విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది

ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.
ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.
శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ… ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.

రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.
దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.

అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s