ఒక్క రామనామం

ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్తపాపములనుండి వినిర్ముక్తుడు కావచ్చు.

1491743_278948288949667_1605282060041256836_n
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!!


భగవంతునియొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే. ఒకమంత్రం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళూ చేతులు కదపకుండా కూర్చొని చేయాలి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి యే అవస్థలోనైనా చెప్పవచ్చు. 


హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!!


అంటాడు గోపన్న. రామా! నీదివ్యమైన నామాన్ని నా నాలుకమీద నర్తింపచెయ్యి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకొని భగవన్నామాన్ని సతతం జపించిన కారణం చేత సమస్త పాపములనుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంతగొప్పది. భగవన్నామాన్ని ఉచ్ఛరించగలిగిన స్థితి ఒక్క మనుష్య ప్రాణికే వుంది.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s