పూజ గదిలో దేవి-దేవతలను ఎలా అమర్చవలెను?

ఎవరి ఇంట్లో అయితే పూజ గది లేదో, లేదా దేవత ఫోటోలు లేవో, లేదా విగ్రహాలు లేవో, లేదా ఇలవేల్పు దేవత ఫోటోలు లేవో, వారు వెంటనే పూజ గదిని ఇంటిలో అమర్చవలెను. పూజ గదిలో దేవి-దేవతలను ఈ విధముగా అమర్చవలెను.

గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో ఉండవలెను. పురుష దేవతలు గణపతికి కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు) మరియు స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధముగా అమర్చవలెను. కొన్ని ఫోటోలలో ఆడ దేవతలతో పాటుగా మగ దేవతలు కూడా కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు)వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధముగా పెట్టవలెను. బొమ్మలో చూపిన మాదిరిగా శంఖు మొన ఆకారములో దేవతలను అమర్చవలెను. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే అతను కేవలము గురువుల ఫోటోను మాత్రమే పెట్టవలెను. ఒక్కవేళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంటే, గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధముగా పెట్టవలెను.

ఎవ్వరైతే పూజను చెయ్యలేకపోతారో, వారు క్రింద చెప్పిన విధముగా చెయ్యాలి :

ప్రతి రోజు దేవి-దేవత చిత్రములను గుడ్డతో తుడవాలి. రెండు ఉదబత్తిలను ఉదయము మరియు సాయంత్రము వెలిగించవలెను.
ముందు రోజు పెట్టిన పువ్వులను తీసివేయ్యాలి. అగరబత్తిలను వెలిగించిన తరువాత, వాటిని సవ్య దిశలో(గడియారపు ముళ్ళు తిరిగే దిశ) త్రిప్పవలెను. నెయ్యి దీపమును వెలిగించిన తరువాత, హారతి చేస్తున్నప్పుడు సవ్య దిశలో దీపమును త్రిప్పవలెను.

విగ్రహములను లేదా చిత్ర పటములను మొదట తడి గుడ్డతో తరువాత పొడి గుడ్డతో తుడవవలెను. గంధమును పెట్టవలెను. తరువాత అక్షింతలు, పువ్వులు, పసుపు మరియు కుంకుమను సమర్పించవలెను. దాని తరువాత ఉదబత్తిలను వెలిగించి, దీపముతో హారతిని ఇవ్వవలెను. చివరగా, నైవేద్యమును చూపించవలెను.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s