తిరొతిరొ జవరాల తిత్తి తిత్తి ఈ

నాట్యగతికి అనుగుణంగా, ఒక నర్తకి నృత్యం చేస్తుంటే చెప్పిన కీర్తన ఇది.
కొన్నిరోజులు “సాళ్వనరసింహరాయల’” సంస్థానంలో వున్న అన్నమాచార్యులవారు “బహుశా” ఒక నర్తకి నాట్యానికి అనుగుణంగా చెప్పిన కీర్తన అయివుంటుంది.

ఇది కూడా అలమేల్మంగమ్మ తిరుమలనాధుని మురిపిస్తూ నృత్యం చేస్తున్నట్లు భావించి ఆమెనుద్దేశించి ఆచార్యులవారు పాడినట్లు తలపిస్తున్నది. తిరో తిరో, ధిమి ధిమ్మి తిత్తి తిత్తి మమారే…. వంటి పదాలకు వేరే అర్థంలేదు. అట్లావుంటే, మజ్జా మాజ్డా…అంటే నేటికాలంలో ‘శహబాష్‌…. అన్నమాట.


తిరొతిరొ జవరాల తిత్తి తిత్తి ఈ
తరలమైన నీ తారహార మదురే

ధిమి ధింకి తోంగ తొంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రారావు మజ్జామజ్జా
కమలనాభుని తమకపుటింతి నీకు
అమరె తీరుపు ఇదె అవధరించగదో

ఝుక జక్క జంఝుం ఝణకిణాని
ప్రకటపు మురువొప్పె భళా భళా
సకలపతికి సరసపు కొమ్మ నీ
మొకసిరి మెరసె చిమ్ముల మురిపెముల

మాయిమాయి అలమేలు మంగనాంచారి మతి
బాయని వేంకటపతి పట్టాపురాణి
మ్రోయ చిరుగజ్జెల నీ మ్రోతలానేని
సోయగమైన నీ సొలపు చూపమరె..

రచన : అన్నమాచార్య
పాడినవారు : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు,
Sri. Sri. Garimella Balakrishna Prasad garu,
భావము : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

ఓ జవ్వనీ! నృత్యానికి అనుగుణంగా తిరుగు. అట్లు నీవు నర్తించుచున్నప్పుడు
నీ మెడలోని తారహారములు తళుకులీనుచు అదిరిపడుచున్నవి. (కదలిపోవుచున్నవి) తిరో తిరో….తిత్తి తిత్తి ఈ.

పద్మనాభుడైన శ్రీమన్నారాయణుని మైమరపించు భామినీ! ఆ నృత్యగీతమునకు సమమగునట్లు (త్రీరుపు) నీ హావభావములన్నియు అమరియున్నవి. ఇదిగో నీవు ఇక సావధానురాలవై సిద్ధముగానుండుము. ధిమి ధిమ్మి తోంగ తోంగ,దిద్ధిమిక్కి ఆరే…మమ్మారే… పాత్రకనుగుణంగా వున్నది సెబాసూ! సెబాసూ!

సకలమునకు, సర్వమునకు అధినాధుడైన జగన్నాధుని ప్రియరాలా! నీ
ముఖళశోభ మెరిసిపోవుచున్నది. నీ నడకలలో కులుకులు (మురిపెములు)
విరజిమ్మబడుచున్నవి. ఇక ర్వుక జక్క జంర్వుం, రుణకిణా- అని ప్రస్ఫుటమైన నీ సౌందర్యము (మురువు) వెలయుచున్నది. భళా! భళా!

ఓ అలమేలుమంగ నాంచారీ ! మఱుగు (దాచివుంచు తల్లీ!) ఎల్లప్పుడు
అనుసరించియేయుండే శ్రీవేంకటేశ్వరుని పట్టపురాణివి, మైగుచున్ననీ చిరు గజ్జెలుచేయుమంజులమైన సవ్వడులు పారవశ్యముతో కూడిన నీ చూపులతో కలసి ఇంకా మనోహరమై చూపట్టుచున్నవి.


#garimella #balaKrishnaPrasad #annamayya
#TiroTiroJavarala #తిరొతిరొజవరాల #అమరవాదిసుబ్రహ్మణ్యదీక్షితులు

Youtube : https://youtu.be/nV4_L06fhk0

Make any Suggitions