భైరవకోన .(పార్వతీదేవి గుడి)

భైరవకోన ……..పార్వతీదేవి గుడి & అద్భుత గుహాలయాలు


అమ్మవారి దేవాలయం ఎక్కడ కొలువైనా అది భక్తులకు పరవశాన్ని ఇస్తుంది. దివ్యశక్తి శోభిస్తూ కళకళలాడుతుంది. ప్రకాశం జిల్లా కొత్తపల్లి దగ్గర్లోని పార్వతీదేవి ఆలయం కూడా అంతే. సరిగ్గా చెప్పాలంటే, పార్వతీదేవి దేవాలయం కొత్తపల్లికి దగ్గర్లో, భైరవకోన అడవుల్లో ఉంది. ఈ గుడి అడవుల్లో ఉండటాన ప్రతిరోజూ కాకుండా, ప్రతి శుక్రవారం అర్చిస్తారు. అలాగే, పండుగలు, పర్వదినాలు లాంటి విశేష దినాల్లో ఉత్సవాలు జరుపుతారు.
ప్రకాశం భైరవకోన పార్వతీదేవి ఆలయం కొత్త పాతల మేలు కలయిక అంటే బాగుంటుంది. ఎందుకంటే, ఈ గుడి ప్రాచీనమైనది కాదు, ఇటీవలి కాలంలో నిర్మించిందే. కానీ, ఆలలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం మాత్రం ప్రాచీనమైంది. భైరవకోన అరణ్యంలో కొండలున్నాయి. ఆ కొండ గుహల్లో లభించిన పార్వతీదేవి శిల్పం ఈ గుడిలో స్థాపించడాన ఇది విశిష్టతను సంతరించుకుంది.
స్థల పురాణాన్ని అనుసరించి, ప్రకాశం భైరవకోన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి సమీపంలో ఉన్న అడవిలో కొండలు, కోనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అందులో ఓ కొండ గుహలో భైరవ శిల్పం ఉంది. దానివల్లే ఈ కొనకు భైరవకోన అనే పేరు వచ్చిందట. మరో కథనాన్ని అనుసరించి, పూర్వం భైరవుడు అనే రుషి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడట. ఆ రుషి పేరు మీదనే వనానికి భైరవవనం అనే పేరు వచ్చింది అంటారు. భైరవ రుషి, తన తపశ్శక్తితోఒక వ్యక్తికి దివ్యశక్తిని ప్రసాదించి, ఆ కొండల్లో అనేక అద్భుత శిల్పాలను, గుహాలయాలను నిర్మింప చేశాడట. మహర్షి తపస్సు చేసిన ప్రాంతం గనుక ఈ పరిసరాలు పునీతమయ్యాయి.


అమ్మవారి దేవాలయంతో పవిత్ర స్థలంగా భావించే భైరవకోన చూడ చక్కని ప్రదేశం. ఇక్కడి గుహాలయాలు ప్రాచీన వైభవాన్ని చాటే కళా నిలయాలు. ఒక గుహలోని శివుని విగ్రహం వెనుక చెక్కిన పార్వతిని భక్తిశ్రద్ధలతో ఆరాచిన్చేవారట. ఒకసారి భైరవకోన గుహాలయాలను దర్శించడానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి శివుని ప్రతిమ వెనుక కనిపిస్తున్న విగ్రహం అమ్మవారిది కాదని తేల్చి చెప్పారు. కనుక ఆ శిల్పాన్ని పార్వతీదేవిగా ఆరాధించడం సముచితం కాదని చెప్పారు. దాంతో ఆ ప్రాంతీయులు వెంటనే విరాళాలు సేకరించి, తమ ఆరాధ్యదైవమైన పార్వతీదేవికి ఒక ఆలయం నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు. శివాలయమే కాదు, పార్వతీదేవి ఆలయం, దేవీదేవతల శిలారూపాలు, గ్రానైట్ శిలలతో చెక్కబడ్డ శివలింగాలు, ఆకాశగంగ ను తలపించేలా జలపాతం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

భైరవకోన లో ప్రసిద్ధిగాంచిన శివాలయం కలదు. దేనిని క్రీ.శ. 9 వ శతాబ్దంలో నిర్మించారు. పల్లవ రాజుల అద్భుత శిల్పకళకు నెలవు ఈ భైరవకోన. కొండల్ని తొలచి గుహాలయాలుగా నిర్మించడం అన్నది అప్పట్లో ఒక గొప్ప అద్భుత కళ. గుహల గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళ ను గోచరిస్తుంది.

స్థలపురాణం ప్రకారం, కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు. ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకొనే నాధుడు లేక పొట్టకూటి కోసం భైరవుడు దారిదోపిడీలకు పాల్పడేవాడు. అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు అవ్వమని, తనకంటికి కనిపించకుండా భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా స్వీకరించమని, కలియుగానంతరం మరలా తనను సేవించవచ్చని చెబుతాడు. నాటి నుండి నేటివరకుభైరవుడుభైరవకోనలో పూజలు అందుకుంటున్నాడు.

శ్రీ దుర్గా భైరవేశ్వర స్వామి దేవాలయం 
నల్లమల అభయారణ్యంలో ఎక్కడ చూసిన
దేవీదేవతలు శిల్పాలే దర్శనమిస్తుంటాయి. ఓ కొండ రాతిని తొలిచి అందులో ఎనిమిది శివాలయాలను చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. వీటన్నింటినీ ఒకేసారి దర్శించుకోవచ్చు. అన్ని ఆలయాల్లో గర్భగుడి, వరండాలు, స్తంభాలు అన్నీ కూడా కొండ రాయితోనే మలచడం విశేషం. శివలింగాలను మాత్రేమే గ్రానైట్ రాయితో చెక్కి ప్రతిష్టించారు.

ఎనిమిది గుహలలో ఒకటి ఉత్తరముఖంగా (మొదటిది), మిగిలిన ఏడు గుహలు తూర్పుముఖంగా ఉంటాయి.

మొదటిగుహ : తలపాగా ధరించిన ద్వారపాలకులు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. ఉత్తరముఖంగా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. 

రెండవ గుహ – ఏడవ గుహ : రెండవ గుహ మొదలు ఏడవ గుహ వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. గర్భగుడి అన్నింటిలో గ్రానైట్ తో చెక్కబడిన శివలింగాలను ప్రతిష్టించారు.

ఎనిమిదో గుహ : ఎనిమిదో గుహ ప్రత్యేకమైనది. లింగంతో పాటు బ్రహ్మ, విష్ణు బొమ్మలను చెక్కి ఉండటం విశేషం.

అమ్మవారిగుడి : భైరవకోన క్షేత్రంలో అమ్మవారి గుడి నూతనంగా నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం మాత్రం పురాతనమైనది. ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజూ కాకుండా, శుక్రవారం అర్చిస్తారు. పండుగలు, పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు 

భైరవకోన లో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షులకిలకిలారావాలు, ఆహ్లాదభరితవాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

ప్రకాశం జిల్లా నుండి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో ‘భైరవకోన’ కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ప్రకాశం నుండి భైరవకోన కోన 70 కిలోమీటర్ల దూరంలో కలదు. కొత్తపల్లి, అంబవరం గ్రామాల నుండి కూడా భైరవకోన కు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, ఆటోలు దొరుకుతాయి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s