ఈశ్వరునికి ’తస్కర పతి’ అని పేరు రావడానికి ఏదైనా పురాణ కథ ఉందా?

’తస్కరపతి’ అనడానికి, ప్రామాణిక పురాణకథ ఏదీ లేదు. అది సర్వాంతర్యామిత్వాన్నీ, సర్వాధపత్యాన్నీ తెలియజేసే విశేషం.
పరమేశ్వరుడు జీవులకు కర్మఫలప్రదాత. విశ్వంలో దీపించుతూ, వివిధ విధాలుగా తన శక్తులను వివిధ ఉపాధులద్వారా ప్రేరేపించి ప్రసాదిస్తుంటాడు. పుణ్యఫలాలను ’అఘోరరూపం’లోనూ, (ఆనందకరస్వరూపం), పాపఫలాలను ’ఘోర’రూపంలోనూ ప్రదానం చేస్తాడు.

12703_267363923423076_710225004_n
విశ్వంలో ఉన్న ప్రతిశక్తి శివుడే అని దర్శించేవానికి అఘోరత్వం (ప్రసన్నత) సామీప్యమై, ఘోరత్వం రక్షకమై కాపాడుతుంది. అక్రమార్జన మొదలైన పురాకృత పాపాలకు ఫలంగా చోర, అగ్ని, రాజులలోని శక్తి ప్రేరేపింపబడి మనపై దాడి చేస్తుంది. ఈశ్వర్ని ఆరాధించే వారికి తస్కర, అగ్న్యాదుల రూపాలలో నున్న శక్తి పీడించకుండా తొలగుతుంది. ’శివుని ఆన లేనిదే చీమైనా కుట్టదు’ అనడంలో అంతరార్థం అదే.
అంతేకాక చోరునిలోనూ ’నైపుణ్యం, పరాక్రమం’ ఉంటాయి. ఆ శక్తి సహజంగా గొప్పదే. వినియోగంలోనే దోషం. అయితే దోషం ఆచరించే స్వభావం ఉన్నవానిలోనే అది ప్రేరేపింపబడుతుంది.
ఇదే చోరత్వ నైపుణ్యం చోరుని పట్టుకొనే రక్షకాధికారికీ ఉంటుంది. ఆ నైపుణ్యం చేతనే చోర లక్షణాలను గ్రహించి చోరుని నిగ్రహించగలుగుతాడు. అందుకే నైపుణ్యం భగవత్స్వరూపం. ఆ నైపుణ్యానికి నమస్కరించింది రుద్రనమకం. అన్ని వృత్తులవారిలోనూ, అన్ని ఉపాధులలోనూ ఈశ్వరుడే చైతన్యంగా వ్యాపించి ఉన్నాడని చెప్పడమే రుద్రనమకం యొక్క తాత్పర్యం. “ఈశావాస్య మిదం సర్వం” అన్న ఉపనిషత్సిద్ధాంత దర్శనమ్ రుద్రోపనిషత్తు హృదయం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s