శ్రీశాంకరీ దేవి – శ్రీలంక

లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేసింది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ వుండమని వరం కోరాడు. అందుకు పార్వతీదేవి –

“రావణా! నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు. అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది. నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో వుంటాను. అయితే నీవు అకృత్యాలు చేయనంతకాలం నేను నీ రాజ్యంలో వుంటాను. నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలివెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై, నీ పాలన అంతమొందుతుంది.” అని పలికింది.

అందుకు రావణాసురుడు అంగీకరించగా – పార్వతీ దేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకో సాగింది.

శ్రీశాంకరీ దేవి - శ్రీలంక

తర్వాత కొంత కాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొనివచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మరునాడు శాంకరీదేవి దర్శనమునకు వెళ్ళి రావణాసురునితో –

“రావణా! సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను” అని పలికింది.

శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆ

దేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని “బనశంకరీ” అని పిలిచారు. ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు. అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని “ట్రింకోమలి” పట్టణంలో వున్న దేవీ ఆలయమును ప్రథమ శక్తి పీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జెలు పడినట్లు చెప్పబడుతోంది.

శ్రీ సతీ శాంకరీ దేవీ త్రింకోమలి పురస్థితా!
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్త కామ ఫలప్రదా!!

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s