పితృ దేవతలను విస్మరించడం

మనది కర్మ భూమి ఈ కర్మ భూమిలో అనేక మంది మంచి పనులచే భగవంతుని అనుగ్రహం పొందినారు. అలాంటి కర్మలను మనం చాలా విస్మరిస్తున్నాము. మన జీవన విధానంలో పరుగులు తీస్తే కాని రోజు వెళ్ళని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈరోజు ప్రపంచంలో మనిషి అనేక సమస్యలతో సతమతమౌతున్నాడు. అడుగడగునా అనేక ఇబ్బందులకు, ఒత్తిళ్ళకు, కష్టాలకు గురి అవుతున్నాడు. డబ్బు ఉన్నవారికి ఆరోగ్యం లేదు, ఈ రెండు ఉన్నా వివాహం కావట్లేదు వివాహమైతే సంతానం కలగకపోవడం, విద్య ఉన్నవారికి ఉద్యోగం లేకపోవడం, వ్యాపారం సరిగా లేకపోవడం ఇవన్ని ఉన్నా న్యాయస్థానాలు, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు. వీటిలన్నిటికి అనేక కారణాలు వాటిలో 1. దైవారధన చేయకపోవడం 2.పితృ దేవతలను విస్మరించడం మొదలైనవి. అవి మనం ఆచరించినా ఇంతకుముందు మన వంశములో ఎవరైనా ఈ దోషములు చేసినచో అవి కూడ మనల్ని ఇబ్బంది పెడతాయి.

ఇందులో పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మనవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భొక్తలకు భోజనము ), యామాన్నము గాని(బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక) పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.

మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.

అంతే కాక పిండ ప్రదానములకు ప్రత్యేకించబడిన క్షేత్రములలో ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన(పితృ కర్మ చేయడం వలన) మనిషికి పుష్టి, ఆయువు, వీర్యము, లక్ష్మి ప్రాప్తిస్తాయి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s