మహర్షి అష్టావక్రుడు

శ్రీకృష్ణుని జీవితముతో సంబంధమున్న ఒక విఖ్యాత మహర్షి అష్టావక్రుడు. ద్వాపర యుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్న రోజులలో ఆయనను వెదుక్కుంటూ ఒకరోజు అష్టావక్ర మహర్షి వచ్చాడు. ఆయన శ్రీకృష్ణుని దర్శించి ధ్యానయోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి గౌరవించాడు. అర్ఘ్య పాద్యాలు ఈయబోతున్న సమయములో కృష్ణుని పాదాలపై శిరస్సు ఉంచి ఆయన శరీరాన్ని వదలిపెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయముగా ఆయనకు అంత్యక్రియలు జరిపించి, ఉదకములిచ్చి, ఆజీవునికి ఎంతోగౌరవమైన సద్గతిని ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుని పత్నులు, మంత్రులు అందరూ, ఆయన చరిత్రను చెప్పమని కృష్ణుని అడిగారు. అప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు.

“ఈ అష్టావక్రుడు నాకు పరమభక్తుడు. జితేంద్రియుడు. పూర్వము నేను నాభి కమలమునుండి బ్రహ్మను సృష్టించి విశ్వసృష్టిచేయమని అతనిని నియోగించాను. అతడు మొదట సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు వారు తపోన్ముఖులై సృష్టికార్యాన్ని తిరస్కరించారు. తరువాత బ్రహ్మదేవుడు వశిష్ఠ, మరీచి, ప్రచేతస, అంగీరసాదులైన మహర్షులనూ, ప్రజాపతులను సృష్టించాడు. వారుకూడా మొదట తపస్సులుచేసినా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి వివాహములు చేసుకొని సంతానమును కన్నారు. ప్రచేతసుని కుమారుడు అసితుడు. అతడు రుద్రుని గురించి తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమై రాధా మంత్రాన్ని ఉపదేశించాడు. రాధాదేవి అనుగ్రహముతో అతనికి కలిగిన కుమారుడు దేవల మహర్సి. ఆ దేవలమహర్షి తీక్షణమైన తపస్సు చేస్తే, ఇంద్రుడు తపోభంగము చేయమని రంభను పంపాడు. రంభను ఆయన తిరస్కరిస్తే, ఆమె అష్టావక్రునిగా జన్మించమని దేవలుని శపించింది. ఏకపాదుని కుమారుడుగా ఆయన జన్మించి మహాజ్ఞానిగా, దివ్య చరితుడైనాడు. కృష్ణుని సన్నిధిలో ప్రాణాలు వదలాలనే సంకల్పంతోనే ఆయన జన్మించాడు.”

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s