దిష్టి మంత్రం

చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

995542_596295530432393_1047749145_n

పల్లె ప్రజలు నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు.ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు.

ఆటోలు, లారీల వెనకాల ‘బురీ నజర్‌వాలా తెరా మూహ్‌ హో కాలా’ (దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా!) లాంటి వాక్యాలు రాస్తారు.’ఎవరి చూపు పడిందో ? పాడు కళ్లు,పాపిష్టి కళ్ళు వామ్మోఅని భయపడతారు.

షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని, అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట.

దృష్టిదోషం ,చెడుచూపు ,దయ్యం చూపు ,దిష్టి కి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు,నల్ల తాడు, నిమ్మకాయల దండ,పసుపు, సున్నం కలిపిన నీళ్లు,ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ,తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ,కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ,చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క,పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క,మెడలో తావీజు… పచ్చిమిరపకాయలు,ఈతాకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని ఏడుమార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు లిఖించిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలోకట్టటం లాంటివి చేస్తారు.

ఈ విధంగానే కాక పసిబిడ్డలకు విబూదిని నుదుట శరీరం పైన రాస్తూ కింద ఇచ్చిన మంత్రం చదువుతూవుంటే కూడా మంచి ఫలితం ఇస్తుంది అంటారు. 

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s