గోవధ మహాపాపం

గోవధ మహాపాపం. తెలియక చేస్తారు. మహాపాపాన్ని సంపాదించుకుంటారు. గోవధ చాలా భయంకరం. అది జరిగే చోట కూడా వేదప్రామాణ్యం తెలిసిన వాడు ఉండకూడదు. శ్రీ జగద్గురువులు శృంగేరీ భారతీ తీర్థ స్వామీజీ కొన్ని సంవత్సరాలు హైదారాబాదుకు రాలేదు. ఈ గోవధ జరగడం గురించి వినలేక ఉన్నానని. మహానుభావులు ఆ ప్రాంతం వైపుకు కూడా రారు. అది అప్రశస్తం. అది మన హిందూ భారతీయ సనాతన సంప్రదాయానికి పూర్తి విరుద్ధం.

జంతుబలి ఆపడం మంచిదే. జీవహింస మంచిది కాదు. సనాతనంగా జరుగుతూనే ఉన్నది. వేటాడడం కోసం రాజులు వెళ్ళినట్లు యే కథలో చూసినా ఉంటుంది. ఇప్పటికీ జమీందారీ కుటుంబాలలో వేటకోసం తుపాకులు ఉంటూంటాయి. దేవతా పూజకోసం చంపకూడదు. ఒక సూత్రం ఉన్నది.

“యదన్నః పురుషోభవతి తదన్నాస్తస్య దేవతాః” –

నువ్వు యేది తింటూ ఉంటావో అది దేవతకు పెట్టాలి. నువ్వు పులిహోర, దద్ద్యోజనం తింటూ ఆమెకి చారు మెతుకులు పెట్టకూడదు. ఆ దృష్టితో సప్తశతి మొదలైన వాటిలో గానీ, దేవీ ఉపాసనా క్రమంలోగానీ, జంతువులు బలులు సనాతనంగా ఉన్నాయి.

అయితే కేవలం ఆమెయొక్క ఆరాధనకోసం వాడి దానిని వినియోగించుకుంటారు. అది తినేవాళ్ళు అలా ఆరాధిస్తారు. అలా పనికి వస్తుంది కానీ వాళ్ళు తినకపోతే అమ్మవారికి అవి పెట్టక్కరలేదు. అమ్మవారి బలి దగ్గర జంతుబలి అన్నారు కానీ మార్కెట్లో వచ్చే టన్నులకొద్దీ గంపలు ఎలా వస్తున్నది? అదెవరూ నిషేధించడంలేదు. అక్కడే ఉంది తమాషా. శాస్త్రీయంగా చెప్పబడ్డ చోట బలిగా చేసేది వాళ్ళ సంప్రదాయంలో ఉన్నది; వాళ్ళు తినేటటువంటిది; అయిన దానిని జంతుబలి చేయడం ఉన్నది వెనకటి నుంచి. అది అనేక శాస్త్రాలలో ఉన్నది, ఉపాసనా కాండలలో ఉన్నది. అమ్మవారి కోసం జీవహింస చేయకూడదు. మనం తినకూడనిది, పెట్టకూడదు. హాయిగా గారెలు, పులిహోర, దద్ద్యోజనం వంటివి, యే అన్నం నువ్వు తింటున్నావో అది దేవుడికి పెట్టడం న్యాయం. అంతేగానీ దేవుడికోసం నైవేద్యం వేరుగా, మనం తినేది వేరుగా చేయకూడదు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s