విశ్వభక్షిణి అనే కపాలంలో

విశ్వభక్షిణి అనే కపాలంలో మొత్తం గంగనంతటినీ పట్టేసింది కనుక ప్రళయబంధినీ దుర్గ. మళ్ళీ తపస్సుకు కూర్చుంది అమ్మవారు. ఇది చూశాడు శివుడు. ఓహో! అడ్డుకున్నావన్నమాట నేను పూనుకుంటాను అనుకొని ఒక్కసారిలలో ఉన్న గంగమ్మనీ వెళ్ళు అన్నాడట మళ్ళీ. ఇంతవరకు శరీరాన్ని తడుపుతూ వెళ్ళింది. శరీరాన్ని తడుపుతూ వెళ్ళిన గంగగురించి ఒక మాట చెప్తున్నాడు. శివుడు ప్రతి రోమకూపాన్ని తడిపి దిగిందిట ఆ కంప వెళ్ళిన గంగ. శివుడికి 3,50,00,000 రోమకూపాలుగా వర్ణించారు. సార్థ త్రికోటి అన్నారు. 3,50,00,000 రోమకూపాలు తాకి వెళ్ళిపోయింది కనుక ఆ గంగకి తన పవితతో పాటు శివుని శరీరంలో వున్న రోమకూపాలు కూడా తడిపిన పవిత్రత కలిసి ఆ తీర్థానికి 3,50,00,000 తీర్థశక్తీ వచ్చిందిట. చిత్రమేమంటే సార్థత్రికోటి శక్తి కలిగిన క్షేత్రమంతా గంగంతా ఇప్పుడు కపాలంలో ఇమిడిపోయింది. ఇప్పుడు పరమేశ్వరుడు రెండవ గంగని పంపాడట. ఈ గంగ కూడా పరుగెత్తుకు వచ్చింది. ప్రళయబంధినినే దీనిని కూడా బంధించమన్నది అమ్మవారు. ఇదివరకు పనిచేసింది కదా అని ఇప్పుడు కూడా కపాలం పెట్టిందిట. లాభంలేకపోయింది. ఎందుకంటే ఆ వచ్చిన గంగ ఈ కపాలానికి దొరకనంత వేగంగా వచ్చింది. పైగా శివుడి సంకల్పంతో పంపాడు కనుక కపాలంతో బంధించలేకపోయింది.

శివ-మహాపురాణము

పొంగులువారిపోతోంది. అప్పుడు ఏం చేయాలో తెలియక అన్నా అని అరిచిందిట కామాక్షీ దేవి. అన్నా అనగానే అన్నయ్య వచ్చేశాడు. ఆవిడ అన్నయ్య వరదరాజస్వామి వారు. అక్కడే వున్నారు. నారాయణుడు కనపడ్డాడుట ఒక్కసారి.

నారాయణుడంటే నీలమేఘకాంతితో ఉండాలి కదా! నీలంగా ఉన్నాడు కానీ కంఠం దగ్గర తెల్లగా వుందిట. ఏమిటి అంటే నన్ను చంద్రకంఠుడంటారు అన్నాడుట. అక్కడ విష్ణువు ఇప్పటికీ వున్నాడు. ఆమ్రవృక్షానికి దగ్గరలో చంద్రకంఠవిష్ణువు విగ్రహం ఉంటుంది. ఆయనే చంద్రగ్రీవ విష్ణువు. ఆయన ఒక సలహా చెప్తాను అని చెప్పాడట. గంగ శివలింగాన్ని ముంచకూడదని కదా నీ బాధ. గట్టిగాఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకో అప్పుడు ఆ గంగ ఏమీ చేయదు అన్నాడట. వెంటనే అమ్మవారు గట్టిగా పట్టుకున్నదిట. శివుడికి ఎంత ఆనందం కలిగిందో. అమ్మవారి గాఢాలింగన సౌఖ్యం అనుభవించాడట ఒక్కసారి. పైగా సైకతం కదా అది. సైకత లింగానికి అమ్మవారు గట్టిగా పట్టుకున్నప్పుడు వక్షస్థలమున గుర్తులు చేతి కంకణముల గుర్తులు అంటుకున్నాయిట. అది పెద్ద అలంకారంగా భావించాడా మహానుభావుడు. అప్పుడు శివుడు గంగని ఇంక నువ్వు ఆగు అన్నాడుట. అమ్మ గట్టిగా పట్టుకుంది. పైగా పన్నెండేళ్ళ బాలికగా తపస్సు చేసింది. గంగ ఉక్రోషంతో ఇంకా మీదకి వస్తే శివుడు పాదంతో గంగను నేలకు తొక్కాడట. అంత గంగ క్రిందకి వెళ్ళిపోయింది. మొత్తంమీద శివలింగం ఇప్పుడు హాయిగా ఉంది. ఎప్పుడైతే అమ్మవారు గట్టిగా పట్టుకున్నారో, శివుడు క్షేమంగా ఉన్నాడో, గంగ క్రిందికి వెళ్ళిపోయిందో అప్పుడు అమ్మవారు చూసి చాలా సంతోషించి పరమేశ్వరా! నీ అనుగ్రహంతో నిన్ను నేను కాపాడుకోగలిగాను అన్నదిట.

అప్పుడా లింగంలో శివుడు దర్శనమిచ్చాడు అమ్మవారికి. ఎలా వున్నాడంటే చంద్రలేఖ ధరించి మందహాసం చేస్తూ త్రినేత్రధారియై చతుర్భుజములతో ఒక చేత్తో లేడిని, ఇంకొక చేత్తో పరశువును, క్రింది రెండు చేతులతో వరదాభయముద్రలను ధరించి చూపిస్తూ తెల్లని స్వామి నీలకంఠుడై, సర్పభూషితుడై గోచరించాడు. అమ్మవారిని చూస్తున్నాడట. ఆ భావనని వర్ణిస్తున్నారిక్కడ. “తతః స భగవాన్ ఈశః – అప్పుడా భగవానుడైన ఈశ్వరుడు; స్వకీయార్థాసనే శుభే గౌరీముద్దీత్య, వామాంగీం స్థాపయామాస వామతః” – రెండు చేతులూ చాచి అమ్మవారిని ఎత్తుకొని తన ఎడమ తొడమీద పెట్టుకున్నారట. పెట్టుకోగానే దేవతలు ఒక్కసారి కుసుమ వృష్టి కురిపించారు. అక్కడికి నారాయణుడు, బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ విచ్చేసి నమస్కారం చేశారు. పరమేశ్వరుడు ఆవిర్భవించిన ఆ రోజు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తృతీయ పాదంతో కూడిన పూర్ణిమ.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s