి దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మదేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తుంది.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s