అన్నప్రాశన

అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తం అనే్వషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అయితే అది చాలా తప్పుడు వాదన. కారణం ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తున్నారా! లేదు. కారణం ఆ రోజులు మంచివి కాదు అని అందరికీ తెలిసిన అంశమే. మరి ఈ వాదన, ఆచారం అమావాస్యనాడు అమలు చేయకుండా వేరే మంచి రోజు కోసం వెదుకుతారు. ఇలాంటి వాదనలు ఇతర కార్యక్రమాల విషయంగా కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.

శిశు కార్యములు చేయు నిమిత్తంగా మూఢమి కర్తరీ వంటివి చూడనవసరం లేదు అని చెప్పారు. సీమంతం, పుంసవనం, జాతకర్మ, నామకరణం, డోలారోహణ (ఊయలలో వేయుట) అన్నప్రాశన వంటివి నెలల ఆధారంగా చేయు కార్యములు గర్భం వ్యక్తం అవగానే రెండు లేదా మూడవ మాసంలో పుంసవనం చేయమని శాస్త్రం.

‘వ్యక్తే గర్భే ద్వితీయేవా తృతీయేమాసి పుంసవనం కార్యం’. గర్భం వ్యక్తం అవగానే రెండవ మూడవ మాసాలలో మూఢమి వున్నది అని పుంసవనం చేయకుండా ఉండరాదు. అందుకుగాను మూఢమి పట్టింపు లేదు అని చెప్పారు. ఆ రెండు మాసాలలోనే పుంసవనం చేయాలి. అలాగే ‘సీమంతోన్నయనం ప్రథమే గర్భే చతుర్థోమాని’ అని ఆపస్తంభుడు, ‘షష్ఠేష్టమేవా సీమంతోన్నయనం’ అని యాజ్ఞవల్కుడు చెప్పిన కారణంగా నాల్గవ మాసం ఆరవ మాసం, ఎనిమిది మాసాలలో హోమ ప్రాధాన్యంగా చేయు సీమంత కార్యమునకు మూఢమి పట్టింపులేదు. ఇలాగే అన్ని శిశు కార్యములకు నెల పట్టింపు మాత్రమే వున్నది కానీ ముహూర్త సంబంధం లేకుండా ఏ పనీ చేయమని జ్యోతిశ్శాస్త్రం చెప్పలేదు.

ఒకవేళ ఆరవ నెల ఆరవ రోజు, వాదన సబబే అయితే ఏ విధమైన జ్యోతిష గ్రంథాలలోను ఈ విషయం ఎందుకు రాయలదు అనే ప్రశ్నను మనం వేసుకొని శోధించుకోవాలి. కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన. అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.

అక్షరాభ్యాసం విషయంలో ‘ఉదగర్కే పంచమేబ్దే పంచమే మాసి పంచమే’ అని వున్నది. దానిని అన్నప్రాశనకు కూడా అన్వయించేశారు. అన్ని కార్యములకు ముహూర్తం చేసే విషయంలో కొన్ని సిద్ధాంతాలు ఇచ్చారు. వాటిని అమలు చేయడానికి అవకాశం వున్నప్పటికీ ఇటువంటి ఆచారాలు అమలులోకి రావడాన్ని మొండి వైఖరిగానే పరిగణించాలి.

పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, పుష్యమి, హస్త, స్వాతి, అశ్వినీ, అనురాధ, శ్రవణం, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త నక్షత్రములు వున్న సమయంలో సోమ, బుధ, గురు, శుక్ర వారములు, తప్పనిసరి అయితే శని ఆదివారములలో అష్టమ స్థానములో పాప గ్రహములు లేకుండాను, ముహూర్త సమయానికి వున్న లగ్నానికి పాపగ్రహ సంబంధం లేకుండా చూసి ముహూర్తం చేయమని, అన్నప్రాశన చేయమని జ్యోతిశ్శాస్తవ్రేత్తలు అందరూ చెబుతారు.

శాస్త్రకారులు అందరూ ఈ విషయమే చెప్పారు. కానీ ఆరవ నెల ఆరవ రోజు అనే మాట చెప్పలేదు. కావున పైన చెప్పిన అంశాలతో కూడిన ముహూర్తం నిర్ణయింపజేసి శాస్త్ర వచనాలు అమలు చేసి అన్నప్రాశన చేయడం సర్వదా శుభప్రదం. ఒకవేళ మాకు శాస్త్రంతో సంబంధం లేదు అంటే వారికి ఈ సిద్ధాంతం అవసరమే లేదు కదా. తేలికగా చెప్పిన ఈ శాస్త్రాన్ని అమలు చేద్దాం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s