పద్మపాదాచార్యులు

పద్మపాదాచార్యుడు క్రీ.శ. 9వ శతాబ్దానికి చెందిన తత్త్వజ్ఞుడు, అద్వైత వేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో ఈయన ఒకడు. శంకరాచార్యుడు భారతదేశానికి తూర్పున పూరి లో గోవర్ధన పీఠాన్ని సంస్థాపించి, ఇతనిని అధిపతిగా నియమించారు .

దక్షిణ భారతదేశం లో కావేరీ నదీతీరంలో విమల అనే బ్రాహ్మణునికి సంతానంగా ఈయన జన్మించాడు. బాల్యంలో వేదాలను చదువుకుని, సన్యసించి, కాశీ నగరం చేరుకున్నాడు. అక్కడ శంకరాచార్యుని కలుసుకొని శిష్యునిగా చేరాడు. ఆయనకు శంకరాచార్యుడు “సనందన” అని నామకరణం చేసాడు.
పద్మపాదుడు శంకరాచార్యుని మొదటి శిష్యుడు.

శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రాహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరునకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.

సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల, తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి, వారిలోని ఆ అసూయను పోగట్టదలచాడు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడిని పిలిచాడు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా, అతడు మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు “పద్మపాదుడు” అయ్యాడు.

పద్మపాదునికి సంబంధించిన మరొక కథ: శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసాడు. శంకరుడు తపస్సు చేసుకొంటూ, ఆపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరుడు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి, తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున, శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ, కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై, శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండొ హఠాత్తుగా ఒక సింహము దాడి చేసినది. అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి, ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి, పద్మపాదుని శక్తికి, అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

అద్వైత సాహిత్యాన్ని బట్టి చూస్తే, ఈయనకు పద్మపాదుడు అని పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. ఒక సారి శంకరాచార్యుడు గంగానదికి ఒక వైపు, శిష్యులందరూ మఱొక వైపు ఉండగా, గురువుగారు వారిని నది దాటి రమ్మన్నారట. తక్కిన శిష్యులందరూ ఒక పడవ కోసం చూస్తుండగా, గురువు గారి ఆజ్ఞ విన్న తఱువాత, రెండవ ఆలోచన ఎఱుగని సనందుడు మధ్యలో ఉన్న నది సంగతి మరిచిపోయి, నది మీద పరుగెట్టడం మొదలెట్టాడు. ఆ గురుభక్తిని మెచ్చి, గంగ సనందుడు అడుగు వేసిన చోటల్లా పద్మాన్ని ఉంచి నదిని దాటించింది. అందుకని ఆయనకు పద్మపాదుడు అనే పేరు సంప్రాప్తించింది.

అద్వైత సాహిత్యంలో తోటకాచార్యు నకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒక కథ ఉంది. గిరిగా పిలువబడే తోటకాచార్యుడు పెద్దగా చదువుకోలేదని పద్మపాదుడికి కొంచెం చిన్నచూపు ఉంది. ఆ విద్యాగర్వం పోగొట్టేందుకే శంకరాచార్యులు గిరి చేత తోటకాష్టకం చెప్పించారు అని ప్రతీతి.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s