కృష్ణావతారం ( పంచమాంశము)-శ్రీ విష్ణు పురాణము

“మైత్రేయా! నీకిప్పుడు యదుకులవ్యాపకుడైన నారాయణుని అంశవతారం శ్రీకృష్ణుని చరిత్ర సవిస్తరంగా వినిపిస్తున్నాను. ఇది జగన్మంగళకర చరిత్ర. దేవకుడనేవాడి కుమారై దేవకిని వసుదేవుడు వివాహమాడాడు.

ఆమె అన్న కంసుడామెను వసుదేవుని రథం మీద అత్తవారింటికి తీసుకువెళ్లడానికి సారధ్యం వహించాడు. అప్పుడాకాశం నుంచి ఆశరీరవాణి ఇలా వినిపించింది…”ఓయీ మూఢా! నీ చెల్లిలిని నీవు ఎంతో సంబరంగా అత్తవారింటికి పంపుతున్నావు. సరే! కాని, ఈమె ఎనిమిదో గర్భంలో పుట్టిన కుమారుడు నీ ప్రాణాలను తీయనున్నాడు…”

ఆ మాటలు వినిపించగానే రథం ఆపి, కంసుడు వెంటనే చెల్లిలి మీదకు కత్తిదూయబోగా “బావా! ఇది నీకు తగదు. స్త్రీ హత్యచేసి మచ్చతెచ్చుకోకు. ఈమెవల్ల నీకొచ్చిన అపాయమేమీ లేదు గదా! పుట్టిన పిల్లల్ని పుట్టినట్టే నీకు అప్పగించగలం” అని సమాధాన పరచడంతో, అతడిపట్ల గల గౌరవం చేత చెల్లిల్ని చంపడం విరమించుకున్నాడు.

ఇటువంటి పాతకులు అధికమవుతున్నారని, భూదేవి దేవతల్తో అదే సమయాన జాలిగా మొరపెట్టుకున్నది.

విష్ణువుచేత హతుడైన ఒకప్పటి కాలనేమి అనేవాడు కంసుడై ఉగ్రసేనునికి జన్మించాడు. అరిష్టుడు, ధేనుకుడు, కేళి, ప్రలంబుడు, సుందుడు, నరకా సురుడు ఆదిగాగల దుష్టులు వివిధరాజులకు తనయులై జన్మించి, నానాకిరాతక కృత్యాలతో పాపభారం పెంచి భూదేవికి కష్టం కలిగిస్తున్నారు. ఇది ఇలాగే సాగితే కొన్నళ్లకు ఈ భూమి పాతాళానికి క్రుంగిపోగలదు అని గ్రహించుకున్న దేవతలు బ్రహ్మాదిగా శ్రీహరివద్దకు వెళ్లి, భూదేవి తమతో మొరపెట్టుకున్న వైనాన్ని శ్రీహరికి విన్నవించారు..

సకల తేజములకు తేజస్సువు. అక్షయుడవు. సర్వావరణాలకు అతీతుడవు. నీ స్వరుపము నిరాలంబము. మహావిభూతి సంస్థానం. అకారణ – సకారణ మధ్యస్థితిగా నీవు శరీరగ్రహణం చేయుదువు. ఓ సర్వహ్యాపీ! నీవు శరీరధారుడివై అవతరించడం కేవలం ధర్మరక్షణ నిమిత్తమే!” అని బ్రహ్మ పలుకగా ప్రత్యక్షమైన శ్రీహరి, “నీవు దేవతాసహితముగా ఇటకు వచ్చిన కారణమేమి?” అని ప్రశ్నించగా, విష్ణుని విశ్వరూపమును చూచి తిరిగి బ్రహ్మ స్తోత్రం ఆరంభించారు.

“వసుదేవుని భార్య దేవకీగర్భాన, నా అంశ జనిస్తుంది. మిరు నిశ్చింతగా ఉండండి” అని నారాయణుడు వారికి అభయం ఇచ్చాడు.

విష్ణువు తన నల్లని కేశములనుంచి రెండు వెంట్రుకులను భూమిమీదవేసి “ఈ రెండు వెంట్రుకలు భూమ్మీద సమయం వచ్చినపుడు వేల్పులై అవతరించి, భూభారక్షేశాన్ని ఉపశమింపచేస్తాయి. అట్లే మీ దేవతలందరూ తమ – తమ అంశలచేత పుడమి మీద పుట్టి ఇంతకాలంగా భూమిని భాధిస్తున్న మదోన్మత్తులయిన అసురులతో పోరాడి, వారిని నశింపచేయుదురు గాక! నా ఈ కేశము ఆ దేవకీదేవికి అష్టమ గర్భమున శిశువగు గాక” అని ఆనతిచ్చాడు.

దేవతలంతా నారాయణుని మ్రొక్కి, తీగి నిజస్థానాలకు వెళ్లారు.

విష్ణువు ఆనతిచ్చిన ప్రకారం, వారు భూమిపై అవతారించారు. దేవకీదేవి అష్టమ గర్భమున ధరణిని ఉద్ధరించే శిశువు ఉదయిస్తడని నారదుడు కంసునితో చెప్పగా, కంసుడు దేవకీ వసుదేవులను బంధించాడు. వసుదేవుడు తాను పలికిన మాటకు కట్టుబడి, ఆరుగురు శిశువులను కంసునికి అర్పించాడు.

విష్ణువుచేత నియోగింపబడిన యోగమాయ, దేవకీ గర్భాన ప్రవేశించింది. ఈ మాయాసక్తి (అవిద్య) చేతనే సర్వజగత్తు మోహించబడుతోంది. ఆమెయే నిద్ర.

“ఓ నిద్రాదేవీ! నీవు నా ఆనతిప్రకారం, పాతాళమందున్న షడ్గర్భాలను, ఒక్కటొక్కటిగా దేవకి కడుపులోనికి చేర్చు! వాళ్లు హతులయిన తర్వాత శేషుడు నా యొక్క అంశాంశమైనవాడు ఏడో గర్భంగా ఆమె ఉదరంలోకి ప్రవేశిస్తాడు.

నందగోకులంలో వసుదేవుని మరొక భార్య రోహిణి ఉంది కదా! నీవు ఆమె కడుపున ఈ శిశువును చేర్చు. కారాగారంలో పెట్టడం చేత దేవకీదేవి ఏడోగర్భం పోయిందని లోకం చెప్పుకుంటుంది. అతడు (ఏడో గర్భవాసి) గర్భం నుంచి లాగబడుటచేత ‘సంకర్షుడనే’ పేర ప్రసిద్ధుడవుతాడు. ఆ తర్వాత నేను దేవకికి అష్టమగర్భంగా అవతరిస్తాను. నీవు నవమినాడు జన్మించు! నా శక్తిప్రేరితుడై వసుదేవుడు నిన్ను దేవకి ప్రక్కలోను, నన్ను యశోదాదేవి అనబడే నందుని భార్యప్రక్కలోనూ ఉంచగలడు. కంసుడు నిన్ను చంప ప్రయత్నించగా, నీవు అకాశానికి ఎగిరి, ఇంద్రుని సోదరిగా పరిగణించబడతావు. నీవు శుంభుడు – నిశుంభుడు మొదలిన రాక్షసుల్ని వేలకొలదిగ సంహరించి, వివిధ పేర్లతో పృధ్విపై నిలుస్తావు. పృధ్వి, లజ్జ, పుష్ఠి, రుష అనే నామ లేక గుణ స్వరూపాలతో వర్థిల్లుతావు. నిన్నే జనులు భద్ర, అంబిక, కాళి, ఆర్య, దుర్గ, తదితర నామాలతో, వారికిష్టమైన నివేదనలతో పూజిస్తారు. నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో అన్నాడు భగవానుడు.

దేవదేవుడు చెప్పిన చొప్పున యోగమాయ ఏడో గర్భంలోని శిశువును రోహిణి గర్భంలో ఉంచి, ఆమె గర్భంలోని శిశువును కర్షణం చేసి, ఆమె జఠరంలోనికి సంకర్షనుని (బలరాముని) ప్రవేశపెట్టింది. విష్ణువు దేవకీదేవి ఎనిమిదో గర్భంలో ప్రవేశించాడు…ఋతువులు సుశోభించాయి. దేవతలు స్తుతించారు దేవకీదేవిని.

ఇతి శ్రీవిష్ణుపురాణే పంచమాంశే ద్వితీయోధ్యాయః

దేవకీ! నీవు సూక్ష్మపరప్రకృతివి. సృజ్యమైన దృస్యాత్మక జగత్తుకు రూపగర్భవు. బీజత్రయిరూపమైన యజ్ఞగర్భవు. యజింపబడు ఫలగర్భవు. అతణి రూపమయిన అగ్ని గర్భవు. నీతి నీవే అయిన నయగర్భవు. ఇంకా…జ్ఞాన, కామ, సంతోష, గ్రహ, నక్షత్ర, తారకా గర్భవు నీవే! అన్నిట్నీ మించిన విష్ణుగర్భవు.

సర్వలోక రక్షార్థం అవతరించిన దేవివి. ఓ కళ్యాణీ! సకల జగత్‌కు శుభం కలిగించు!…ఇలా స్తుతించబడిన దేవకి జగత్కారణుని గర్భానమోసింది.

ఆమె కడుపున అర్ధరాత్రాన ఉదయించాడు పుండరీకాక్షుడు. వసుదేవుడా బాలశ్రీహరిని స్తుతించి, అ నివాసంలో నుంచి కంసుని కంటపడకుండా, ఆ శిశువును నెత్తుకుని బైటకొచ్చాడు. యోగనిద్ర మాయవల్ల కంసుని కారాగారభటులు నిద్రలోకి జారుకున్నారు.

మధురానగర ద్వారపాలకులస్థితీ అంతే!

నడిరేయి మేఘాలు వర్షిస్తుంటే, శేషుడు తన పడగలతో రక్షణ కల్పించగా లోతైన యమునానదిని దాటాడు. మధురలో నందుని ఇంటికి చేరి యశోదప్రక్కలో ఆ శిశువును పరుండబెట్టి యోగమాయ అనే బాలికను ఎత్తుకుని అతివేగంగా మరలి వచ్చాడు వసుదేవుడు.

కారాగార రక్షకులకు అప్పుడు నిద్రనుంచి మెలుకువ వచ్చింది. దేవకి నుంచిన కారాగారం నుంచి ఏడ్పులు వినిపించగా శిశివు పుట్టిందని కంసునికి నివేదించారు.

కంసుడాబాలికను పైకి విసిరి చంపబోగా, అ బాలిక అష్టభుజాన్విత, ఆయుధపాణి అయి, గట్టిగానవ్వి “ఓరీ! కంసా! దురహంకార మూఢా! నీకు మూడింది. నిన్ను వధించగలవాడు పుట్టి పెరుగుతున్నాడులే” అని దేవతలు సిద్ధులు స్తుతిస్తుండగా ఆకాశానికి ఎగిరిపోయింది.

కంసుడా పరాభవానికోర్వజాలక, తన అనుచరగణాన్ని సమావేశపరచి దురాత్ములైన దేవతలు నన్ను చంపేందుకు కుట్ర చేశాడు. కేశి, ప్రలంభ, అరిష్ట, పూతనలారా! జాగ్రత్తగా వినండి! నాకు నా గురువు; ఒక్క జరాసంధుడు తప్ప మిగిలిన వారంతా తలలు వంచిన వారే!

నాకు కీడుమూడనున్నదని, దేవకీగర్భన పుట్టిన ఒక మాయశిశువు చెప్పింది కనుక –

geeta

ఎక్కడెక్కడ బాలురు కనబడినా, వారిలో బలోద్రేకాలున్నవారిని బట్టి మట్టుపెట్టడానికి వెనుకాడకండి. అటువంటివారిని కడతేర్చనిదే వదలకండి.

అని అసురగణానికి అనుజ్ఞ నిచ్చి, అప్పుడు దేవకి – వసుదేవులను కారాగార విముక్తుల్ని చేశాడు.

“నేను అకారణంగా మీ శిశువులందర్నీ చంపేసినవాడిని, కాని నా కోసమే ఎవడో ఎక్కడో పుట్టాడట! జరిగిందేదో జరిగింది. పరితాపం చెందకండి. మీకు జన్మించిన శిశువులు, మీ పాపం వల్ల ఆయువు కోల్పోయిన వారయ్యారు” అని వారిని విడిచిపుచ్చడం ద్వారా తానొక ఘనకార్యం చేసినట్లు భావించుకొని, తన అంతఃపురానికి పోయాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s