శ్రీ రామనవమి

శ్రీ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలలో శ్రీరామావతారం ఏడవది.

శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.

అందుచేత ప్రతీ సంవత్సరం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. ఆంధ్రదేశంలో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తోంది.

రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని సంహరించడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు.

ఒక రోజు పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేసాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మానవులకు ‘రామనామ స్మరణ’ జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ‘రామ’ యనగా రమించుట అని అర్ధం.

శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు.

రామ సంబంధమైన పండుగలు ఏడాదిలో శ్రీరామనవమి కాక మరి రెండు ఉన్నాయి.

1. రామలక్ష్మణ ద్వాదశి: ఇది జ్యేష్ఠ శుద్ద ద్వాదశి నాడు జరుపుకుంటాం.
2. జానకీ జయంతి: ఇది ఫాల్గుణ శుద్ద అష్టమి నాడు జరుపుకుంటాం.
జనకమహారాజు యజ్ఞశాలకై భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో తగిలిన బంగారు పెట్టెలో ఈ నాడు సీత దొరికింది. అందుచేత ఈనాడు సీతాజయంతిగా జరుపుకుంటాము.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s