వినాయకుడు సర్వస్వతంత్రుడు

వినాయకుడి కన్నా అధికులు కానీ, వినాయకుణ్ణి ఆదేశించేవారు కానీ ఎవరూ లేరు. తనపైన మరొక నాయకుడు లేనివాడు వినాయకుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ వారికన్నా అధికులు (వారిని శాసించేవారు) ఉంటూనే ఉంటారు. కానీ వినాయకుడు సర్వస్వతంత్రుడు. అందువల్ల భారతీయులు ముందు వినాయకుణ్ణి పూజిస్తారు.

IMG_20140829_125335
వినాయకుడు సకల విద్యాధిదేవత. విద్య అంటే కేవలం పుస్తక పాండిత్యమొక్కటే కాదు. విశ్వవ్యవస్థకు సంబంధించిన ప్రతిదీ విద్యయే! అయితే నేటి కాలంలో సమాచార సేకరనను విద్య అంటున్నారు. ఒక వ్యక్తి జీవితం మొత్తం ఒక నిరంతర విద్యాభ్యాస ప్రక్రియ. ఏ విచారనా ప్రక్రియ అయినా విద్యకు సంబంధించినదే. అయితే ప్రధానంగా మన విచారన ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది అనే దానికి సంబంధిమ్చి ఉండాలి. అదే నిజమైన జ్ఞానం.
వినాయకుని ఏనుగు తల బుద్ధి సూక్ష్మత, వివేచన, జ్ఞానాలకు సంకేతం. ఏనుగు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, పరిసరాలను గురించి ఎరుక కలిగి ఉంటుంది. దానికి జ్ఞాపకశక్తి అత్యధికం. దట్టమైన అరణ్యంలో సంచరించేటప్పుడు నిర్దిష్తమైన మార్గంలో గంభీరంగా నడుస్తుంది. తనకు తెలియకుండానే ఇతర జంతువులకు మార్గనిర్దేశం చేయడం ఏనుగు స్వభావం. వినాయకుడు సర్వ ప్రపంచానికీ మార్గదర్శకుడు. ఆయన విఘ్నాలకు నాయకుడు, అవసరమైనప్పుడు విఘ్నాలు కలిగించేదీ ఆయనే. తనను భక్తితో తలచుకున్న వారి విఘ్నాలను అధిగమించడంలో తోడ్పడేదీ ఆయనే.
వినాయకుడి వాహనం ఎలుక. మూషికం చీకటికీ, అజ్ఞానానికీ గుర్తు. వినాయకుడు (అజ్ఞానాన్ని)చీకటిని నిరోధించగలడు. కనుక ఆయనను మూషిక వాహనుడు అంటారు. అజ్ఞానపు చీకటిని పారద్రోలి, ప్రపంచాన్ని జ్ఞాన ప్రకాశంతో నింపుతాడు.
మూషికం ఘ్రాణేంద్రియానికి సంకేతం. వాసనను అనుసరించి ఎలుక సంచరిస్తుంటుంది. వాసన(కోరిక)లపై ఆధిపత్యం గలవాడు వినాయకుడు. వాసనలకు ప్రతీక అయిన ఎలుక మీద స్వారీ చేస్తాడని చెప్పడమే ఎలుక ఆయన వాహనం అనడంలోని అంతరార్థం.
పవిత్రమైన మనస్సు ఉంటే శాంతిని పొందుతాం – అదే సిద్ధి అంటే! వినాయకుడు బుద్ధి, సిద్ధి (వివేకం, ఆత్మసాక్షాత్కారం) లకు అధిపతి. అందుకే ప్రతి ఒక్కరూ మనస్సును తమ వశంలో ఉంచుకోవాలి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s