శివమిచ్చేత్ మనుష్యాణాం తస్మాత్ శివ ఇతి స్మృతః!

శివుడంటే మానవులకు సర్వ శుభాలను కలిగించే దైవము అని మహాభారతములో శ్రీకృష్ణుని వచనం.
పరమ శివుడిని ఆరాధించే వాడు శివుడు అంటే ఎవరో చక్కని అవగాహన పూర్ణజ్ఞానము కలిగి ఉండాలి. అందుకే అగస్త్య మహర్షి
“అచింత్య రూపం అవ్యక్తం అనంతం అమృతం శివం!!”
చింతించుటకు వీలు కాని వాడు, అవ్యక్త స్వరూపుడు, అనంతుడు, అమృత స్వరూపమైన పరబ్రహ్మమే శివుడని తెలిపెను.
ఎవరి నుంచి బ్రహ్మ విష్ణు రుద్రులు ఆవిర్భవించారో, ఎవరు బ్రహ్మ విష్ణు రుద్రులకు ఆధారమో, ఎవరు బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతమో ఎవరిని బ్రహ్మ విష్ణు రుద్రులు సదా సేవిస్తుంటారో ఆ పరమ పురుషుడే శివుడు.
అందుకే మాండుక్యోపనిషత్ “శివమద్వైతం చతుర్థం మన్యంతే” – త్రిగుణాలకు, త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని తెలిపినది.
ఏ దైవం నుంది విష్ణువు సృష్టించబడ్డాడో, ఏ దైవం విష్ణువును స్థితికారకుడిగా నియమించాడో, ఏ దైవాన్ని విష్ణువు సదా ధ్యానం చేస్తూంటాడో ఆ మహాదైవమే శివుడు. అందుకే శ్వేతాశ్వతరోపనిషత్ –
“తం దేవతానాం పరమం చ దైవతం” సకల దేవతలందరిలోను శివుడు పరాత్పరుడు, దేవాధిదేవుడని తెలిపింది.
ఎవరు సర్వ జీవులలో చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడో, ఎవరు సకల ప్రాణులకు ఆధారమో, ఎవరు ఈ విశ్వమును సృష్టించాడో ఆ పరాత్పర దైవమే శివుడు. అందుకే కైవల్యోపనిషత్ –
“అచింత్యమవ్యక్త మనంత రూపం శివం” – చింతించుటకు వీలుకాని వాడు, వ్యక్తం కానివాడు, అనంతుడే శివుడని తెలిపింది.
నిరాలంబోపనిషత్ – “అనాద్యనంత శుద్ధం శివం శాంతం నిర్గుణం” – ఆది అంతాలు లేని అనంతమైన, నిర్గుణ శాంత స్వరూపమే శివుడని తెలిపినది.
పై లక్షణాలన్నీ ఒక్క శివుడికి మాత్రమే ఉన్నాయి. అందుకే పతంజలి మహర్షి
“క్లేశకర్మ విపాకా శయైరపరామృష్టః పురుష విశేష ఈశ్వరః” – క్లేశాలకు, కర్మలకు, ప్రారబ్దానికి, అతీతమైన మహాపురుషుడు శివుడని తెలిపెను.
శివుడంటే సర్వ దోష రహితుడు, సర్వదోషాతీతుడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s