హిందూధర్మమునకు వేదములే మూలము

హిందూధర్మమునకు వేదములే మూలము. వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటె ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపబడినవి. హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. “విద్” అనే ధాతువుకు “తెలియుట” అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా “తెలుపబడినవి” అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.

ప్రస్తుత కాల మాన పరిస్థితులలో మీకు ప్రమాణమేది అంటే చటుక్కున చెప్పేది అంతరాత్మ, తరవాత గీత, భారతం, రామాయణం ఆ తరవాత శాస్త్రం వగైరా వగైరా.. కానీ అసలు మనం పుట్టిన గడ్డ ఏది? ఈ గడ్డలో సనాతనంగా ఉన్న ధర్మంలో ఏది ప్రమాణం? దేన్ని ప్రమాణం చేసుకొని జీవించాలి అన్నది చాలా చోట్ల ప్రస్తుతం సందిగ్ధంగా ఉన్నది. దానికి కారణమేమైనా కావచ్చుగాక.

మొట్టమొదట మన మనస్సులలో, బుద్ధిలో నిగూఢంగా నాటబడిన ’మతం’ అన్నమాటను తుడిచి మనది ఏదో ఒక మనిషి మతిలోనుంచి పుట్టిన మతం కాదు ఇది ధర్మం అని చెరగకుండా ముద్ర వేసుకోవలసి ఉన్నది. మనం చరించే వైదిక ధర్మం, లేదా హైందవ ధర్మంగా పిలువబడేది సనాతనమైనది భగవంతుడెంత సనాతనుడో మన ధర్మం అప్పట్నుంచీ ఉన్నది భగవంతుడెప్పటివరకూ ఉంటాడో అప్పటివరకూ ఉంటుంది. అంటే భగవంతునికెలా ఆద్యంతాలు లేవో మన ధర్మమూ అంతే.

ఈ ధర్మం ఏరూపంలో వ్యక్త పరచబడింది దీన్ని తెలుసుకోవడం ఎలా? అంటే ఆభగవంతుని ఊపిరులుగా తెలియబడే వేదములు మొట్ట మొదట మనకి ధర్మాన్ని ( లౌకిక + పార లౌకిక) రెండు రకాల జ్ఞానాన్ని కలిపి బోధించాయి. వేదాన్ని అర్థం చేసుకోవడానికిగానూ దానికి ముఖ్యమైన కొన్ని అంగాలను కూడా తెలుసుకోవలసిఉంటుంది. అవి కూడా శాసనములే, శాస్త్రములే. అవి భగవత్శాసనములు కాబట్టే వాటికి ’శాస్త్రములు’ అని పేరు. భగవత్శాసనమును ఔదలదాల్చడం వినా తర్కించడానికి కుదరదు. అందుకే ఆయన జగన్నియంత. ఈ శాస్త్రాదులు అందరికీ ఎలా అందుతాయి అంటే, మహానుభావులైన ఋషులు తమ జీవితాలను త్యాగం చేసి తపించి శృతులను దర్శించి స్మృతులుగా కూర్చి మనకందించారు మరికొందరు భగవంతుని లీలలను దర్శించి పురాణేతిహాసములుగా అందించారు. అందుకే ఈ భరత ఖండం ఆర్షభూమి. ఎందరో ఋషుల పాద స్పర్శచేతనూ, వారి అమూల్యమైన వాగమృతధారలచేతనూ తడిసి తడిసి ఉన్నదీ భూమి.

ఋషులు దర్శించిన ఈ వేద వాఙ్మయాన్ని కలియుగంలో మానవులు సంపూర్ణంగా అధ్యయనం చేయలేరని, వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా విభజించి నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకిచ్చి వాటిని బోధించమన్నారు. అట్లాగే ఈ అపారమైన వేద వాఙ్మయాన్ని ఇంకా సులభతరమైన పద్ధతిలో తెలుసుకొని ఆచరణలోకి తెచ్చి జీవితాలని బాగుచేసుకోవడానికి వేద విషయ ప్రతిపాదితములైన పురాణేతిహాసములను రచన చేసి, పంచమవేదంగా కీర్తించబడే మహాభారతాన్నీ రచన చేసారు. సమస్త వేదవిహితమైన ధర్మసూక్ష్మములతో కలిపి భగవంతుని లీలలు కలిపి ఉన్నందునా ఎందరో ఋషుల గాథలు బోధలచేతనూ, మహానుభావులైన వారి ధర్మాచరణ వైశిష్ఠ్యము గలదైనందుననూ అది పంచమ వేదమని కొనియాడబడింది. మొత్తంగా చూస్తే వేద బద్ధమైన వాఙ్మయములే వేదానికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మంగా సులభగ్రాహ్యములుగా ధర్మ ప్రచారానికి వ్యాసాది మహర్షులు దర్శించి ఇచ్చినవి తప్ప అన్యములు సనాతన ధర్మమునకు ప్రమాణము కావు అన్నది పరమ సత్యం.

కలియుగంలో జనులు మంద బుద్ధులు, పరధర్మాసక్తతాపరులు, రోగపీడితులు, పాఖండులు (ఇది తిట్టుకాదు పా అంటే వేదం దాన్ని ఖండించేవారు పాఖండులు అని అర్థం) వగైరా వగైరా కలి ప్రభావ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారని వ్యాసోక్తి. వ్యాస మహర్షి ఎంతో త్యాగ బుద్ధితో, జనులను ధర్మమార్గంలో ఉంచడానికి ఇచ్చిన వేదవిహితమైన వాఙ్మయం మనకి ప్రమాణం. గీతలో శ్రీ కృష్ణుడే చెప్తారు “తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ! జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!” తస్మాత్= కావున, కార్య+అకార్య వ్యవస్థితౌ = కార్యము చేయవలెనా చేయవద్దా అని నిర్ణయించవలసినప్పుడు, శాస్త్రం=శాస్త్రము తే ప్రమాణం=నీకు ప్రమాణం (అనుమాన నివృత్తి చేయదగలిగినది, ఆధారపడవలసినది) ఇహ శాస్త్రవిధానోక్తం=ఈ విధంగా చేయొచ్చా లేదా అన్న శాస్త్రవిధిని బట్టి కర్మకర్తుఁ=స్వకర్మను చేయడానికి అర్హసి = అర్హుడవౌదువు అని స్వయం విష్ణుమూర్తి సంపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణపరమాత్మ బోధ. అంటే శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు. శ్రీ కృష్ణుడికి దణ్ణం పెడతాం కానీ ఆయన చెప్పింది ప్రమాణం కాదంటే?

ఈ శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది. ఈ పధ్నాలుగింటినీ ధర్మస్థానములు అంటారు
వేదములు – 4
1)ఋగ్వేదము 2) యజుర్వేదము 3)సామవేదము 4)అథర్వవేదము
వేదాంగములు 6
1)శిక్ష 2)కల్పము 3)జ్యోతిషము 4)వ్యాకరణము 5)నిరుక్తము 6)ఛందస్సు
ఇతరశాస్త్రములు
1)పురాణాములు 2) న్యాయము 3) మీమా

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s