స్తుతించడం

స్తుతించడం అంటే పొగడడం. మనకు బాగా నచ్చిన వాళ్ళను పొగుడుతాం. అంతేకాదు మనకు ఎవరివల్ల ప్రయోజనం, లాభం కలుగుతాయో వారిని కూడా పొగుడుతాం. భగవంతుణ్ణి స్తుతించడం హిందూ సంప్రదాయం. ఈ స్తోత్రపఠనం అతి చిన్నవయస్సులోనే పిల్లలు పెద్దలనుండి నేర్చుకుంటారు. అర్థం తెలియకపోయినా స్తోత్రాలు వల్లిస్తారు. ఈ స్తోత్ర పఠనం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు అన్న నమ్మకంతో అనేక స్తోత్రాు పిల్లలు నేర్చుకోగలుగుతారు. ఎంతో ఇష్టంతో, క్రమశిక్షణతో సాగే ఈ నేర్చుకొనే ప్రక్రియ నెమ్మదిగా అంతరించిపోతోంది. చెప్పే పెద్దలు లేరు. వినే పిల్లలూ కరువయ్యారు.

స్తోత్ర పఠనానికి సంగీతం నేర్చుకోనవసరం లేదు. పాడడానికి స్వరజ్ఞానం తప్పకుండా అవసరం. పాడడం తెలియనివారు కూడా గుక్కతిప్పుకోకుండా కూనిరాగాలు తీస్తూ ఎన్నెన్ని పాటలు ఖూనీ చేయడం లేదు! కావలసినది భగవంతునిపై భక్తి.

శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ లలితా సహస్రనామం అత్యంత ప్రసిద్ధికెక్కిన స్తోత్రాలు. ఇంకా దేవీ దేవతలపై ఎన్నోస్తోత్రాలు ఉన్నాయి. ఆధునిక యుగంలో స్తోత్ర పఠనం యొక్ ప్రాముఖ్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దీనివల్ల లబ్ధిపొందిన వారినుండి మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుని మీద భక్తి పరిపక్వత పొందినప్పుడే స్తోత్రాలలోని గంభీరమైన అంతరార్థం మనం గ్రహించగలుగుతాం. ప్రతిరోజూ స్తోత్రపఠనం ఒక గంగా స్నానం లాంటిది. జర్మనీలో, “గంగే చ యమునే చైవ గోదావరి సస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు” అనుకుంటూ స్నానం చేసే వ్యక్తికీ మన మహా నగరాల్లో మైఖేల్ జాక్సన్ పాట వింటూ జలకాలాడే కుర్రకారుకీ ఉండే తేడా నక్కకూ నాగలోకానికీ, మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేస్తాయి! స్తోత్రపఠనంతో మనస్సుకు నిలకడ లభిస్తుంది. అలాకాకుండా మనస్సుకు ఉద్రేకపరిచే విషయాలను అందిస్తే, స్వామి వివేకానందుల వారన్నట్లు మనసొక సారాయి తాగిన పిచ్చికోతి అవుతుంది. దానికి ఉండే చంచలత్వం ఇంకా పెరిగి, ఆనందానికి బదులు ఆవేదనకు గురి అవుతుంది. ఈ కారణం వల్లనే నేటి సమాజంలో ప్రతిరోజూ కొత్త టివి చానెల్స్ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి! మనస్సును ఎండిపోకుండా ఎలా కాపాడాలి? స్వామి అద్భుతానందజీ (లాటూ మహరాజ్), శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యులు. ఆయన జీవితం అతి సరళం, మాటలు భావగర్భితం. ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నారు: “ఒక ముంతను నీటితో నింపి పెడితే కొన్నాళ్ళ తర్వాత ముంతలోని నీరు ఆవిరైపోతుంది. అదే ముంతను గంగానదిలో ముంచితే ముంతలో నీరు ఎప్పటికీ ఆవిరి అవదు.”

భగవంతుడే ఆ గంగానది. మనం ముంత. ముంతలో ఉన్న కొద్దిపాటి నీరే ’మన భగవంతుడు’. ’విషయ వాంఛలు’ అనే వేడితో ముంతలో ఉన్న కొద్దిపాటి నీరు ఆవిరైపోతుంది. దీన్ని ఎలా అరికట్టాలి? ఈ సమస్యకు ఏమిటి పరిష్కారం?

మొదటిగా భగవంతుడిపై భక్తి కలగాలి. ముంతయొక్క అల్పత్వాన్ని గ్రహించి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ భగవంతుడి చింతనలో గడపవలసిన ఆధ్యాత్మిక సాధకుడికి స్తోత్ర పఠనం అతడి పయనంలో మొదటి మైలురాయి. పట్టుదలతో ప్రతిరోజూ కనీసం ఐదునిమిషాలు స్తోత్ర పఠనం చేసి చూద్దాం! పిల్లలు చెడిపోతున్నారే అని వాపోయే కన్నా మనం ఏ విషయమైనా ఆచరించి చూపించినప్పుడు వారు నేర్చుకుంటారో లేదో అన్నది తెలుసుకుందాం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s