అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం ఒకటి

అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం ఒకటి. బ్రహ్మ పురాణములో 246 అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణములో విశేషముగా పుణ్య క్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్య తీర్ధముల గురించి చెప్పబడింది. గౌతమీ మాహాత్మ్యము లో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రము గురించి చెప్పబడింది.

పురాణం వైష్ణవం త్వేతత్ సర్వకిల్బిష నాశకం
విశిష్టం సర్వ శాస్త్రేభ్యః పురుషార్ధోపసాదకం
బ్రహ్మ పురాణము విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్ధములకు పొందడానికి సర్వ శాస్త్రాలకంటే విశేషము కలది. – అని శాస్త్రోక్తి. ఇది వేదవ్యాసుడు తన శిష్యుడైన జైమినికి చెప్పాడు.

అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం ఒకటి. బ్రహ్మ పురాణములో 246 అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణములో విశేషముగా పుణ్య క్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్య తీర్ధముల గురించి చెప్పబడింది. గౌతమీ మాహాత్మ్యము లో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రము గురించి చెప్పబడింది.

పురాణం వైష్ణవం త్వేతత్ సర్వకిల్బిష నాశకం
విశిష్టం సర్వ శాస్త్రేభ్యః పురుషార్ధోపసాదకం
బ్రహ్మ పురాణము విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్ధములకు పొందడానికి సర్వ శాస్త్రాలకంటే విశేషము కలది. – అని శాస్త్రోక్తి. ఇది వేదవ్యాసుడు తన శిష్యుడైన జైమినికి చెప్పాడు.

బ్రహ్మ పురాణంలో ఉన్న ముఖ్యాంశాలు.
నక్షత్రముల జన్మము, వివాహము
కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.

ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.
చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట]
ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్ధించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.
చంద్రుడు దక్షునికి నమస్కరించి “తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను” అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.
దేవ, రాక్షస, మానవ గణములు
దక్షుడు ఇలా చెప్పాడు – రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.
వివాహ సమయంలో చేసే ప్రమాణములు
చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు – మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులను అరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.
చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము
తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.
వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.
ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు
ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి
వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.
కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.
ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
చంద్రుని క్షయరోగ విముక్తి
తన భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు అవుతాయని దక్షుడు చెప్పాడు. – అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధృవము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి.

అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.

మహా పాతకము, పుణ్యములో పాపము

నక్షత్రాల, చంద్రుని కథ విన్న తరువాత జైమిని వ్యాసుని “మహాపాతకములు” అంటే ఏమిటని అడిగాడు. అందుకు వ్యాసుడిలా చెప్పాడు – పాతకాలలో ఐదింటిని “మహాపాతకాలు” అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు –
స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము
ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక, ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.

ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే – రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము – అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.

గోవు పుట్టుక

గోవుకు అంత పవిత్రత ఎందుకు కలిగిందని జైమిని అడిగాడు.
శ్వేతవరాహకల్పంలో విరాట్పురుషుడైన పరబ్రహ్మ యోగనిద్రనుండి లేచి ముందుగా తన నాభి కమలంనుండి బ్రహ్మను పుట్టించాడు. అనంతరం తనయందున్న ప్రకృతినుండి విష్ణువును, మహేశ్వరుని సృజింపజేశాడు. అనంతరం ప్రకృతి చేసిన ఒక తప్పిదం కారణంగా ఆమెను “పశువు” అన్నాడు. కాని మరల కరుణించి – నీ ముఖంలో పంచమహాపాతకాలుంటాయి. అయినా నీవు అతిపవిత్రవై యుందువు. నీ మలమూత్రములు కూడా పవిత్రములు. నీ దర్శనము సకల పాపములు పోగొట్టును. నిన్ను దానమిచ్చేవారి శరీరంలో ఎన్ని వెండ్రుకలుంటాయో అన్నివేల దివ్యాబ్ధములు వాఱు గోలోకంలో నివశిస్తారు.- అని చెప్పెను.

గాయత్రి ఉత్పత్తి

గాయత్రి గురించి తెలుపమని జైమిని వ్యాసుని ప్రార్ధించాడు – అందుకు వ్యాసుని ఉత్తరం:
పరబ్రహ్మ నాభి కమలంనుండి జనించిన నాలుగు ముఖాల బ్రహ్మకు “ఓం” అనే ప్రణవనాదం వినిపించింది. అప్పుడు బ్రహ్మ ఒకోముఖంనుండి ఆరు అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రం (మొత్తం నాలుగు ముఖాలనుండి 24 అక్షరాలు) వెలువడింది. కనుక అన్ని వేదములకు ఈ మంత్రము మాతృక. అన్ని మంత్రములకు తల్లివంటిది. ఈ మంత్రాన్ని ఉపాసించేవారి కోరికలు ఈడేరును. బ్రహ్మమును ఉపాసించేవారికి ఇది ముఖ్యసాధనమైన బ్రహ్మవిద్య. ఉపనయనార్హత కలిగిన ద్విజులు తప్ప అన్యులు దీనిని జపించరాదు, ఉపాసింపరాదు.”

బ్రహ్మ పురాణము అధ్యాయ క్రమంలో

 1. మొదటి అధ్యాయములో బ్రహ్మ సృష్టి చేయ సంకల్పించుట. ఆ తరువాత ఉదకమును సృజించుట. ఆ ఊదకములో సృష్టి చేయడానికి వీర్యమును వదలుట. అవి బంగారు అందములుగా తెలియుట. అందు ఒక అండమునందు హిరణ్య గర్భుడుగా తానే జనించుట. బ్రహ్మ మానస పుత్రులను సంకల్ప కారణముగా పుట్టించుట. రుద్రుని పుట్టించుట. సనత్కుమారుడు జన్మించి స్కందుడగుట. పక్షులను, సాధ్యులను పుట్టించుట. ఉరుములు, మెరుపులు, ఇంద్ర ధనస్సు, మేఘములను సృష్టించుట, భువి, దివి, ఆకాశమును సృష్టించుట వర్ణించబడ్డాయి. బ్రహ్మ స్త్రీ పురుషులుగా మారి ప్రజలను వృద్ధి చేయుట. పురుషుడు జగములందు విష్ణువుగా వ్యాపించుట. విష్ణువు విరాట్పురుషుని పుట్టించుట. విరాట్పురుషుడు మనువును సృజించుట. మన్వంతరము కొనసాగుట వర్ణించబడినది.
 2. స్వాయంభువ మనువు శతరూపల వివాహము వారి వంశాభివృద్ధి క్రమంలో ధృవ జననము, పృధువు జననము, దక్షప్రజాపతి జననము అతడి వివాహము వారి వివాహములు వర్ణించబడ్డయి.
 3. తృతీయాధ్యాయములో దక్షుడు సంకల్ప మాత్రముగా దేవ దానవ యక్షులను పుట్టించడము. అస్నికను వివాహమాడడము, పుత్రులను కనడము, నారదుని మాటలు విని వారు గృహస్థ జీవితానికి విముఖులై వెళ్లి తిరిగి రాక పోవడము, దక్షుడు తిరిగి వైరిణి యందు వేయి మంది పుత్రులను పొందడము, వారు అన్నలను వెదుకుతూ వెళ్లి తిరిగి రాక పోవడము, తత్ఫలితముగా దక్షుడు కుపితుడై నారదుడిని శపించడము, శాపవశాన నారదుడు బ్రహ్మకు జన్మించడము, దక్షుడు తిరిగి అరవై మంది పుత్రికలను కనడము, వారిని ధర్మునుకి, కశ్యపునికి, చంద్రుడికి ఇచ్చి వివాహము వేయడము వర్ణించబదినది. దేవాసుర ఉత్పత్తి వర్ణించబడినది.
 4. నాలుగవ అధ్యాయములో బ్రహ్మ సృష్టి అంతటికీ అధిపతులను నిర్ణయించుట, రాజులకు కుబేరుడిని, ఆదిత్యులకు విష్ణువును, జలాలకు వరుణిడిని, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుడిని, మరుత్తులకు వాసవుని, దైత్యులకు ప్రహ్లాదుడిని, పితరులకు యముడిని, యక్ష, భూత పిశాచములకు శివుడిని, పర్వతములకు హిమవంతుడిని, నదులకు సాగరుడిని, గంఘర్వులకు చిత్రరధుడిని, నాగులకు వాసుకుని, సర్పములకు తక్షకుడిని, ఏనుగులకు ఐరావతాన్ని, గుర్రములకు ఉచ్ఛైశ్వాన్ని, పక్షులకు గరుడిని, మృగములకు సింహాన్ని, గోవులకు గోవృషమును, వృక్షములకు జువ్విని అధిపతులను చేయడము. దిక్కులకు అధిపతులను నిర్ణయించడము. పృధు చక్రవర్తి సహాయముతో భూని గోవుగా చేసి అందరూ క్షీరమును పితకడము వర్ణించబడినది.
 5. ఐదవ అధ్యాయమున మనువుల గురించి మన్వంతరముల గురించి మనువుల కుమారుల గురించి వర్ణించ బడినది. ఆయా మనువుల కాలములో సప్తఋషుల గురించి వర్ణించబడినది.
 6. ఆరవ అధ్యాయములో కశ్పపునికి వివస్వంతుడు(సుర్యుడు) జన్మించుట, సూర్యుడు త్వష్ట ప్రజాపతి కూతురైన సంజ్ఞాదేవిని వివాహము చేసుకొనుట, ఛాయాదేవి సృష్తి, మనువు, యముడు, యమున, సావర్ణి మనువు, శనీశ్వర జననము, వారి విధులు వర్ణించబడ్డాయి.
 7. ఏడవ అధ్యాయములో వైవసత్వమనువు వంశ చరిత్ర, పురూరవ జననము, దుంధుమారుని గురించి వర్ణించబడినది.
 8. ఎనిమిదవ అధ్యాయములో సూర్యవంశానుక్రమములో త్రిశంఖు చరిత్ర, హరిశ్చంద్రుడు, సగరుడు, దశరధుడు, శ్రీరాముడు, కుశుడు, నలుడు మొదలైన వారి చరిత్ర వర్ణించబడినది.
 9. పదియవ అధ్యాయములోచంద్రవంశ చరిత్ర చెప్పబడినది. గంగాదేవి జాహ్నవిగా మారుట, కవేరి, కైశికీ నదుల పుట్టుక, జమదగ్ని పరశురాముల జననము వర్ణించబడినది.
 10. పదకొండవ అధ్యాయములో కాశ్యపవంశ వర్ణన చేయబడినది.
 11. పన్నెండవ అధ్యాయములో యయాతి చరిత్ర వర్ణించబడినది.
 12. పదమూడవ అధ్యాయములో యయాతికుమారులైన పురువు, దుహ్యుడు, తుర్వసుడు, అనువు, యదువుల చరిత్ర వర్ణించబడినది.
 13. పదినాల్గవ అధ్యాయములో వృష్టి వంస చరిత్ర వర్ణించబడినది.
 14. పదిహేవవ అధ్యాయములో భోజవంశ చరిత్ర గురించి చెప్పబడినది.
 15. పదహారవ అధ్యాయమున అంధక వంశ చరిత్ర చెప్పబడినది. శ్యమంతకమణి వృత్తాంతము వర్ణించబడినది.
 16. పదిహేడవ అధ్యాయములో శ్యమంతకమణి కథా సమాప్తము అయినది.
 17. పద్దెనిమిదవ అధ్యాయములో భువునకోశ ద్వీప వర్ణన చేయబడినది.
 18. పదొమ్మిదవ అధ్యాయములో జంబుద్వీప వర్ణన చేయబడినది.
 19. ఇరవైవ అధ్యాయము ప్లక్ష్యద్వీపము, శాల్మద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, పుష్కరద్విపము అను ఆరు ద్వీపముల వర్ణన చోటు చేసుకున్నది.
 20. ఇరవై ఒకటవ అధ్యాయములో అతల, వితల, సుతల, తలాతల, పాతాళ, రసాతల, నితల అను ఏడు పాల లొకముల వర్నన జరిగినది.
 21. ఇరవైరెండవ అధ్యాయములో నరక లోక వర్ణన పాపములు ఫలితము విముక్తి మోక్షము గురించి వర్ణించబడినది.
 22. ఇరవైమూడవ అధ్యాయములో ఊర్ధ్వలోక వర్నన, విష్ణుతత్వము సృష్టి గురించి తెలుపబడినది.
 23. ఇరవైనాల్గవ అధ్యాయములో బ్రహ్మాండము, సూర్యుడు, వర్షము గురించి వర్ణించబడినది.
 24. ఇరవై ఐదవ అధ్యాయములోసకల పూణ్యతీర్ధాల వర్ణన చేయబడినది.
 25. ఇరవై ఆరవ అధ్యాయములోమునులు సుతుడిని మోక్షము నిచ్చే పుణ్యతీరధము గురించి ప్రశ్నించుట గురించి వర్ణించబడినది.
 26. ఇరవైఏడవ అధ్యాయములో భరత ల్హండము గురిఛిన వర్ణన చేయబడినది.
 27. ఇరై ఎనిమిదవ అధ్యాయములో సూర్యోపాసన, పుజావిధనము, కోణతీర్ధమహిమ గురించి వర్ణించబడినది.రామేశ్వర మహిమ గురించి చెప్పబడినది.
 28. ఇరవై తొమ్మిదవ అధ్యాయములో సుర్యోపసన గురించి పుజా విధానము ఫలితాల గురిమ్చి వివరించబడింది.
 29. ముప్పైవ అధ్యాయములో సుర్యుడి మహిమ గురించి వర్ణించబదినది.
 30. ముప్పై ఒకట్వ అధ్యాయములో సూర్యుది మహిమ సూర్యోపసనా ఫలితాలు వర్ణించబడ్డాయి.
 31. ముప్పై రెండవ అధ్యాయములో మార్తాండుడు జన్మించుట అతడికి తరణి పట్టి మూర్తిని సుందరముగా చెక్కుట వర్ణించబడినది.
 32. ముప్పై మూడవ అధ్యాయములో సూర్య అష్టోత్తరము, శతనామావళి దాని ఫలితము.
 33. ముప్పై ఐదవ అధ్యాయములో పార్వతీదేవి తపస్సు గురిమ్చి వివరంచబడినది.
 34. ముప్పై ఆరవ అధ్యాయములో శివపార్వతుల వివాహాలంకరణ శోభ గురించి వర్ణించబడినది.
 35. ముప్పై ఏడవ అధ్యాయములో శివకల్యాణము వర్ణించబడినది.
 36. ముప్పై ఎనిమిదవ అధ్యాయములో శివుడు పార్వతితో విహరించుత శివుడు కైలాసమును వీడి మెరువును చేరుట వివరించబదినది.
 37. ముప్పై తొమ్మిదవ అధ్యాయములొ దక్షయజ్ఞ వినాశనము గురిమ్చి వర్ణించబడినది.
 38. నలభైయవ అధ్యాయములో దక్షుడు చేసిన శివసహస్రనామావళి గురించి వర్ణించబడినది.
 39. నలభై ఒకటవ అధ్యాయములో ఏకామ్రేశ్వరుని మాహాత్మ్యము గురిమ్చి వర్ణించబడినది.
 40. నలభై రెండవ అధ్యాయములో ఉత్కళ క్షేత్రవైభము గురించి వర్ణించబడినది.
 41. నలభై నాల్గవ అధ్యాయంలో అవంతీపుర వర్ణనము చేయబడినది.
 42. నలభై నాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రం గురించి వర్ణించబడ్డాయి.
 43. నలభై అయిదవ అధ్యాయములో పురుషూత్మ క్షేత్ర ఆవిర్భావము మహిమ గురించి వర్ణించబడినది.
 44. నలభై ఏడవ అధ్యాయములో ఇంద్రద్యుమ్నుదు చేసిన అస్వమెధయజ్ఞము, విష్ణుదేవాలయ ప్రాసాద నిర్మానము గురంచిన వర్ణన జరిగినగినది.
 45. నలభై ఎనిమిదవ అధ్యాయములో విష్ణురూప ముర్తి నిర్మాణము కొరముకు ధ్యానించుటను గురించి వర్నించబదినది.
 46. నలభైతొమ్మిదవ అధ్యాయములో కృష్ణస్తుతి గురించి దాని మహిమ గురించి వర్ణించబదినది.
 47. ఎభైయవ అధ్యాయములో జగన్నధ, బలరామ, సుభద్రల ముర్తుల నిర్మానము గురించిన వర్ణన చేయబడినది.
 48. ఏభై ఒకటవ అధ్యాయములో పురిజన్నాధయాత్రా విధానము మహిమ వర్ణించబడినది.
 49. ఎభైరెండవ అధ్యాయములో స్వయంభువు ఋషి సంవాదములో మార్కండేయుడు వటవృక్షమును దర్శించుట గురించి వర్ణించుట.
 50. ఎభైమూడవ అధ్యాయములో మార్కండేయుడు ప్రళయదర్సనము చేయుట వర్ణించబదినది.
 51. ఎభైనాల్గవ అధ్యాయములో మార్కండేయుడు భగవానుదైన వటపత్రశయి కుక్షి(ఉదరము)అందు ప్రవేశించుట వర్ణించబడినది.
 52. ఎభై అయిదవ అధ్యాయములో మర్కండేయుడు భవానుదైన వతపత్రశాయిని స్తుతించుత వర్ణించబడినది.
 53. ఎభై ఆరవ అధ్యాయములో వటపత్రశాయి అయిన నారాయణుడు ఆ క్షేత్రములో శివలింగ ప్రతిష్ట చేయమని మార్కండేయుడికి ఆనతి ఇచ్చుట. శివుడికి, విష్ణువుకు భేదము లేదని చెప్పుట.
 54. ఎభై ఏడవ అధ్యాయములో పంచతీర్ధ విధిలో జగన్నధుని దర్శించు విధానము గురించి వర్ణించబడినది.
 55. ఎభై ఎనిమిదవ అధ్యాయములో నృసింహ మహిమ గురించి వర్ణించుట.
 56. ఎభై తొమ్మిదవ అధ్యాయములో శ్వేతమాధవుని మహిమ గురిమ్చి వర్ణించబడినది.
 57. అరవైయవ అధ్యాయములో సముద్రస్నాన విధి గురిమ్చి వర్ణించబడినది.
 58. అరవై ఒకటవ అధ్యాయములో విష్ణు పూజా విధానము గురించి వర్ణించబడినది.
 59. అరవై రెండవ అధ్యాయములో సముద్ర స్నానము సముద్రుడికి నమస్కారము గురించి వర్ణించబదినది.
 60. అరవై మూడవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రములోని పంచతీర్ధ మహిమగురించి వర్ణించబడినది.
 61. అరవైనాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్ర దర్శన ఫలసృతి ప్రస్థావించబడినది.
 62. అరవై అయిదవ అధ్యాయములో పురుషోతమక్షెత్రాఅన్ని దెవతలు సహితము దర్శించుకుని తరిమ్చిన విధము వర్ణించబడినది.
 63. అరవై ఆరవ అధ్యాయములో గుడివా రధయాత్రా వర్ణన చేయబడినది.
 64. అరవై ఎనిమిదవ అధ్యాయములో గుదివా యాత్రాఫలము గురించి వర్ణించబదినది.
 65. అరవై ఎనిమిదవ అధ్యాయములో విష్ణులోక వర్ణన చేయబదినది.
 66. పురుషోత్తమ క్షెత్ర వర్ణన ప్[అరొసమాప్తి చేయబడినది.
 67. అనంతవాసుదేవుని మాహాత్మ్యము గురించి వర్ణించబడినది.
  పురుషోత్తమ క్షేత్రమున మరణించిన కలుగు ఫలము, వ్రతములు ఆచరిమ్చిన కలుగు ఫలము వర్ణించబడినది.
  కండూపోఖ్యానము పేరుతో కండూపముని గురించిన వర్ణన చేయబడినది.
  వసుదేవుని మానవ జననము గురించి మునులు వ్యాసుడిని ప్రశ్నించుట వివరించబడినది.
  వాసుదేవుని చతుర్వ్యూహ వర్ణన చెయ్యబడినది.
  హరియంశావతరణ గురించి వర్ణించబడినది.
  కంస విచారము గురించి వర్ణించబడినది.
  బృందావనగమనము గురించి వర్ణించబడినది. కంసుని కృష్ణుని నందుని ఇంట వదిలి వచ్చుట గురించి వర్ణించబడినది.
  కాళీయమదనము (కాళీయ మర్ధనము ) గురించి వర్ణించబడినది.
  ధేనుక కథ (ధేనుకాసుర వధ )గురించి వర్ణించబడినది.
  గోవర్ధన గిరి యజ్ఞము గురించి వర్ణించబడినది.
  శ్రీకృష్ణ బాలచరితము గోవింద పట్టాభిషేకము గురించి వర్ణించచబడినది.
  శ్రీకృష్ణుడి రాసలీల గురించి వర్ణించబడినది.
  కేశివధ గురించి వర్ణించబడినది.
  అక్రూర ప్రత్యాగమనము అను పేర శ్రీకృష్ణ బలరాములను మధురకు తిసుకొనొని పోవుట వర్ణించబడినది.
  కంసవధ గురించి వర్ణించబడినది.
  బలరామ కృష్ణులు తల్లి తండ్రులను కలుసుకొనుట గురుదక్షిణ సమర్పించుట.
  జరాసంధుని దండయాత్రల గురించి వర్ణించబదినది.
  కాలయవనోపాఖ్యము గురించి వర్ణించబదినది.
  బలరాముడు నందగోకులముకు పోవుట.
  బలరామ క్రీడగురించి వర్ణించబడినది.
  రుక్మిణీ కల్యాణం శంబరాసుర వధ వర్ణించబడినది.
  ప్రద్యుమ్నుడు రుక్మిణిని కలుసుకొనుత గురించి వర్ణించడినది.
  రుక్మివధ గురించి వర్ణించబడినది.
  నరకాసురవధ గురించి వర్ణన జరిగింది.
  ఇంద్రుడు హరినిస్తుతించుట గురించి వర్ణన జరిగింది.
  పారిజాతాపహరణం ఇంద్రస్తుతి గురించి వర్ణించబడింది.
  ఇంద్రకృష్ణ సంవాదం కృష్ణుడితో పరహారు వేల నూరు మంది స్త్రీల వివాహం గురించి వర్ణించబడినది.
  అనిరుద్ధచరిత్ర గురించి వర్ణించబడినది.
  బాణాసుర యుద్ధం గురించి వర్ణించబడినది.
  పౌండ్రకవాసుదేవుని కథ గురించి వర్ణించబడినది.
  శ్రీకృష్ణజాంబవంతిల కుమారుడైన సాంబుడి వివాహము గురించి వర్ణించబడినది.
  బలరాముడు నరకాసుర వధకు కోపించి అందుకు బదులుగా భూలోకమును తపింపజేసిన ద్వివిధవానరమును వధించుట వర్ణించబడినది.
  బలరామ నిర్యాణం శ్రీకృష్ణుడు నిజధామముకు ఏగుట గురించి వర్ణించబడినది.
  శ్రీకృష్ణ నిర్యాణం గురించి వర్ణించబడినది.
  శ్రీకృష్ణ చరిత్ర సమాప్తి గురించి వర్ణించబడినది.
  విష్ణ్వతార సంకీర్తనం అనే పేరుయ్తో దశావతారవర్ణన జరిగినది.
  యమలోక మార్గ స్వరూపము వర్ణించబడినది.
  యమలోకము యొక్క దక్షిణ మార్గము గురంచి వర్ణించబడినది.
  అధర్మానుగతి పేరుతో పాపములు శిక్షలు గురించి వర్ణించబడినది.
  జీవుడి చక్ర భ్రమణము అను పేరుతో జీవచక్రము గురంచి వర్ణించబడినది.
  అన్నదాన మహిమ గురించి వర్ణించబడినది.
  పితరులకు పిండ ప్రధాన విధానము గురిమ్చి వర్ణించబడినది.
  శ్రాద్ధకర్మ గురించి వర్ణించబడినది.
  సదాచారముల గురించి వర్ణించబదినది.
  వర్ణాశ్రమ ధర్మాల గురించి వర్ణించబడినది.
  సంకరజాతి లక్షణాల గురించి వర్ణించబడినది.
  దండనిరూపణము గురించి వర్ణించబడినది.
  ఋషి పరమేశ్వర సంవాదమ అనే పేరుతో వాసుదేవుని మహిమను గురింవి వర్ణించబడింది.
  వైష్ణవగతి ఉపాఖ్యానము అను పేరుతో వైష్ణవులు పొందే ఉత్తమగతుల వర్ణన జరిగింది.
  విష్ణుగాన ప్రశస్తి గురించి వర్ణించబడినది.
  విష్ణుమాయాప్రభావము గురించి వర్ణించబడినది.
  భవిష్యత్తు కథ అను పేరుతో కలియుగధర్మము గురించి వర్ణించబడినది.
  భవిష్యత్దర్శనం కలియుగధర్మము గురించి వర్ణించబడినది.
  సృష్టి సంహారము గురించి వర్ణించబడినది.
  నైమిత్తిక ప్రళయము ప్రకృతి లయ గురించి వర్ణించబడినది.
  ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది భూతము గురించి వర్ణించబడినది.
  యోగవిధానము గురించి వర్ణించబడినది.
  సాంఖ్యయోగము గురించి వర్ణించడినది.
  యొగవిధుల గురించి వర్ణించబడినది.
  జనక వశిష్టుల క్షరము అక్షరముగురించిన వర్ణన చేయబడినది.
  పరతత్వవర్ణన పరిసమాప్తి.
  రొమహర్షణ మునుల సమావేశంలో చెప్పబడిన పురాణ శ్రవణ ప్రసంశ.
Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s