కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి.?

వదాన్యుడనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు ఆమెను వివాహమాడగోరి వదాన్యుడిని అడిగాడు. ఆయన రూపగుణవర్తనాలలో యోగ్యుడైన అష్టావక్రుడికి కూతురుని ఇస్తానని మాట ఇచ్చి, అతడిని ఉత్తరదిశగా పయనించి పార్వతి శివుడి కొరకు తపస్సు చేసిన ప్రాంతం దాటి కదంబ వనంలో ప్రవేశించి, అక్కడ నివసించే ఒక పవిత్ర ప్రౌఢ వనితను దర్శించి తిరిగి రమ్మని కోరాడు. ఆ వెంటనే వివాహం చేస్తానన్నాడు. అష్టావక్రుడు దానికి అంగీకరించి ఆ రాత్రి బాహుదా నదీ తీరంలో ఆగి మరునాడు కుబేరనగరానికి పోయి ఆయన కల్పించిన వినోదాలను వీక్షిస్తూ నిశ్చలమనస్సుతో ఒక యేడాది గడిపి ఈశ్వరుడి క్రీడా క్షేత్రాలను దర్శించి కడిమిచెట్ల వనం చేరి బంగారు మేడలో నివసించే ఒక పవిత్ర వనితను దర్శించాడు. ఆమె అతడికి ఎన్నో అతిథి సత్కారాలను చేసింది. రాత్రి శయ్యపై అతడితో శయనించి భోగించుమని కోరింది. అష్టావక్రుడు తనను తాకకుండా ఉంటే ఉంటానని, లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని అంటాడు. ఆరోజు మిన్నకుండి మరునాడు రాత్రి మరల అతడిని కోరింది. అష్టావక్రుడు ఇలా అన్నాడు. “స్త్రీని పసితనంలో తండ్రి, వివాహమైన తర్వాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమె స్వతంత్రంగా ఏమీ చేయ తగదు. కాబట్టి నేను నిన్ను స్వీకరించను” అన్నాడు. ఆమె ఎన్ని విలాసాలు ప్రదర్శించినా చలించలేదు. అప్పుడామె సంతోషించి తాను ఉత్తరదిశా కన్యనని వదాన్యుడి ఆనతితో అతనిని పరీక్షించానని చెప్పి అతడిని అభినందించి పంపింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి వదాన్యుడి అభినందనలతో పాటు సుప్రభను భార్యగా పొంది సుఖించాడు. కాబట్టి కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s