వేదవ్యాసుల వారి జన్మదినం(గురుపూర్ణిమ)

అపరనారాయణుడైన వేదవ్యాసుల వలననే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమయ్యింది. వేదాలు విభజించి, అష్టాదశ మహాపురాణోపపురాణాలను ఏర్పరచి, మహాభారతేతిహాసాన్ని రచించి మహాభాగవతాన్ని ప్రసాదించి, బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మజ్ఞాన భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ మహాత్ముని ఈ రోజున అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయనను విస్మరించడం కన్నా కృతఘ్నతా దోషం మరొకటుండదు. వ్యాసుని గ్రంథాల్లో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చెయ్యాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏగ్రంథమైనా (పురాణాల్లనివి గానీ, భాగవతం గానీ) ఉంచి, అందు వ్యాసదేవుని ఆవాహన చేసి షోడశోపారాలతో పూజించాలి.

వారి వారి గురువులను అర్చించాలి. నిజమైన గురుపూజ ఈరోజే. చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరిమ్చి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవుని భావించి ఆరాధించాలి. వారి వారి గురుపరంపరను పూజించాలి.

వ్యాసకృతమైన పురాణాది గ్రంథాల పఠనం ఈ రోజున ఆవశ్యకం. నారాయణ, సదాశివ, బ్రహ్మ, వసిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్యులను ఆరాధించాలి.

శ్రీకృష్ణుని, వ్యాసుని, జైమిని, సుమంత, వైశంపాయన, పైలాది వ్యాసిశిష్యులను, శ్రీ ఆదిశంకర, పద్మపాద, విశ్వరూప, తోటక, హస్తామలకాచార్యులను ఆవాహన చేసి పూజించాలి.

ఈ రోజుననే ప్రతివారు తమ గురువును అర్చించాలి. వ్యాసదేవులు జగద్గురువులు. వారి ద్వారా లోకానికి అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తాడు. కనుక ఆ జగద్గురువును మన గురువుయందే దర్శించి, ఆరాధించాలి. అందుకు వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా నిర్ణయించారు సంప్రదాయజ్ఞులు.

యతులైన వారు ఈ రోజున చాతుర్మాస్యదీక్ష ప్రారంభిస్తారు. ఒకే చోట స్థిరంగా ఈ నాలుగు మాసాలు ఉండాలి. సన్యాసి, నాలుగు మాసాలు కుదరనపుడు రెండు మాసాలైనా ఏకస్థలాన నివసించాలి.

చాతుర్మాసం ద్విమాసం వా సదైకత్రైవ సంవసేత్!! అని ధర్మశాస్త్రం

పూర్తి అహింసా వ్రతావలంబకులైన ఆ యతులు యథావిధిగా అర్చనాదులు చేసి,

అహంతావన్నివత్స్యామి సర్వభూత హితాయవై
ప్రాయేణ ప్రావృషిప్రాణి సంకులం వర్త్మదృశ్యతే
అతస్తేషా మహింసార్థం పక్షాన్వై శ్రుతిసంశయాన్
స్థాస్యా మశ్చతురోమాసాన్ అత్రైవాసతి బాధకైః!! అని సంకల్పిస్తారు.

వర్షాకాలంలో అనేక కొత్త జీవాలు, అంకురాలు భూమిపై ఏర్పడతాయి. తమ నడక వల్ల వాటికి బాధ కలుగకూడదని యతుల సంకల్పం.

ప్రదోష సమయాన, పూర్వాషాఢ నక్షత్రాన ఆషాఢ పూర్ణిమ ఉంటే అది గొప్పయోగం. ఈ సమయాన శివార్చన చేయడం ఉత్తమ ఫలప్రదం. ఇదిశ్రీ శివుని శయనోత్సవం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s