బ్రహ్మ- హనుమంతుని స్తుతి ( 32 ఆంజనేయ నామాలు)

లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం మనకి తెలుసు. ఆ సంఘటన తర్వాత దేవతలు కుసుమవృష్టి కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద. కుసుమ వృష్టి కురిపించగనే బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చాడట గగనం నుంచి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఆయన స్వయంగా దిగి వచ్చి బ్రహ్మగారు హనుమంతుని స్తుతి చేస్తారు.ఆ స్తుతి చేసేటప్పుడు 32 ఆంజనేయ నామాలు అంటారాయన. ఇవి విశేషమైన అంశం. 32 హనుమన్నామాలు. ఈ 32 హనుమన్నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనపడుతున్న లీలారూపం వేరు. ఆయనలో ఉన్న మంత్రమూర్తులేమిటో వేదములు తెలిసిన బ్రహ్మ గారికి తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలుస్తుంది? అందుకు 32 నామములతో హనుమంతుని కీర్తన చేస్తారు. ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. సుందర హనుమన్మంత్రము అంటే 32 నామాల వరుస. ఈ 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. ఇదీ రహస్యం. అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది. ఇది రహస్యం. సంహితా గ్రంథాలలో ఉంటుంది. ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్నిరకాల ఆధివ్యాధులు నశిస్తాయి. ఇందులో 27 ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు. 

Lankini
హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
కపీంద్రః పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః వీరః సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః రామకార్య దురంధరా
మహౌషధ గిరేర్హారీ వానర ప్రాణదాయకః
వాగీశ తారకశ్చైవ మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్ఠాతా బాష్పకృత్ జపతాం వరః
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః!!

ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు. 5 రహస్య నామములుగా చెప్పారు. కనుక 27 ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతోంది. కనీసం విని ఆనందించినా చాలు. గుర్తు పెట్టుకోలేకపోయినా.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s